Nose bite
-
ఇదేం ప్రేమరా బాబు.. భార్య అందాన్ని తట్టుకోలేక భర్త పిచ్చి పని..
ఎవరైనా భర్త.. తన భార్య అందంగా ఉండాలని అనుకుంటాడు. అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాడు. కానీ, ఇక్కడో భర్త.. తన భార్య అందంగా ఉందన్న కారణంగా ఆమె ముక్కును కొరుక్కుని తిన్నాడు. ఈ వింత దారుణ ఘటన పశ్చిమ బెంగాల్ చోటుచేసుకుంది. అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ ఘటనతో ఆ భార్య భయపడిపోయింది. బాధతో గట్టిగా కేకలు వేసింది.వివరాల ప్రకారం.. నదియా జిల్లాలోని శాంతీపుర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బేర్పారా ప్రాంతంలో బాపన్ షేక్, మధు ఖాతూన్ అనే దంపతులు నివసిస్తున్నారు. తొమ్మిదేళ్ల క్రితం వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ఎనిమిదేళ్ల కూతురు కూడా ఉంది. ఈ నెల 2వ తేదీ తెల్లవారుజామున అర్ధరాత్రి మూడు గంటలకు బాపన్ షేక్ ఇంట్లో ఒక్కసారిగా అలజడి రేగింది. తన భార్య మధు ఖాతూన్ ముక్కును భర్త కొరికి నమిలేశాడు. దీంతో బాధను తట్టుకోలేక మధు ఖాతూన్ గట్టిగా కేకలు వేసింది. బయటకు పరుగులు తీసింది. అయితే ఆమె వెంటబడిన భర్త.. వేలును కూడా కొరికే ప్రయ్నతం చేశాడు. ఈ క్రమంలో ముక్కూ, వేలికి తీవ్రగాయాలయ్యాయి.అనంతరం, భర్త నిర్వాకంపై మధు ఖాతూన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తల్లి రేష్మా బేగంతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన మధు ఖాతూన్ భర్త మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు అవకాశం దొరికితే ముక్కును కొరికి తినేస్తానని నా భర్త అనేవాడు. చివరకు అన్నంత పనీ చేశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. మరోవైపు తాను అందంగా ఉండటంతో ముఖంపై యాసిడ్ పోస్తానని తాగిన మత్తులో తన భర్త బెదిరించేవాడని పోలీసులకు బాధితురాలు తెలిపింది. దీంతో, అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం బాపన్ షేక్‌ను అరెస్టు చేసి కోర్టులో పరిచారు. ఇక, ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. -
బాలుడి ముక్కు కొరికేసిన పొలిటికల్ లీడర్.. అంత కోపం దేనికో?
లక్నో: నలుగురికి మంచి చెడులు చెప్పాల్సిన నాయకులే ఒక్కోసారి వారు చేసే పనులతో నవ్వులపాలవుతుంటారు. ఓ రాజకీయ నాయకుడు కోపంతో తమ ఇంట్లో పని చేసే 16 ఏళ్ల బాలుడి ముక్కును కొరికేశాడు. తీవ్ర రక్త స్రావంతో ఆ బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని లలిత్‌పుర్‌లో సోమవారం వెలుగులోకి వచ్చింది. అభయ్ నామ్‌దేవ్ అనే బాలుడు.. సచిన్ సాహూ అనే రాజకీయ నాయకుడి ఇంట్లో సహాయకుడిగా పని చేస్తున్నాడు. శనివారం సాయంత్రం బాలుడు చిన్న తప్పు చేశాడని కోపంతో రగిలిపోయిన సాహూ అతడి ముక్కు కొరికేశాడు. తీవ్ర రక్తస్రావమైన బాలుడిని శనివారం రాత్రి స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం ఝాన్సీ వైద్య కళాశాల ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాధితుడి కుటుంబ సభ్యులు ఎలాంటి ఫిర్యాదు చేయకపోవటం వల్ల చర్యలు తీసుకోలేదని పోలీసు వర్గాలు తెలిపాయి. ఇదీ చదవండి: ఎస్పీ నేత కారును ఢీకొట్టి.. 500 మీటర్లు ఈడ్చుకెళ్లిన ట్రక్కు డ్రైవర్.. వీడియో వైరల్ -
అత్త ముక్కు కొరికిన కోడలు
సాక్షి, మానవపాడు (అలంపూర్): గతంలో కోడలిని అత్త కొట్టిన సంఘటనలు చూశాం.. ఇప్పుడు అత్త ముక్కును కోడలు కొరి కింది. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మంగలి వీధిలోని శారదమ్మ, జయ్యన్న దంపతు లకు ప్రసాద్, భాస్కర్, శేఖర్ సంతానం. పెద్ద కొడుకు ప్రసాద్ కర్నూలులోని అత్తగారి ఇంట్లో నివాసం ఉంటున్నాడు. అన్నదమ్ముల మధ్య తరచూ కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సోమ వారం ఉదయం మరోసారి గొడవ పడ్డారు. దీంతో చిన్న కుమారుడు శేఖర్ భార్య రేవతి ఆగ్రహంతో అత్త శారదమ్మ ముక్కు కొరికింది. తీవ్రరక్తస్రావం కావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించగా, వైద్యులు.. ముక్కుకు ఏడు కుట్లు వేశారు. చదవండి: (ప్రేమించిన వ్యక్తిని మరిచిపోలేకపోతున్నా..) -
భార్య చెవి, ముక్కు కోసిన భర్త
యాదాద్రి భువనగిరి, పెద్దఅడిశర్లపల్లి (దేవరకొండ) : మద్యం మత్తులో భార్య చెవి, ముక్కు కోసిన ఘటన గురువారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దఅడిశర్లపల్లి మండల కేంద్రానికి చెందిన నారాయణదాసు సుధాకర్, రాధ దంపతులు నాలుగు రోజుల క్రితం కూతురుకు నూతన వస్త్రాలంకరణ కార్యక్రమాన్ని చేశారు. ఇందుకు గాను చేసిన ఖర్చులను భార్య రాధను తల్లిగారింటి వద్ద నుంచి తీసుకురమ్మని సుధాకర్ వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలో మద్యం సేవించి రాధతో గొడవ పడి ఇంట్లోని చేపలను కోసే కత్తితో ఆమెపై దాడిచేసి చెవి, ముక్కు కోసి తీవ్రంగా గాయపరిచాడు. దాంతో ఆమె బంధువులు హైదరాబాద్‌కు తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఈ విషయమై రాధ సోదరుడు సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ గోపాల్‌రావు తెలిపారు. -
భార్య ముక్కు కొరికిన భర్త
లక్నో: అనుమానం విచక్షణను చంపేస్తుంది. ఆవేశం అనర్థాలకు దారి తీస్తుంది. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లా, పల్హోరా గ్రామంలో సరిగ్గా ఇలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది. భార్య తనకు చెప్పకుండా ఊరు వెళ్లిందన్న అసహనంతో భార్యమీద అనుమానం పెంచుకున్నాడు. ఊరునుంచి తిరిగి వచ్చిన భార్యపై ఆగ్రహంతో ఊగిపోతూ వాదనకు దిగాడు. ఏకంగా ఆమె ముక్కి కొరికి తీవ్రంగా గాయపర్చాడు. వివరాల్లోకి వెళితే..అర్జున్, గీతా దంపతులు. గీత (32) ఐదు రోజుల క్రితం తన భర్త అర్జున్‌కు చెప్పకుండా బరేలీకి వెళ్లింది తన అనుమతి లేకుండా ఎక్కడికి వెళ్లావంటూ గీతను అర్జున్ నిలదీశాడు. అయితే ఆమె సమాధానమివ్వకపోవడంతో వాగ్వాదానికి దిగాడు. ఆవేశంతో రగిలిపోతూ గీతపై దాడి చేసి ముక్కును కొరికాడు. ఈ సమాచారం అందుకున్నపోలీసులు కేసు నమోదు చేసి, గీతను జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడు అర్జున్ను అరెస్ట్ చేసి, విచారణ కొనసాగిస్తున్నామని పోలీసు ఉన్నతాధికారి దినేశ్ త్రిపాఠి వెల్లడించారు. -
ముక్కు కొరికి మింగేశాడు!
బీజింగ్: ఫోన్ ఎత్తలేదన్న కోపంతో భార్య ముక్కు కొరికి తినేశాడో భర్త. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన చైనాలో డెజ్ హొయు నగరంలో చోటు చేసుకుంది. ఈనెల 6న ఆఫీసు నుంచి సమయానికి రాకపోవడంతో తన భార్యకు భర్త ఫోన్ చేశాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె స్పందించలేదు. దీంతో కోపోద్రిక్తుడైన భర్త నేరుగా భార్య పనిచేస్తున్న కార్యాలయానికి వెళ్లి ఆమెతో గొడవ పడ్డాడు. ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో ఆమె ముక్కు కొరికేసి మింగేశాడు. అక్కడితో ఆగకుండా తన తలను గోడకేసి కొట్టాడని బాధితురాలు యాంగ్ స్థానిక మీడియాతో చెప్పింది. అయితే అతడి నుంచి విడిపోయినా ఫోన్ చేసి వేధిస్తున్నాడని ఆమె వాపోయింది. బాధితురాలు ముక్కుకి తీవ్రగాయమైందని, శస్త్రచికిత్స చేయాల్సివుంటుందని వైద్యులు తెలిపారు. ముక్కు పూర్వరూపం సంతరించుకోవడానికి కనీసం 3 నెలలు పడుతుందని వెల్లడించారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.