breaking news
Red Corner
-
విదేశాల నుంచి 274 మంది నేరగాళ్లను పట్టుకొచ్చాం
సాక్షి, న్యూఢిల్లీ: తీవ్ర నేరాలకు పాల్పడిన విదేశాలకు పరారైన 274 మంది నేరగాళ్లను తిరిగి రప్పించినట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. 2019 నుంచి ఈ ఏడాది జూలై వరకు మొత్తం 36 దేశాల ప్రభుత్వాలతో చర్చలు జరిపి వీరిని తీసుకొచ్చామని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ విషయంలో ఐబీ, సీబీఐ, రా, ఎన్ఐఏ, ఈడీ, విదేశాంగ శాఖ, ఎన్సీబీ, డీజీజీఐ, రాష్ట్ర పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపింది.అప్పట్లో ఏడాదికి నలుగురే..విదేశాలకు పారిపోయిన నేరస్తులను తిరిగి తీసుకు వచ్చే అంశాన్ని గత ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోలేదని తెలిపింది. అప్పట్లో నేరగాళ్ల అప్పగింతకు సంబంధించి భారత్ కేవలం 37 దేశాలతో మాత్రమే ఒప్పందాలు చేసుకుందని తెలిపింది. 2004–13 మధ్య కాలంలో ఏడాదికి కేవలం నలుగురు నేరస్తులను మాత్రమే రప్పించగలిగిందని, 110 అప్పగింత అభ్యర్థనలు పెండింగ్‌లో ఉండిపోయాయని వివరించింది.అమల్లోకి పలు చట్టాలుపరారీలో ఉన్న నేరగాళ్ల సమస్య దేశ సార్వభౌమాధికారం, ఆర్థిక స్థిరత్వం, శాంతిభద్రతలు, జాతీయ భద్రతతో ముడిపడి ఉన్న అంశంగా మోదీ ప్రభుత్వం భావించిందని వివరించింది. నేరగాళ్లను తిరిగి తీసుకు వచ్చేందుకు గ్లోబల్ ఆపరేషన్స్, రోబస్ట్ కో–ఆర్డినేషన్, స్మార్ట్ డిప్లొమసీ అనే మూడంచెల వ్యూహాన్ని అమలు చేస్తోందని పేర్కొంది. 2018లో తీసుకొచ్చిన ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ చట్టం, 2019లో ఎన్ఐఏ (సవరణ) చట్టం, యూఏపీఏ (సవరణ) చట్టంతోపాటు 2024లో అమల్లోకి వచ్చిన మూడు కొత్త క్రిమినల్ చట్టాల్లో పరారీలో ఉన్న నిందితులకు సంబంధించిన ప్రత్యేక నిబంధనలు చేర్చినట్లు పేర్కొంది. భారత్‌పోల్ ఏర్పాటుఇంటర్పోల్ మాదిరిగా కేంద్రం 2025 జనవరిలో భారత్‌పోల్‌ను ప్రారంభించింది. దీంతో, సీబీఐ, రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాల యాలు, జిల్లా పోలీసు కార్యాలయాలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 1,400కు పైగా విభాగాలను ఒకే వేదికపై అనుసంధానం వీలైదంది. దీంతో సమాచార మార్పిడి సమయం గణనీయంగా తగ్గిందని, గతంలో 20 రోజుల వరకు పట్టే సమాచారం ఇప్పుడు 10 రోజుల్లోపే అందుబాటులోకి వస్తోందని పేర్కొంది.పెరిగిన రెడ్ కార్నర్ నోటీసుల జారీఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసులు 2022లో 40, 2023లో 100, 2024లో 107, 2025లో 112 జారీ కాగా, 2026లో ఇప్పటివరకు 182 నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించింది. మూడేళ్లలో మొత్తం 401 మంది కోసం రెడ్ కార్నర్ నోటీసులిచ్చినట్లు తెలిపింది. విదేశాల్లో పేర్లు, గుర్తింపులు మార్చుకుని దాక్కున్న నేరగాళ్ల గుర్తింపునకు ప్రత్యేకంగా ఆపరేషన్ త్రిశూల్‌ను చేపట్టినట్లు హోంశాఖ వెల్లడించింది. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కోర్టు విచారణలను నిర్వహించడం వల్ల అప్పగింత ప్రక్రియ వేగం పుంజుకుందని తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ లో కీలక మలుపు నిందితులకు రెడ్ కార్నర్..
-
జైషే చీఫ్ మసూద్‌పై రెడ్ కార్నర్ నోటీసు
న్యూఢిల్లీ : పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాద దాడికి ప్రధాన సూత్రధారి, జైషే ఈ మొహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ కు ఇంటర్ పోల్ మంగళవారం రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. మసూద్ తో పాటు అతడి సోదరుడు అబ్దుల్ రవూఫ్‌లపై ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చింది. అలాగే ఇంటర్‌పోల్ ఈ కేసులో మరో ఇద్దరు షాహిద్ లతిఫ్, ఖషీఫ్ జాన్‌పై కూడా రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసే యోచనలో ఉంది. ఈ ఏడాది జనవరి 2వ తేదీన పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్‌పై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆరుగురు ఉగ్రవాదులు, ఏడుగురు కమెండోలు మృతి చెందారు. ఇక పాకిస్థాన్‌లో ఉంటూనే ఈ దాడికి సూత్రధారిగా వ్యవహరించిన మసూద్ అక్కడి నుంచే ఉగ్రవాదులను పంపాడని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణలో తేల్చింది. ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన అరెస్ట్ వారెంటును సీబీఐ ఇంటర్ పోల్ కు పంపి వారిద్దరిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాల్సిందిగా కోరింది. దీనిపై స్పందించిన ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చింది. -
మాల్యాపై రెడ్ కార్నర్ నోటీసులివ్వండి..
ఇంటర్‌పోల్‌కు సీబీఐ లేఖ న్యూఢిల్లీ: భారత్‌లో రూ.9,000 కోట్ల మేర బ్యాంకింగ్ రుణ ఎగవేతలు, అక్రమ ధనార్జన వంటి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ... ప్రస్తుతం బ్రిటన్‌లో ఉన్న పారిశ్రామికవేత్త విజయ్‌మాల్యా మరింత సంక్షోభంలో కూరుకుపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆయన కోసం రెడ్ కార్నర్ (అరెస్ట్ వారెంట్) నోటీస్ జారీ చేయాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) గ్లోబల్ పోలీస్- ఇంటర్‌పోల్‌కు ఒక లేఖ రాసింది. ముంబైలో రూ.900 కోట్ల ఐడీబీఐ రుణ ఎగవేత కేసుపై విచారణ జరుపుతున్న ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) చేసిన విజ్ఞప్తికి అనుగుణంగా సీబీఐ ఈ లేఖ రాసింది. ఇంటర్‌పోల్ సభ్యదేశాలకు చెందిన ఒక వ్యక్తి నేరం చేసి ఆయా సభ్యదేశాల్లో ఎక్కడ దాక్కున్నా... రెడ్‌కార్నర్ నోటీసు జారీ... అనంతరం అరెస్ట్‌చేసి... చట్టం ముందు నిలబెట్టడం ఇంటర్‌పోల్ లక్ష్యం. తమ దేశ పాస్‌పోర్ట్‌ను కలిగిఉన్న వ్యక్తిని దేశం నుంచి బహిష్కరించడం కుదరదని, అవసరమైతే నేరస్తుల అప్పగింత ఒప్పందం పరిధిలో మాల్యాను అప్పగించేందుకు సహకరిస్తామని బ్రిటన్ పేర్కొన్న నేపథ్యంలో సీబీఐ చర్య ప్రాధాన్యం సంతరించుకుంది. -
హైకోర్టును ఆశ్రయించిన కేవీపీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో టైటానియం కేసులో ఇంటర్ పోల్ ద్వారా అమెరికా జాతీయ క్రైం బ్యూర్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటిస్ అంశంపై రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు హైకోర్టును ఆశ్రయించారు. రెడ్ కార్నర్ నోటీసు ఆధారంగా తన అరెస్ట్‌ను ఆపాలంటూ కేవీపీ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసినట్టు తెలుస్తోంది. కేవీపీపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ పోలీసులకు సీబీఐ లేఖ పంపినట్టు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.


