breaking news
Paramilitary force
-
ఉన్నావ్ బాధితుల్ని ఈడ్చిపడేశారు!
దేశరాజధానిలో జరిగిన మంగళవారం రాత్రి జరిగిన ఓ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎనిమిదేళ్ల కిందట.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ లైంగికదాడి కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది తెలిసిందే. ఈ కేసు నిందితుడు మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ జీవిత ఖైదును సస్పెండ్ చేసిన ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే దీనిని నిరసిస్తూ బాధిత కుటుంబం ఆందోళనకు దిగగా.. భద్రతా సిబ్బంది వాళ్లను ఈడ్చిపడేశారు. ఉన్నావ్ అత్యాచార కేసులో నిందితుడికి బెయిల్ దక్కడంపై నిరసనగా బాధితురాలు, ఆమె తల్లి ఇండియా గేట్ వద్ద నిరసన చేపట్టబోయారు. ఆ సమయంలో యోగితా భయానా అనే యాక్టివిస్ట్ వాళ్లతో పాటు ఉన్నారు. నిందితుడికి బెయిల్ ఇవ్వడమంటే తమ ప్రాణాలకు గ్యారెంటీ లేదంటూ ఆ తల్లీకూతుళ్లు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ సిబ్బంది వాళ్ల ప్రయత్నాన్ని భగ్నం చేసి అక్కడి నుంచి బలవంతంగా తరలించారు. ఈ క్రమంలో బాధితురాలి తల్లి బస్సు నుంచి కింద పడిపోయినట్లు తెలుస్తోంది. తొలుత ఇండియా గేట్ వద్ద, ఆ తర్వాత మండీహౌజ్ వద్ద బాధితుల్ని సీఆర్పీఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు. వాళ్లను బలవంతంగా తమ వాహనాల్లో తరలించారు. ఆ రెండు చోట్లా మీడియాతో మాట్లాడేందుకు అనుమతి లేదని అధికారుల తెలిపారు. JUSTICE DETAINEDRapist's Sentence SuspendedUnnao rape victim dragged into police van by @AmitShah's Delhi Police, protesting against suspension of sentence of former @BJP4India MLA RAPIST-MURDERER Kuldeep Singh Sengar#KuldeepSinghSengar#StockMarketIndia #PlaneCrash pic.twitter.com/vYApILE9kN— Taj INDIA (@taj_india007) December 24, 20252017లో వెలుగు చూసిన ఉన్నావ్ కేసులో ఎన్నో సంచలనాలు ఉన్నాయి. అప్పటి బీజేపీ ఎమ్మెల్యే ఉన్న కుల్దీప్ సింగ్ సెంగర్ ఉన్నావ్ ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారానికి (Unnao rape case) పాల్పడడంతో పాటు ఆమెను అమ్మేసే ప్రయత్నం చేసినట్లు అభియోగాలు ఉన్నాయి. అంతేకాదు.. బాధితురాలి తండ్రి మరణానికి కూడా కారణమయ్యాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో.. ఆగస్టు 1, 2019న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అత్యాచారం కేసు, సంబంధిత ఇతర కేసులను ఉత్తరప్రదేశ్‌లోని ట్రయల్ కోర్టు నుంచి ఢిల్లీకి బదిలీ చేశారు. ఢిల్లీ కోర్టు 2019 డిసెంబర్ 16న 2019 దోషిగా తేల్చి.. డిసెంబర్ 20న జీవిత ఖైదు విధించింది. అయితే.. సెంగర్‌కు శిక్ష పడక ముందే.. ఎన్నో పరిణామాలు జరిగాయి. అదే ఏడాది కేసు సీబీఐ విచారణ జరుగుతుండగానే.. బాధితురాలు, ఆమె కుటుంబం ప్రయాణిస్తున్న వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదం నుంచి బాధితురాలు బయటపడగా.. ఆమె ఇద్దరు బంధువులు మరణించారు. జీవిత ఖైదు పడడంతో 2020 నుంచి సెంగర్ జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. అయితే తాజాగా ఢిల్లీ కోర్టు ఆ శిక్షను సస్పెండ్ చేసి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. 2027 అసెంబ్లీ ఎన్నికల తరుణంలోనే కుల్దీప్కు బెయిల్ దక్కిందని రాజకీయ ఆరోపణలు వినవస్తున్నాయి. మరోవైపు.. తర్వాత పోయేది తన ప్రాణమేనంటూ బాధితురాలు, ఆమె తల్లి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘‘మాకు న్యాయం జరగలేదు. నా కుమార్తెను బంధించారు. మమ్మల్ని చంపాలని చూస్తున్నారు. అధికారులు (సీఆర్పీఎఫ్)సిబ్బంది బాధితురాలిని బలవంతంగా తీసుకెళ్లి, తాను రోడ్డుపై పడేశారు.సెంగర్‌కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. బాధిత కుటుంబానికి ఐదు కిలోమీటర్ల దూరంలో అతను సంచరించకూడదని.. వాళ్లను బెదరించే ప్రయత్నం చేసినా బెయిల్ రద్దు అవుతుందని హెచ్చరించింది. అయినప్పటికీ.. నిందితుడికి బెయిల్ రావడంపై అభ్యంతరాలతో నెట్టింట చర్చ నడుస్తోంది. ఉన్నావ్ కేసు టైమ్లైన్జూన్ 4, 2017 – 17 ఏళ్ల బాలిక ఉన్నావ్ జిల్లా, మఖి గ్రామంలో కనిపించకుండా పోయింది. ఆమెను కుల్దీప్ సింగ్ సేంగర్, అతని సోదరుడు అటుల్ సింగ్ ఇతరులు అత్యాచారం చేశారు.జూన్ 21, 2017 – బాధితురాలు ఔరయ్యలో ప్రత్యక్షమైంది.. పోలీసులు ఆమెను రక్షించారుజూన్ 22, 2017 – పోలీసులు IPC సెక్షన్లు 363, 366 కింద కేసు నమోదు చేశారు.ఏప్రిల్ 3, 2018 – బాధితురాలి తండ్రిని సేంగర్ సోదరుడు అటుల్ మరియు అనుచరులు కొట్టి, తర్వాత జైలులో మరణించాడు.ఏప్రిల్ 8, 2018 – బాధితురాలు లక్నోలో CM యోగి ఆదిత్యనాథ్ నివాసం వద్ద ఆత్మహత్యాయత్నం చేసింది. దీని తర్వాత కేసు దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది.ఏప్రిల్ 2018 – CBI దర్యాప్తు ప్రారంభమైంది.జూలై 2019 – బాధితురాలు, ఆమె కుటుంబం ప్రయాణిస్తున్న కారుపై లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు బంధువులు మరణించారు.డిసెంబర్ 16, 2019 – ఢిల్లీ కోర్టు సేంగర్ను అత్యాచారంలో దోషిగా తేల్చింది.డిసెంబర్ 20, 2019 – సేంగర్కు జీవితఖైదు శిక్ష విధించారు.2020–2024 – సేంగర్ జైలులో శిక్ష అనుభవించాడుడిసెంబర్ 23, 2025 – ఢిల్లీ హైకోర్టు సేంగర్ జీవితఖైదు శిక్షను కొట్టేసి.. కండిషన్ బెయిల్ ఇచ్చింది -
‘నాకు కొడుకే కావాలి’.. ఏడాది కుమార్తెకు విషమిచ్చి ప్రాణం తీసిన తండ్రి
అగర్తల: కొడుకులకన్నా కూతురు నయం అనుకునే ఈ రోజుల్లో ఆడపిల్లలపై ఇంకా వివక్ష ఇంకా కొనసాగుతోంది. తాజాగా ఓ తండ్రి తన కుమార్తెకు విషం ఇచ్చి హత్య చేసిన ఘటన.. విషాద వాస్తవానికి నిదర్శనంగా నిలుస్తోంది.త్రిపుర రాష్ట్రం ఖోవై జిల్లా బేహలాబారి గ్రామంలో దారుణం జరిగింది. త్రిపురా స్టేట్ రైఫిల్స్‌కు చెందిన జవాన్ రతీంద్ర దేవ్‌బర్మా తన ఏడాది కుమార్తెను విషమిచ్చి హత్య చేశారు. అయితే,తండ్రి విషం ఇవ్వడంతో చిన్నారి ఆపస్మారక స్థితిలోకి వెళ్లింది. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు చిన్నారిని అత్యవసర చికిత్స నిమిత్తం త్రిపురా రాజధాని అగర్తల జీబీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆ చిన్నారి కన్నుమూసినట్లు వైద్యులు నిర్ధారించారు. నిందితుడు రతీంద్ర దేవ్ బర్మా త్రిపురా స్టేట్ రైఫిల్స్ పదోవ బెటాలియన్ తరుఫున ఏడీసీ ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వహిస్తుండగా.. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం రతీంద్రదేవ్ను కోర్టు మూడు రోజుల రిమాండ్ విధించింది.కుమార్తె మరణంపై గుండెలవిసేలా రోధిస్తున్న తల్లి మిథాలీ.. తన భర్త రతీంద్రదేవ్పై సంచలన వ్యాఖ్యలు చేసింది. కుమార్తెకు బిస్కెట్లు కొనుక్కునే నెపంతో తమ కూతురు సుహాని దేవ్ బర్మా విషం తినిపించాడని ఆరోపించింది. తన భర్తకి ఎప్పుడూ కుమారులే కావాలి. ఇద్దరు కూతుళ్లకు జన్మనిచ్చినందుకు తనను నిరంతరం ద్వేషిస్తుండేవారని వాపోయింది. మేం బెహలబరిలోని నా సోదరి ఇంటికి వెళ్తున్నాము. అప్పుడు నా భర్త.. నా కుమార్తెను, నా సోదరి కొడుకుకు బిస్కెట్లు కొనిచ్చేందుకు సమీపంలోని దుకాణానికి తీసుకెళ్లాడు. వెంటనే, నా సోదరి కొడుకు, నా కుమార్తె వాంతులు,విరోచనాలు చేసుకున్నారు. నా కుమార్తె నోటి వెంట క్రిమిసంహారక మందు వాసన రావడాన్ని గమనించా. ఆస్పత్రికి తరలించా. కుమార్తెకు.. నా భర్త హాని తలపెట్టి ఉంటాడని అనుమానించా. అతడిని నిలదీశా. కుమార్తెకు విషం ఇవ్వలేదని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. భర్తే తన కుమార్తె సుహాని ప్రాణాలు తీశాడని, అతడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తోంది. -
ధోని కొత్త ఇన్నింగ్స్ షురూ!
శ్రీనగర్ : పారామిలటరీ రెజిమెంట్‌లో సేవ చేసేందుకుగాను రెండు నెలలపాటు సెలవు తీసుకున్న భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని.. ప్రస్తుతం క్యాంపులో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఆర్మీలో గౌరవ లెప్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న ధోని.. సైన్యంతో కలిసి విధులు నిర్వర్తించేందుకు వెస్టిండీస్ పర్యటనకు దూరమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ధోని ప్రస్తుతం భారత సైన్యంలో 106 టీఏ పారా బెటాలియన్‌తో కలిసి కాశ్మీర్ లోయలో రెండు నెలలపాటు సైన్యంతో కలిసి పనిచేయనున్నారు. ఇందులో భాగంగా ఉగ్రదాడులు ఎదుర్కొనే విక్టర్ ఫోర్స్ విభాగంలో సైనాధికారులు ధోనికి బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో ధోని ఉన్నతాధికారులతో కలిసి క్యాంపులో పాల్గొంటూ, సైనికులలో ఒకరికి బ్యాట్ మీద ఆటోగ్రాఫ్ చేస్తోన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా 2011లో కల్నల్ హోదా పొందిన ధోని, అనంతరం పారా మిలటరీ రెజిమెంట్‌లో పని చేయడం కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. అంతకుముందు ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ మాట్లాడుతూ భారత పౌరుడు మిలటరీ యూనిఫామ్ ధరించాలనుకున్నప్పుడు అతనికి కేటాయించిన ఏ విధులనైనా నిర్వర్తించడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ధోని ప్రాథమిక శిక్షణ పూర్తి చేశారని, క్రికెట్లో నిర్వర్తించిన విధంగానే ఇక్కడ కూడా తన విధులను బాధ్యాతయుతంగా నిర్వర్తిస్తాడని విశ్వాసం వ్యక్తం చేశారు. -
దేశంలో అతిపెద్ద ఫోర్స్‌గా సీఆర్పీఎఫ్
కలికిరి : దేశంలోనే అతిపెద్ద పారా మిలటరీ ఫోర్స్‌గా కేంద్ర రిజర్వ్ పోలీసు ఫోర్స్ సీఆర్పీఎఫ్ పనిచేస్తోందని డీజీ దుర్గాప్రసాద్ తెలిపారు. శుక్రవారం ఆయన కలికిరి మండలం పత్తేగడ పంచాయతీ పాళ్యెంకొండలో విలేకరులతో మా ట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో సీఆర్పీఎఫ్ విస్తరించిందని వివరిం చారు. ప్రకృతి వైపరీత్యాల్లో సాహసోపేతంగా పనిచేస్తూ సేవలందిస్తున్నట్లు పేర్కొన్నారు. నక్సల్ ప్రభావిత స్థావరాలో్లకి చొరబడి వాటిని ధ్వంసం అణచివేశామన్నారు. కాశ్మీర్లో చెలరేగిన అల్లర్లను చక్కదిద్దడంలో సీఆర్పీఎఫ్ ప్రధాన పాత్ర పోషించిందని చెప్పారు. కలికిరి సీఆర్పీఎఫ్ కేంద్రాన్ని 450 ఎకరాల్లో ఏర్పాటు చేశామని, 34 తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేసి ఉగ్రవాద నిరోధక శిక్షణ పాఠశాల–3 ప్రారంభించామని తెలి పారు. ఏడాదికి మూడు బ్యాచ్‌లకు ఇక్కడ శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. దేశంలోనే మొదటి మూడు శిక్షణ పాఠశాలలో కలికిరి ఒకటని పేర్కొన్నారు. సీయట్, శివపురి ప్రాంతాలలో పాఠశాలలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వాల్మీకిపురం సీఐ శ్రీధర్‌నాయుడు, ఎస్ఐ పురుషోత్తంరెడ్డి, ఎంపీటీసీ సభ్యులు జనార్దన్ గౌడ్, సీఆర్పీఎఫ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీ అభిషేక్ మహంతి, సీఆర్పీఎఫ్ ఐజీ గిరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సీఆర్పీఎఫ్ శిక్షణ కేంద్రం ప్రారంభం కలికిరి సమీపంలోని పాళ్యెం కొండ వద్ద ఏర్పాటు చేసిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) శిక్షణ కేంద్రాన్ని డైరెక్టర్ జనరల్ కె.దుర్గాప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభించారు. శుక్రవారం విచ్చేసిన ఆయనకు ఐజీ గిరిప్రసాద్, జిల్లా అడిషనల్ ఎస్పీ అభిషేక్ మహంతి, మదనపపల్లె డీఎస్పీ రాజేంద్రప్రసాద్, సైనిక పాఠశాల వింగ్‌కమాండర్ వీఎస్. డంగ్వాల్ స్వాగతం పలికారు. -
సీమాంధ్రకు 25 కంపెనీల పారా మిలటరీ బలగాలు
హైదరాబాద్: తెలంగాణ నోట్‌ను కేంద్ర కేబినెట్ ఆమోదించడంతో సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమయింది. శాంతి భద్రతలు అదుపుతప్పకుండా చూసేందుకు అదనపు భద్రతా బలగాలను రంగంలోకి దించుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో 45 కంపెనీల పారామిలటరీ బలగాలు ఉన్నాయి. అదనంగా 25 కంపెనీల పారా మిలటరీ బలగాలు కావాలని కేంద్రాన్ని కోరింది. కోయంబత్తూరు నుంచి 15, కోల్‌కతా నుంచి 10 పారామిలటరీ బలగాలు రాష్ట్రానికి రానున్నాయి. కేంద్ర కార్యాలయాలు, ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం అదనపు బలగాలు కోరినట్టు సమాచారం. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని ఇన్చార్జి డీజీపీ ప్రసాదరావు తెలిపారు. సీమాంధ్ర నాయకులకు అవసరమయితే భద్రత పెంచుతామన్నారు. సమైక్య ఉద్యమకారులు కేంద్ర కార్యాలయాలు టార్గెట్ చేస్తున్నట్టు సమాచారం ఉందని తెలిపారు. ఈ మధ్యాహ్నం శాంతి భద్రతలపై సీఎం కిరణ్ సమీక్ష నిర్వహించారు. ఉద్యమకారులపై ఒక్క రబ్బర్ బుల్లెట్ కూడా ప్రయోగించడానికి వీల్లేదని ఆదేశాలిచ్చారు.


