research organisation
-
భారత్‌లోకి ఆంథ్రోపిక్ ‘మైథోస్’
న్యూఢిల్లీ: అమెరికా చెందిన కృత్రిమ మేధ(ఏఐ) పరిశోధనా సంస్థ ఆంథ్రోపిక్ అభివృద్ధి చేసిన అత్యాధునిక ‘మైథోస్’ ఏఐ మోడల్‌ను వినియోగించే అవకాశం కొన్ని భారతీయ సంస్థలకు లభించింది. ఆంథ్రోపిక్ చేపట్టిన ‘ప్రాజెక్ట్ గ్లాస్‌వింగ్’ విస్తరణలో భాగంగా భారత్‌కు చెందిన ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు ఈ యాక్సెస్‌ను పొందినట్లు సమాచారం. ప్రస్తుతానికి ఈ మోడల్‌కు యాక్సెస్ పొందిన దేశీయ సంస్థల సంఖ్య పదిలోపే ఉన్నట్లు తెలుస్తోంది. భద్రతా కారణాల దృష్ట్యా ఆయా సంస్థల పేర్లను వెల్లడించలేదు. ‘ప్రాజెక్ట్ గ్లాస్‌వింగ్’ అంటే సైబర్ భద్రతను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఆంథ్రోపిక్ చేపట్టిన కార్యక్రమమే ‘ప్రాజెక్ట్ గ్లాస్‌వింగ్’. ఈ కార్యక్రమం కింద ఎంపిక చేసిన సంస్థలకు ఆంథ్రోపిక్ అభివృద్ధి చేసిన అధునాతన ‘క్లాడ్ మైథోస్ ప్రివ్యూ’ ఏఐ మోడల్‌కు యాక్సెస్ కలి్పస్తోంది. సాఫ్ట్వేర్లలోని క్లిష్టమైన భద్రతా లోపాలు, జరగబోయే సైబర్ ముప్పులను గుర్తించడంలో ఈ మోడల్ కీలక పాత్ర పోషిస్తుంది. ఏప్రిల్‌లో కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు సుమారు 50 భాగస్వామ్య సంస్థలకు మాత్రమే యాక్సెస్ ఇచ్చారు. ఈ మోడల్ సాయంతో ఆయా సంస్థలు వివిధ కోడ్‌బేస్‌లలో 10 వేలకుపైగా అధిక లేదా అత్యంత తీవ్ర స్థాయి భద్రతా లోపాలను గుర్తించినట్లు ఆంథ్రోపిక్ వెల్లడించింది. సైబర్ భద్రత కోసం అంతర్జాతీయ విస్తరణ తాజాగా ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తూ భారత్‌తో పాటు 15కుపైగా దేశాల్లోని 150 సంస్థలను భాగస్వాములుగా చేర్చింది. వీటిలో విద్యుత్, నీటి సరఫరా, ఆరోగ్య సంరక్షణ, కమ్యూనికేషన్స్, హార్డ్‌వేర్ రంగాలకు చెందిన కీలక మౌలిక వసతుల నిర్వాహక సంస్థలు ఉన్నాయి. సైబర్ దాడి జరిగితే కొన్ని సందర్భాల్లో 10 కోట్ల మందికిపైగా ప్రభావితమయ్యే అవకాశం ఉన్న సంస్థలను ఈ ప్రాజెక్ట్ కోసం ఎంపిక చేసినట్లు ఆంథ్రోపిక్ తెలిపింది. ఈ యాక్సెస్ ద్వారా భాగస్వామ్య సంస్థలు తమ డిజిటల్ మౌలిక వసతుల్లోని భద్రతా లోపాలను ముందే గుర్తించడం, రక్షణ వ్యవస్థలను పరీక్షించడం, సాఫ్ట్వేర్ ప్యాచ్‌ల అమలును వేగవంతం చేయడం వంటి చర్యలు చేపట్టగలవు. -
జోరుగా యాప్ ఆదాయం
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా మొబైల్ యాప్‌ల డౌన్లోడ్ ఆదాయం ఈ ఏడాది 44 శాతం వృద్ధి చెంది 2,600 కోట్ల డాలర్లకు చేరుతుందని రీసెర్చ్ సంస్థ గార్ట్నర్ తెలిపింది. యాప్‌ల జోరు రెండు, మూడేళ్లలో బాగా పెరిగి, ఆ తర్వాత తగ్గుతుందంటున్న ఈ సంస్థ వెల్లడించిన ఇతర ముఖ్యాంశాలు గత ఏడాది 6,400 కోట్ల యాప్‌లు డౌన్లోడ్ అయ్యాయి. 1,800 కోట్ల డాలర్ల ఆదాయం లభించింది. ఈ ఏడాది 10,200 కోట్ల యాప్‌లు డౌన్లోడ్ అయ్యే అవకాశాలున్నాయి. మొత్తం యాప్ డౌన్లోడ్స్ల్లో ఉచిత యాప్‌ల వాటా 91 శాతంగా ఉంటుందని అంచనాలున్నాయి. వచ్చే ఏడాది యాప్‌ల డౌన్లోడ్ మరింత జోరుగా ఉంటుంది. మార్కెట్లోకి ఎప్పటికప్పుడు కొత్త కొత్త మొబైల్ మోడళ్లు రావడం, యాప్‌ల సంఖ్య పెరుగుతుండడం వంటి కారణాల వల్ల వచ్చే ఒక్కో మొబైల్ వినియోగదారుడు సగటున ఉపయోగించే యాప్‌ల సంఖ్య బాగా పెరుగుతోంది. నచ్చిన యాప్‌లనే ఎక్కువగా ఉపయోగిస్తారు కాబట్టి, కొత్త యాప్‌లను వినియోగదారులు పట్టించుకోరు. ఫలితంగా తర్వాతి సంవత్సరాల్లో యాప్‌ల డౌన్లోడ్ జోరు తగ్గవచ్చు. 2017లో డౌన్లోడయ్యే మొత్తం యాప్‌ల్లో 90 శాతం వరకూ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్‌లే ఉంటాయి.


