breaking news
Reza Pahlavi
-
షా వారసుడికి అడ్డుపడుతోంది ఎవరో తెలుసా?
ఒక అవకాశం వస్తే చాలు.. చరిత్ర తిరగరాస్తానని భావించాడు. ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆ క్షణం వచ్చేసిందనుకున్నాడు. అల్లకల్లోల పరిస్థితులు.. మార్పు కోసం ఎదురుచూస్తున్న ప్రజలు.. ఇదే సరైన సమయం అనుకున్నాడు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కల నెరవేరుతుందని ఆయన ఆశలు పెట్టుకున్నాడు. కానీ పరిస్థితులు అనుకున్నట్లుగా సాగలేదు. మద్దతు పెరుగుతుందని భావించిన వేళ.. వరుస సవాళ్లు ఎదురయ్యాయి. ఈ ప్రయత్నాల్లో షా వారసుడికి ఇప్పుడు చిక్కులు తప్పడం లేదు.ఇరాన్లో పాలనా మార్పు వస్తే కొత్త నాయకత్వం ఎవరిది? అనే ప్రశ్నకు సమాధానంగా తనను తాను ముందుకు తెచ్చుకున్న మాజీ షా కుమారుడు రెజా పహ్లవీ ప్రయత్నాలకు అనూహ్య అడ్డంకులు ఎదురవుతున్నాయి. 1979 ఇస్లామిక్ విప్లవంలో తన తండ్రి మహ్మద్ రెజా పహ్లవీ పాలన కూలిపోయిన తర్వాత దేశం విడిచిన రెజా పహ్లవీ దాదాపు ఐదు దశాబ్దాలుగా ప్రవాస జీవితంలోనే ఉన్నారు. రాజరికం అంతమైనప్పటికీ.. షా కుటుంబ వారసుడిగా ఆయన పేరు ఇరాన్ రాజకీయాల్లో మాత్రం కొనసాగుతూనే వచ్చింది. అయితే ఇరాన్లో ఇటీవలి పరిణామాలు, అమెరికా–ఇజ్రాయెల్ ఘర్షణల నేపథ్యంలో రాజకీయ మార్పు వస్తుందనే అంచనాలతో ఆయన మళ్లీ తెరపైకి వచ్చారు. ఇరాన్లో కొత్త వ్యవస్థ ఏర్పడితే తాత్కాలిక మార్పు దశకు తానే నాయకత్వం వహిస్తానని ప్రకటించారు. ఈ క్రమంలో.. ‘నేను గమ్యం కాదు.. వంతెన మాత్రమే’రెజా పహ్లవీ తనను భవిష్యత్ పాలకుడిగా కాకుండా ప్రజాస్వామ్య మార్పుకు మార్గదర్శిగా చూపించుకునే ప్రయత్నం చేశారు. ‘‘నేను గమ్యం కాదు.. గమ్యానికి తీసుకెళ్లే వంతెన మాత్రమే’’ అంటూ ఆయన తన పాత్రను వివరించారు. ఇరాన్ ప్రజలు తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకోవాలని ప్రకటించారు. అయితే..అదే సమయంలో అమెరికా, యూరప్‌లో పర్యటిస్తూ ఆయన మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేశారు. అమెరికాలోని కొంతమంది సంపన్న ప్రవాస ఇరానీయులు కూడా ఆయనకు ఆర్థిక సహకారం అందించారు. అయితే ఈ మద్దతు దేశంలో బలమైన ప్రజా ఉద్యమంగా మారిందా? అనే అనుమానాలు ఆ సమయంలో వ్యక్తం అయ్యాయి కూడా!.ప్రతిపక్షంలోనే అసలు పోరుఒకవైపు ఇరాన్ ప్రభుత్వంపై వ్యతిరేకత.. మరోవైపు ప్రతిపక్షంలోనే విభేదాలు.. ఇంకోవైపు అంతర్జాతీయ మద్దతుపై అనిశ్చితి.. ఇలా మూడు వైపుల సవాళ్ల మధ్య పహ్లవీ రాజకీయ ప్రయాణం సాగుతోంది. రెజా పహ్లవీకి ఎదురైన అతిపెద్ద సవాలు ఇరాన్ ప్రభుత్వమే కాదు.. ప్రతిపక్షంలోని విభేదాలే. ఇస్లామిక్ రిపబ్లిక్కు వ్యతిరేకంగా ఉన్న వర్గాలు అనేకం ఉన్నప్పటికీ.. వాటి మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం సమస్యగా మారింది.రాయిటర్స్ కథనం ప్రకారం.. పహ్లవీ చుట్టూ ఉన్న కొందరు మద్దతుదారులు ఇతర ప్రతిపక్ష నేతలపై తీవ్ర విమర్శలు చేయడం, కొందరిపై దాడులకు పాల్పడిన ఘటనలు ఉద్యమ ఐక్యతను దెబ్బతీశాయి. 2023లో ప్రతిపక్షాలను ఏకం చేసే ప్రయత్నాలు జరిగినప్పటికీ అవి ఎక్కువ కాలం కొనసాగలేదనే విషయం ఇప్పుడు వెలుగులోకి రావడం గమనార్హం.దాతల్లోనూ పెరిగిన అసంతృప్తిపహ్లవీకి మద్దతుగా కొందరు ఇరానియన్-అమెరికన్ వ్యాపారవేత్తలు మిలియన్ల డాలర్ల నిధులు సమకూర్చినప్పటికీ.. ఆశించిన స్థాయిలో రాజకీయ ఫలితాలు కనిపించడం లేదనే అసంతృప్తి కొందరిలో పెరిగినట్లు సమాచారం. ఉద్యమాన్ని మరింత విస్తృతం చేయడం, ప్రతిపక్షాలను ఒక్కతాటిపైకి తీసుకురావడంలో మరింత చురుగ్గా వ్యవహరించాలని వారు సూచించినట్లు తెలుస్తోంది.అమెరికా మద్దతు కూడా ప్రశ్నార్థకమేఇరాన్లో మార్పు కోసం ప్రయత్నిస్తున్న పహ్లవీకి అమెరికా మద్దతు పూర్తిగా లభించలేదని విశ్లేషణలు చెబుతున్నాయి. ట్రంప్ సహా అమెరికా అధికారులు కూడా ఆయనను భవిష్యత్ ఇరాన్ నాయకుడిగా అధికారికంగా ప్రకటించలేదు. ఇరాన్లో ఆయనకు ఉన్న వాస్తవ ప్రజాదరణ, రాజకీయ స్థిరత్వంపై సందేహాలు ఉన్నట్లు తెలుస్తోంది.షా వారసత్వం.. బలంతోపాటు బలహీనత కూడా!రెజా పహ్లవీకి అతిపెద్ద బలం ఆయన కుటుంబ పేరు. చివరి షా కుమారుడిగా కొందరు ఆయనను స్థిరత్వానికి ప్రతీకగా చూస్తున్నారు. అయితే అదే గతం ఆయనకు సవాల్‌గా మారింది. షా పాలనలో జరిగిన అణచివేతను గుర్తు చేస్తూ కొందరు వర్గాలు ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ప్రస్తుతం ఇరాన్లో మార్పు కోసం ప్రయత్నిస్తున్న అనేక శక్తుల్లో రెజా పహ్లవీ అత్యంత గుర్తింపు ఉన్న వ్యక్తిగా ఉన్నప్పటికీ.. ఆయన ముందున్న అసలు పరీక్ష మాత్రం ఒక్కటే. విభిన్న ప్రతిపక్షాలను ఏకం చేసి, దేశంలో విశ్వసనీయమైన ప్రత్యామ్నాయంగా నిలబడగలరా? అన్నదే. -
ఇరాన్ మాజీ యువరాజుపై దాడి..
ఇరాన్ బహిష్కృత యువరాజుపై బెర్లిన్‌లో దాడి జరిగింది. ప్రస్తుతం జర్మనీ పర్యటనలో ఉన్న ఆయనపై గుర్తు తెలియని వ్యక్తులు ఎరుపురంగు ద్రవాన్ని మీద చల్లారు. అయితే వెంటనే ఆయన రక్షణ సిబ్బంది స్పందించి ఆందోళనకారుడిని ప్రక్కకు తోశారు.రెజా పహ్లావి గురువారం బెర్లిన్‌లో ఒక భవనం నుండి బయటకు వస్తున్నారు. ఆ సమయంలో పహ్లావి తన భద్రతా సిబ్బందితో కలిసి నడుచుకుంటూ వెళ్తున్నారు. వెనుక నుండి వచ్చిన ఒక వ్యక్తి తన బ్యాగ్ నుంచి ఎరుపు రంగు ద్రవాన్ని (ఇది టమోటా జ్యూస్ అని భావిస్తున్నారు) ఆయనపై విసిరాడు. దీంతో ఆ ఎరుపు ద్రవం పహ్లావి తల వెనుక భాగం, మెడ మరియు ఆయన ధరించిన బ్లేజర్‌పై పడింది. అయితే ఈ హఠాత్ పరిణామంతో ఏ మాత్రం సంబంధం లేకుండా చాలా ప్రశాంతంగా అక్కడి నుండి వెళ్లిపోయారు. అయితే రెజాపహ్లవిపై దాడి చేసిన వ్యక్తిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.కాగా ఈ దాడి జరిగిన కొద్ది సేపటికే పహ్లవి విలేకరుల సమావేశం నిర్వహించారు. అమెరికా మరియు ఇరాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు: ప్రస్తుత ఇరాన్ ప్రభుత్వాన్ని నడుపుతున్న వ్యక్తుల్ని గూండాలు, ఉగ్రవాదులుగా ఆయన అభివర్ణించారు. ప్రజాస్వామ్య దేశాలన్ని ఇరాన్ పాలనపై మరింత ఒత్తిడి తీసుకురావాలని, కేవలం యధాతథ స్థితిని కొనసాగించడం వల్ల ప్రయోజనం లేదని ఆయన పేర్కొన్నారు. రాజకీయ ఖైదీల విడుదల, ఉరిశిక్షల నిలిపివేత విషయంలో ఐరోపా దేశాలు తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.రెజా పహ్లవీ నేపథ్యంకాగా ప్రస్తుతం రెజా పహ్లవీ అమెరికాలో నివాసం ఉంటున్నారు. 1979లో మెుహమ్మద్ రెజా షా పహ్లవీకి వ్యతిరేకంగా ఇరాన్లో పెద్దఎత్తున ఉద్యమం జరిగింది. దీంతో అక్కడ రాజరిక వ్యవస్థ రద్దై రెజా షా పహ్లవీ దేశాన్ని విడిచి పారిపోయాడు. అనంతరం అక్కడ ఇస్లామిక్ ప్రభుత్వం ఏర్పడింది. ఆ సమయంలో రెజా పహ్లవీ అమెరికాలో ఫైలట్ శిక్షణ పొందుతున్నారు. అప్పటి నుంచి నేటి వరకూ ఆయన అమెరికాలోనే నివసిస్తున్నారు. ప్రస్తుతం ఇరాన్లో ఉన్న ఇస్లామిక్ పాలన అంతం కోసం ఆయన పోరాడుతున్నారు. ఇరాన్లో అమెరికా, ఇజ్రాయెల్ సైనిక జోక్యాన్ని ఆయన సమర్థిస్తున్నారు. అయితే ఇరాన్ లోపల ఆయనకు ఎంతవరకు మద్దతు ఉందనేది తెలియాల్సి ఉంది. -
దాడులు కొనసాగించండి.. అమెరికాను కోరిన ఇరాన్ మాజీ క్రౌన్ ప్రిన్స్
ఇరాన్ మాజీ క్రౌన్ ప్రిన్స్ రెజా పహ్లవి ఎక్స్‌లో చేసిన ఓ పోస్ట్ ఆసక్తికరంగా ఉంది. రెజా ఆ పోస్ట్‌లో ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్‌పై దాడులు కొనసాగించాలని అమెరికా, ఇజ్రాయెల్‌ను కోరారు. రెజా తన పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు. ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ కాదు. ఇరాన్ పౌర మౌలిక సదుపాయాలు ఇరాన్ ప్రజలకు మరియు స్వేచ్ఛాయుత ఇరాన్ భవిష్యత్తుకు చెందినవి. ఇస్లామిక్ రిపబ్లిక్ మౌలిక సదుపాయాలు అణచివేత, ఉగ్రవాద యంత్రాంగం మాత్రమే. ఇరాన్ కాపాడబడాలి. ఆ ప్రభుత్వాన్ని కూల్చివేయాలి.దేశాన్ని పునర్నిర్మించుకోవడానికి ఇరానీయులకు అవసరమయ్యే పౌర మౌలిక సదుపాయాలను కాపాడుతూ, ఆ ప్రభుత్వాన్ని మరియు దాని అణచివేత యంత్రాంగాన్ని లక్ష్యంగా చేసుకోవడం కొనసాగించాలని ట్రంప్ మరియు నెతన్యాహును కోరుతున్నాను.అమెరికా మరియు ఇజ్రాయెల్ మద్దతుతో, అన్నింటికంటే ముఖ్యంగా ఇరాన్ దేశభక్తుల త్యాగంతో ఇరాన్ స్వేచ్ఛా గడియ ఆసన్నమైంది. ఇరాన్ వర్ధిల్లాలి అని రెజా ఎక్స్‌లో రాసుకొచ్చాడు.కాగా, ఇరాన్ చివరి షా మహ్మద్ రెజా పహ్లవి పెద్ద కుమారుడైన ఈ రెజా పహ్లవి.. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ప్రవాసంలోకి వెళ్లి, ప్రస్తుతం అమెరికాలో తలదాచుకుంటున్నారు. రెజా ప్రస్తుత ఇరాన్ పాలనపై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఆయన తరచూ అమెరికా దాడులకు మద్దతు ప్రకటిస్తూ, పాలన మార్పు జరిగితే తిరిగి ఇరాన్‌కు వెళ్లవచ్చని అనుకుంటున్నారు. -
ఇరాన్ మాజీ యువరాజు సంచలన ప్రకటన
వాషింగ్టన్ డీసీ: ప్రస్తుతం ఇరాన్ యుద్ధంతో అట్టుడికి పోతుంది. ఇజ్రాయెల్, అమెరికా దాడులతో ఆ దేశం అతలాకుతలంగా మారింది. సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ మరణంతో రాజకీయంగా సైతం సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి.ఈ నేపథ్యంలోనే ఇరాన్ బహిష్కృత రాజు రెజా పహ్లావి సంచలన ప్రకటన చేశారు. ఇరాన్లో ఇస్లామిక్ ప్రభుత్వం కూలిపోతే ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామని సంచలన ప్రకటన చేశారు.టెహ్రాన్ మునుపెన్నడూ లేని సంక్షోభాలని చూస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో అతలాకుతమవుతున్న ఆ దేశం రాజకీయంగా తీవ్ర అస్థిరతను ఎదుర్కొంటుంది. యుద్ధం ప్రారంభం కావడానికి అణుచర్చల విఫలంతో పాటు ఆ దేశంలో ప్రజలు జరిపిన నిరసనలు సైతం ఒక కారణం. ఇస్లామిక్ ప్రభుత్వ కఠిన చట్టాలు, అవినీతిపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్న అక్కడి ప్రజలు ఖమేనీ ప్రభుత్వంపై నిరసనలతో రోడ్లెక్కారు. దీంతో ఖమేనీ ప్రభుత్వం ఉక్కుపాదంతో వారిని అణిచివేసింది. వేలాది మందిని కాల్చి చంపింది. ఈ విషయంలో మెుదటి నుంచి ఇరాన్‌ను వ్యతిరేకిస్తూ వచ్చిన ట్రంప్ ఇదే సాకుగా భావించి యుద్ధాన్ని ప్రకటించారు.అయితే యుద్దం ప్రారంభంలోనే ఆ దేశ సుప్రీం లీడర్ ఆయుతుల్లా ఖమేనీని హతమార్చారు. ప్రస్తుతం సుప్రీంగా బాధ్యతలు స్వీకరించిన మోజ్తాబా ఖమేనీని సైతం లేపేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ఈ ఉద్రిక్తతల నడుమ ఇరాన్ బహిష్కృత యువరాజు రెజాపహ్లవీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వీడియో ప్రకటనలో ఆయన మాట్లాడుతూ"ఇరాన్లో ఇస్లామిక్ ప్రభుత్వం కూలిపోతే వెను వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. నా నాయకత్వంలో ఇరాన్‌ని పాలించడానికి ప్రతినిధి వర్గం సిద్ధంగా ఉంది. కొద్దికాలంలోనే ఇరాన్లో శాంతి భద్రతలు, స్వేచ్ఛా తిరిగి పునరుద్ధరిస్తాం." అని ప్రకటనలో తెలిపారు.దేశంలో తిరిగి శాంతిని పునరుద్ధరించడానికి స్థానికంగా ఉన్న వారితో పాటు విదేశాలలో ఉన్న నిపుణులను నియమించాలని పేర్కొన్నారు. అంతేకాకుండా దేశ అభివృద్ధి కోసం “ఇరాన్ ప్రాస్పెరిటీ ప్రాజెక్ట్” అనే కార్యక్రమం కూడా రూపొందించబడిందని ఇస్లామిక్ ప్రభుత్వం పడిపోయిన మొదటి 180 రోజుల్లో చేపట్టాల్సిన చర్యలు, కొత్త రాజ్యాంగం రూపకల్పన, ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం) వంటి అంశాలు ఉన్నాయన్నారు. ప్రజాస్వామ్య పాలనతోనే ఇరాన్లో అభివృద్ధి సాధ్యం అని రెజా పహ్లవీ పేర్కొంటున్నారు.రెజా పహ్లవీ నేపథ్యంకాగా ప్రస్తుతం రెజా పహ్లవీ అమెరికాలో నివాసం ఉంటున్నారు. 1979లో మెుహమ్మద్ రెజా షా పహ్లవీకి వ్యతిరేకంగా ఇరాన్లో పెద్దఎత్తున ఉద్యమం జరిగింది.దీంతో అక్కడ రాజరిక వ్యవస్థ రద్దై రెజా షా పహ్లవీ దేశాన్ని విడిచి పారిపోయాడు. అనంతరం అక్కడ ఇస్లామిక్ ప్రభుత్వం ఏర్పడింది. ఆసమయంలో రెజా పహ్లవీ అమెరికాలో ఫైలట్ శిక్షణ పొందుతున్నారు. అప్పటి నుంచి నేటి వరకూ ఆయన అమెరికాలోనే నివసిస్తున్నారు.


