
సాక్షి, మానవపాడు (అలంపూర్): గతంలో కోడలిని అత్త కొట్టిన సంఘటనలు చూశాం.. ఇప్పుడు అత్త ముక్కును కోడలు కొరి కింది. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మంగలి వీధిలోని శారదమ్మ, జయ్యన్న దంపతు లకు ప్రసాద్, భాస్కర్, శేఖర్ సంతానం. పెద్ద కొడుకు ప్రసాద్ కర్నూలులోని అత్తగారి ఇంట్లో నివాసం ఉంటున్నాడు. అన్నదమ్ముల మధ్య తరచూ కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సోమ వారం ఉదయం మరోసారి గొడవ పడ్డారు. దీంతో చిన్న కుమారుడు శేఖర్ భార్య రేవతి ఆగ్రహంతో అత్త శారదమ్మ ముక్కు కొరికింది. తీవ్రరక్తస్రావం కావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించగా, వైద్యులు.. ముక్కుకు ఏడు కుట్లు వేశారు. చదవండి: (ప్రేమించిన వ్యక్తిని మరిచిపోలేకపోతున్నా..)