N Rangasamy
-
75 ఏళ్ల వయసులో ప్రభంజనం, ఎవరీ రంగస్వామి
మచ్చలేని తెల్లటి ధోవతి, పొడవాటి చొక్కా ఇదే ఆయన ఆహార్యం. 75 ఏళ్ల వయసు, 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం. ఐదోసారి సీఎం పగ్గాలు చేపట్టేందుకు ఉత్సాహంగా ఉన్నారు. ఆయన పేరే పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి. ఆయన రాజకీయ ప్రస్థానం, విజయాలపై కొన్ని అంశాలను పరిశీలిద్దాం. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగింది. ముఖ్యంగా ఏఐఎన్ఆర్సి వ్యవస్థాపకుడు, ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి ప్రజల మద్దతు తమకే, అధికారం తమదే అన్నంత ప్రశాంతంగా పోలింగ్‌లో దూసుకుపోయారు. ఇంటింటికీ వెళ్తూ, తన విజయాలపై కరపత్రాలను స్వయంగా పంచుతూ చిరునవ్వుతో విజయంపై అడుగులు వేశారు.ఎవరీ రంగస్వామినాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన, అవివాహితుడు . న్యాయశాస్త్ర పట్టభద్రుడు. ఆయన తట్టంచవాడి, మంగళం అనే రెండు నియోజకవర్గాల నుంచి ఐదోసారి ముఖ్యమంత్రి పదవికి పోటికి నిలిచారు. 2011లో అఖిల భారత ఎన్. ఆర్. కాంగ్రెస్ (ఏఐఎన్ఆర్సి) అనే తన సొంత పార్టీని స్థాపించి సంచలనంరేపారు. అప్పటిదాకా కాంగ్రెస్ పార్టీలో ఎదురులేని నాయకుడిగా ప్రజల మానాల్ని దక్కించుకున్నారు.అందుకే ఆయన "వాళుం కామరాజర్" (తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు, జీవించి ఉన్న కామరాజు),"మక్కలిన్ ముత్తల్వార్" (ప్రజల ముఖ్యమంత్రి) అని కీర్తిస్తారు. అది గృహ కార్యక్రమం అయినా, వివాహం అయినా, ప్రజల ఆహ్వానాలకు ఆయన ఎల్లప్పుడూ స్పందిస్తారని, ప్రజా అభ్యర్థనలను కాదనరని జనం గర్వంగా చెప్పుకుంటారు."తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయేది మేమే. చింతించకండి. మీ సమస్యలను పరిష్కరిస్తాం." ప్రజలతో మాట్లాడేటప్పుడు గానీ, ఓట్లు అభ్యర్థించేటప్పుడు గానీ, రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కొనేటప్పుడు గానీ, ఆయన ప్రశాంతంగా, మృదువైన, ఆదరణపూర్వకమైన స్వరంతో ఆయన ఇచ్చిన హామీ ఓట్లగా మారిపోయింది.గురువు అప్పా పైత్యం స్వామిప్రజాదరణ పొందిన నాయకుడైన ఆయన సుమారు నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు మరియు చాలా మంది ఆయనను ఒక ఆధ్యాత్మిక అన్వేషిగా, సౌమ్యమైన క్రమశిక్షణావాదిగా భావిస్తారు. పూజ్య గురువు అయిన అప్పా పైత్యం స్వామిగారికి పరమ భక్తుడైన రంగస్వామి ఎల్లప్పుడూ తన నుదుటిపై పవిత్ర భస్మాన్ని ధరిస్తారు. ఆ ఆధ్యాత్మిక గురువు ఫోటో ఆయన ప్రచార వాహనాన్ని అలంకరించడమే కాకుండా, ఆయన ప్రచార సామగ్రిలో కూడా ప్రముఖ స్థానాన్ని ఆక్రమిస్తుంది.ఈ ఆలయంలో 'మౌన వ్రతం' పాటిస్తాడు, ఎప్పుడు అన్నదానం చేస్తారని స్థానికులు చెబుతుంటారు.ప్రజల నాడి ఆయనకు, ఆయన గురించి ప్రజలకు బాగా తెలుసుఅంతేకాదు ఆయన ఎపుడు ఎక్కడ ఉంటాడో ప్రజలకు బాగా తెలుసు. మధ్యాహ్నం సమయంలో ముఖ్యమంత్రిని కలవాలనుకుంటే, బజారులోని నెహ్రూ వీధికి వెళ్లాలి. అక్క ఆయన తన స్నేహితుడి ఇంట్లో ఉంటాని రంగస్వామి నివసించే వీధిలోనే ఉండే ఒక యువకుడు చెప్పిన మాటే ఇందుకు నిదర్శనం. ప్రభావవంతమైన వన్నియర్ సామాజిక వర్గానికి చెందిన ఆయన, 2001లో తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. 2006 నుండి 2008 వరకు రెండోసారి పదవిలో ఉన్నారు. 2011లో మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగా, 2021లో నాలుగోసారి పదవి చేపట్టారు. 1991, 1996, 2001, 2006 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా తిరుగులేని విజయాన్ని నమోదు చేశారు. ఇక తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 1991లోనే మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇదీ చదవండి: పీకే అంచనాలు బ్రేక్ : విజయ్ విజయ దుందుభి! -
Puducherry: గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. గ్యాస్ సిలిండర్‌పై భారీగా సబ్సిడీ!
ఇప్పటికే పెరుగుతున్న నిత్యావసరాల ధరలు ఓ వైపు, ఇంధన ధరలు పైపైకి ఎగబాకుతూ మరో వైపు సామాన్యుడి నెల వారి బడ్జెట్‌పై మరింత భారాన్ని మోపుతున్నాయి. ఇదిలా ఉండగా గ్యాస్ ధరల పెంపు మధ్య తరగతి ప్రజలకు ఊహించని షాక్ ఇచ్చిందనే చెప్పాలి. దీంతో పలు రాష్ట్రాలలో పెరిగిన గ్యాస్ ధరలు నుంచి ఉపశమనం కలిగించే దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా జాగ్రత్తలు పడుతున్నాయి. ఈ క్రమంలో పుదుచ్చేరి ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ పుదుచ్చేరి ప్రభుత్వం తమ రాష్ట్రంలోని బీపీఎల్ వర్గాల ప్రజలకు నెలవారీ రూ.300 ఎల్పీజీ సబ్సిడీని ప్రకటిస్తున్నట్లు తెలిపింది. 2023-24 సంవత్సరానికి సమర్పించిన బడ్జెట్లో ముఖ్యమంత్రి ఎన్ రంగసామి ఈ మేరకు ప్రకటించారు. గ్యాస్ సిలింబర్ సబ్సిడీపై ఆయన మాట్లాడుతూ... అన్ని కుటుంబాలకు నెలకు ఒక సిలిండర్‌కు రూ.300 సబ్సిడీని అందించే పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం రూ.126 కోట్లు కేటాయించిందని తెలిపారు. 11,600 కోట్ల పన్ను రహిత బడ్జెట్‌ను ఆయన సమర్పించారు. ఎల్పీజీ సబ్సిడీ కార్యక్రమం రేషన్ కార్డులను కలిగి ఉన్న అన్ని కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపారు. కాగా ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరగడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. జనవరి 1న సిలిండర్ ధరలను పెంచగా.. ఇటీవల మార్చిలోనూ మరో సారి ధరలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. స్థానిక పన్నుల కారణంగా.. ఎల్పీజీ సిలిండర్ ధరలు వివిధ రాష్ట్రాల్లో వేరువేరుగా ఉంటాయి. ప్రతి నెల 1వ తేదీన ఎల్పీజీ సిలిండర్ ధరలను సవరిస్తుంటారు. దేశంలోని ప్రతి ఇంటికి ఏడాది చొప్పున 12 సిలిండర్లు (14.2కేజీల) సబ్సిడీ రేట్లతో అందుతాయి. వీటికి అదనంగా తీసుకోవాలంటే.. మార్కెట్లో ఉన్న ధరకు తగ్గట్టు కొనాల్సిందే. -
చెదిరిన రంగసామి కల
పుదుచ్చేరి సీఎం ఎన్.రంగసామి కల చెదిరింది. రాష్ట్రంలో అత్యధిక కాలం సీఎంగా కొనసాగిన ఆయనకు ఆశాభంగం ఎదురైంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా దాదాపు పదిహేనేళ్లుగా కొనసాగుతూ రికార్డు సృష్టించిన రంగసామికి పుదుచ్చేరి ఓటర్లు షాక్ ఇచ్చారు. తాజాగా వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆయన నేతృత్వంలోని ఆల్ ఇండియా ఎన్ ఆర్ కాంగ్రెస్ (ఏఐఎన్ఆర్సీ) రెండో స్థానానికి పడిపోయింది. కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 30 స్థానాల్లో కాంగ్రెస్ 15, ఏఐఎన్ఆర్సీ 8, అన్నాడీఎంకే 4, డీఎంకే 2 సీట్లు గెల్చుకున్నాయి. ఇండిపెండెంట్ ఒక స్థానంలో గెలిచారు. ఓట్ల లెక్కింపు ప్రారంభంకాగానే కాంగ్రెస్, ఏఐఎన్ఆర్సీ హోరాహోరీగా తలపడినట్టు పరిస్థితి కనిపించింది. చివరికి కాంగ్రెస్-డీఎంకే కూటమి మెజారిటీ స్థానాలు కైవసం చేసుకున్నాయి. అధికార ఏఐఎన్ఆర్సీ 8 సీట్లతో సరిపెట్టుకుంది. ఒంటరిగా పోటీ చేసిన అన్నా డీఎంకే 4 స్థానాలు దక్కించుకుంది. సీపీఎం, సీపీఐ, వీసీకే, ఎండీఎంకే, ఆర్ఎస్పీలతో కూడిన పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ (పీఎఫ్‌డబ్ల్యూ) పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. బీజేపీ ఒక్క సీటు కూడా గెల్చుకోలేకపోయింది. ఇందిరా నగర్ నుంచి పోటీ చేసిన సీఎం రంగసామి 3,404 ఓట్ల మెజారిటీతో గెలిచారు. యానాంలో కాంగ్రెస్ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు ఆరోసారి విజయం సాధించారు. అంతకుముందు 1996 నుంచి ఐదు సార్లు పోటీ చేసి నాలుగు సార్లు గెలిచారు. 1996, 2001 సంవత్సరాల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఆయన అనంతరం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. -
పాండిచ్చేరి సీఎం కాన్వాయ్ ఢికొట్టిన వ్యక్తి అరెస్ట్!
చెన్నై: పాండిచ్చేరి ముఖ్యమంత్రి కాన్వాయ్ లోని కారును ఢీకొట్టిన కారు డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాన్వాయ్ లోని పైలెట్ కారును అతివేగంగా మరో కారు ఢికొట్టింది. ఈ ప్రమాదంలో ముఖ్యమంత్రి రంగస్వామి సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ ముబారక్ ఆలీని అరెస్ట్ చేశారు. మద్యం సేవించి.. మితీమిరిన వేగంగా కారు నడిపారని కారు డ్రైవర్ పై కేసు నమోదు చేశారు. చెన్నైలోని సాంతోమ్ వద్ద ఈ ప్రమాదం గత రాత్రి చోటుచేసుకుంది. గత రాత్రి వివాహ కార్యక్రమంలో పాల్గొనడానికి రంగస్వామి చెన్నైకి వచ్చారు.


