రైతులకు సంఘం అవసరం | - | Sakshi
Sakshi News home page

రైతులకు సంఘం అవసరం

Apr 9 2026 8:17 AM | Updated on Apr 9 2026 8:17 AM

న్యూస్‌రీల్‌

అన్ని చెరువుల్లోనూ నీరు

బత్తాయి రైతుల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి ఓ సంఘం అవసరమని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు.

గురువారం శ్రీ 9 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

- 8లో

సాక్షి ప్రతినిఽధి, నల్లగొండ : వేసవిలో ఎండలు మండుతుండడంతో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. జిల్లాలో ఫిబ్రవరి నెలలో భూగర్భ జలాలు 5.96 మీటర్ల పైన ఉండగా.. మార్చి నెలాఖరులో 6.69 మీటర్ల లోతుకు పోయాయి. అంటే 0.73 మీటర్లకు భూగర్భ జలాలు తగ్గాయి. 8 మండలాల్లో తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. వచ్చే రెండు నెలల్లో జిల్లా అంతటా భూగర్భ జలాలు మరింత లోతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. కానీ, గతేడాది మార్చి నెలాఖరుతో పోల్చితే ఈ ఏడాది మార్చి నెలాఖరుకు భూగర్భ జలాలు కాస్త మెరుగ్గానే ఉన్నాయి.

గతేడాది కంటే ఇప్పుడు 1.44 మీటర్లు పైకే..

గత సంవత్సరం మార్చిలో జిల్లాలో సగటున 8.13 మీటర్లలోతులో ఉన్న భూగర్భ జలాలు ఉండగా.. ఈ ఏడాది మార్చిలో 6.69 మీటర్లపైనే ఉన్నాయి. అంటే 1.44 మీటర్ల పైకే భూగర్భ జలం ఉంది. జిల్లాలో ఈసారి అత్యధిక వర్షపాతం నమోదైంది. సగటును మించి వర్షాలు కురిశాయి. గత సంవత్సరం మే నెలలోనే వర్షాలు ప్రారంభమై 2025 డిసెంబర్‌ వరకు కురిశాయి. దీంతో జిల్లాలోని చెరువులు, కుంటల్లో నీరు చేరింది. దానికి తోడు ఎగువన కురిసిన వర్షాలతో శ్రీశైలం, సాగర్‌ కూడా నిండటంతో కృష్ణా జలాలతో చెరువులు నింపారు. దీంతో భూగర్భ జలాలు గతేడాది కంటే ఎక్కువగా ఉన్నాయి.

గతేడాదితో పోల్చితే

ఐదు మండలాల్లో తగ్గుదల

● అడవిదేవులపల్లి మండలంలో గతేడాది మార్చిలో 3.40 మీటర్లపైన ఉన్న భూగర్భ జలాలు ఈ మార్చి నెలాఖరుకు 4.84 మీటర్లకు పడిపోయాయి.

● కొండమల్లేపల్లిలో గతేడాది 5.06 మీటర్ల వద్ద భూగర్భ జలాలు ఉండగా, ప్రస్తుతం అవి 7.75 మీటర్ల లోతుకు పడిపోయాయి.

● మిర్యాలగూడ మండలంలో గతేడాది 0.47 మీటర్లపైన భూగర్భ జలాలు ఉండగా, ప్రస్తుతం అవి 3.22 మీటర్ల లోతులో ఉన్నాయి.

● నకిరేకల్‌లో గత సంవత్సరం 7.0 మీటర్ల లోతులో నీరు ఉండగా, ఇప్పుడది 8.05 మీటర్లకు పడిపోయింది.

● వేములపల్లి మండలంలో గత సంవత్సరం 3.86 మీటర్ల పైన ఉన్న భూగర్భ జలాలు, ఇప్పుడు 4.44 మీటర్ల లోతుకు తగ్గిపోయాయి.

జిల్లాలో మొత్తం 1,417 చెరువులు ఉన్నాయి. ఇందులో 821 చెరువుల్లో 25 శాతం నీటి నిల్వలు ఉన్నాయి. మరో 290 చెరువుల్లో 25 నుంచి 50 శాతం నిల్వ ఉంది. 271 చెరువుల్లో 50 నుంచి 75 శాతం నీటి నిల్వలు ఉన్నాయి. మరో 35 చెరువుల్లో ఇంకా 75 నుంచి 100 శాతం నీటితో నిండుకుండలా ఉన్నాయి. దీనివల్ల ఈసారి మార్చి నెలాఖరు నాటికి భూగర్భ జలాలు పెద్దగా తగ్గలేదు.

ఫ ఫిబ్రవరి పోల్చితే.. మార్చి నెలాఖరుకు పడిపోయిన జలాలు

ఫ ఎనిమిది మండలాల్లో ప్రమాద ఘంటికలు

ఫ వచ్చే రెండు నెలల్లో జిల్లా అంతటా తగ్గే అవకాశం

ఫ గతేడాది మార్చితో పోల్చితే మాత్రం కాస్త మెరుగే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement