Palnadu Express Train
-
పల్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం
సాక్షి, నల్లగొండ జిల్లా: పల్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం తప్పింది. తిప్పర్తి సమీపంలో గేదెను ఢీకొట్టింది. దీంతో రైలు ఇంజిన్‌లో సమస్య తలెత్తింది. రైల్వే సిబ్బంది మరమ్మతులు చేపట్టారు. నల్లగొండ-మిర్యాలగూడ మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.కాగా, ఇటీవల హన్మకొండ జిల్లాలో సికింద్రాబాద్- హిస్సార్ ఎక్స్ ప్రెస్ రైలుకు కూడా పెను ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. రైలు ఇంజన్ వీల్ విరిగిపోవడంతో ఉప్పల్ రైల్వే స్టేషన్ సమీపంలోని మడిపల్లి గేట్ వద్ద సుమారు నాలుగు గంటల పాటు నిలిపివేశారు. సమాచారం అందుకున్న రైల్వే శాఖ అధికారులు మరమత్తులు చేపట్టిన అనంతరం వేరే ఇంజన్‌తో సహా రైలును ఉప్పల్ రైల్వే స్టేషన్‌కు తరలించారు. -
గుంటూరు పల్నాడు ఎక్స్ ప్రెస్ లో బ్యాగ్ లో పసికందు కలకలం
-
నిలిచిపోయిన పల్నాడు రైలు.. ప్యాసింజర్స్ అవస్థలు
గుంటూరు: సాంకేతిక లోపం తలెత్తడంతో పల్నాడు ఎక్స్ ప్రెస్ రైలు నిలిచిపోయింది. ఈ ఘటన గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల రైల్వే స్టేషన్ వద్ద మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పల్నాడు నిలిచిపోవడంతో ఆ మార్గంలో వెళ్లవలసిన పలు రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. గంటకు పైగా రైలు కదలకపోవడంతో గమ్యస్థానాలకు ఆలస్యం అవుతుందని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఎక్స్ ప్రెస్ రైలు ఆగిపోయిన ప్రాంతానికి చేరుకున్నారు. ఇంజిన్‌లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో రైలు సేవలు తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం మరమ్మతు పనులు నిర్వహిస్తున్నారు.


