breaking news
Paranormal
-
అర్థరాత్రి గదిలో మహిళ ఏడుపులు..కాళ్ల శబ్ధం, నాపై శక్తి దాడి : నటి
ప్రముఖ నటి, నృత్యకారిణి సుధా చంద్రన్ పూనకానికి సంబంధించిన ఓ వీడియో ఆ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. సుధా చంద్రన్ ఇంట్లో జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆమె సడన్‌గా ట్రాన్స్‌లోకి వెళ్లిపోయింది. పూనకంతో ఊగిపోతూ వింతగా ప్రవర్తించింది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సుధా ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, మద్యం తాగి అలా ప్రవర్తిస్తుందని కామెంట్ చేస్తూ ఆమెను విమర్శించారు. తాజాగా ఈ విమర్శలపై సుధా చంద్రన్ స్పందించారు. అప్పుడు ఏం జరిగిందనే విషయాన్ని వివరిస్తూనే.. గతంలో తనకు ఎదురైన వింత అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. మాములు మనిషి అలా చేయగలడా?‘ఆ సమయంలో(పూనకం వచ్చినప్పుడు) నేను ఏ స్థితిలో ఉన్నానో నాకే తెలియదు. ఏం జరిగిందనే విషయం నా కుటుంబ సభ్యులు చెబితేనే తెలిసింది. కేవలం 6 నిమిషాల్లో 4 లీటర్ల నీళ్లు తాగానని నా భర్త చెప్పాడు. మాములు మనిషి అలా తాగగలడా? అమ్మవారే నాలోకి ప్రవేశించారని నేను చెప్పను. ఎందుకంటే అమ్మవారి శక్తిని మనిషి తట్టుకోలేడు. కానీ ఆమె ఆశిస్సులు నాపై ఉన్నాయని బలంగా నమ్ముతాను. మద్యం తాగి నేను అలా ఊగిపోయానని కొంతమంది విమర్శించారు. అదంతా యాక్టింగ్ అని కూడా అన్నారు. అసలు అలా నటిస్తే నాకొచ్చే లాభం ఏంటి? నమ్మకం లేకపోతే వదిలేయండి అంతేకానీ ఇలాంటి విమర్శలు చేయడం సరికాదు. నా నమ్మకాలను ఎవరీకి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు’ అని సుధా చెప్పుకొచ్చింది.A video of actress Sudha Chandran is going viral on social media, showing her completely immersed in devotion during Mata Ki Chowki. The video shows people around her trying to support her as she becomes emotional.1/2#SudhaChandran #MataKiChowki pic.twitter.com/rGZPiSpwT6— Siraj Noorani (@sirajnoorani) January 4, 2026ఏదో శక్తి వచ్చి నాపై పడిందిఇదే ఇంటర్వ్యూలో షూటింగ్ సమయంలో తనకు జరిగిన ఓ వింత అనుభవం గురించి సుధా పంచుకుంది. ‘గుజరాత్లో షూటింగ్ చేస్తున్న సమయంలో ఓ శక్తి నాపై దాడి చేసింది. ఆ రోజు షూటింగ్ పూర్తి చేసుకొని అర్థరాత్రి 11.30 గంటలకు గదిలోకి వెళ్లాను. నా పక్కన అమ్మ కూడా పడుకొని ఉంది. నేను నిద్రపోవడానికి ట్రై చేశా..కానీ మనసులో ఏదో అలజడి మొదలైంది. అతీంద్రియ సంఘటనలు(పారానార్మల్ యాక్టివిటీ) చోటు చేసుకునే అవకాశం ఉంటే నాకు ముందే తెలిసిపోతుంది. ఆ గదిలో ఏదో శక్తి ఉన్నట్లు నాకు అనిపించింది. వెంటనే లేచి కూర్చున్నా. గదిలో ఉన్న ఓ కబోర్డ్ తెరచి ఉండడం గమనించా. అక్కడ నుంచి ఓ శక్తి నావైపు కదులుతూ వచ్చింది. అది నన్ను చేరినప్పుడు, నా ఛాతీపై భారీ బరువు నొక్కినట్లు అనిపించింది. నేను నోరు తెరవడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ శబ్దం బయటకు రావడం లేదు. నా తల్లి నా పక్కనే ఉన్నప్పటికీ, నేను నా చేతులను కదపలేకపోయాను. ఆ శక్తి వింతగా అరుస్తూ నాలోకి ప్రశించినట్లుగా అనిపించింది. వెంటనే నేను కార్తిక్ దేవుడిని పేరుని జపించాను. ఏదోలా నా తల్లి చేతులను టచ్ చేశాను. వెంటనే నా గొంతు వచ్చింది. నా ఛాతీ బరువు కూడా తగ్గింది. మా అమ్మ వెంటనే నాపై విభూతి చల్లింది. నేను సైలెంట్ అయిపోయా’ అని సుధా చెప్పుకొచ్చింది. అలాగే ఓ సినిమా షూటింగ్ కోసం సౌత్ ఇండియాకు వచ్చినప్పుడు కూడా ఇలాంటి సంఘటనే ఎదురైంది అట. ‘ షూటింగ్ కోసం సౌత్‌కి వెళ్లినప్పుడు రాత్రిపూట ఓ వ్యక్తి కాళ్ల చప్పుడుతో పాటు మహిళ ఏడుపులు కూడా వినించాయని.. తోటివారిని అడిగితే.. ఈ ప్రాంతంలో అలానే వినిపిస్తాయని చెప్పారు’ అని సుధా చెప్పుకొచ్చింది.సుధా చంద్రన్ కెరీర్ విషయానికొస్తే..‘యే హై మొహబ్బతేన్’, ‘క్యుంకీ సాస్ భీ కబీ బహు థీ’ వంటి సూపర్ హిట్ సీరియల్స్‌తో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ‘నాగిన్’ సిరీస్‌లో యామిని రహేజా అనే పవర్ఫుల్ నెగెటివ్ రోల్ ప్లే చేసింది.తెలుగులో మయూరి మూవీలో హీరోయిన్గా చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. అందులో ఆమె దాదాపుగా రియల్ లైఫ్ క్యారెక్టర్‌ను పోషించారు. -
ఆ హోటల్లో దెయ్యాలు..! ‘ఎలిజిబెత్’.. అంటూ మగ గొంతుతో పిలిచి..
దెయ్యాల గురించి మనం సినిమాల్లో లేక ఎవరైనా చెబుతుంటే వినడమే గానీ చూసిన అనుభవాలు ఉండవు. పైగా దెయ్యం వస్తే గల్లు గల్లుమని గజ్జెల చప్పుడు, కిటికి తలుపుల శబ్దాలు వస్తాయి అన్నట్లుగా సినిమాల్లో చూపిస్తుంటారు. కానీ నిజానికి అలా జరుగుతుందో లేదో తెలియదు కానీ సౌత్ వెస్ట్ ఇంగ్లాండ్‌లోని ఓ హోటల్లో మాత్ర దెయ్యం సినిమాను తలిపించేలా భయంకరమైన ఆకృతులు, శబ్దాలు వస్తున్నాయంటున్నారు. (చదవండి: హమ్మయ్య దూకేశా!! ఏనుగునైతే మాత్రం దూకలేననుకున్నారా.. ఏం?) అసలు విషయంలోకెళ్లితే...సోమర్సెట్ కౌంటీలోని ఇల్మిన్స్టర్ ప్రాంతంలోగల ష్రబ్బరీ హోటల్లో అతిథులు అదృశ్య శక్తుల అడుగుల చప్పుడు, తల వెంట్రుకలు లాగడం, రిసెప్షన్లో ఖాళీగా ఉన్న గదుల నుండి ఫోన్లు వినబడుతున్నాయంటూ భయాందోళనకు గురౌతున్నారంటూ.. ఆ హోటల్ యజమాని పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్‌కు ఫిర్యాదు చేస్తాడు. దీంతో యూకేకి చెందిన సోమర్సెట్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ పరిశోధించడం మొదలు పెడతారు. అక్కడ పారానార్మల్ ఇన్వెస్టిగేషన్ కార్యక్రమాన్ని చేపడతారు. అంతేకాదు వారు రెండు బృందాలుగా విడిపోయి పరిశోధించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఇన్వెస్టిగేటర్ మాట్లాడుతూ..." మేము పరిశోధన చేయడానికి శాస్త్రీయ పరికరాలను, కొన్ని పాత పద్ధతులను ఉపయోగిస్తాము. అంతేకాదు మా బృందం వాకీ టాకీలు, కెమెరాల సాయంతో విడివిడిగా పరిశోధనలు చేయడం మొదలు పెట్టాం. అయితే మాకు ఈ పరిశోధనలో ఎలిజిబెత్ అనే పేరును మగ గొంతుతో ఎవరో పిలుస్తున్నట్లు వినిపించింది. మాలో చాలామందికి మా జుట్టును పైకి లాగినట్లుగా, ఎవరో తమను తాకిన అనుభూతి కలిగింది. అంతేకాదు మేము కొన్ని వికృత ఆకారాలను చూశాం’ అని పేర్కొన్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే హోటల్ యజమాని మొదటి భార్య పేరు ఎలిజబెత్ కావడం. (చదవండి: అంతరాలు దాటిన కల్లాకపటంలేని ప్రేమ) -
తాండాలో మంటల మిస్టరీ...
-
దెయ్యాలు నిజంగానే ఉన్నాయా?
సాక్షి, వెబ్ డెస్క్ : మీరు కళ్లు తెరచి పడుకుంటున్నారా?, నిద్రిస్తున్న సమయంలో ఏవైనా వింత శబ్దాలు మీకు వినిపిస్తున్నాయా?. సహజంగా ఒకసారి, రెండుసార్లు ఇలాంటి సంఘటనలు జరిగితే పట్టించుకోకుండా వదిలేస్తాం. అదే పదేపదే శబ్దాలు వినిపిస్తే మాత్రం అనుమానం(ఏదో ఉందని) మొదలవుతుంది. ఏదో గుర్తించలేని అదృశ్య శక్తి మనల్ని వెంబడిస్తుందని భావిస్తాం. ఒక్కోసారి పడుకున్న చోటును ఎటూ కదలలేకపోతాం. దీంతో మనల్ని ఎవరో వెంటాడుతున్నారన్న భయం పెరిగిపోతుంది. అప్పటినుంచి క్షణక్షణం నరకం అనుభవిస్తాం. చీకటి పడుతుంటుంది. ఇంటికి వెళ్లాలంటే గుండెల్లో రైళ్లు పరుగెడుతుంటాయి. రాత్రికి మళ్లీ ఏం జరుగుతోందనని హడలెత్తిపోతుంటాం. ఇలాంటి అనుభూతులన్నీ దెయ్యాలు, భూతాల వల్ల కాదని సైకాలజీ ప్రొఫెసర్ ఎలైస్ గ్రెగరీ తేల్చేశారు. గోల్డ్‌స్మిత్ విశ్వవిద్యాలయంలో సైకాలజీ విభాగంలో ఆయన పని చేస్తున్నారు. హఠాత్తుగా నిద్రలో నుంచి లేచి ఇంట్లో ఏదో ఉన్నట్లు భావించే వారు అధికంగా బాగా పొద్దుపోయిన తర్వాత నిద్రిస్తున్నారని చెప్పారు. ఇదే వారిని మానసిక ప్రశాంత నుంచి దూరం చేస్తోందని వెల్లడించారు. నిద్ర పక్షవాతం నిద్ర మొత్తం 3 స్టేజ్లలో ఉంటుందని గ్రేగ్ చెప్పారు. మనుషులు మొదట మెల్లగా నిద్రలోకి జారుకుంటారని, సమయం గడిచే కొద్దీ గాఢ నిద్రలోకి వెళ్తారని, ఆ తర్వాత రకరకాల కలల్లోకి వెళ్తామని గ్రెగరీ పేర్కొన్నారు. ఈ దశలో కలలోని పనులను మనం నిజంగానే చేస్తున్నట్లు భావిస్తామని, బెడ్‌పై కాళ్లు, చేతులు, ముఖ కవళికలు కలకు అనుకూలంగా మారతాయని చెప్పారు. ఈ స్థితిని నిద్ర పక్షవాతం అంటారని చెప్పారు. బాగా పొద్దుపోయిన తర్వాత నిద్రించేవారిలో ఈ మూడు స్టేజ్‌లు పూర్తికావని దాంతో వారు పగటిపూట అవిశ్రాంతిగా ఫీల్ అవుతారని తెలిపారు. ఇదే పరిస్థితి ఎక్కువకాలం కొనసాగితే మెల్కొన్న తర్వాత కూడా కదలలేకపోవడం, ఏదో జరుగుతున్నట్లు ఫీల్ అవ్వడం వంటివి జరుగుతాయని వివరించారు. -
ఆ పరిశోధకుడిది ఆత్మహత్యే..!
ఇటీవల అనుమానాస్పద స్థితిలో చనిపోయిన పారానార్మల్ సొసైటీ స్థాపకుడు గౌరవ్ తివారీ ది ఆత్మహత్యేనని పోలీసులు తేల్చి చెప్పారు. అతడు తన ఇంట్లోని బాత్రూమ్ లో స్వయంగానే ఉరి వేసుకున్నాడని, అది ఆత్మహత్యేనని ప్రాథమిక శవపరీక్ష నివేదిక ఆధారంగా తేలినట్లు తెలిపారు. అతడి మరణం వెనుక ఏదైనా కుట్ర జరిగిందా అన్న కోణంలో విచారించిన పోలీసులు... అతడు ఆత్మహత్య చేసుకున్న సమయంలో కుటుంబ సభ్యులంతా ఇంట్లోనే ఉన్నన్లు చెప్పారు. భారత్ లో ప్రేతాత్మల పరిశోధకుడిగా గుర్తింపు పొందిన గౌరవ్ తివారీ ఢిల్లీలోని తన ఫ్లాట్ లో అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. 2009 లో ప్రారంభమైన ఇండియన్ పారా నార్మల్ సొసైటీ సీఈవో గౌరవ్ తివారీ.. సొసైటీ తరపున మూఢనమ్మకాలు, ప్రేతాతమ్మల భయంతో బాధపడే వారికి అవగాహన కల్పించి, వారిలోని భయాలను పోగెట్టేవాడు. 32 ఏళ్ళ తివారీకి తల్లిదండ్రులు, భార్య ఉన్నారు. అయితే అనుమానాస్పద స్థితిలో చనిపోయిన గౌరవ్ ది హత్యా, ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు విచారించారు. చివరికి ప్రాథమిక శవపరీక్ష నివేదికల ఆధారంగా ఆత్మహత్యేనని ధృవీకరించారు. అతడి మరణం వెనుక ఎటువంటి కుట్ర జరగలేదని తెలిపారు. గౌరవ్ బాత్రూమ్ లో ఆత్మహత్య చేసుకున్నట్లు అతడి భార్య సహా తల్లిదండ్రులు తెలిపారని, ఓ గుడ్డతో ద్వారకా ఫ్లాట్ లోని బాత్రూమ్ లో ఇంట్లో అందరూ ఉన్న సమయంలోనే ఉరి వేసుకున్నట్లు తెలిపారని ఓ పోలీస్ సీనియర్ అధికారి వెల్లడించారు. తివారీ తరచుగా రాత్రి సమయంలో పని చేసే వాడని, సంపాదన కూడా పెద్దగా లేదని తెలిపిన కుటుంబ సభ్యులు అతడు చేపట్టిన కార్యకలాపాలపై ఏమాత్రం సంతోషంగా లేనట్లు విచారణలో తెలిసిందని ఓ పోలీసు అధికారి తెలిపారు.


