breaking news
pre-budget survey
-
బడ్జెట్ 2026పై పారిశ్రామిక వర్గాల అంచనాలు
కేంద్ర బడ్జెట్ 2026-27 విడుదలకు సమయం దగ్గరపడుతున్న వేళ పారిశ్రామిక వర్గాల అంచనాలు, ఆశలపై కేపీఎంజీ ఇండియా సర్వే విడుదల చేసింది. 2026 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్న నూతన ఆదాయపు పన్ను చట్టం నేపథ్యంలో పన్ను విధానాల సరళీకరణ, ప్రోత్సాహకాలపై స్టేక్హోల్డర్లు ఏమనుకుంటున్నారో ఈ ప్రీ-బడ్జెట్ సర్వే స్పష్టం చేస్తోంది.జనవరి 2026లో నిర్వహించిన ఈ సర్వేలో ఫైనాన్షియల్ సర్వీసెస్, టెక్నాలజీ, ఫార్మా, హెల్త్‌కేర్ వంటి కీలక రంగాలకు చెందిన 100 మందికి పైగా పాల్గొన్నారు. వీరి అభిప్రాయాల ప్రకారం బడ్జెట్ నుంచి ఆశిస్తున్న ప్రధాన మార్పులు ఇవే..పన్ను ప్రోత్సాహకాల పునరుద్ధరణతయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు గతంలో ఉన్న తక్కువ పన్ను రేటు విధానాన్ని మళ్లీ తీసుకురావాలని 34 శాతం మంది కోరుతుండగా, దాదాపు 50 శాతం మంది నిర్దిష్ట రంగాల వారీగా ప్రత్యేక పన్ను ప్రోత్సాహకాలు ఉండాలని అభిప్రాయపడ్డారు.కొత్త ఐటీ చట్టం - సరళీకరణకొత్త చట్టం దిశగా అడుగులు పడుతున్నా కొన్ని అంశాల్లో మరింత స్పష్టత, సరళీకరణ అవసరమని సర్వే నొక్కి చెప్పింది. అందులో..టీడీఎస్/టీసీఎస్ నిబంధనల అమలులో సరళత.క్యాపిటల్ గెయిన్స్ పన్ను విధానంలో మార్పులు.లిటిగేషన్ (న్యాయపరమైన వివాదాలు), అసెస్మెంట్ ప్రక్రియలో వేగం అవసరమనే అభిప్రాయాలున్నాయి.స్టాండర్డ్ డిడక్షన్మధ్యతరగతి, వేతన జీవులకు ఊరటనిచ్చేలా బడ్జెట్లో స్టాండర్డ్ డిడక్షన్ (Standard Deduction) పరిమితిని గణనీయంగా పెంచాలని 73 శాతం మంది కోరుతున్నారు.జీఎస్టీ, ఇతర సంస్కరణలుజీఎస్టీ ‘ఇన్వాయిస్ మేనేజ్మెంట్ సిస్టమ్’లో ఉన్న లోపాల వల్ల క్రెడిట్ నోట్ల మిస్మ్యాచ్లు పెరుగుతున్నాయని, వీటిని సరిదిద్దాలని 82 శాతం మంది కోరుతున్నారు.ప్రస్తుత డిస్ప్యూట్ రిజల్యూషన్ ప్యానెల్ (DRP) వివాదాలను వేగంగా పరిష్కరించడంలో విఫలమవుతోందని సగం మంది ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు.అంతర్జాతీయ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ల (IFSC) కోసం దీర్ఘకాలిక నిబంధనలు కావాలని 51 శాతం మంది కోరారు.‘పరిశ్రమ వర్గాలు కేవలం పన్ను తగ్గింపులనే కాకుండా పారదర్శక వివాద పరిష్కార వ్యవస్థను, పన్ను నిబంధనల పునర్వ్యవస్థీకరణను కోరుకుంటున్నాయి. 2026 ఏప్రిల్ నుంచి రానున్న కొత్త చట్టం ఈ అంచనాలను ఏ మేరకు అందుకుంటుందో చూడాలి’ అని కేపీఎంజీ ఇండియా, ట్యాక్స్ హెడ్ సునీల్ బడాలా అన్నారు.ఇదీ చదవండి: కొత్త వాహనం.. అయినా టైరు పేలొచ్చు! -
ఐటీ మినహాయింపు పరిమితి... రెట్టింపు చేయాలి
• కార్పొరేట్లకు రాయితీలు, మినహాయింపులు కొనసాగించాలి • ఎర్నెస్ట్ అండ్ యంగ్ ప్రీ–బడ్జెట్ సర్వేలో అభిప్రాయం న్యూఢిల్లీ: మరో పది రోజుల్లో మోదీ సర్కారు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ప్రభుత్వానికి విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా వేతనజీవులకు భారీగా ఊరట కల్పించాలన్న డిమాండ్ ఎక్కువగా వినబడుతోంది. ఈసారి ఆదాయపు పన్ను(ఐటీ) మినహాయింపు పరిమితిని రెట్టింపు చేయాలని(ఇప్పుడున్న రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు) ట్యాక్స్ కన్సల్టెన్సీ దిగ్గజం ఎర్నెస్ట్ అండ్ యంగ్(ఈవై) నిర్వహించిన ప్రీ–బడ్జెట్ సర్వేలో అత్యధికులు పేర్కొన్నారు. అంతేకాకుండా కార్పొరేట్ కంపెనీలకు ఇస్తున్న రాయితీలు, మినహాయింపులను కొనసాగించాలని అభిప్రాయపడ్డారు. నోట్ల రద్దు(డీమోనిటైజేషన్) నేపథ్యంలో ప్రైవేటు పెట్టుబడులు, వినియోగ డిమాండ్‌ను పెంచాలంటే ఇవి తప్పనిసరి అని చెబుతున్నారు. వివిధ రంగాలకు చెందిన 200లకు పైగా సీనియర్ ట్యాక్స్ నిపుణులు, సీఎఫ్ఓల అభిప్రాయాలను సర్వేలో పొందుపరిచారు. ముఖ్యాంశాలివీ... ⇔ కార్పొరేట్ ట్యాక్స్‌ను ఇప్పుడున్న 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించాలని(సర్‌చార్జ్, సెస్‌లు కాకుండా) సర్వేలో 81.42 శాతం మంది పేర్కొన్నారు. ⇔ ‘మేకిన్ ఇండియా’కు ఊతమివ్వాలంటే రంగాలవారీగా పరిశ్రమలకు నిర్ధిష్టమైన రాయితీలు/మినహాయింపులు ఇవ్వాలని 72 శాతం మంది కోరారు. ⇔ వ్యక్తిగత ఐటీ మినహాయింపు పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలని 60% మంది అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత ఆదాయపు పన్ను గరిష్ట రేటులో 25 శాతం కోత విధించాలని 36% మంది అన్నారు. ప్రస్తుతం రూ.10 లక్షలకు పైగా ఆదాయం ఉన్నవారికి 30 శాతం పన్ను రేటు అమల్లో ఉంది. ⇔ ‘వినియోగ వ్యయాన్ని పెంచేందుకు వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు కొన్ని పన్ను ప్రయోజనాలు అందించవచ్చన్న అంచనాలున్నాయి. డీమోనిటైజేషన్ తర్వాత బ్యాంకింగ్ వ్యవస్థలోకి నిధుల ప్రవాహం, ప్రతిపాదిత వస్తు–సేవల పన్ను(జీఎస్టీ) అమలుతో పన్ను పరిధి పెరగవచ్చు’ అని ఈవై ఇండియా పార్ట్నర్, నేషనల్ ట్యాక్స్ లీడర్ సుధీర్ కపాడియా చెప్పారు.


