మాల్యాపై రెడ్ కార్నర్ నోటీసులివ్వండి.. | Endgame Vijay Mallya? ED asks Interpol to issue Red Corner Notice against him | Sakshi
Sakshi News home page

మాల్యాపై రెడ్ కార్నర్ నోటీసులివ్వండి..

May 12 2016 11:56 PM | Updated on Sep 3 2017 11:57 PM

మాల్యాపై రెడ్ కార్నర్ నోటీసులివ్వండి..

మాల్యాపై రెడ్ కార్నర్ నోటీసులివ్వండి..

భారత్‌లో రూ.9,000 కోట్ల మేర బ్యాంకింగ్ రుణ ఎగవేతలు, అక్రమ ధనార్జన వంటి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ...

ఇంటర్‌పోల్‌కు సీబీఐ లేఖ
న్యూఢిల్లీ: భారత్‌లో రూ.9,000 కోట్ల మేర బ్యాంకింగ్ రుణ ఎగవేతలు, అక్రమ ధనార్జన వంటి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ... ప్రస్తుతం బ్రిటన్‌లో ఉన్న పారిశ్రామికవేత్త విజయ్‌మాల్యా మరింత సంక్షోభంలో కూరుకుపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆయన కోసం రెడ్ కార్నర్ (అరెస్ట్ వారెంట్) నోటీస్ జారీ చేయాలని  సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) గ్లోబల్ పోలీస్- ఇంటర్‌పోల్‌కు ఒక లేఖ రాసింది. ముంబైలో రూ.900 కోట్ల ఐడీబీఐ రుణ ఎగవేత కేసుపై విచారణ జరుపుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) చేసిన విజ్ఞప్తికి అనుగుణంగా సీబీఐ ఈ లేఖ రాసింది.

ఇంటర్‌పోల్ సభ్యదేశాలకు చెందిన ఒక వ్యక్తి నేరం చేసి ఆయా సభ్యదేశాల్లో ఎక్కడ దాక్కున్నా... రెడ్‌కార్నర్ నోటీసు జారీ... అనంతరం అరెస్ట్‌చేసి... చట్టం ముందు నిలబెట్టడం ఇంటర్‌పోల్ లక్ష్యం. తమ దేశ పాస్‌పోర్ట్‌ను కలిగిఉన్న వ్యక్తిని దేశం నుంచి బహిష్కరించడం కుదరదని, అవసరమైతే నేరస్తుల అప్పగింత ఒప్పందం పరిధిలో మాల్యాను అప్పగించేందుకు సహకరిస్తామని బ్రిటన్ పేర్కొన్న నేపథ్యంలో సీబీఐ చర్య ప్రాధాన్యం సంతరించుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement