breaking news
PRC allowances
-
మా సహనానికి పరీక్షా?
సాక్షి, అమరావతి: ‘అధికారంలోకి రాగానే పీఆర్సీ వేస్తామన్నారు.. అంతకు ముందే ఐఆర్ ప్రకటిస్తామని చెప్పారు. తీరా గద్దెనెక్కాక ‘మీరెవరు?’ అన్నట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా? ఉద్యోగులను ఇంత దారుణంగా వంచిస్తారా?’ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాల నేతలు శనివారం చంద్రబాబు సర్కారుపై నిప్పులు చెరిగారు. రెండేళ్లవుతున్నా పీఆర్సీ లేదు.. ఐఆర్ లేదు.. బకాయిల ఊసే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఉద్యోగులకు చేసిందేమీ లేదు. ప్రభుత్వ తీరు చూస్తుంటే పీఆర్సీ దూరమవుతోందనే ఆందోళన ఉద్యోగుల్లో కనిపిస్తోంది. గతంలో ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో ఐఆర్‌ను ప్రకటిస్తూ వచ్చాయి. రెండేళ్లవుతున్నా ఐఆర్ ప్రకటించకపోవడం చరిత్రలో ఇదే తొలిసారి. ఉద్యోగులకు రూ.30 వేల కోట్లు, పెన్షనర్లకు రూ.10 వేల కోట్ల బకాయిల ఊసేలేదు. సరెండర్ లీవులు పెండింగ్.. డీఏలు పెండింగ్. మాకు చట్టబద్ధంగా రావాల్సినవే అడుగుతున్నాం. ఉద్యోగులందరూ ఆర్థికంగా నష్టపోతున్నారు. పెన్షనర్లు, చనిపోయిన ఉద్యోగుల కుటుంబాల పరిస్థితి దయనీయం. రిటైర్ అయిన ఉద్యోగులు వారికి రావాల్సిన బెనిఫిట్స్ అందుకోకుండానే కన్ను మూస్తున్నారు. ఉద్యోగులు అడుగుతున్న ప్రశ్నలకు నాయకులుగా సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. చేతగాకపోతే తప్పుకోండంటూ మాట్లాడుతున్నారు. ప్రభుత్వం చేస్తుందనే నమ్మకంతో ఇన్నాళ్లూ ఓపికగా ఉన్నాం. ఆ ఓపిక ఉద్యోగులు మాకు అవకాశం ఇచ్చినంత వరకే. ఆ తర్వాత చెప్పలేం’ అని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఇది మంచి ప్రభుత్వం కానేకాదని, ముంచిన ప్రభుత్వం అని ప్రభుత్వోద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను బానిసల కంటే హీనంగా చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఉగాదిలోపు ఐఆర్ ప్రకటించకపోతే పోరాటం తథ్యం అని స్పష్టం చేశారు. ఆయా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉగాదిలోపు ఐఆర్ ప్రకటించకపోతే పోరాటమేసాక్షి, అమరావతి : ఉగాది నాటికి రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు ఐఆర్ ప్రకటించకపోతే ఆందోళనలకు దిగుతామని ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కె. వెంకట్రామిరెడ్డి చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తొలుత అన్ని జిల్లాల్లో నిరసన ప్రదర్శలు చేస్తామని, అనంతపురం జిల్లాతో నిరసనలు ప్రారంభిస్తామన్నారు. తాడేపల్లిలోని సమాఖ్య కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా స్థాయి నిరసన ప్రదర్శనల తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకపోతే విజయవాడలో మహా ధర్నా నిర్వహిస్తామని తేల్చిచెప్పారు. ఐఆర్ ప్రకటించి, పీఆర్సీ కమిషన్‌ను వెంటనే ఏర్పాటుచేయాలని, లేనిపక్షంలో ఏప్రిల్ ఒకటి నుంచి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఏ కేటగిరీ ఉద్యోగులకు కూడా మంచి జరగలేదని, ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. ఉద్యోగులకు ఇవ్వాల్సినవి ఇవ్వకపోగా అణచివేస్తున్నారని, అనివార్యంగా పోరాడక తప్పని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇది మంచి ప్రభుత్వం కాదని ఉద్యోగులను ముంచిన ప్రభుత్వమని ఆయన మండిపడ్డారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కాకర్ల వెంకట్రామిరెడ్డి రెండేళ్లయినా ఐఆర్ ఊసేలేదు.. ఉద్యోగులను దారుణంగా వంచించారని, ఏ ఒక్కరికీ న్యాయం జరగలేదని వెంకట్రామిరెడ్డి తెలిపారు. రెండేళ్లుగా ఉద్యోగులను పట్టించుకోకపోవడంవల్లే విజయవాడ ధర్నాచౌక్ ఉద్యోగుల ధర్నాలతో దద్దరిల్లుతోందన్నారు. ఒక్క డీఏ ఇచ్చి పండుగ చేసుకోవాలని చెప్పారని.. దానితో ఎన్ని పండుగలు చేసుకోవాలని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం వచ్చాక ప్రతి ఆర్నెల్లకు ఒకటి చొప్పున మొత్తం నాలుగు డీఏలు ఇవ్వాల్సి ఉండగా కేవలం ఒకటి మాత్రమే ఇచ్చారని.. అది కూడా పూర్తిగా ఇవ్వకుండా కొంత పెండింగ్ పెట్టారని తెలిపారు. అలాగే, ఐఆర్ వెంటనే ఇస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారని.. కానీ, రెండేళ్లయినా దాని గురించి మాట్లాడడంలేదన్నారు. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చెప్పిన మాట మేరకు ఐఆర్ ఇచ్చిందని వెంకట్రామిరెడ్డి గుర్తుచేశారు. గత ప్రభుత్వం నియమించిన పీఆర్సీ కమిషనర్ రాజీనామా చేస్తే ఇప్పటివరకూ కొత్త కమిషనర్‌ను నియమించలేదని, ఇక పీఆర్సీ ఎప్పుడు ఇస్తారని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగులకు రూ.40 వేల కోట్ల బకాయిలు..ఇక ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు రూ.35 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్ల వరకూ ఉన్నాయని.. వాటిని ఎప్పుడు ఇస్తారో, అసలు ఇస్తారో లేదో కూడా తెలీడంలేదని వెంకట్రామిరెడ్డి అన్నారు. చరిత్రలో ఎప్పుడూలేని విధంగా పోలీసులకు ఐదు ఎస్ఎల్లు పెండింగ్‌లో ఉన్నాయని.. సీపీఎస్ ఉద్యోగుల సమస్యకు పరిష్కారం చూపించకపోగా కనీసం దాని గురించి ఆలోచన కూడా చేయడంలేదని.. ఉద్యోగులకు కనీసం పదోన్నతులు కూడా ఇవ్వలేదన్నారు. అర్హతలేని వ్యక్తిని సెక్రటరీ జనరల్‌గా నియమించి అసెంబ్లీలో ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబదీ్ధకరణను నిలిపివేయడం అన్యాయమని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బాధలు చెప్పలేని విధంగా ఉన్నాయని, రాజుల కాలంలో బానిసల కంటే దారుణంగా వారితో పనిచేయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అంత పని ఒత్తిడి తట్టుకోలేక ఇప్పటికే 80 మంది ఉద్యోగులు చనిపోయారని.. అయినా వారిపై చంద్రబాబు ప్రభుత్వం కనికరం చూపడంలేదని వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఈ రెండేళ్లలో ఉద్యోగులకు చేసిందేమీ లేదుఅనంతపురం అర్బన్ : ‘చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఉద్యోగులకు చేసిందేమీ లేదు. ప్రభుత్వ తీరు చూస్తుంటే పీఆర్సీ దూరమవుతోందనే ఆందోళన ఉద్యోగుల్లో కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో ఐఆర్‌ను ప్రభుత్వాలు ప్రకటిస్తూ వచ్చాయి. కానీ, రెండేళ్లవుతున్నా ఐఆర్ ప్రకటించకపోవడం చరిత్రలో ఇదే తొలిసారి. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల ఊసేలేదు. సరెండర్ లీవులు పెండింగ్.. డీఏలు పెండింగ్. మాకు చట్టబద్ధంగా రావాల్సినవే అడుగుతున్నాం. పెన్షనర్లు, చనిపోయిన ఉద్యోగుల కుటుంబాల పరిస్థితి దయనీయంగా ఉంది. ప్రభుత్వం నుంచి అందాల్సిన బెనిఫిట్లలో ఒక్క రూపాయి కూడా వారికి అందలేదు. ఉద్యోగులు అడుగుతున్న ప్రశ్నలకు నాయకులుగా సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. చేతగాకపోతే తప్పుకోండంటూ మాట్లాడుతున్నారు. ప్రభుత్వం చేస్తుందనే నమ్మకంతో ఓపికగా ఉన్నాం. ఆ ఓపిక ఉద్యోగులు మాకు అవకాశం ఇచ్చినంత వరకే. ఆ తరువాత చెప్పలేం’.. అని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. అనంతపురం విచ్చేసిన ఆయన శనివారం ఆ సంఘం కార్యాలయంలో అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల అధ్యక్షులు దివాకర్‌రావు, మైనుద్దీన్, కార్యదర్శి సోమశేఖర్ తదితర నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నారు.. ప్రభుత్వ తీరుతో ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆయన చెప్పారు., ఉద్యోగులకు ఇవ్వాల్సినవన్నీ త్వరలో ఇస్తామని గత ఏడాది అక్టోబరు 18న ముఖ్యమంత్రి స్పష్టమైన హామీ ఇచ్చారని.. అయితే, ఐదారు నెలలు అవుతున్నా ఇప్పటికీ అమలుకాలేదని బొప్పరాజు అన్నారు. దీంతో పీఆర్సీ దూరం చేస్తారనే ఆందోళనలో ఉద్యోగులు ఉన్నారన్నారు. జాప్యం చేయకుండా పీఆర్సీ కమిషనర్‌ను తక్షణం నియమించాలన్నారు. 60 రోజుల్లో నివేదిక ఇచ్చే వెసులుబాటు కల్పించాలన్నారు. తక్షణం ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇక ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.30 వేల కోట్లకు పైగా బకాయిల ఊసేలేదని అన్నారు. సరెండర్ లీవులు ఇవ్వలేదని, డీఏలూ పెండింగ్ పెట్టారన్నారు. పోలీసులకు ఒక్క సరెండర్ లీవును రెండు విడతలుగా ఇవ్వడం ఇప్పుడే చూస్తున్నామని చెప్పారు. ఇంతటి దయనీయమైన పరిస్థితిని ఎప్పుడూ చూడలేదన్నారు. పెన్షనర్లకు రూ.10 వేల కోట్ల బకాయి.. ఇక పెన్షనర్లు, చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు చెల్లించాల్సిన బకాయిలు రూ.10 వేల కోట్లు ఉన్నాయని బొప్పరాజు చెప్పారు. బెనిఫిట్లు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా అందకపోవడంతో వారు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని.. కానీ, అవి తీసుకోకుండానే రిటైర్డ్ ఉద్యోగులు చనిపోయిన సందర్భాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వానికి ఉద్యోగులుగా తాము సహకరిస్తున్నామని, అదే స్థాయిలో ప్రభుత్వం సహకరించడంలేదని బొప్పరాజు చెప్పారు.ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తిచంద్రబాబు ప్రభుత్వంలో ఉద్యోగులు ఏమాత్రం సంతృప్తికరంగా లేరు. గత సంక్రాంతి పండుగకు ఇచ్చామంటున్న డీఏ ఇంత వరకు చాలా మందికి అందలేదు. సంస్కరణల పేరుతో ఉపాధ్యాయులను తీవ్రంగా వేధిస్తున్నారు. పదో తరగతి పరీక్షల మూల్యాంకనం రెమ్యూనరేషన్ ఇవ్వడం లేదు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పరిస్థితి యమలోకంలో ఉన్నట్లు ఉంది. 30 ఏళ్ల పిల్లలు కూడా గుండె నొప్పి, బ్రెయిన్ స్ట్రోక్‌లతో చనిపోతున్నారు. – బాజీ పఠాన్, అధ్యక్షులు, ఏపీ సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ఏ సమస్యా పరిష్కారం కాలేదుఉపాధ్యాయుల సమస్యలు ఏవీ పరిష్కారం కాలేదు. వాటి కోసం దశల వారీగా ఉద్యమాన్ని చేపడుతున్నాం. కూటమి మేనిఫెస్టో హామీల అమలు కోరుతూ ఆందోళనలు చేస్తాం. ఈ ప్రభుత్వం ఐఆర్ గురించి పట్టించుకోలేదు. బకాయిలు చెల్లించలేదు. పీఆర్సీ ఎప్పుడు వేస్తారో తెలియని పరిస్థితి. 11వ పీఆర్సీ బకాయిలు, డీఏ బకాయిలు, సరెండర్ లీవ్ బకాయిలు అలాగే ఉన్నాయి. పెన్షన్ కార్పొరేషన్ హామీ ఏమైందో తెలీదు. – రఘునాథ్‌రెడ్డి, అధ్యక్షుడు, రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ)త్వరలో ఆందోళన ఉధృతంఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. మా జీతం కింద దాచుకున్న పీఎఫ్, ఏపీజీఎల్ఐ వంటి వాటిని కూడా మాకు ఇవ్వడంలేదు. పీఆర్సీ, ఐఆర్ గురించి అసలు ప్రస్తావనే చేయకపోవడాన్ని బట్టి అవి ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని అర్థమవుతోంది. ఉపాధ్యాయులను ప్రతి చిన్న విషయానికి వేధింపులకు గురి చేస్తున్నారు. లోపభూయిష్టమైన అసెస్మెంట్ రిజిస్టర్లతో ఇబ్బంది పెడుతున్నారు. త్వరలో ఉధృతంగా ఆందోళన తప్పదు.– ఏఎం గిరిప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పీఆర్టీయూ -
పీఆర్సీ కమిటీ నియమించిన తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పే స్కేల్ చెల్లింపుకోసం పే రివిజన్ కమిటీని( పీఆర్సీ) నియమించారు. ఇద్దరు సభ్యులతో మొదలైన ఈ కమిటీ చైర్మన్ గా ఎన్. శివశంకర్(రిటైర్డ్ ఐఎఎస్), సభ్యులుగా బి. రామయ్య(రిటైర్డ్ ఐఎఎస్) లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 శాతం మధ్యంతర భృతి(ఐఆర్)ని చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కమిటీ 6 నెలల్లోపు నివేదికను ప్రభుత్వానికి అందచేయాలని ఆదేశించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. పీఆర్సీకి బాధ్యతలు నిర్వర్తించేందుకు కావాల్సిన నిధులను, సిబ్బందిని ఏర్పాటు చేయాల్సిందిగా ఆర్థిక శాఖను ఆదేశించారు. ఇది కూడా చదవండి: చదువు మాని.. చపాతీల తయారీ.. గురుకులంలో విద్యార్థుల వంటావార్పు -
పీఆర్సీ పై కోన్ని ఉద్యోగ సంఘాల్లో భేదాభిప్రాయాలు : బొత్స
-
జగన్ పీఆర్సీ నిర్ణయంతో ఉద్యోగుల పాలాభిషేకం
-
హెచ్ఆర్ఏ తగ్గిస్తే..తగ్గనున్న వేతనాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు అమలు చేయనున్న పీఆర్సీలో ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) తగ్గిస్తూ వేతన సవరణ సంఘం సిఫారసు చేసిన నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న హెచ్ఆర్ఏను యథాతథంగా కొనసాగించాలని కోరుతున్నాయి. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటివరకు హెచ్ఆర్ఏ 30 శాతం ఉండగా దాన్ని 24 శాతానికి తగ్గిస్తూ పీఆర్సీ సిఫారసు చేసింది. అలాగే 2 లక్షల జనాభా కంటే ఎక్కువున్న పట్టణాలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 20 శాతం హెచ్ఆర్ఏ ఉంటే దాన్ని 17 శాతానికి తగ్గించింది. ఇక 50 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో 14.5 శాతం హెచ్ఆర్ఏ ఉండగా దాన్ని 13 శాతానికి, మండల కేంద్రాలు, గ్రామాల్లో 12 శాతం హెచ్ఆర్ఏ ఉంటే దాన్ని 11 శాతానికి తగ్గించింది. దీంతో హెచ్ఆర్ఏ తగ్గింపు వల్ల తమకు చేకూరాల్సిన ప్రయోజనం రాకుండా పోతుందని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. అందుకే ప్రస్తుతం హెచ్ఆర్ఏను యథావిధిగా కొనసా గించాలని కోరుతున్నాయి. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిసింది. దానిపై ఉత్తర్వులు జారీ చేసే సమయంలో ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా, పాత పీఆర్సీలో హెచ్ఆర్ఏ గరిష్టంగా రూ. 15 వేల వరకే సీలింగ్ ఉంది. దీని ప్రకారం ఉద్యోగుల హెచ్ఆర్ఏ ఒకవేళ రూ. 15 వేలకు మించినా రూ. 15 వేలే ఇస్తారు. కానీ ప్రస్తుత పీఆర్సీలో ఆ సీలింగ్ లేదు. అయితే రూ. 15 వేల కంటే తక్కువ హెచ్ఆర్ఏ ఉన్న వారికి మాత్రం హెచ్ఆర్ఏలో తగ్గుదల తప్పదు. -
ఉద్యోగులకు జూలై ఝలక్!
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ కమిటీ(పీఆర్సీ) ఏర్పాటులో తీవ్ర జాప్యం చేశారు. ప్రత్యామ్నాయంగా ఇవ్వాల్సిన మధ్యంతర భృతినీ ప్రకటించడంలో నాన్చుడు ధోరణి అవలంబించారు. ఇది ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి రాజేసింది. ఎన్నికలు తరుముకొస్తున్న వేళ ఈ అసంతృప్తి జ్వాలలు టీడీపీ విజయావకాశాలను మసి చేస్తాయని భయపడిన సర్కారు హడావుడిగా 20 శాతం ఐఆర్ ఇస్తున్నట్లు ప్రకటించేసింది. కానీ.దాన్ని వచ్చే జూలై నుంచి అమలు చేస్తారట!.. తక్షణమే చెల్లించాల్సిన ఐఆర్‌ను ఐదు నెలల తర్వాత నుంచి అమలు చేయడమేమిటని ఉద్యోగులు మండిపడుతున్నారు. జూలైలో అమలు చేసేదాన్ని ఇప్పుడే హడావుడిగా ప్రకటించడమేమిటని ప్రశ్నిస్తున్నారు. రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. పీఆర్సీ అమలులో జాప్యం కారణంగా రగిలిపోతున్న ఉద్యోగులను మభ్యపెట్టి, మచ్చిక చేసుకోవడం ద్వారా ఎన్నికల్లో వారి ఓట్లు పొందాలన్న రాజకీయ లక్ష్యమే తప్ప సర్కారుకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని.. ఐఆర్ ప్రకటనతో స్పష్టమవుతోందని ఉద్యోగులు అంటున్నారు. సాక్షి, విశాఖపట్నం : గతంలో ఏ ప్రభుత్వంపై లేనంత వ్యతిరేకత పెల్లుబికుతోంది. ఈ విషయాన్ని ఇంటిలిజెన్స్ వర్గాలు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించాయి. లేనిగొప్పలు చెబుతూ సమీక్షలు, సమావేశాలంటూ ఒత్తిళ్లకు గురిచేయడంతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో పని చేస్తున్నారు. కొన్ని చోట్ల ఒత్తిళ్లు తట్టుకోలేక గుండెపోటుకు గురై మృత్యువాత పడిన సంఘటనలూ ఉన్నాయి. పోనీ ఎంత కష్టపడి పనిచేస్తున్నా గుర్తింపు, గౌరవం దక్కడం లేదు. సకాలంలో పదోన్నతులు లభిస్తున్నాయా అంటే అదీ లేదు. గద్దెనెక్కగానే పక్కనే ఉన్న తెలంగాణా ప్రభుత్వం ఇచ్చిందన్న ఒత్తిడితో రాష్ట్ర ప్రభుత్వం 43 శాతం ఫిట్మెంట్ ప్రకటించి ఆ మేరకు బాండ్లు ఇచ్చారు. ఇదిగో ఇస్తాం..అదిగో ఇస్తాం అంటూ నాలుగేళ్ల పాటు ఊరించి చివరకు గతేడాది జీపీఎఫ్ ఖాతాలో కాగితాలపై సర్దుబాటు చేశారే చప్ప చేతికిచ్చిన పాపాన పోలేదు. 11వ పేరివిజన్ కమిషన్(పీఆర్సీ) వేతనాలు 2018 జూలై 1వ తేదీ నుంచి అమలు చేయాలి. అలా అమలు చేయాలంటే ఈ కమిషన్ 2017లోనే ఏర్పాటు చేయాలి. కానీ పీఆర్సీ కమిషన్ సకాలంలో ఏర్పాటు చేస్తే ఎక్కడ నిర్ణీత గడువులోగా అమలు చేయాల్సి వస్తోందన్న ఆలోచనతో ప్రభుత్వం కమిషన్ ఏర్పాటును వాయిదా వేస్తూ వచ్చింది. చివరకు ఉద్యోగ సంఘాల ఒత్తిడి తట్టుకోలేక గతేడాది మేలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అసితోష్ మిశ్రా చైర్మన్‌గా పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ రిపోర్టు ఆరు నెలల్లో ఇవ్వాల్సి ఉంది. కానీ దాదాపు పది నెలలు కావస్తున్నా కమిషన్ నివేదిక ఇవ్వలేదు. దీంతో కనీసం మధ్యంతర భృతైనా ఇవ్వండంటూ ఉద్యోగ సంఘాలు ఒత్తిడి తీసుకొచ్చాయి. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ఇవ్వలేమని ప్రభుత్వం తెగేసి చెప్పింది. రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందేందుకైనా ఓ మాటైనా చెప్పండి చాలు అంటూ ఏపీ ఎన్జీవో సంఘం మాజీ నేత పరుచూరి అశోక్‌బాబు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుకు ఆ బాధ్యతలు అప్పగించారు. యనమలతో జరిగిన చర్చల్లో 20 శాతం ఐఆర్‌కు పరుచూరి అండ్‌కో అంగీకరించడం.. ఆ వెంటనే చిట్టచివరి కేబినెట్లో ఆమోదం తెలపడం చకచకా జరిగిపోయాయి. ఉద్యోగులకు 20 శాతం ఐఆర్ ప్రకటిస్తున్నాం. అమలు మాత్రం జూలై నుంచి చేస్తాం అని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ పదవీ కాలం మేతో ముగియనుంది. పైగా మరో వారం పది రోజుల్లో ఎన్నికల కోడ్ అమలుకు వచ్చే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో కేవలం తమను మభ్య పెట్టేందుకే ప్రభుత్వం ఐఆర్‌ను ప్రకటించిందని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఆరోపిస్తున్నారు. జిల్లాలో ఇదీ పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 31,452 మంది ఉద్యోగులున్నారు. వారిలో 2,708 మంది మహిళా ఉద్యోగులు పని చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో 39,297 మంది పని చేస్తుండగా, వారిలో 2956 మంది మహిళలున్నారు. ఇక స్థానిక సంస్థలైన లోకల్ బోర్డుల్లో 11,232 మంది పని చేస్తున్నారు, వీరిలో 2,679 మంది మహిళలు పనిచేస్తున్నారు. ఇక 15 వేల మందికి పైగా ప్రభుత్వ ఉపాధ్యాయులున్నారు. వీరంతా ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు. గతంలో ఐఆర్ ఎప్పుడు ప్రకటించిన ఆ మరుసటి నెల నుంచే సర్దుబాటు చేసేవారని, కానీ ఇలా ప్రకటించిన ఆరు నెలలకు ఐఆర్ అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదంటున్నారు. మరో రెండు నెలల్లో జరిగే ఎన్నికల్లో ఈ ప్రభుత్వం ఉంటుందో? పోతుందో? తెలియదు. అలాంటప్పుడు ఇలా అర్థంపర్థం లేని మధ్యంతర భృతిని ప్రకటించి ఉపయోగమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ముందు ఇలాంటి గిమ్మిక్కులు ఎన్ని చేసినా చంద్రబాబును మాత్రం ఈసారి నమ్మే ప్రసక్తే లేదని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలు తేల్చి చెబుతున్నాయి. -
ఉద్యోగులకు పీఆర్సీ అలవెన్సులు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు పదో వేతన సవరణ కమిటీ (పీఆర్సీ) సిఫార్సు ల ప్రకారం వివిధ రకాల అలవెన్సులు వర్తింపజే స్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పదో పీఆర్సీ సిఫార్సుల ప్రకా రం అలవెన్సులకు సంబంధించిన జీవోలు ఇవ్వాలని ఉద్యోగులు నెలల తరబడి కోరుతున్నా, ప్రభుత్వం సమీక్షల పేరుతో నాన్చుతూ వచ్చిం ది. ఈ నెల 17 నుంచి అసెం బ్లీ శీతాకాల సమావేశాలు ఆరంభమవుతున్న నేపథ్యంలో ఈ అంశంపై విపక్షం వైఎస్సార్ సీపీ నిలదీస్తుందనే ఉద్దేశంతో ప్రభుత్వం హడావుడిగా ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ స్థాయిల ఉద్యోగులకు పీఆర్సీ సిఫార్సుల ప్రకారం పలు రకాల భత్యాలు (అలవెన్సులు) అమల్లోకి తెస్తున్నట్లు ఆర్థికశాఖ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు విడుదల చేసింది. ఇవీ అలవెన్సులు: ఉద్యోగుల పర్యటనల రవాణా భత్యం (టీఏ), బదిలీ రవాణా భత్యం (టీటీఏ), లీవ్ ట్రావెలింగ్ అలవెన్సు (ఎల్టీసీ), ఫిక్స్డ్ ట్రావెలింగ్ అలవెన్సు (ఎఫ్‌టీఏ), న్యాయశాఖ సిబ్బందికి మిషన్ అలవెన్సు, గ్రేహౌండ్స్ - స్పెషల్ ఇంటెలిజెన్స్- కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులకు స్పెషల్ అలవెన్సు, ఆర్మ్డ్ పోలీసు హెడ్ కానిస్టేబుళ్లు - కానిస్టేబుళ్లకు ఇన్సెంటివ్ అలవెన్సు, ఉపాధ్యాయులకు స్కౌట్ అలవెన్సు, ఉద్యోగులకు రిస్క్ అలవెన్సు, ఎన్జీవోలకు క్లరికల్ అలవెన్సు, క్లినిక్ అలవెన్సు, నైట్ డ్యూటీ అలవెన్సు వర్తింపజేస్తున్నట్లు వేర్వేరు ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే థియేటర్ అలవెన్సు, వికలాంగ ఉద్యోగులకు కన్వేయన్స్ అలవెన్సు, జమేదార్లు- డ్రైవర్లు- లిఫ్ట్ ఆపరేటర్లు- నాలుగో తరగతి ఉద్యోగులకు స్టిచ్చింగ్ ఛార్జీలు, ఈఎస్ఐ అలవెన్సు, బ్లడ్ బ్యాంకు అలవెన్సు, రేషన్ అలవెన్సు, లెప్రసీ అలవెన్సు, కబేళా (శ్లాటర్ హౌస్) అలవెన్సు, సూపర్వైజరీ అలవెన్సు, సబ్‌జైలు అలవెన్సు, నిర్వహణ భత్యం, స్పెషల్ పేస్ అలవెన్సు వర్తింప జేస్తున్నట్లు శుక్రవారం రాత్రి జారీ చేసిన 21 జీవోల్లో పేర్కొంది.


