breaking news
paper leak issue
-
పేపర్ లీకులకు చెక్! కేంద్రం సంచలన నిర్ణయం
పేపర్ లీకేజీ వ్యవహారాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల పవిత్రతను కాపాడేందుకు.. అక్రమాలకు పాల్పడే వారికి త్వరగతిన శిక్షలు పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా వెల్లడించారు. యువత సంక్షేమం, భవిష్యత్తు కంటే తమకు ఏదీ ముఖ్యమైనది కాదని స్పష్టం చేశారు.ఈ మేరకు గురువారం ఉదయం ప్రధాని మోదీ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. పేపర్ లీకేజీలకు పాల్పడే వ్యక్తులపై కఠిన, వేగవంతమైన శిక్షలు పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ దిశగా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు, విభాగాలకు ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు.“యువత సంక్షేమం, వారి భవిష్యత్తు కంటే ఏదీ ముఖ్యం కాదు. పేపర్ లీకులకు పాల్పడి యువత భవిష్యత్తును దెబ్బతీసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టం” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.Nothing is more important than the welfare and future of our youth!We have decided to set up fast-track courts to ensure swift and stringent punishment for those involved in paper leaks. Have directed the concerned authorities and officials to take all necessary steps in this…— Narendra Modi (@narendramodi) July 23, 2026విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణకు చర్యలుపరీక్షల నిర్వహణలో పారదర్శకత, విశ్వసనీయతను పెంచేందుకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటోందని ప్రధాని తెలిపారు. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పేపర్ లీకులు, పరీక్షల్లో అక్రమాలు లక్షలాది మంది విద్యార్థుల శ్రమను దెబ్బతీస్తాయని కేంద్రం భావిస్తోంది. ఇలాంటి చర్యలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని లక్ష్యంగా పెట్టుకుంది.నీట్ వివాదం వేళ ప్రధాని ప్రకటననీట్–యూజీ పరీక్షలో అవకతవకల ఆరోపణల నేపథ్యంలో దేశవ్యాప్తంగా విద్యార్థులు, ప్రతిపక్షాలు నిరసనలు చేస్తున్న సమయంలో ప్రధాని ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. పరీక్షల నిర్వహణపై విశ్వసనీయతను పునరుద్ధరించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్న వేళ.. కేంద్రం వేగవంతమైన న్యాయ ప్రక్రియపై దృష్టి సారించింది.ఇటీవల పేపర్ లీకేజీ కేసుల్లో పలువురిపై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో.. ఇకపై ఇలాంటి వ్యవహారాల్లో విచారణ, శిక్షల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రత్యేక న్యాయ వ్యవస్థను తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది.“యువత భవిష్యత్తుతో ఆటలాడితే క్షమించం”పేపర్ లీకుల వ్యవహారాన్ని మహా పాపంగా అభివర్ణించిన ప్రధాని మోదీ.. యువత భవిష్యత్తును నాశనం చేసే ప్రయత్నాలను సహించబోమని ఇదివరకే స్పష్టం చేశారు. పరీక్షల వ్యవస్థపై విద్యార్థులకు నమ్మకం కలిగించేలా ప్రభుత్వం నిరంతరం చర్యలు కొనసాగిస్తుందని తెలిపారు. అయితే పేపర్ లీకేజీ అంశంపై కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం.. నీట్ నిరసనకారులను శాంతింపజేస్తుందా? అనేది చూడాలి. -
విజయ్.. ఒక దెబ్బకు రెండు పిట్టలు!
నీట్ వివాదం దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్న వేళ.. తమిళగ వెట్రి కళగం అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మరోసారి తన వైఖరిని స్పష్టం చేశారు. నీట్ పరీక్షను పూర్తిగా రద్దు చేయాలన్నదే తమ పార్టీ విధానమని ప్రకటించారు. కేవలం పరీక్ష నిర్వహణలో లోపాలు, పేపర్ లీక్‌లు వంటి అంశాలను సరిదిద్దితే సరిపోదని.. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష విధానాన్నే పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారాయన. అయితే ఈసారి ఆయన టార్గెట్ కేవలం నీట్ మాత్రమే కాదని అనిపిస్తోంది.ఢిల్లీలో నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న సమయంలో టీవీకే కీలక ప్రకటన చేసింది. వైద్య విద్య ప్రవేశాలపై నిర్ణయాలు తీసుకునే పూర్తి అధికారం రాష్ట్రాలకు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ప్రస్తుతం విద్య రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితా (Concurrent List)లో ఉంది. అంటే కేంద్రం, రాష్ట్రాలు రెండూ దీనిపై చట్టాలు చేయవచ్చు. అయితే విద్యను రాష్ట్ర జాబితా (State List)లోకి మార్చాలని టీవీకే కోరుతోంది.ఒకవేళ దీనికి రాజ్యాంగపరమైన అడ్డంకులు ఉంటే.. మధ్యంతర పరిష్కారంగా రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు కల్పించే ప్రత్యేక విధానం తీసుకురావాలని సూచించింది. TVK అభిప్రాయం ప్రకారం.. స్థానిక పరిస్థితులు, విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా వైద్య విద్య విధానాలను రాష్ట్రాలే రూపొందించుకునే అవకాశం ఉండాలి.కేంద్రంపై విమర్శ.. డీఎంకేపై కౌంటర్విజయ్ తాజా ప్రకటనలో రాజకీయ వ్యూహం స్పష్టంగా కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నీట్ విధానాన్ని వ్యతిరేకించడం ద్వారా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేసిన టీవీకే.. అదే సమయంలో తమిళనాడులో ప్రధాన ప్రత్యర్థి అయిన డీఎంకేపైనా ప్రశ్నలు సంధించింది.2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో డీఎంకే అధికారంలోకి వస్తే నీట్‌ను రద్దు చేస్తామని(చేయిస్తామని) హామీ ఇచ్చింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీ అమలు కాలేదని టీవీకే విమర్శించింది.“మేమే నీట్‌ను రద్దు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేసే రాజకీయాలు చేయం” అంటూ పరోక్షంగా డీఎంకేను టార్గెట్ చేసింది టీవీకే. ఒకే అంశంతో అటు కేంద్ర విధానాన్ని వ్యతిరేకిస్తూ.. ఇటు డీఎంకే హామీలను ప్రశ్నించే వ్యూహాన్ని విజయ్ అనుసరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.పాత వివాదమే.. కొత్త రాజకీయ రంగుతమిళనాడులో ఈ అంశం కొత్తది కాదు. వైద్య విద్య ప్రవేశాల్లో జాతీయ స్థాయి పరీక్ష అవసరమా? లేదంటే రాష్ట్రాలకు అధికారం ఇవ్వాలా? అనే చర్చ చాలాకాలంగా కొనసాగుతోంది. నీట్‌ను వ్యతిరేకించేవాళ్లు.. గ్రామీణ ప్రాంతాలు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ విధానం ప్రతికూలంగా మారుతోందని వాదిస్తున్నారు. కోచింగ్ వ్యవస్థకు ప్రాధాన్యం పెరిగి, సామాన్య కుటుంబాల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. మరోవైపు అనుకూల వర్గాలు మాత్రం దేశవ్యాప్తంగా వైద్య విద్య ప్రవేశాల్లో ఒకే ప్రమాణం ఉండేందుకు జాతీయ స్థాయి పరీక్ష అవసరమని వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజా పేపర్ లీకేజీ వివాదం.. తమిళనాడు చర్చను మళ్లీ తెరపైకి తెచ్చింది.విజయ్‌కు రాజకీయంగా కీలకమా?సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన విజయ్.. టీవీకేను బలమైన రాజకీయ శక్తిగా నిలబెట్టే ప్రయత్నంలో ఉన్నారు. యువత, విద్యార్థులు, రాష్ట్ర హక్కులు వంటి అంశాలను ప్రధాన అజెండాగా తీసుకుంటున్నారు. తమిళనాడులో విద్య, సామాజిక న్యాయం అంశాలు ఎప్పటి నుంచో కీలక రాజకీయ అంశాలు. ఈ నేపథ్యంలో నీట్ వ్యతిరేకతను బలంగా వినిపించడం ద్వారా విద్యార్థుల్లో, యువ ఓటర్లలో తన పార్టీకి స్థానం పెంచుకునే ప్రయత్నంగా ఈ అడుగును చూస్తున్నారు.NEET రగడ.. పొలిటికల్ గేమ్‌గా మారుతుందా?ఇప్పటివరకు నీట్ వివాదం ప్రధానంగా పరీక్షా విధానం, లీక్‌లు, సంస్కరణల చుట్టూ తిరిగింది. కానీ తమిళనాడులో మాత్రం ఇది కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, రాజకీయ ఆధిపత్య పోరుగా మారే అవకాశం కనిపిస్తోంది. విజయ్ తాజా వైఖరి చూస్తే.. నీట్ అంశాన్ని కేవలం విద్యా సమస్యగా కాకుండా రాజకీయ చర్చగా మార్చే ప్రయత్నం కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా.. NEET వ్యతిరేకతతో కేంద్రంపై విమర్శలు, డీఎంకేపై ఎదురుదాడి.. రెండింటినీ ఒకేసారి సాధించే వ్యూహంతో విజయ్ ముందుకు సాగుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
TSPSC: పరీక్షల కంట్రోలర్‌గా బీఎం సంతోష్ నియామకం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీఎస్పీఎస్పీలో పేపర్ లీక్‌ల వ్యవహారంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దీంతో, తెలంగాణ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా కమిషన్‌లో పది కొత్త పోస్టులను మంజూరు చేసింది. పరీక్షల కంట్రోలర్, డిప్యూటీ కంట్రోలర్, అసిస్టెంట్ కంట్రోలర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, చీఫ్ ఇన్మర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్, సీనియర్, జూనియర్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, సీనియర్, జూనియర్ ప్రోగ్రామర్ పోస్టులు, జూనియర్ సివిల్ జడ్జి కేడర్‌లో లా ఆఫీసర్ పోస్టులకు కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వీటికి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఆమోదం తెలుపింది. అలాగే, కొత్త పోస్టులను మంజూరు చేసింది. పరీక్షల కంట్రోలర్‌గా బీఎం సంతోష్ ఇదే సమయంలో ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు డైరెక్టర్ బాధ్యతలను నిర్వరిస్తున్న బి.ఎం.సంతోష్‌కు కీలక బాధ్యతలు అప్పగించింది. టీఎస్పీఎస్సీ అదనపు కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి బి.ఎం.సంతోష్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో, సంతోష్ టీఎస్పీఎస్సీ పరీక్షల కంట్రోలర్‌గా వ్యవహరించనున్నారు. -
TSPSC పేపర్ లీకేజీ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం
-
టెన్త్ పరీక్షా పేపర్ లీక్ కేసు కొత్త మలుపులు
-
వరంగల్ సీపీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు
-
బండి సంజయ్ అరెస్ట్.. కేటీఆర్ సంచలన కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పేపర్ లీక్ వ్యవహారంలో భాగంగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సంజయ్‌పై బీఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో బీజేపీ చెలగాటం ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే సంజయ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్బంగా కేటీఆర్ ట్విట్టర్ వేదికగా సంచలన కామెంట్స్ చేశారు. కేటీఆర్ ట్విట్టర్లో ‘పిచ్చోని చేతిలో రాయి ఉంటే.. వచ్చి పోయేటోళ్ళకే ప్రమాదం...!! కానీ అదే పిచ్చోని చేతిలో ఒక పార్టీ ఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం...!!! తమ స్వార్థ రాజకీయాల కోసం ప్రశ్నా పత్రాలు లీకు చేసి అమాయకులైన విద్యార్ధుల, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న బీజేపి నాయకులు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. పిచ్చోని చేతిలో రాయి ఉంటే.. వచ్చి పోయేటోళ్ళకే ప్రమాదం...!! కానీ అదే పిచ్చోని చేతిలో ఒక పార్టీ ఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం...!!! తమ స్వార్థ రాజకీయాల కోసం ప్రశ్నా పత్రాలు లీకు చేసి అమాయకులైన విద్యార్ధుల, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న బీజేపి నాయకులు #BJPleaks https://t.co/8GFI6ups6v — KTR (@KTRBRS) April 5, 2023 కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ.. తెలంగాణలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా బీజేపీ కుట్ర చేస్తోంది. టెన్త్ పేపర్ లీకేజీలో కుట్రదారుడు బండి సంజయ్. పేపర్ లీక్ నిందితులతో బీజేపీ పెద్దలకు సంబంధాలున్నాయి. టీఎస్పీఎస్సీ నిందితులకు సునీల్ బన్సల్‌తో సంబంధాలున్నాయి. ఢిల్లీ పెద్దల కనుసన్నల్లోనే సంజయ్ పేపర్ లీకులు చేయిస్తున్నాడు. మా ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికే ఢిల్లీ పెద్దలు కుట్ర చేస్తున్నారు. ఢిల్లీ పెద్దల డైరెక్షన్లోనే తెలంగాణలో పేపర్ లీకేజీలు. టెన్త్ పేపర్‌ను వైరల్ చేసిన ప్రశాంత్ బీజేపీ కార్యకర్త అని తెలిపారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. పేపర్ లీకేజీలో బండి సంజయ్ కుట్రదారుడు. సంజయ్ ఆదేశాలతోనే పేపర్ లీక్ జరుగుతోంది. విద్యార్థుల భవిష్యత్తుతో బీజేపీ చెలగాటం ఆడుతోంది. అవసరమైతే సంజయ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేయాలి. మాతో పోటీపడలేక ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్నారు. బండి సంజయ్ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: అసలేం జరిగింది.. బండి సంజయ్ అరెస్ట్ -
TSPSCని UPSCకి అప్పగించాలి..!
-
టీఎస్పీఎస్సీ మీద మాకు నమ్మకం లేదు...ఆందోళనలో విద్యార్ధులు
-
అభ్యర్థులను కుదిపేస్తున్న లీకేజీలు
-
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్‌పై కేసీఆర్ సీరియస్.. ఉన్నతస్థాయి సమీక్ష..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పబ్లిక్ సర్వి స్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పరీక్ష పేపర్ల లీకేజీ ఘటన రోజురోజుకు ముదురుతోంది. టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాల నాయకులతోపాటు ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. పేపర్ లీకేజీపై సమగ్ర విచారణ జరపాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ అయ్యారు. దీనిపై శనివారం ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ప్రగతి భవన్లో జరిగిన ఈ సమీక్ష సమావేశానికి సీఎస్ శాంతి కుమారి, మంత్రి హరీష్ రావు, కేటీఆర్, టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి, మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి హాజరయ్యారు. ఈ క్రమంలో టీఎస్పీఎస్సీపై సర్కార్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. చదవండి: టీఎస్పీఎస్సీ పేపర్‌లీక్‌పై గవర్నర్‌కు బీజేపీ ఫిర్యాదు -
రామోజీ స్కూల్ నుంచి లాజిక్ లేని పాఠాలు
ఒకప్పుడు మీడియా అయినా, రాజకీయ పార్టీలు అయినా.. విద్యార్దుల చదువుల విషయానికి వచ్చినప్పుడు జాగ్రత్తగా స్పందించేవి. వారి భవిష్యత్తు దెబ్బతినకూడదన్న స్పష్టమైన అవగాహనతో ఉండేవి. ఉపాధ్యాయులు వారి వృత్తికి నిబ్బందులై ఉండేవారు. అలాగని అసలు అక్రమాలు జరగలేదని కాదు. కాకపోతే గతంలో సామూహికంగా ప్రశ్నాపత్రాల లీకేజీలతో రాష్ట్రం అంతా అట్టుడికి పోయేది. పత్రికలలో నిత్యం ఏదో ఒక పరీక్ష ప్రశ్నపత్రం ముద్రితమయ్యేది. అది వాస్తవమైనదా? కాదా? అన్నది నిర్దారించుకున్న తర్వాత ప్రభుత్వం స్పందించేది. అవసరమైతే ఆ పరీక్షను రద్దు చేసేది. కానీ ఇప్పుడు.. ఆ దశ నుంచి ఎక్కడైనా ప్రశ్నపత్రం వాట్సాప్ ద్వారా బయటకు వస్తే అది అక్కడికే పరిమితం అవుతోంది. ఇది కొంతలో కొంత బెటర్. దీనివల్ల సంబంధిత నేరం చేసినవారిని గుర్తించి అరెస్టు చేసే అవకాశం కూడా తేలిక అయింది. ఇటీవలికాలంలో ఇలా వాట్పప్ లీక్ ద్వారా అక్రమాలకు పాల్పడ్డ టీచర్లు, హెడ్ మాస్టర్ లు, ఇతరులు అంతా కలిపి సుమారు డెబ్బై మంది వరకు ఉన్నట్లు పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. విశేషం ఏమిటంటే.. ఇలా అరెస్టు అయినవారిలో కార్పొరేట్ స్కూల్ టీచర్లు, ప్రభుత్వ స్కూళ్ల టీచర్లు ఉన్నారు. సమాజాన్ని సరైన మార్గంలో తీసుకు వెళ్లవలసిన ఈ ఉపాధ్యాయులే ఇలాంటి అక్రమాలకు ప్రోత్సహించడం శోచనీయం. దీనివల్ల ప్రభుత్వానికి వచ్చే చెడ్డపేరు కన్నా, టీచర్లు అంటే అసహ్యం ఏర్పడే పరిస్థితి ఏర్పడుతోంది. కొన్ని లక్షల మంది టీచర్లు ఉంటే అంతా కలిపి వంద లోపే ఇలాంటి అక్రమాలకు పాల్పడ్డారు. అందువల్ల టీచర్లు అందరిని అనజాలం. అయితే ఈనాడు దినపత్రిక ‘గురువులకే పరీక్ష’ అంటూ ఒక కథనం రాసి మొత్తం వ్యవహారాన్ని ప్రభుత్వంపైన, పిల్లలపైన నెట్టే ప్రయత్నం చేసింది. దీనివల్ల తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా లాభం జరుగుతుందని ఆశించారో, లేక తెలివితక్కువగా కథనాన్ని ఇచ్చారో తెలియదో కాని.. వారు చెప్పినదాని ప్రకారం ప్రభుత్వస్కూళ్లలో వంద శాతం ఫలితాలు రావాలని ఒత్తిడి చేస్తున్నందునే ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయని వారు తీర్పు ఇచ్చేశారు. ఈ లెక్కన అక్రమాలు చేయడంలో తప్పు లేదని ఈ పత్రికవారు అభిప్రాయపడుతున్నట్లుగా ఉంది. ► ఈనాడు పత్రికకు నిజాయితీ ఉంటే ఏమని రాయాలి?.. ఉపాధ్యాయలు పెడదోవపట్టరాదని, సమాజానికి మార్గదర్శకులుగా ఉండాలని, మాస్ కాపీయింగ్‌కు కాని.. వాట్సాప్ లీకేజీలకు కాని అవకాశం ఇవ్వరాదని రాయాలి. అలారాయకపోగా.. వారు ఏదో తప్పనిసరి పరిస్థితిలో అక్రమాలకు పాల్పడుతున్నారని, అందువల్ల వారు తప్పు లేదన్న చందంగా కథనాన్ని ఇవ్వడం శోచనీయం. పోనీ అది కూడా ప్రైవేటు రంగ స్కూళ్ల గురించి ఏమైనా ప్రస్తావించారా? అంటే అదేమీ చేయలేదు. ఏదో సంస్థ సర్వే చేసిందని, దాని ప్రకారం ప్రమాణాలు లేకపోయినా, కొందరు ఇలా అక్రమాలకు పాల్పడి ఉత్తీర్ణులు అవుతున్నారని పేర్కొన్నారు. ఈ సర్వేని ప్రాతిపదికగా తీసుకుంటే ఈ పత్రిక టీచర్లకు మంచి సలహాలు ఇవ్వాల్సింది పోయి, పాపం వారేం చేస్తారని వాపోయింది. ప్రభుత్వ స్కూళ్లలోనే టీచర్లు ఒత్తిడికి గురి అవుతున్నారా? ప్రైవేటు స్కూళ్లలో టీచర్లు అంతా ఆడుతూ,పాడుతూ చేసుకుంటున్నారా? ఈనాడు వారికి కూడా ఒక స్కూల్ ఉంది కదా? అక్కడ టీచర్లు పాఠాలు చెప్పకపోయినా పర్వాలేదు.. నిర్దిష్ట లక్ష్యాల ప్రకారం పనిచేయకపోయినా పర్వాలేదని చెబుతున్నారా? అలా చేయరు కదా.. బోలెడంత అదనపు పని పెడుతుంటారు. ► అదొక్కటే కాదు. కార్పొరేట్ స్కూళ్లలో మెజార్టీ అలాగే చేస్తుంటాయి. సాయంత్రం స్కూల్ టైమ్ ముగిశాక, పిల్లలను స్టడీ క్లాస్ పేరుతో గంటల తరబడి కాపలా పెట్టి చదివిస్తుంటారు. మరి దీనిని ఏమంటారు? అయినా వారు ఉత్తీర్ణులు కాకపోతే ప్రైవేటు యాజమాన్యాలు ఊరుకుంటాయా? ప్రభుత్వ స్కూళ్లలో మాత్రం టీచర్లను బాగా పనిచేయాలని అడగకూడదట. చివరికి రామోజీ లాజిక్ ఇలా తయారయ్యిందని అనుకోవాలి. అసలు ముందుగా పేపర్ వాట్సాప్ ద్వారా బయటకు వచ్చింది నారాయణ స్కూల్ నుంచే కదా. దానిని పోలీసులు సకాలంలో పసిగట్టి పలువురిని అరెస్టు చేశారు కదా? ఆ విషయం ఈ పత్రిక గానీ ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీగానీ ఎందుకు చెప్పడం లేదు. అంతేకాదు.. శ్రీకాకుళం జిల్లాలో కొందరు టీడీపీ కార్యకర్తలు ఈ దిక్కుమాలిన పాపానికి పాల్పడ్డారట. వారికి ఒక తెలుగుదేశం టీవీ చానల్ జతకలిసిదంట. ఏపీలో రాజకీయం ఎంత క్షుద్రంగా తయారైందో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం కావాలా?. అయినా పోలీసులు ఆయా చోట్ల కఠినంగా వ్యవహరించి నిందితులుగా ఉన్న టీచర్లను అరెస్టు చేసినందుకు ప్రభుత్వాన్ని ప్రశంసించాలి కదా?.. అదే చంద్రబాబు టైమ్ లో ఇలాంటివి జరిగి అరెస్టు అయితే ఏమని రాసేవారు..ప్రభుత్వం సత్వరమే స్పందించి వారిని అదుపులోకి తీసుకోవడం ద్వారా సమర్ధంగా వ్యవహరించిందని రాసేవారు కదా. ► అదే పని జగన్ ప్రభుత్వం చేస్తే ‘గురువులకు పరీక్ష’ అంటూ పిచ్చి కథనాలు ఇస్తుంటారు. వంద శాతం ఫలితాలు కావాలంటే ఎవరైనా పేపర్ లీక్ చేస్తారా? మాస్ కాపీయింగ్ చేసి మార్కులు సంపాదిస్తారా. దానిని మీడియా సమర్ధించడమా? మాస్ కాపీయింగ్ అన్న సమస్య ఇవ్వాళ్టిది కాదు. కొన్ని దశాబ్దాలుగా ఉంది. విద్యార్దుల తల్లిదండ్రులు, వారి సమీప బందువులు బయట నుంచి స్లిప్‌లు అందించి అక్రమాలకు పాల్పడుతుంటారు. ఇదే విషయం పై 2017లో ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం కొన్ని చోట్ల సీసీటీవీలు ఏర్పాటు చేసి పరిశీలించిందట. అప్పుడు అనేక అవకతవకలు కాని, వివిధ నాసిరకం ప్రమాణాలు కాని బయటపడ్డాయట. తదుపరి రాష్ట్ర వ్యాప్తంగా సీసీటీవీల ఏర్పాటు మాత్రం చేయలేదని ఆ పత్రికే రాసింది. అంటే ఇది ఎవరి తప్పు? ఆనాటి ప్రభుత్వం సిసిటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహించిందని,కనీసం ఈ ప్రభుత్వం అయినా చేయాలని సలహా ఇచ్చి ఉంటే మంచిపనే అవుతుంది. అలా చేయకుండా ప్రస్తుత ప్రభుత్వంపై బురద చల్లాలన్న తపన ఆ కథనంలో కనిపిస్తుంది. ► ఈ ఒక్క అంశంలోనే కాదు. ఏపీలో ఎక్కడైనా రేప్ లేదా ఇతర నేరం జరిగితే, దానిని రాష్ట్రం అంతటికి వర్తింపచేస్తూ కధలు అల్లుతున్నారు. పోలీసులు అలాంటి ఘటనలు జరిగిన వెంటనే స్పందించి సంబందిత నిందితులను అరెస్టు చేయకపోతే ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు. పోలీసులు తగు చర్యలు తీసుకున్నా, తెలుగుదేశం పార్టీకాని, వారి మీడియా కానీ ‘రేప్.. రేప్’ అంటూ గగ్గోలు పెడుతున్నాయి. దానికి కారణం ఒకటే ఏదో రకంగా ఈ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలన్న తాపత్రయమే. మంగళగిరి వద్ద జరిగిన ఒక ఘటనలో టీడీపీ నేతల హస్తం ఉందని బయటపడడంతో వీరంతా ఒక్కసారిగా గప్ చుప్ అయ్యారు. ఇప్పుడు వాట్సప్ లో ప్రశ్నా పత్రాల లీక్ విషయంలో కూడా ఎక్కువ చోట్ల టీడీపీకి సంబంధించినవారి హస్తం ఉందని బయటపడింది. నారాయణ విద్యాసంస్థలు.. మాజీ మంత్రి నారాయణకు సంబందించినవి. గతంలో ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటే, ఆయన వియ్యంకుడు గంటా శ్రీనివాసరావు విద్యాశాఖ మంత్రిగా ఉండేవారు. అప్పుడు ఇలాంటి లీకేజీ ఘటనలు జరిగినా ప్రభుత్వం చూసి, చూడనట్లు పోయిందని, ఇప్పుడు కఠినంగా వ్యవహరిస్తుంటే.. లేనిపోని విమర్శలు చేస్తూ అసలు విషయాన్ని తప్పుదారి పట్టిస్తోందని వైఎస్సార్సీపీ వ్యాఖ్యానిస్తోంది. ► శ్రీకాకుళం జిల్లాలో ఏడుగురు టీడీపీ కార్యకర్తలు ఇలా ప్రశ్నాపత్రాల లీకేజీ కేసుల్లో అరెస్టు అయ్యారు. ఒకవేళ ఇలా అరెస్టు అయినవారు వైఎస్సార్సీపీ వాళ్లు అయి ఉంటే?.. ఈనాడు, తదితర టీడీపీ పత్రికలు ఇల్లెక్కి చిందులు వేసేవి. వైఎస్సార్సీపీ వాళ్లే.. రాష్ట్రం అంతటా పేపర్లు లీక్ చేస్తున్నారని ప్రచారం చేసేవారు. ఇక్కడ మరో విషయం చెప్పాలి. టీచర్ల సంఘాలు కూడా ప్రభుత్వం ఏదో సమస్య పరిష్కరించలేదని నిరసనలకు దిగుతున్నాయి. కానీ, విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయని ఆందోళన చెందకపోవడం దురదృష్టకరం. ఈ మధ్యకాలంలో బడులు మానేసి కొందరు గుండు కొట్టించుకుని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. అలాంటివారు ఈ రకంగా టీచర్లు అరెస్టు అయ్యే పరిస్థితి రావడం మంచిదేనా? కాదా? అన్నదానిపై ఎందుకు స్పందించడం లేదు?. వారు కూడా రాజకీయాలకు బాగా అలవాటు పడిపోయినందువల్లే ఇలా చేస్తున్నారా?. టీచర్లు అందరు అక్రమాలకు పాల్పడతారని కాదు. ప్రభుత్వం చేపట్టిన వివిధ సంస్కరణలకు మురిసిపోయి పలువురు టీచర్లు చాలా బాగా పని చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా బెండపూడి ప్రభుత్వ స్కూల్ విద్యార్ధులు ఆంగ్లంలో మాట్లాడే తీరు చూస్తే ముచ్చటవేస్తుంది. ఇంగ్లీష్ మీడియంపై దుమ్మెత్తిపోసిన చంద్రబాబు, రామోజీ వంటి వారితో సహా పలువురు పెద్దలు ఈ పిల్లలను చూసి ముక్కున వేలువేసుకోవాల్సిందే. ఇలా అన్ని స్కూళ్లు మారితే ఏపీకి ఎంత మంచి పేరు వస్తుంది. ► స్కూళ్ల భవనాలను మాత్రమే కాకుండా, స్కూళ్లలో విద్యాబోధన ప్రమాణాలను కూడా పెంచడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అంతా సహకరించవలసి ఉంది. అదే సమయంలో ప్రభుత్వపరంగా ఏవైనా లోపాలు జరుగుతుంటేవాటిని చెప్పవలసిన బాధ్యత అందరిపైనా ఉంటుంది. అలాకాకుండా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకు రావాలన్న యావతో పిచ్చి,పిచ్చి కథనాలు రాస్తే.. ప్రజలు వాటిని గమనించలేనంత అమాయకులా? రామోజీ ఇంకా పాతచింతకాయ పచ్చడి భావాలతోనే ఉంటున్నారు తప్ప, సమాజం మారుతోంది.. వారికి మరింత మేలు చేద్దామని వార్తలు ఇవ్వడం లేదు. దానివల్ల ప్రజల దృష్టిలో ఆయనే పలచన అవుతున్నారు..ఆ విషయాన్ని ఆయనే గమనించలేకపోతున్నారా? లేక గమనించినా రాజకీయం కోసం విలువలను వదలివేస్తున్నారా? - కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు -
దేశ భద్రతను ప్రమాదంలోకి నెట్టారు
న్యూఢిల్లీ: వివాదాస్పద రఫేల్ ఒప్పంద పత్రాలు చోరీకి గురయ్యాయని వార్తలు వచ్చిన నేపథ్యంలో కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలుచేసింది. లీకైన రహస్య సమాచారం ఆధారంగానే పిటిషన్‌దారులు కోర్టును ఆశ్రయించారని తెలిపింది. ఫ్రాన్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందం అంతా సక్రమంగానే ఉందని గతంలో అత్యున్నత న్యాయస్థానం తీర్పునివ్వగా, దానిని సమీక్షించాలని కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ రివ్యూ పిటిషన్లు వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం రక్షణశాఖ అఫిడవిట్ దాఖలుచేసింది. రఫేల్ పత్రాలు బహిర్గతం కావడం దేశ భద్రతను ప్రమాదంలోకి నెట్టిందని రక్షణ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పేపర్లను నకళ్లు తీసినవారు దొంగతనానికి పాల్పడ్డారని ఆరోపించింది. బలగాల పోరాట సామర్థ్యానికి సంబంధించిన ఈ సమాచారం విస్తృతంగా వ్యాపించి శత్రువుకు కూడా అందుబాటులోకి వచ్చిందని రక్షణ శాఖ ఆక్షేపించింది. ఈ వ్యవహారంలో అంతర్గత విచారణ ప్రారంభమైందని, లీకేజీ ఎక్కడ జరిగిందో కనుక్కోవడంపై ప్రధానంగా దృష్టిపెట్టామని కోర్టుకు తెలిపింది. ఈ అఫిడవిట్ గురువారం సుప్రీంకోర్టు ముందుకు రానుంది. వారంతా ఐపీసీ కింద దోషులే రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి చోరీకి గురైన పత్రాల ఆధారంగానే రివ్యూ పిటిషన్లు వేశారని మార్చి 6నే అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మళ్లీ రెండు రోజుల తరువాత మాటమారుస్తూ..పత్రాలు తస్కరణకు గురి కాలేదని, వాటి నకళ్లనే పిటిషన్‌దారులు ఉపయోగించారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రక్షణ శాఖ వివరణ ఇస్తూ అఫిడవిట్ దాఖలు చేసింది. కేంద్రం రఫేల్ గోప్యతను కాపాడుతున్నా..సిన్హా, శౌరి, భూషణ్‌లు సున్నిత సమాచారాన్ని బహిర్గతం చేసి ఒప్పంద నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని అందులో పేర్కొంది. ఈ కుట్రలో పాలుపంచుకుని అనధికారికంగా ఆ పత్రాలను నకళ్లు తీసిన వారు ఐపీసీ చట్టం ప్రకారం దోషులేనని తెలిపింది. ఈ వ్యవహారంలో లీకేజీ ఎక్కడ జరిగిందో తెలుసుకుని భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వ కీలక నిర్ణయాల గోప్యతను కాపాడతామని చెప్పింది. అనధికారికంగా, అక్రమంగా సేకరించి సమర్పించిన పత్రాలను కోర్టు రికార్డుల నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేసింది. రక్షణ శాఖ, కేంద్ర ప్రభుత్వ అనుమతి లేనిదే ఆ సమాచారాన్ని సమాచార హక్కు చట్టం కింద బహిర్గతం చేయరాదని గుర్తు చేసింది. -
సీబీఎస్ఈ పేపర్ లీక్.. రీ–ఎగ్జామ్
న్యూఢిల్లీ: ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని వార్తలు వచ్చిన నేపథ్యంలో రెండు పరీక్షలను మళ్లీ నిర్వహించాలని (రీ–ఎగ్జామ్) సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) బుధవారం నిర్ణయించింది. పదవ తరగతి విద్యార్థులకు గణిత శాస్త్రం, పన్నెండవ తరగతి విద్యార్థులకు ఎకనామిక్స్ పరీక్షలను మళ్లీ నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ పరీక్షల తేదీల వివరాలను వారం రోజుల్లో తమ వెబ్సైట్లో ఉంచుతామని సీబీఎస్ఈ ఓ సర్క్యులర్‌లో పేర్కొంది. ఈ లీకేజీ వ్యవహారంపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ‘కొన్ని పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగినట్లు వచ్చిన వార్తలను మేం పరిగణనలోకి తీసుకుంటున్నాం. విద్యార్థుల్లో నెలకొన్న ఆందోళనను దృష్టిలో ఉంచుకుని, పరీక్షల పవిత్రతను కాపాడటం కోసం రెండు సబ్జెక్టులకు మళ్లీ పరీక్షలు నిర్వహిస్తాం’ అని సర్క్యులర్‌లో సీబీఎస్ఈ తెలిపింది. 12వ తరగతికి సోమవారం జరిగిన ఆర్థిక శాస్త్రం పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయ్యిందని సామాజిక మాధ్యమాల్లో కొందరు పోస్టులు చేయడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. అయితే తాము అన్ని పరీక్షా కేంద్రాల నుంచీ సమాచారం తెప్పించుకున్నామనీ, పేపర్ లీక్ కాలేదని సీబీఎస్ఈ అప్పుడే స్పష్టం చేసింది. పరీక్షల ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొందరు దుండగులు పేపర్ లీక్ అయినట్లుగా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు పెట్టి ఉంటారని సీబీఎస్ఈ పేర్కొంది. 12వ తరగతికే చెందిన అకౌంటెన్సీ పరీక్ష ప్రశ్నపత్రం కూడా లీక్ అయినట్లు తమకు ఫిర్యాదులు అందాయని మార్చి 15నే ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. అలాంటిదేమీ లేదని సీబీఎస్ఈ వివరణ ఇచ్చినా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. సోమవారం నుంచి కొత్త పద్ధతి.. ప్రశ్నప్రతాలు లీక్ అవుతున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో సోమవారం నుంచి కొత్త పద్ధతిలో క్వశ్చన్ పేపర్లను పంపిణీ చేస్తామని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. అలాగే లీకేజీ వ్యవహారంపై ప్రభుత్వం అంతర్గతంగా విచారణ జరుపుతోందన్నారు. ‘సీబీఎస్ఈకి దృఢమైన వ్యవస్థ ఉంది. అయినా పేపర్లు లీక్ అవుతుంటే, లేదా వ్యవస్థలో ఏదైనా లోపముంటే.. వాటిని సరిదిద్దేందుకు సోమవారం నుంచి కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టబోతున్నాం’ అని జవదేకర్ చెప్పారు. లీకేజీ వ్యవహారంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఏం మాట్లాడారని అడగ్గా.. ప్రధానికి అన్ని వివరాలనూ తాను అందించాననీ, ఒత్తిడి లేకుండా పరీక్షలు నిర్వహించాలని మోదీ ఎప్పుడూ అంటుంటా రని జవదేకర్ చెప్పారు. పరీక్షల నిర్వహణను మోదీ ముఖ్యమైన అంశంగా పరిగణిస్తారన్నారు. -
లీకేజీ వ్యవహారం: సిబిఎస్ఈలో ప్రకంపనలు
-
‘పది’ లీకేజీ నిందితులను కఠినంగా శిక్షించాలి
నిర్మల్‌టౌన్ : పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ నిందితులను కఠినంగా శిక్షించాలని టీయూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మురళీమనోహర్‌రెడ్డి, నాంపల్లి నాగభూషన్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో చోటు చేసుకుంటున్న పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ ఘటనల్లో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పదో పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకున్నామని జిల్లా విద్యాశాఖాధికారులు పేర్కొంటున్నా కార్యరూపం దాల్చడం లేదని విమర్శించారు. విద్యార్థులు కష్టపడి పరీక్షలు రాస్తుంటే కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజ మన్యాలు ర్యాంకుల కోసం ఇలాంటి చర్యలకు పాల్ప డుతున్నాయని ఆరోపించారు. దీనికి కేవలం ప్రభుత్వ ఉపాధ్యాయులనే నిందితులుగా పేర్కొనకుండా అస లు నిందితులను బయటకు తేవాలన్నారు. ఇలాంటి ఘటనల్లో రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా లోతుగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సహాధ్యక్షుడు లక్ష్మీప్రసాద్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోడిశెట్టి రవికాంత్ తదితరులు పాల్గొన్నారు. -
పేపర్ల లీక్ వ్యవహారంపై దర్యాప్తు
కదిరి టౌన్ : టెన్త్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై దర్యాప్తు చేపడుతున్నామని జిల్లా విద్యాశాఖాధికారి లక్ష్మీనారాయణ తెలిపారు. శనివారం ఆయన కదిరిలోని పదోతరగతి పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. పట్టణంలోని ప్రభుత్వ బాలుర, బాలికలతోపాటు మున్సిపల్ హైస్కూల్, షిరిడిసాయి, బ్లూమూన్ పాఠశాల పరీక్షా కేంద్రాలను ఆయన పరిశీలించారు. కేంద్రాల్లో విద్యార్థులు రాస్తున్న పరీక్షా విధానాన్ని పరిశీలించి చీఫ్ అధికారులు, డిపార్ట్మెంటల్ అధికారులకు సూచనలందించారు. ఈ సందర్భంగా జిల్లాలోని మడకశిర, కూడేరు, కదిరి పరీక్షా కేంద్రాల నుంచి ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని మీడియా ప్రశ్నించారు. దీనికి డీఈఓ సమాధానమిస్తూ పేపర్ లీక్ వ్యవహారంపై దర్యాప్తు చేపడుతున్నామని, అందుకు పోలీస్ శాఖ కూడా బాధ్యులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తోందన్నారు.


