Record turnout
-
షాక్ మీద షాక్: ఫలితాలను తిరగతోడిన సట్టా బజార్
ప్రస్తుత పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలు అత్యంత ఉత్కంఠభరిత, రసవత్తర పోటీకి వేదికగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన రెండు దశల పోలింగ్‌లో నమోదైన రికార్డు స్థాయి ఓటింగ్ శాతం అటు రాజకీయ వర్గాల్లో, ఇటు ప్రజల్లో తీవ్ర ఆసక్తిని రేపుతోంది. ఓట్ల లెక్కింపు సమయం దగ్గర పడుతున్న వేళ ‘ఫలోడి సట్టా బజార్’ తన అంచనా ఫలితాలను మరోమారు తిరగతోడింది. ఈ నేపధ్యంలో ఊహకందని పలు షాకింగ్ అంశాలు వెలుగు చూశాయి.తీవ్రమైన పోటీ తప్పదురాజస్థాన్లోని జోధ్‌పూర్ జిల్లాలో ఉన్న ‘ఫలోడి’ అనే పట్టణం దేశవ్యాప్తంగా అక్రమ బెట్టింగ్‌లకు ప్రధాన కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. దీనిని భారతదేశపు ‘బెట్టింగ్ రాజధాని’ అని కూడా పిలుస్తుంటారు. ఇక్కడ ప్రధానంగా దేశంలో జరిగే ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్‌లు జరుగుతాయి. వీరు ఇచ్చే అంచనాలు చాలా వరకు నిజమవుతాయని ఒక నమ్మకం ఉంది. అందుకే దేశీయ మీడియాతో పాటు రాజకీయ విశ్లేషకులు కూడా ఈ బజార్ లెక్కలను గమనిస్తుంటారు. ఇటు అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, అటు ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ రెండూ కూడా గెలుపు తమదే అని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మొదట్లో వెలువడిన ప్రాథమిక అంచనాలు ఒక పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని సూచించినప్పటికీ, తాజాగా నవీకరించిన ‘ఫలోడి సట్టా బజార్’ అంచనాలు గెలుపు ఎవరిదైనా సరే తీవ్రమైన పోటీ తప్పదని తేల్చి చెబుతున్నాయి. తారుమారైన లెక్కలు పశ్చిమ బెంగాల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తిగా ముగిసిన తర్వాత ఫలోడి సట్టా బజార్ తన పాత అంచనాలను భారీగా సవరించింది. ప్రారంభంలో వచ్చిన నివేదికల ప్రకారం అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సునాయాసంగా గెలిచే అవకాశం ఉన్నట్లు కనిపించింది. కానీ తాజా మార్పుల తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి స్వల్ప ఆధిక్యం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. తాజా అంచనాల ప్రకారం బీజేపీ మ్యాజిక్ ఫిగర్ సాధించే దిశగా లేదా అంతకంటే కొద్దిగా ఎక్కువ సీట్లను కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో తృణమూల్ కాంగ్రెస్ కూడా చాలా దగ్గరి పోటీ ఇస్తూ వెనుబడే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొత్తం 294 స్థానాలున్న అసెంబ్లీలో మెజారిటీ కోసం 148 సీట్లు ఖచ్చితంగా అవసరం.ప్రభుత్వ వ్యతిరేక పవనాలు? పశ్చిమ బెంగాల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ ఓటింగ్ శాతం నమోదు కావడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రెండు దశల ఎన్నికల్లోనూ పోలింగ్ ఏకంగా 92 శాతం దాటడం విశేషం. ఈ భారీ ఓటింగ్ శాతాన్ని చూసిన తర్వాత ఫలోడి సట్టా బజార్ తన అంచనాలను వెంటనే మార్చుకుంది. ఇంత పెద్ద ఎత్తున ఓటర్లు బయటకు రావడం అనేది బహుశా అధికార పార్టీపై ఉన్న తీవ్ర వ్యతిరేకతకు ప్రబల సంకేతం కావచ్చని, లేదా ఓటర్ల ఆలోచనా విధానంలో వస్తున్న పెను మార్పులకు ఒక ప్రత్యక్ష నిదర్శనం కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మొదటి దశ పోలింగ్ ముగిసిన వెంటనే వచ్చిన అంచనాలు తృణమూల్ కాంగ్రెస్ పార్టీదే పైచేయి అని స్పష్టంగా చెప్పాయి. కానీ రెండవ దశ పోలింగ్ ముగిశాక బెట్టింగ్ ధోరణుల్లో పెను మార్పులు వచ్చాయి. అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ బలపడిందని, రెండు పార్టీల మధ్య ఉన్న అంతరం బాగా తగ్గిపోయిందని చెబుతున్నారు.ఈ ఒక్క అంశమే కీలకంపశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ఒక అత్యంత కఠినమైన ఎన్నికల యుద్ధాన్ని ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అసాధారణ స్థాయిలో బలపడి అధికార పీఠాన్ని కైవసం చేసుకునేందుకు సవాలు విసురుతోంది. ఒకపక్క తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి అట్టడుగు స్థాయిలో బలమైన సంస్థాగత నిర్మాణం, ప్రజల ఆదరణ ఇప్పటికీ స్థిరంగా కొనసాగుతున్నప్పటికీ, తాజాగా వస్తున్న ఎగ్జిట్ పోల్స్, అలాగే సట్టా మార్కెట్ ధోరణులు చూస్తుంటే, రెండు పార్టీల మధ్య నరాలు తెగే హోరాహోరీ పోరు తప్పదని స్పష్టమవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోని ఓటు బ్యాంకును కాపాడుకుంటూనే, పట్టణ ప్రాంతాల్లో విస్తరిస్తున్న బీజేపీని మమతా బెనర్జీ ఏ మేరకు అడ్డుకోగలరనేదే అంతిమ విజేతను నిర్ణయించే ప్రధానాంశం కానుందని విశ్లేషకులు అంటున్నారు.ఇది కూడా చదవండి: బెంగాల్ పీఠంపై సస్పెన్స్.. ‘హంగ్’ వస్తే ఎవరికి ఛాన్స్? -
French elections 2024: ఫ్రాన్స్ రెండో దశలో... రికార్డు పోలింగ్
పారిస్: ఫ్రాన్స్ పార్లమెంటు ఎన్నికల్లో ఆదివారం కీలకమైన రెండో దశలో రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం ఐదుగంటలకు 59.7 శాతం పోలింగ్ నమోదైనట్లు ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది. 1981 తర్వాత ఇంతటి పోలింగ్ నమోదవడం ఇదే తొలిసారి. జూన్ 30వ తేదీన జరిగిన తొలి రౌండ్లో 67 శాతం పోలింగ్ జరిగింది. ఐరోపా ఎన్నికల్లో మధ్యేవాదుల పరాజయం తర్వాత అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ జూన్ 9న పార్లమెంట్‌ను రద్దు చేసి ఎన్నికలకు పిలుపునిచ్చారు. ఫ్రాన్స్‌లో అధ్యక్ష ఎన్నికలైనా, పార్లమెంటు ఎన్నికలైనా రెండు దశల్లో జరుగుతాయి. ఆదివారం జరిగిన రెండో దశ కీలకమైనది. మాక్రాన్ అధ్యక్ష పదవీ కాలం ఇంకా మూడేళ్లు ఉంది. ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల ఫలితాల వల్ల ఆయన పదవికి తక్షణ ప్రమాదం ఏమీ లేకున్నా, చట్టాలు చేసేటప్పుడు పార్లమెంటులో అడుగడుగునా పరీక్ష ఎదురయ్యే అవకాశం ఉంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌కు తొలిరౌండ్లో చేదు అనుభవం ఎదురైన విషయం తెల్సిందే. మేక్రాన్‌కు చెందిన మితవాద సెంట్రిస్ట్ ఎన్‌సింబల్ కూటమి మూడో స్థానంలో సరిపెట్టుకుంది. తొలి రౌండ్లో అతివాద నేషనల్ ర్యాలీ కూటమి 33.14 శాతం ఓట్లను ఒడిసిపట్టి విజయం సాధించింది. విపక్షాలకు చెందిన న్యూ పాపులర్ ఫ్రంట్ కూటమి 27.99 శాతం ఓట్లను సాధించింది. మేక్రాన్ పార్టీ కేవలం 20.04 శాతం ఓట్లతో సరిపెట్టుకుంది. ఇటీవల యురోపియన్ పార్లమెంట్ ఎన్నికల్లో నాయకురాలు మెరీన్ లీ పెన్కు చెందిన నేషనల్ ర్యాలీ పార్టీ విజయం సాధించింది. ఆలస్యం చేస్తే విపక్షాలు మరింత పుంజుకుంటాయన్న భయంతో మేక్రాన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లిన విషయం విదితమే. -
రికార్డ్ పోలింగ్
కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో 66 శాతం.. 27 ఏళ్లలో రికార్డ్ జార్ఖండ్‌లో 66.03 శాతం.. రాష్ట్ర చరిత్రలో రికార్డ్ రెండు రాష్ట్రాలలో ఐదో విడతతో ముగిసిన ఎన్నికలు శ్రీనగర్/రాంచి/న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్, జార్ఖండ్ శాసనసభలకు శనివారంతో ముగిసిన ఐదు దశల ఎన్నికల్లో చరిత్రాత్మకంగా, కనీవినీ ఎరుగని రీతిలో పోలింగ్ నమోదైంది. జమ్మూ కశ్మీర్ ఐదు విడతల పోలింగ్‌లో గత 27 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా రీతిలో 66 శాతం పోలింగ్ జరిగింది. జార్ఖండ్‌లో ఐదు దశల్లో 66.03 శాతం ఓటింగ్ నమోదైంది. చివరిదైన ఐదవ దశ పోలింగ్‌లో ఏకంగా 71.26 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. జార్ఖండ్ చరిత్రలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. కశ్మీర్లో ఐదో దశ ఎన్నికల్లో జమ్మూ, క తువా, రాజౌరీ జిల్లాల్లోని 20 నియోజకవర్గాల్లో ఏకంగా 76 శాతం ఓటింగ్ నమోదైంది. గడ్డకట్టించే చలిని కూడా లెక్కచేయకుండా జనం ఓటుహక్కు వినియోగించుకున్నారు. వేర్పాటు వాదుల ఎన్నికల బహిష్కరణ పిలుపును, సరిహద్దులో ఉగ్రవాదుల దాడులను లెక్కచేయకుండా ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నారు. రాజౌరీ జిల్లాలోని చౌదరీ ఖార్ గ్రామానికి చెందిన 110 ఏళ్ల వయోవృద్ధుడు మున్షీ ఖాన్ ఎముకలు కొరికే చలినిసైతం లెక్కచేయకుండా ఓటుహక్కు వినియోగించుకోవడం విశేషం. కాగా, కతువా జిల్లాలో బీజేపీ అభ్యర్థి నిర్మల్ సింగ్‌పై దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలపై కాంగ్రెస్ అభ్యర్థి, కశ్మీర్ మంత్రి మనోహర్ లాల్ శర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించినందుకు రాజీందర్ సింగ్ అనే స్వతంత్ర అభ్యర్థిపై కూడా కేసు నమోదైంది. గతనెల 25న మొదలైన కశ్మీర్ ఐదుదశల ఎన్నికలు పూర్తి ప్రశాంత వాతావరణంలో జరిగాయని, ఓటర్లు ఉత్సాహంతో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారని ఎన్నికల కమిషన్ డిప్యూటీ కమిషనర్ వినోద్ జుత్షి తెలిపారు. 1987 తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ, తాజా పోలింగ్ కంటే తక్కువ శాతమే ఓటింగ్ జరిగింద న్నారు. 2008 అసెంబ్లీ ఎన్నికల్లో 61.62 శాతం, 2002లో 43.09 శాతం ఓటింగ్ నమోదైందని, 2004 లోక్‌సభ ఎన్నికల్లో 35.20 శాతం, 2009లో 39.67 శాతం, 2014లో 50.23 శాతం మాత్రమే పోలింగ్ నమోదైందన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ ఎన్నికలకు ముందస్తుగాగానీ, ఎన్నికల్లో గానీ ప్రాణనష్టమే జరగలేదని చెప్పారు. ఐదవ దశలో కశ్మీర్ ఉపముఖ్యమంత్రి తారాచంద్, నలుగురు మంత్రివర్గ సహచరులు సహా 312 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఇక జార్ఖండ్ ఐదవదశలో 16 నియోజకవర్గాల్లో 71.26 శాతం పోలింగ్ నమోదైందని, ఎన్నికల డిప్యూటీ కమిషనర్ ఉమేశ్ సిన్హా చెప్పారు. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, స్పీకర్ శశాంక్ శేఖర్ భోక్తా, మంత్రి లోబిన్ హెంబ్రోమ్ తదితరుల భవితవ్యం ఐదవ దశలో తేలనుంది. కశ్మీర్లో సర్పంచ్ కాల్చివేత జమ్మూకశ్మీర్‌లో ఓ గ్రామ సర్పంచ్‌ను మిలిటెంట్లు శనివారం కాల్చిచంపారు. బారాముల్లా జిల్లా బోమై గ్రామ సర్పంచ్ గులామ్ అహ్మన్ భట్(65)పై గ్రామంలోని మెయిన్ చౌక్ వద్ద మిలిటెంట్లు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన భట్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రిగా తరలించగా.. బుల్లెట్ గాయాలతో తుది శ్వాస విడిచారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఏ ఉగ్రవాద సంస్థా బాధ్యత ప్రకటించుకోలేదు.


