Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Emergency Day June 25 To Be Observed As Samvidhaan Hatya Diwas
జూన్‌ 25 సంవిధాన్‌ హత్యా దివస్‌.. కేంద్రం సంచలన ప్రకటన

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రతి ఏడాది జూన్‌ 25వ తేదీని సంవిధాన్‌ హత్యా దివస్‌(రాజ్యాంగాన్ని హత్య చేసిన రోజు)గా జరపాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తన ఎక్స్‌ ద్వారా ప్రకటన చేశారు.1975లో ఆ తేదీన అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించారు. ఆ రోజులకు నిరసనగా ఇక నుంచి సంవిధాన్‌ హత్యా దివస్‌ నిర్వహించాలని బీజేపీ నేతృత్వంలోని కేంద్రం నిర్ణయించింది. రాజ్యాంగాన్ని లెక్క చేయకుండా ప్రజల్ని వేధించినందుకు ఈ పేరుతో దినోత్సవం జరుపుతామని అమిత్‌ షా తెలిపారు. ఎమర్జెన్సీలో కష్టాల పాలైన వారిని స్మరించుకునే విధంగా సంవిధాన్ హత్య దివస్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు పేర్కొన్నారు

Police Have Registered Case Against Ys Jagan
వైఎస్‌ జగన్‌పై చంద్రబాబు సర్కార్‌ కక్ష సాధింపు

సాక్షి, విజయవాడ: మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై చంద్రబాబు సర్కార్‌ కక్ష సాధింపు చర్యలకు దిగింది. రఘురామకృష్ణం రాజు ఫిర్యాదును అడ్డం పెట్టుకుని వైఎస్‌ జగన్‌పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. పోలీసులు కొట్టారంటూ ఫిర్యాదు చేస్తే.. మాజీ ముఖ్యమంత్రిపై కేసు నమోదు చేశారు. పోలీసులు వైఖరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.మాజీ సీఎం వైఎస్‌ జగన్‌తో పాటు సీఐడీ మాజీ డీజీ సునీల్‌కుమార్‌పై కూడా కేసు నమోదైంది. రఘురామ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కస్టడీలో తనపై హత్యాయత్నం చేశారని రఘురామకృష్ణం రాజు ఫిర్యాదు చేశారు. కేసులో ఏ3గా వైఎస్‌ జగన్ పేరును పోలీసులు నమోదు చేశారు.ఏ1గా సీఐడీ మాజీ డీజీ సునీల్‌కుమార్, ఏ2గా ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు, ఏ4గా విజయ్‌పాల్, ఏ5గా డాక్టర్‌ ప్రభావతి పేరును పోలీసులు చేర్చారు. మే 14న జరిగిన ఘటనపై.. నిన్న సాయంత్రం ఈ-మెయిల్ ద్వారా రఘురామకృష్ణ ఫిర్యాదు చేశారు. గతంలో సుప్రీంకోర్టు తిరస్కరించిన కేసుకు సంబంధించి రఘురామ మళ్లీ ఫిర్యాదు చేయడం.. ఆపై కేసు నమోదు చేయించడం ద్వారా.. టీడీపీ ప్రభుత్వం కుట్రలకు తెరలేపుతోంది.వారి విజ్ఞతకే వదిలేస్తున్నా.. సీఐడీ మాజీ డీజీ ట్వీట్‌తనపై కేసు నమోదు చేయడంపై సీఐడీ మాజీ డీజీ స్పందించారు. సుప్రీంకోర్టు తిరస్కరించిన కేసులో కొత్తగా ఎఫ్‌ఐఆర్‌ వేయడాన్ని ఏమనాలో వారి విజ్ఞతకే వదిలేస్తున్నా అంటూ సునీల్‌ ట్వీట్‌ చేశారు.సుప్రీం కోర్టులో మూడేళ్ళు నడిచి … సాక్షాత్తూ సుప్రీమ్ కోర్ట్ తిరస్కరించిన కేసులో కొత్తగా FIR వేయడాన్ని ఏమనాలో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను— PV Sunil Kumar (@PV_Sunil_Kumar) July 12, 2024

Staff Should Talk to Shami Paras Mhambrey on New Coach Plan For Shami Return
టీమిండియా స్టార్‌ పేసర్‌ రీ ఎంట్రీపై సందేహాలు! గౌతీ ప్లాన్‌?

వన్డే ప్రపంచకప్‌-2023 తర్వాత టీమిండియాకు దూరమయ్యాడు స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ. చీలమండ గాయం వేధిస్తున్నా పంటిబిగువన నొప్పిని భరించి ఐసీసీ టోర్నీని పూర్తి చేసిన ఈ ఫాస్ట్‌బౌలర్‌.. అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు.సొంతగడ్డపై ఈ మెగా ఈవెంట్లో ఫైనల్‌ వరకు అజేయంగా నిలవడంలో కీలక పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్నాడు షమీ. అయితే, వరల్డ్‌కప్‌ తర్వాత గాయం తీవ్రత ఎక్కువ కావడంతో సర్జరీ చేయించుకున్నాడు.అయితే, ఈ యూపీ ఎక్స్‌ప్రెస్‌ ఇంత వరకు పునరాగమనం చేయలేదు. ఐపీఎల్‌-2024తో పాటు టీ20 ప్రపంచకప్‌-2024కు కూడా దూరమయ్యాడు. తాను క్రమక్రమంగా కోలుకుంటున్నానని షమీ సోషల్‌ మీడియా ద్వారా తెలియజేసినా రీఎంట్రీపై స్పష్టత మాత్రం ఇవ్వలేదు.పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ సాధించాడా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇక టీ20 వరల్డ్‌కప్‌ గెలిచిన టీమిండియా తదుపరి ద్వైపాక్షిక సిరీస్‌లతో పాటు చాంపియన్స్‌ ట్రోఫీ-2025తో పాటు వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌పై కన్నేసింది.ఈ ఐసీసీ టోర్నీల్లో రాణించాలంటే సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ అవసరం ఉందని టీమిండియా బౌలింగ్‌ మాజీ కోచ్‌ పారస్‌ మాంబ్రే అన్నాడు. ఈ విషయంలో కొత్త కోచింగ్‌ సిబ్బంది చొరవతీసుకోవాలని సూచించాడు.‘‘షమీ తదుపరి ప్రణాళిక ఏమిటో కోచింగ్‌ స్టాఫ్‌ అడిగి తెలుసుకోవాలి. అతడిని సంప్రదించి.. ఫిట్‌గా ఉన్నాడా లేదా? ఇంకెన్నాళ్లు క్రికెట్‌ ఆడాలనుకుంటున్నాడు? అన్న విషయాలను అడగాలి. అతడికీ వయసు మీద పడుతోంది.అయినా షమీ నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టుకోగలగాలంటే అందుకు తగ్గ వ్యూహాలు రచించాలి. జట్టుకు అదెంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. గౌతీ ఆ పని చేస్తాడని నాకు నమ్మకం ఉంది.టెస్టుల్లో అతడిని వాడుకోవాలనుకుంటే ఆస్ట్రేలియాతో సిరీస్‌ నాటికి పూర్తిస్థాయిలో అతడు ఫిట్‌నెస్‌ సాధించేలా శిక్షణ ఇవ్వాలి. అయితే, ఆడేందుకు షమీ శరీరం సహకరిస్తేనే అన్నీ సజావుగా సాగుతాయి.షమీ లాంటి సీనియర్ల విషయంలో యో- యో టెస్టు(ఫిట్‌నెస్‌) అవసరం లేదనే అనుకుంటా’’ అని పారస్‌ మాంబ్రే ది టెలిగ్రాఫ్‌తో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా టీమిండియా కొత్త కోచ్‌గా గౌతం గంభీర్‌ నియమితుడైన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. టీమిండియా పేస్‌ దళ నాయకుడు జస్‌ప్రీత్‌ బుమ్రాతో పాటు షమీ కూడా కొన్నేళ్లుగా ఫాస్ట్‌ బౌలింగ్‌ విభాగంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. చదవండి: చరిత్ర సృష్టించిన బెన్‌ స్టోక్స్‌.. ఇంగ్లండ్‌ తొలి ప్లేయర్‌గా రికార్డు

Biden Late For NATO Summit Giorgia Meloni Expressions Viral
Watch: మెలోనీకి విసుగు తెప్పించిన బైడెన్‌!

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ గురించి వీడియోలు వైరల్‌ అవుతుండడం చూస్తున్నాం. అయితే.. ఇటలీ పీఎం మెలోనీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ విసుగు తెప్పించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌ అవుతోంది.ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి సంబంధించిన మూమెంట్స్‌ కొన్ని సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుండడం చూస్తున్నాం. ముఖ్యంగా భారత ప్రధాని మోదీకి, ఆమెకు మధ్య ప్రత్యేకంగా ‘మెలోడీ’(మోదీ+మెలోనీ) మూమెంట్స్‌ పేరిట ప్రత్యేకంగా వైరల్‌ అవుతుంటాయి కూడా. అయితే..వాషింగ్టన్‌లో జరిగే నాటో సదస్సు కోసం వెళ్లిన ఇటలీ ప్రధాని మెలోనీకి, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ విసుగు తెప్పించారు. మూడో రోజు సదస్సు ప్రారంభం కోసం సభ్యదేశాల ప్రపంచ దేశాల అధినేతలంతా ఎదురు చూస్తున్నారు. ఆ నిరీక్షణ మెలోనీకి చిరాకు తెప్పించినట్లుంది. ఎదురుగా ఉన్న ఫిన్లాండ్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ స్టబ్‌తో సంభాషిస్తూనే.. అంత ఇంకా ఎంత టైం? అంటూ అన్నారామె. దానికి అధ్యక్షుడు స్టబ్‌ తన ఫోన్‌ బయటకు తీసి టైం చూసి ఏదో చెప్పారు. దీంతో ఆమె మరోసారి కళ్లతో సైగ చేసి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. Giorgia #Meloni in top eye-rolling form as leaders at the #NATO summit wait for Stoltenberg and Biden to arrive for the first session today. pic.twitter.com/KVSobO8QNU— Life On Earth (@e_jagat_) July 12, 2024సుమారు 40 నిమిషాలు ఆలస్యంగా బైడెన్‌, నాటో సెక్రటరీ జనరల్‌ జెన్స్‌ స్టోల్టెన్‌బర్గ్‌తో కలిసి వచ్చారు. మొత్తంగా ఉదయం 10గం.లకు ప్రారంభం కావాల్సిన ఆ సదస్సు.. లేట్‌గా ప్రారంభమైంది. అన్నట్లు మెలోనీ-బైడెన్‌ మధ్య ఈ తరహా వైరల్‌ ఇన్సిడెంట్‌లు ఇంతకు ముందు కూడా వచ్చాయి.WHAT IS BIDEN DOING? pic.twitter.com/iY33K2srII— RNC Research (@RNCResearch) June 13, 2024

Rahul Gandhi Argues Stop Use Derogatory language against Smriti Irani
స్మృతి ఇరానీకి మద్దతుగా రాహుల్‌ గాంధీ ట్వీట్‌!

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ.. కేంద్రమాజీ మంత్రి, బీజేపీ నేత స్మృతి ఇరానీకి మద్దతుగా ఎక్స్‌ ఖాతాలో ఓ సందేశం ఉంచడం చర్చనీయాంశంగా మారింది.2019 సార్వత్రిక ఎన్నికల్లో అమేథీలో స్మృతి ఇరానీ చేతిలో రాహుల్‌ గాంధీ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లోనూ వీళ్ల మధ్య పోటీ ఉండొచ్చని భావించినప్పటికీ.. అనూహ్యంగా రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ పోటీ చేశారు. ఈ క్రమంలో స్మృతి ఇరానీ, రాహుల్‌ను ఎద్దేవా చేస్తూ కాంగ్రెస్‌పై కామెంట్లు చేశారు. అయితే కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన కిషోరీ లాల్‌ శర్మ, స్మృతి ఇరానీని ఓడించారు.ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక.. తాజాగా స్మృతి ఇరానీని దూషిస్తూ సోషల్‌ మీడియాలో కొందరు పోస్టులు చేస్తు‍న్న సంగతి రాహుల్‌ గాంధీ దృష్టికి వచ్చింది. దీంతో ఆమెకు మద్దతుగా ఆయన తన ఎక్స్‌ ఖాతాలో ఓ సందేశం ఉంచారు.జీవితంలో గెలుపోటములు వస్తుంటాయి. అలాగని ఒకరిని కించపర్చడం, అవమానించడం సరికాదు. పైగా అది బలహీనత అవుతుందే తప్ప.. బలం అనిపించుకోదు. స్మృతి ఇరానీనో లేదంటే ఇతర నాయకుల్ని అవమానించడం, దుర్భాషలాడడంలాంటివి చేయొద్దని కోరుతున్నా అని రాహుల్‌ తన ఎక్స్‌ ఖాతాలో ట్వీట్‌ చేశారు. Winning and losing happen in life. I urge everyone to refrain from using derogatory language and being nasty towards Smt. Smriti Irani or any other leader for that matter. Humiliating and insulting people is a sign of weakness, not strength.— Rahul Gandhi (@RahulGandhi) July 12, 2024

Indian 2: Bharateeyudu 2 Movie Review And Rating In Telugu
Indian 2 Review: ‘భారతీయుడు 2’ మూవీ రివ్యూ

టైటిల్‌: భారతీయుడు 2(ఇండియన్‌ 2)నటీనటులు: క‌మ‌ల్ హాస‌న్‌, ఎస్‌.జె.సూర్య‌, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, సిద్ధార్థ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్,స‌ముద్ర‌ఖ‌ని, బాబీ సింహ‌, బ్ర‌హ్మానందం తదితరులునిర్మాణ సంస్థ: లైకా ప్రొడ‌క్ష‌న్స్, రెడ్ జెయింట్నిర్మాత: సుభాస్క‌ర‌న్ క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం: ఎస్‌.శంక‌ర్‌సంగీతం: అనిరుధ్ రవిచందర్ఎడిటింగ్‌: శ్రీకర్‌ ప్రసాద్‌సినిమాటోగ్రఫీ: రవి వర్మన్‌విడుదల తేది: జులై 12, 2024కమల్‌ హాసన్‌ నటించిన బెస్ట్‌ చిత్రాల్లో ‘భారతీయుడు’ ఒకటి. శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ 1996లో విడుదలై బాక్సాఫీస్‌ని షేక్‌ చేసింది. దాదాపు 28 ఏళ్ల తర్వాత ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘భారతీయుడు 2’ వచ్చింది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. దానికి తోడు మూవీ ప్రమోషన్స్‌ కూడా గట్టిగా చేయడంతో ‘భారతీయుడు 2’(Bharateeyudu 2 Review) పై భారీ హైప్‌ క్రియేట్‌ అయింది.భారీ అంచనాల మధ్య నేడు(జులై 12) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. భారతీయుడు 2 కథేంటంటే..చిత్ర అరవిందన్‌(సిద్దార్థ్‌), హారతి(ప్రియాభవాని శంకర్‌) ఇంకో ఇద్దరు స్నేహితులు కలిసి సోషల్‌ మీడియా వేదికగా అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటారు. రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు చేసే అన్యాయాలపై వీడియోలు చేసి బార్కింగ్‌ డాగ్స్‌ అనే పేరుతో య్యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌ ఇతర సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో షేర్‌ చేస్తుంటారు. వారి చుట్టు జరిగిన కొన్ని సంఘటనలు చూసి చలించిపోయిన అరవిందన్‌.. మళ్లీ భారతీయుడు వస్తే బాగుంటుందని భావిస్తాడు. కమ్‌బ్యాక్‌ ఇండియా(Comeback India) హ్యాష్‌ట్యాగ్‌తో సేనాపతి(కమల్‌ హాసన్‌) మళ్లీ ఇండియా రావాలని పోస్టులు పెడతారు. అవికాస్త వైరల్‌ అయి.. చైనీస్ తైపీలో ఉన్న సేనాపతి అలియాస్‌ భారతీయుడుకి చేరతాయి. దీంతో సేనాపతి తిరిగి ఇండియా వస్తాడు. ఈ విషయం తెలుసుకున్న సీబీఐ అధికారి ప్రమోద్‌(బాబీ సింహా).. అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు. కానీ భారతీయుడు గెటప్స్‌ మారుస్తూ అవినీతికి పాల్పడిన వారిని దారుణంగా హత్య చేస్తుంటారు. భారతీయుడు ఇచ్చిన పిలుపుతో దేశంలోని యువత కూడా అవితీనికి వ్యతిరేకంగా పని చేస్తుంటుంది. ఈ క్రమంలో అరవిందన్‌ ఫ్యామిలీలో ఓ విషాదం చోటు చేసుకుంటుంది. దానికి కారణంగా భారతీయుడే అని అరవిందన్‌తో సహా అందరూ నిందిస్తారు. అసలు అరవిందన్‌ ఇంట్లో చోటు చేసుకున్న ఆ విషాదం ఏంటి? దానికి భారతీయుడు ఎలా కారణం అయ్యాడు? కమ్‌బ్యాక్‌ ఇండియా అని భారతీయుడిని ఆహ్వానించిన యువతే.. గోబ్యాక్‌ ఇండియా అని ఎందుకు నినదించారు? సామాన్యులకు సైతం భారతీయుడుపై ఎందుకు కోపం పెరిగింది? రియల్‌ ఎస్టేట్‌ పేరుతో అ‍క్రమంగా భూములను స్వాధీనం చేసుకుంటూ వేలకోట్లు సంపాదించిన సద్గుణ పాండ్యన్(ఎస్‌ జే సూర్య)..సేనాపతిని చంపేందుకు వేసిన ప్లాన్‌ వర్కౌంట్‌ అయిందా? సీబీఐ అధికారులకు దొరికిన సేనాపతి..వారి నుంచి ఎలా తప్పించుకున్నాడు? అసలు సేనాపతి టార్గెట్‌ ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే అంటెండర్‌ దగ్గర నుంచి ఆర్డర్ లిచ్చే అధికారుల వరకు లంచం అనే మాట ఎలా నాటుకుపోయిందో ‘భారతీయుడు’లో కళ్లకు కట్టినట్లు చూపించాడు శంకర్‌. ఆ సినిమా విడుదలై ఏళ్లు గడుస్తున్నా.. ఆ కథ, అందులోని పాత్రలు మనకు అలా గుర్తిండిపోతాయి. అలాంటి సూపర్‌ హిట్‌ సినిమాకు సీక్వెల్‌ అంటే..కచ్చితంగా అంచనాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. అయితే ఆ అంచనాలకు తగ్గట్లుగా భారతీయుడు 2ని తీర్చిదిద్దలేకపోయాడు శంకర్‌. స్టోరీ లైన్‌ మాత్రమే కాదు చాలా సన్నివేశాలు ‘భారతీయుడు’చిత్రాన్నే గుర్తు చేస్తాయి. అయితే అందులో వర్కౌట్‌ అయిన ఎమోషన్ ఇందులో మిస్‌ అయింది. ప్రతి సీన్‌ సినిమాటిక్‌గానే అనిపిస్తుంది కానీ.. ఎక్కడ కూడా రియాల్టీగా దగ్గరగా ఉండదు. స్క్రీన్‌ప్లే కూడా చాలా రొటీన్‌గా ఉంటుంది. పార్ట్‌ 3 కోసమే అన్నట్లుగా కథను సాగదీశారు. కొన్ని సీన్లు చూస్తే నిజంగానే ఈ చిత్రానికి శంకర్‌ దర్శకత్వం వహించారా అనే అనుమానం కలుగుతుంది. భారతీయుడులో అవినీతికి పాల్పడిన వారిని సేనాపతి చంపుతుంటే మన రోమాలు నిక్కబొడుచుకుంటాయి. కానీ ఇందులో మాత్రం అలాంటి సీన్లను కూడా చాలా చప్పగా తీసేశాడు. సినిమా నిడివి( 3 గంటలు) కూడా మైనస్సే. కొన్ని సీన్లను తొలగించి.. నిడివిని తగ్గిస్తే బాగుండేది (తొలగించడానికి ఒక్క సీన్‌ లేదనే పార్ట్‌ 3 ప్లాన్‌ చేశామని ఓ ఇంటర్వ్యూలో శంకర్‌ చెప్పారు..కానీ సినిమా చూస్తే సాధారణ ప్రేక్షకుడు సైతం కట్‌ చేయాల్సిన సీన్ల గురించి చెప్పగలడు). ఫ్యామిలీ ఎమోషన్స్‌ కూడా అంతగా ఆకట్టుకోలేదు. భారతీయుడు సినిమాలాగే ఈ కథ కూడా మొత్తం లంచం చుట్టే తిరుగుతుంది. సినిమా ప్రారంభ సీన్‌తోనే ఆ విషయం అర్థమైపోతుంది. అవినీతికి వ్యతిరేకంగా చిత్ర అరవిందన్‌ గ్యాంగ్‌ చేసే పోరాటం కాస్త ఆసక్తికరంగా అనిపించినప్పటికీ.. అవినీతి జరిగే సీన్లను బలంగా చూపించలేకపోయాడు. ఇక సేనాపతి ఎంట్రీ సీన్‌తో కథపై ఆసక్తి పెరుగుతుంది. కానీ ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత..కథనం రొటీన్‌గా సా..గూ..తూ.. చిరాకు తెప్పిస్తుంది. తరువాత ఏం జరుగుతందనే విషయం ముందే తెలిసిపోవడంతో.. కథపై అంత ఆసక్తి కలగదు. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ కూడా సింపుల్‌గానే ఉంటుంది. ఇక సెకండాఫ్‌లో కథ మరింత సాగదీతగా అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో మర్మకళను ఉపయోగించి సీక్స్‌ ఫ్యాక్‌తో కమల్‌ చేసే యాక్షన్‌ సీన్‌ బాగుంటుంది. కానీ ఆ తర్వాత వచ్చే ఛేజింగ్‌ సీన్‌ అయితే సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ముగింపులో పార్ట్‌ 3 స్టోరీ ఎలా ఉంటుందో చూపించారు. అది కాస్త ఆసక్తికరంగానే అనిపిస్తుంది. అవినీతిని అంతం చేయాలంటే అది మొదట మన ఇంటి నుంచే ప్రారంభించాలని యూత్‌కి ఇచ్చిన మెసేజ్‌ మాత్రం బాగుంది. ఎవరెలా చేశారంటే..వైవిధ్యమైన పాత్రలు పోషించడం కమల్‌ హాసన్‌కు కొత్తేమి కాదు. ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోతుంటాడు. సేనాపతి పాత్రలో కమల్‌ ఒదిగిపోయాడు. రకరకాల గెటప్స్‌లో కనిపిస్తూ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. యాక్షన్‌ సీన్స్‌ కూడా అదరగొట్టేశాడు. అయితే ఆయన గొంతే ఒక్కో చోట ఒక్కోలా వచ్చింది. సిక్స్‌ ఫ్యాక్స్‌తో కమల్‌ చేసే యాక్షన్‌ సీన్‌కి థియేటర్‌లో ఈళలు పడతాయి.ఇక హీరో సిద్ధార్థ్‌కి మంచి పాత్ర దక్కింది. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసే చిత్ర అరవిందన్‌ పాత్రకు న్యాయం చేశాడు. ఎమోషన్‌ సీన్లలో అదరగొట్టేశాడు. సిద్ధార్థ్‌ స్నేహితురాలికిగా ప్రియా భవానీ శంకర్‌ ఆకట్టుకుంది. సిద్ధార్థ్‌ ప్రియురాలు దిశగా నటించిన రకుల్‌కి ఈ చిత్రంలో ఎక్కువగా స్క్రీన్‌ స్పేస్‌ లభించలేదు. సినిమా మొత్తంలో రకుల్‌ మూడు, నాలుగు సీన్లలో మాత్రమే కనిపిస్తుంది. సీబీఐ అధికారి ప్రమోద్‌గా బాబీ సింహా ఉన్నంతగా బాగానే నటించాడు. వ్యాపారీ సద్గుణ పాండ్యన్‌గా ఎస్‌ జే సూర్యకి పార్ట్‌ 3లోనే ఎక్కువ నిడివి ఉన్నట్లు ఉంది. ఇందులో కేవలం మూడు సీన్లలో కనిపించి వెళ్తాడు. ఏసీబీ అధికారిగా సముద్రఖనితో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. టెక్నికల్‌గా సినిమా పర్వాలేదు.అనిరుధ్ రవిచందర్ నేపథ్య సంగీతం యావరేజ్‌గా ఉంది. ఇక పాటలు గురించి మాట్లాడుకోవద్దు. ఒక్కటి కూడా గుర్తుంచుకునే విధంగా లేవు. రవి వర్మన్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సినిమాలో సాగదీత సన్నివేశాలు చాలా ఉన్నాయి. వాటిని మరింత క్రిస్పీగా కట్‌ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.(Bharateeyudu 2 Telugu Movie Review)-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Ex Minister Perni Nani Satirical Comments On Chandrababu Govt
అక్రమ కేసులు పెట్టడానికేనా ఎర్ర బుక్‌?: పేర్ని నాని

సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి ప్రభుత్వం అసత్యాలతో శ్వేతపత్రం విడుదల చేస్తోందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. అలాగే, ప్రతీరోజు ఏదో ఒకదానిపై శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు. అసత్యాలు, తప్పుడు అంకెలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, పేర్ని నాని శుక్రవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటై నెల రోజులైంది. రాష్ట్రంలో కూటమి నేతలు శ్వేతపత్రాల విడుదల పేరుతో అబద్దాలు చెబుతున్నారు. హామీలు అమలు చేయకుండా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్‌ ఇస్తామన్నారు. ఇప్పుడు బిల్లులు ఎక్కువగా బిల్లులు వేస్తున్నారు. ట్రూఅప్ ఛార్జీలు గురించి విలేకరులు అడిగితే నేనెప్పుడు ఆమాట అన్నాను అన్నారు. అమరావతి నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందని ప్రశ్నిస్తే సరైన సమాధానం చెప్పలేదుసంపద సృష్టించి అమరావతిని అభివృద్ధి చేస్తామన్నారు.. ఏమైంది?. అభివృద్ధిపై ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారు. సంపద సృష్టిస్తామని చంద్రబాబు అనేక సార్లు మాట్లాడారు. 2019లో సంపద ఎక్కడుందో ఎవరికీ కనిపించలేదు. అప్పులు సృష్టించడంలో ఏపీని మొదటి స్థానంలో నిలబెట్టారు చంద్రబాబు. ఎర్రబుక్‌ అక్రమ కేసులు పెట్టడానికేనా?. పోలవరాన్ని నాశనం చేసిందే చంద్రబాబు. ఆయన నిర్వాకం వల్లే డయాఫ్రం వాల్‌ కొట్టుకుపోయింది. చంద్రబాబు, బీజేపీ కలిసే పోలవరాన్ని నాశనం చేశారు. నచ్చినోళ్లకు కాంట్రాక్ట్‌లు ఇచ్చి ప్రాజెక్ట్‌ను నాశనం చేశారు.ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ప్రతీ పిల్లాడికి రూ.15వేలు ఇస్తామన్నారు.. ఏమైంది?. రాష్ట్రంలో పిల్లలు హ్యాపీగా లేరు.. మంత్రి మాత్రం హ్యాపీగా ఉన్నారు. తల్లికి వందనం.. పిల్లలకు పంగనామాలు పెట్టి జనాన్ని మోసం చేశారు. ఆరడగుల అబద్ధం చంద్రబాబు. కూటమి అంతా హ్యాపీగా ఉంటే కాదు.. ప్రజలు కూడా హ్యాపీగా ఉండాలి. ఉచిత ఇసుక అంటారు.. వెంటనే డబ్బులు కట్టమంటారు. ఎప్పుడో జరిగిన ఘటనలపై ఇప్పుడు కేసులు పెడుతున్నారు.ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తామన్న బాబు.. ఇప్పుడేం చేయలేమని చెప్పడం విడ్డూరం. ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, లోకేష్‌ మాటలు కోటలు దాటించారు. ఉచితం పేరుతో మళ్లీ దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యేలు దోచుకోవడం కోసమే ఉచిత ఇసుక పాలసీ తీసుకొచ్చారు. అధికారం లేనప్పుడు చంద్రబాబుకు ప్రజలపై వినయం, ప్రేమ ఉంటుంది. అధికారం రాగానే బాబు బలుపు మాటలు మాట్లాడుతున్నారు. ఈరోజు కనుక వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధికారంలో ఉంటే అమ్మఒడి తల్లుల ఖాతాల్లో​ వేసేవారు. విద్యాదీవెన, వసతి దీవెన లబ్దిదారుల ఖాతాల్లో పడేవి. ముగ్గురూ కలిసి సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారు. కూటమి బాస్ అయిన బీజేపీ వారే ఏపీ రూ.4 లక్షల కోట్లు అప్పులు చేసినట్లు చెప్పింది. కానీ, చంద్రబాబు మాత్రం పది లక్షల కోట్లు అంటూ అబద్దాలు చెప్తున్నారు. సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు చేతులెత్తేశారు. వైఎస్‌ జగన్ సీఎం అయ్యేనాటికే ఖజానా ఖాళీ అయింది. ఇక అప్పు కూడా పుట్టదని యనమల రామకృష్ణుడు అన్నారు. ప్రజలను మోసం చేసి కూటమి అధికారంలోకి వచ్చింది. కూటమి నేతలంతా ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే. పంచాయతీరాజ్‌ శాఖ తప్ప మరో శాఖ వైపు పవన్‌ చూడటం లేదు. షర్మిల ఎవరి కోసం రాజకీయాలు చేస్తున్నారో అందరికీ తెలుసు. బీజేపీ, చంద్రబాబు కోసమే షర్మిల రాజకీయం చేస్తున్నారు. అధికారంలో ఉన్నవాళ్లను వదిలేసి, మమ్మల్ని ప్రశ్నించడమేంటి? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Aalim Hakim Hairdresser Makeover To  Ambanis And Their Guests
అనంత్‌ అంబానీ గ్రాండ్‌ వెడ్డింగ్‌ : ఆలిమ్ హకీం స్టయిల్స్‌ మామూలుగా లేవుగా!

హెయిర్ డ్రెస్సర్ అనగానే సెలబ్రిటీలకు గుర్తొచ్చే పేరు ఆలిమ్ హకీమ్. ఆలీం చెయ్యేస్తే మాస్‌.. క్లాస్‌ ..అదిరే లుక్స్‌.. గుర్తు పట్టలేనంత అందంగా తీర్చిదిద్దేంత ప్రతిభ అతని సొంతం. అందుకే సెలబ్రిటీలు, స్టార్లు, గొప్ప గొప్ప బిజినెస్‌ మేన్‌లు సెలబ్రిటీ హెయిర్ స్టయిలిష్ట్‌ ఆలిమ్ హకీమ్. తాజాగా అంబానీ పెళ్లి ఇంట సందడిలో మేజిక్‌ చేస్తున్నాడు.బాలీవుడ్ ,టాలీవుడ్ , క్రికెట్, బిజినెస్ ఇలా రంగం ఏదైనా టాప్‌ సెలబ్రిటీలు ఆలిమ్ హకీమ్ కస్టమర్లు. తన హెయిర్ స్టైల్‌తో స్టైలిష్ లుక్స్‌ ఇచ్చి అందర్నీ ఆకట్టుకుంటాడు. మహేష్ బాబు,రణవీర్‌ సింగ్‌, ధోని, కోహ్లీ లాంటి స్టార్ల లుక్‌ను అదుర్స్‌ అనిపించేలా తీర్చిదిద్దిన ఘన ఆయ సొంతం. తాజాగా రిలయన్స్‌ కుచెందిన కాబోయే వరుడు అనంత్‌ అంబానీకి రూపును అందంగా తీర్చిదిద్ది మరోసారి వార్తల్లోకి వచ్చాడు.రిలయన్స్‌ ఫ్యామిలీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అనంత్‌-రాధిక మర్చంట్‌ వివాహ వేడుకల్లో ఆలిమ్ హకీమ్ హెయిర్‌ స్టయిలిస్ట్‌గా తన సత్తా చాటాడు. వరుడు అనంత్‌ అంబానీ, అలాగే ముఖేష్‌ అంబానీ పెద్దకుమారుడు ఆకాష్‌ లుక్‌ను అద్భుతంగా మార్చేశాడు. ఈ సందర్భంగా ఇన్‌స్టాలో ఆలిమ్ హకీమ్‌ అంబానీకి ఫేడ్ కట్‌తో ఎలా సరికొత్త రూపాన్ని ఇచ్చాడో షేర్‌ చేశాడు.అంతేనా కాబోయే వరుడు అనంత్ అంబానీకి కూడా అలీమ్ అద్భుతమైన మేకోవర్ ఇచ్చాడు. అనంత్ పొడవాటి గిరజాల జుట్టును కత్తిరించకుండా మేకోవర్‌ చేయడం హైలైట్‌గా నిలిచింది. అలాగే పెళ్లికి వచ్చిన అతిథుల కేశాలను అందంగా తీర్చిదిద్దుతున్నాడు. View this post on Instagram A post shared by Eka (@ekalakhani)

Ksr Comments On Attack On Deccan Chronicles In AP, And Nara Lokesh's Behavior
యూటర్న్‌ బాబు.. ఎందుకంత ఉలికిపాటు?

విశాఖపట్నంలోని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై తెలుగుదేశం గూండాలు దాడి చేశారు. విధ్వంసం సృష్టించారు. విలువైన ప్రింటింగ్ యంత్ర సామాగ్రిని నాశనం చేయాలని చూశారు.. ఇది డెక్కన్ క్రానికల్ అధికారికంగా ఇచ్చిన కథనం. మరో విషయం చూద్దాం. ఏపీ మంత్రి, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ దీనిపై ఒక ప్రకటన చేశారు. 'డెక్కన్ క్రానికల్ డిస్ ప్లే బోర్డుపై జరిగిన దాడిని ఖండిస్తున్నాను. టీడీపీ నేతలు, కార్యకర్తలు తమ భావోద్వేగాలను ఇలా చూపరాదు'.ఈ రెండు ప్రకటనల మధ్య తేడాను గమనించారా? తెలుగుదేశం కార్యకర్తలు కేవలం బోర్డును తగులపెట్టారు తప్ప ఇంకేమీ జరగలేదన్నట్లుగా లోకేష్ ప్రకటన ఉంటే, తమ కార్యాలయంపై టీడీపీ గూండాలు ఏ రకంగా దాడి చేసింది, ఫర్నిచర్ తదితర సామాగ్రిని ధ్వంసం చేసింది. మహిళా ఉద్యోగుల పట్ల ఎలా అసభ్యంగా వ్యవహరించింది. ఆఫీస్‌పై రాళ్లు విసిరిన వైనం మొదలైనవాటి గురించి క్రానికల్ సవివరంగా రాసింది. అంటే ఈ ఘటన తీవ్రత కనిపంచకుండా ఉండడానికి లోకేష్ యత్నిస్తూ, ఒక విషయాన్ని మాత్రం అంగీకరించారు. క్రానికల్ ఆఫీస్‌పై దాడి చేసింది టీడీపీ కార్యకర్తలేనని. క్రానికల్ పత్రిక మాత్రం వారంతా టీడీపీ గూండాలని స్పష్టంగా ప్రకటించింది. వారిలో కొందరు మహిళలు కూడా ఉండడం మరో ప్రత్యేకత. తదుపరి రెండు రోజులకు విశాఖ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘటనపై పెద్దగా స్పందించకుండా కార్యకర్తలు ఆఫీస్‌ల వద్ద నిరసనలు చెప్పవద్దని సలహా ఇచ్చారు. అంతే తప్ప ఇలాంటి దాడులు తప్పు అని చెప్పినట్లు కనిపించలేదు.ఏపీలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సంభవించిన విధ్వంస కాండ గతంలో ఎన్నడూ జరగనిది. టీడీపీ గూండాలు, సంఘ వ్యతిరేక శక్తులు వైఎస్పార్‌సీపీ అనుకూలరులపై దారుణమైన రీతిలో దాడులు చేశారు. విధ్వంసాలకు పాల్పడ్డారు. వైఎస్సార్‌ విగ్రహాలను దగ్దం చేశారు. కొంతమందిని కత్తులతో పొడిచారు. కర్రలతో కొట్టారు. ప్రభుత్వ కార్యాలయాలపై దాడి చేసి బోర్డులు పీకేశారు. ఇంత జరుగుతున్నా చేష్టలుడిగిన పోలీస్ యంత్రాంగం, మానసికంగా పైశాచికానందం పొందుతున్న టీడీపీ నాయకత్వం కారణంగా టీడీపీ గుండాలు తమ ఇష్టారాజ్యంగా అరాచకాలను కొనసాగిస్తున్నారు. వాటికి పరాకాష్టగా ఇప్పుడు మీడియాపై కూడా దాడి చేశారు.ఇలాంటి ఘటనే కనుక వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జరిగి ఉంటే మొత్తం దేశం అంతా ఈనాడు, జ్యోతి వంటి టీడీపీ మీడియా హోరెత్తించేవి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మొత్తం రాష్ట్రం అంతా తిరిగి గగ్గోలు పెట్టేవారు. వీలైతే ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, హోం మంత్రి.. ఇలా ఎవరు కలిస్తే వారిదగ్గర ఏపీ అంతా అట్టుడికిపోతోందని చెప్పేవారు. పత్రికా స్వేచ్చ కనుమరుగు అవుతున్నా జర్నలిస్టులకు చీమ కుట్టినట్లు లేదని చంద్రబాబు ప్రచారం చేసేవారు. కానీ ఇప్పుడు స్వయంగా టీడీపీ గూండాలు చేస్తున్న ఈ అరాచకాన్ని ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు స్పష్టంగా ఖండించలేదు. డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై దాడి చేసినవారిని పట్టుకుని కేసు పెట్టాలని, వెంటనే అరెస్టు చేయాలని ఆదేశాలు ఇవ్వలేదు. ఆయనే మాట్లాడనప్పుడు హోం మంత్రి అనిత వంటివారు ఎందుకు పట్టించుకుంటారు!టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు తర్వాత అత్యంత కీలక వ్యక్తిగా ఉన్న లోకేష్ కూడా ఎక్కడా పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పలేదు. క్రానికల్ ఆఫీస్‌పై దాడి గురించి సిబ్బంది ఫోన్ చేస్తే పోలీసులు వచ్చారు. కానీ వారిని చూసి టీడీపీ గూండాలు పారిపోయారని క్రానికల్ తెలిపింది. మరి ఈ దాడులు చేసినవారిని ఎప్పటికి పట్టుకుంటారో, ఎప్పటికి కేసులు పెడతారో తెలియదు. అరెస్టులు చేయకుండా నోటీసులు ఇవ్వడం విశేషం. ఏపీ వ్యాప్తంగా వందలాది చోట్ల టీడీపీ గూండాలు అకృత్యాలకు పాల్పడినా కేసులు పెట్టని పోలీసు యంత్రాంగం విశాఖలో మీడియా ఆఫీస్ మీద జరిగిన దాడి మీద మాత్రం గట్టిగా స్పందిస్తుందా అనేది అనుమానమే. ఒకవేళ పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి దాడికి వచ్చినవారిని అదుపులోకి తీసుకుంటే మాత్రం అభినందించవచ్చు.మరో విషయం చెప్పాలి. గత ఐదేళ్లపాటు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వంపై రంకెలు వేస్తూ, పచ్చి అబద్దాలను ప్రచారం చేసి, రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఏదో ప్రమాదం జరిగిపోయినట్లు ఉపన్యాసాలు ఇచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసంపైన, మీడియాపై జరిగిన దాడి మీద కనీసం స్పందించలేదు. అది ఆయన నిజాయితి, చిత్తశుద్ది. ఇప్పటికే సాక్షితో సహా పలు మీడియా సంస్థలపై అనధికార ఆంక్షలు పెట్టి వేధిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఇక ప్రత్యక్ష దాడులకు తెగబడడం అత్యంత దురదృష్టకరం.ఇక సంగతి ఏమిటి?విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయడానికి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం సుముఖంగా ఉందన్నది క్రానికల్ రాసిన వార్త సారాంశం. నిజానికి క్రానికల్ ఈ వార్తను ముందుగా వెలుగులోకి తేలేదు. ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్‌ అనే పత్రిక ఈ విషయాన్ని వెల్లడించి, టీడీపీ, జనసేనలు విశాఖ ఉక్కు విషయంలో యు టర్న్ తీసుకుంటున్నాయని తెలిపింది. ఒక టాప్ టీడీపీ లీడర్ ఈ విషయం చెప్పినట్లు కూడా ఆ పత్రిక రాసింది. అదృష్టవశాత్తు ఆ పత్రిక కార్యాలయం విశాఖలో లేదు కాబట్టి సరిపోయింది. ఉండి ఉంటే ఆ పత్రిక ఆఫీస్‌పై కూడా ఇలాగే దాడి చేసి బీభత్సం సృష్టించి ఉండేవారేమో!ఆ తర్వాత రోజు క్రానికల్ పత్రిక అదే వార్తను కొందరు దీనిపై గతంలో చేసిన వ్యాఖ్యలు, ప్రస్తుతం కేంద్రంలో మంత్రులుగా ఉన్న కొందరు ప్రైవేటైజేషన్‌కు అనుకూలంగా వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలతో కథనాన్ని ఇచ్చింది. అదే ఆ మీడియా చేసిన తప్పట. ఉన్న మాట అంటే ఉలికిపడినట్లుగా, టీడీపీ కూటమి యుటర్న్ తీసుకుంటోందని చెప్పడం వారికి ఆగ్రహం కలిగించింది. నిజానికి తెలుగుదేశంకు, ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు యూటర్న్‌లు తీసుకోవడం వెన్నతో పెట్టిన విద్య. ఆ సంగతి దేశ ప్రధాని నరేంద్ర మోదీనే గతంలో ఒకసారి చెప్పి యుటర్న్ బాబు అని పేరు పెట్టారు.నిజంగా విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అంశంలో టీడీపీ, జనసేనల వైఖరి మారకపోతే అదే విషయాన్ని స్పష్టం చేసి ఉండవచ్చు. ఖండన ఇవ్వవచ్చు. లేదా ఆ పత్రిక అసత్యం రాసిందని వారు భావిస్తే శాంతియుతంగా నిరసన తెలపవచ్చు. అలాకాకుండా ఇలా దహనకాండకు పాల్పడ్డారంటే ఏమని అనుకోవాలి. ఏపీలో శాంతిభద్రతలు ఇంత ఘోరంగా ఉన్నాయని అర్ధం అవడం లేదా?తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, చంద్రబాబు కానీ, లోకేష్ కానీ, పవన్ కల్యాణ్ కానీ ఎవరూ ఎందుకు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై నిర్దిష్టంగా మాట్లాడడం లేదు. విశాఖ టూర్‌లో చంద్రబాబు తాము ప్రైవేటైజేషన్‌కు వ్యతిరేకమని మొక్కుబడిగా చెప్పినట్లు ఉంది తప్ప, దానికి కట్టుబడి ఉంటే ఏ రకంగా కేంద్రాన్ని ఒప్పిస్తామో చెప్పి ఉంటే కొంత విశ్వాసం ఏర్పడేది.కేంద్ర మంత్రి కుమారస్వామి ప్లాంట్ మూతపడకుండా చూస్తామని అంటున్నారు తప్ప ప్రైవేటైజేషన్ జరగదని స్పష్టంగా చెప్పినట్లు అనిపించదు. నిజమైన టీడీపీ, జనసేన కార్యకర్తలైతే ముందుగా తమ నాయకులను దీనిపై నిలదీయాలి! కనీసం వాస్తవమా? కాదా?అన్నది తెలుసుకోవాలి. అలాకాకుండా దహనకాండకు తెగబడడం అంటే వారి అరాచక స్వభావాన్ని నగ్నంగా ప్రదర్శించినట్లు అనుకోవాలి! చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు విశాఖ స్టీల్‌పై తమ కార్యాచరణను స్పష్టం చేస్తే సరే! లేకుంటే మీడియాలో వచ్చిన కథనాలన్ని వాస్తవమేనని భవిష్యత్తులో తేలుతుంది కదా! అప్పుడు అలవాటు ప్రకారం టీడీపీ కూటమి యూ టర్న్ తీసుకున్నట్లే కదా! దాని గురించి మీడియా రాస్తే మాత్రం దహనకాండకు పాల్పడతారా!– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు

If You Are Preparing For Neet Again Heres Why You Should Choose Aakashs Repeaterxii Passed Courses
మీరు మళ్లీ NEET లేదా JEE కోసం సిద్ధమవుతున్నట్లయితే, మీరు ఆకాష్ రిపీటర్/XII Passed కోర్సులను ఎందుకు ఎంచుకోవాలి?

NEET/JEE కోసం సన్నద్ధం కావడానికి ఒక సంవత్సరాన్ని వెచ్చించడం అనేది ఏడాది పొడవునా నిబద్ధత కలిగి మరియు మెడిసిన్ లేదా ఇంజినీరింగ్లో కెరీర్పై మీ కలను కొనసాగించడం పట్ల మీకు మక్కువ ఉంటే ఖచ్చితంగా విలువైనది. ఈ పరీక్షలు ఛేదించడానికి చాలా కఠినంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనికి హాజరైన లక్షలాది మంది విద్యార్థులలో మొదటి ప్రయత్నంలోనే కొంత మంది మాత్రమే విజయం సాధిస్తారు. ప్రత్యామ్నాయ కెరీర్ ఎంపికల కోసం వెతకని వారు లేదా తమకు పెద్దగా నచ్చని కాలేజీలలో స్థిరపడని వారు. అయినప్పటికీ, ఒక సంవత్సరం పునరావృతం చేయడానికి మరియు మళ్లీ సిద్ధం కావడానికి వెనుకాడని వారు కూడా చాలా మంది ఉన్నారు.మీరు మీ మొదటి ప్రయత్నంలో NEETని ఛేదించనట్లయితే మరియు మళ్లీ సిద్ధం కావాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు తాజాగా ప్రారంభించి సరైన మార్గ నిర్దేశం చేయడంలో సహాయపడే ఆకాష్ రిపీటర్/XII పాస్ కోర్సులను మీరు తీవ్రంగా పరిగణించాలి.NEET/ JEE 2025 కోసం మీరు ఆకాష్ రిపీటర్/ XII Passed కోర్సును ఎంచుకోవడానికి కారణాలు● ఆకాష్ రిపీటర్ కోర్సులు మీ స్కోర్ను మెరుగుపరచడంలో మీకు సహాయపడటానికి రూపొందించబడ్డాయి మరియు తద్వారా మీ కలల కళాశాలకు ఎంపికయ్యే అవకాశాలను పెంచుతాయిసూర్యాంశ్ K ఆర్యన్ ఆకాష్లో NEET రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి, అతను NEET 2023లో తన 2వ ప్రయత్నంలో తన స్కోర్లలో గణనీయమైన మెరుగుదలను నమోదు చేసుకున్నాడు మరియు NEET 2022 (592 స్కోర్)లో తన మొదటి ప్రయత్నం కంటే 705 స్కోర్ సాధించగలిగాడు మరియు ప్రస్తుతం AIIMS భోపాల్లో చదువుతున్నాడు. అంజలి కథ కూడా అలాంటిదే. NEET 2022లో 622 స్కోర్ చేసిన తర్వాత, అంజలి ఆకాష్ NEET రిపీటర్ క్లాస్రూమ్ ప్రోగ్రామ్లో చేరింది మరియు 706 స్కోర్ చేయగలిగింది మరియు NEET 2023లో అండమాన్ & నికోబార్ దీవుల టాపర్గా నిలిచింది. అంజలి ప్రస్తుతం MAMC, ఢిల్లీలో చదువుతోంది. ఆకాష్లోని రిపీటర్ సక్సెస్ స్టోరీలు ప్రోగ్రామ్ యొక్క దృఢత్వం మరియు తీవ్రతను తెలియజేస్తాయి, ఇది తమ కలలను సాధించుకోవడానికి తమ విలువైన సమయాన్ని వెచ్చించే విద్యార్థులకు ఆఫర్లో ఉత్తమమైన వాటి కంటే తక్కువ ఏమీ కాకుండా లభించేలా చేస్తుంది.● ఉత్తమ అధ్యాపకులతో అత్యుత్తమ ఫలితాలను అందించడం ద్వారా ఆకాష్ యొక్క 35 ఏళ్ల వారసత్వం నుండి ప్రయోజనం పొందండిఆకాష్ దానితో పాటు, దేశంలోని అత్యుత్తమ అధ్యాపకులలో ఒకరి ద్వారా ఫోకస్డ్ మరియు రిజల్ట్-ఓరియెంటెడ్ టెస్ట్ ప్రిపరేషన్ను అందించే 35 సంవత్సరాల శక్తివంతమైన చరిత్ర కలిగినదిగా పిలవబడింది.. ఆకాష్లోని ఉపాధ్యాయులు అధిక అర్హతలు మరియు అనుభవజ్ఞులు మాత్రమే కాకుండా కోచింగ్ మెథడాలజీలు మరియు విద్యార్థుల మారుతున్న విద్యా అవసరాలకు అనుగుణంగా వారికి సహాయపడే నైపుణ్యాలలో బాగా శిక్షణ పొందారు. ఆకాష్ రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో, రిపీటర్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం మరియు వారి ప్రత్యేక అవసరాలు మరియు సామర్థ్యాలను అర్థం చేసుకోవడంలో నైపుణ్యం కలిగిన అత్యుత్తమ అధ్యాపకుల దగ్గర మీరు నేర్చుకుంటారు, తద్వారా వారి ఎంపిక అవకాశాలను మెరుగుపరుస్తారు.● నిపుణులచే రూపొందించబడిన అధిక నాణ్యత అధ్యయన సామగ్రిఆకాష్లోని ప్రతి అధ్యయన వనరు అన్ని అంశాల సమగ్ర విశ్లేషణను అందించడానికి రూపొందించబడింది, విద్యార్థులు NEET మరియు/లేదా JEEలో పరీక్షించిన కాన్సెప్ట్లపై పూర్తి అవగాహన కలిగి ఉండేలా చూసుకుంటారు. విద్యార్థులు కష్టమైన పాఠాలను సులభంగా గ్రహించడంలో సహాయపడేందుకు వివిధ రకాల అభ్యాస ప్రశ్నలు, ఉదాహరణలు మరియు దృష్టాంతాలను చేర్చడానికి మా నిపుణులు స్టడీ మెటీరియల్ను జాగ్రత్తగా డిజైన్ చేస్తారు.అంతేకాకుండా, తాజా పరీక్షల ట్రెండ్లు మరియు ప్యాటర్న్లకు అనుగుణంగా మా స్టడీ మెటీరియల్ కఠినమైన సమీక్ష మరియు అప్డేట్లను కలిగియున్నది. విద్యార్థులు తమ పరీక్షా సన్నాహక ప్రయాణంలో ముందుకు సాగడానికి అత్యంత సందర్భోచితమైన మరియు నవీనమైన కంటెంట్పై అవగాహణ కలిగి ఉండేలా ఇది దోహదపడుతుంది.● పూర్తి అభ్యాసం కోసం కఠినమైన పరీక్షలు మరియు మూల్యాంకన షెడ్యూల్ఆకాష్లో విద్యార్థులు తమ సన్నద్ధత సమయంలో వారి బలహీనమైన ప్రాంతాలలో గణనీయమైన మెరుగుదలను ప్రదర్శించడంలో సహాయపడే నిర్దిష్టమైన పరీక్ష షెడ్యూల్ను అనుసరిస్తారు. ప్రస్తుతం భోపాల్లోని AIIMSలో ఉన్న ఆకాష్లోని రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి సూర్యాంశ్ మాటల్లో, “నేను ప్రతిరోజూ ఒక పరీక్ష రాశాను”, పరీక్షలు నా బలమైన మరియు బలహీనమైన ప్రాంతాలను గుర్తించడంలో నాకు సహాయపడాయి.● గరిష్టంగా 90% మొత్తం స్కాలర్షిప్ పొందండిమీ కల కోసం సిద్ధపడడం మరియు అది కూడా రెండవసారి, ఖచ్చింగా సవాలుగా ఉంటుంది, ముఖ్యంగా ఆర్థికంగా. మేము, ఆకాష్ వద్ద, ఆకాష్ ఇన్స్టంట్ అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్ (iACST)తో మీ కలను సాకారం చేయడానికి మీకు అవకాశాన్ని అందిస్తున్నాము. iACST మీకు 90% మొత్తం స్కాలర్షిప్ను గెలుచుకోవడానికి మరియు ఆకాష్ యొక్క రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో మీ కెరీర్ లక్ష్యాలను సాధించడానికి తక్షణ అవకాశాన్ని మీకు అందిస్తుంది.మీరు 2025లో NEET లేదా JEEలో మరోసారి మీ అదృష్టం పరీక్షించుకోవాలనుక్నుట్లయితే , మెడిసిన్/ఇంజినీరింగ్లో మీ కలల కెరీర్కు ఒక అడుగు దగ్గరగా తీసుకెళ్లగల సరైన మెంటర్ని మీరు ఎంచుకున్నారని నిర్ధారించుకోండి. ఆకాష్ రిపీటర్ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఈరోజే నమోదు చేసుకోండి మరియు మొత్తం 90% స్కాలర్షిప్ పొందండి.ఇక్కడ క్లిక్ చేయండి

Advertisement
Advertisement
Advertisement
National View all
జూన్‌ 25 సంవిధాన్‌ హత్యా దివస్‌.. కేంద్రం సంచలన ప్రకటన

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

లిక్క‌ర్ కేసులో కేజ్రీవాల్‌కు బెయిల్‌.. బీజేపీ కుట్ర‌లు బ‌హిర్గ‌తం: ఆప్‌

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్క‌ర్ స్కాం కేసులో సీఎం అర‌వింద్ కేజ్ర

స్మృతి ఇరానీకి మద్దతుగా రాహుల్‌ గాంధీ ట్వీట్‌!

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌

లిక్క‌ర్ స్కాం.. సీబీఐ కేసులో క‌విత విచార‌ణ వాయిదా

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌కు సంబంధ

Pooja khedkar: కూతురే కాదు త‌ల్లి కూడా అదే దందా.. వీడియో వైర‌ల్‌

ముంబై: ట్రెయినీ ఐఏఎస్ పూజా ఖేద్క‌ర్ లీల‌లు ఒక్కొక్క‌టిగా వెల

International View all
Watch: మెలోనీకి విసుగు తెప్పించిన బైడెన్‌!

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ గురించి వీడియోలు వైరల్‌ అవుతుండడం చూస్తున్నాం.

ఖతార్‌లో యూపీఐ సేవలు..!

దేశంలో డిజిటల్‌ చెల్లింపులకు కీలకంగా ఉన్న యూపీఐ సేవలను ఖతార్‌కు విస్తరిస్తున్నట్లు నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇం

నేపాల్ బ‌స్సు ప్ర‌మాదం.. ఏడుగురు భార‌తీయుల మృతి

నేపాల్‌లో శుక్ర‌వారం తెల్లవారుజామున ఘోర బ‌స్సు ప్ర‌మాదం చోటుచేసుకున్న విష‌యం తెలిసిందే.

నదిలో పడ్డ బస్సులు.. 65 మంది గల్లంతు

ఖట్మాండు: నేపాల్‌లో కొండచరియలు విరిగిపడి ఘోర ప్రమాదం జరిగింద

మళ్లీ తడబడ్డ బైడెన్‌.. ట్రంప్‌కు వైస్‌ ప్రెసిడెంట్‌ పదవి

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నవంబర్‌లో జరగబోయే

NRI View all
Video: భగవద్గీత సాక్షిగా బ్రిటన్ ఎంపీగా శివాని ప్రమాణం

భారత సంతతికి చెందిన 29 ఏళ్ల శివాని రాజా యూకే పార్ల‌మెంటులో హిందువుల పవిత్ర‌గ్రంథం భ‌గ‌వ‌ద్గీత సాక్షిగా ఎంపీగా ప్ర‌మాణ స్

45 కిలోలు తగ్గిన భారత సంతతి సీఈవో..అతడి హెల్త్‌ సీక్రెట్‌ ఇదే..!

బరువు తగ్గడం అనేది శారీరక శ్రమకు మించిన కష్టమైన ప్రక్రియ.

అమెరికాలో నలుగురు తెలుగోళ్ల అరెస్టు!

సాక్షి, హైదరాబాద్‌: టెక్సాస్‌లో మానవ అక్రమ రవాణా రాకెట్‌ను నడుపుతున్న నలుగురు భారతీయులను అక్కడి పోలీసుల

డల్లాస్‌లో ఘనంగా మహానేత వైఎస్సార్ 75వ జయంతి వేడుకలు

దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్.

రష్యా కళాకారులపై మోదీ ప్రశంసలు : అక్కడి ఎన్‌ఆర్‌ఐలకు గుడ్‌ న్యూస్‌

ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనలో భాగంగా మాస్కోలోని భారతీయులను కలిశారు. వారినుఉద్దేశించి ప్రసంగించారు.

Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all