● నల్లగొండలో అధిక శబ్దం కలిగించే సైలెన్సర్లు ధ్వంసం
నల్లగొండ : ట్రాఫిక్ నిబంధనల అమలు, శబ్ద, వాయు కాలుష్యం నియంత్రణలో భాగంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో బుధవారం స్పెషల్ డ్రైవ్ చేపట్టి అధిక శబ్దం కలిగించే 72 ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను రోడ్డు రోలర్‌తో ధ్వంసం చేయించారు. ఈ సందర్భంగా నల్లగొండ ఏఎస్పీ రమేష్, డీఎస్పీ శివరాంరెడ్డి మాట్లాడుతూ వాహనాలకు అధిక శబ్దం కలిగించే సైలెన్సర్లు అమర్చి ప్రజలకు ఇబ్బంది కలిగించే వాహనదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రజలు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. కంపెనీ ద్వారా అందించిన ఒరిజినల్ సైలెన్సర్లను మాత్రమే వినియోగించాలని సూచించారు. కార్యక్రమంలో సీఐలు రాఘవరావు, మహాలక్ష్మయ్య, రాజశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐలు సైదులు, సైదాబాబు తదితరులు పాల్గొన్నారు.


