పల్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం | Nalgonda District: Palnadu Superfast Express Hits Buffalo | Sakshi
Sakshi News home page

పల్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం

Apr 9 2026 10:16 AM | Updated on Apr 9 2026 10:37 AM

Nalgonda District: Palnadu Superfast Express Hits Buffalo

సాక్షి, నల్లగొండ జిల్లా: పల్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం తప్పింది. తిప్పర్తి సమీపంలో గేదెను ఢీకొట్టింది. దీంతో రైలు ఇంజిన్‌లో సమస్య తలెత్తింది. రైల్వే సిబ్బంది మరమ్మతులు చేపట్టారు. నల్లగొండ-మిర్యాలగూడ మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

కాగా, ఇటీవల హన్మకొండ జిల్లాలో సికింద్రాబాద్- హిస్సార్ ఎక్స్ ప్రెస్ రైలుకు కూడా పెను ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. రైలు ఇంజన్ వీల్ విరిగిపోవడంతో ఉప్పల్ రైల్వే స్టేషన్ సమీపంలోని మడిపల్లి గేట్ వద్ద సుమారు నాలుగు గంటల పాటు నిలిపివేశారు. సమాచారం అందుకున్న రైల్వే శాఖ అధికారులు మరమత్తులు చేపట్టిన అనంతరం వేరే ఇంజన్‌తో సహా రైలును ఉప్పల్ రైల్వే స్టేషన్‌కు తరలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement