breaking news
Morning walkers
-
హైదరాబాద్: పార్క్‌లో కాల్పుల కలకలం
సాక్షి, హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్‌లో కాల్పుల కలకలం రేగింది. మార్నింగ్ వాకర్స్‌పై దుండగులు కాల్పులు జరిపారు. శాలివాహన నగర్ పార్క్‌లో జరిగిన ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. వాకింగ్ చేస్తున్న సమయంలో చందు నాయక్ అనే వ్యక్తిపై దుండగులు కాల్పులు జరపగా.. ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.చందు నాయక్ నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట వాసిగా పోలీసులు గుర్తించారు. కాల్పులకు భూ వివాదమే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కారులో నలుగురు వ్యక్తులు.. చందు నాయక్‌పై ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. మృతుడిపై కారం చల్లి.. ఆ తర్వాత దాడికి పాల్పడ్డారు. ఘటన స్థలానికి చేరుకున్న కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇసుక రేణువుల్లో ఉన్న బుల్లెట్స్ కోసం పోలీసులు సెర్చింగ్ చేస్తున్నారు. మృతుడు చందును చంపుతున్న క్రమంలో అడ్డొచ్చిన వారిని దుండగులు గన్‌తో బెదిరించారు. చుట్టుపక్కల సీసీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. గన్స్‌లో ఉన్న బుల్లెట్స్‌ను పరిశీలించిన క్లూస్ టీమ్.. నమూనాలను ల్యాబ్‌కి పంపించారు. నిందితుల కార్ నెంబర్ ఆధారంగా పోలీసులు ట్రాక్ చేస్తున్నారు.సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్యకుమార్ కాల్పుల ఘటన వివరాలను మీడియాకు వెల్లడించారు. ‘‘ఉదయం 7:30 గంటలకు ఓ వ్యక్తిపై కాల్పులు జరిగాయని సమాచారం వచ్చింది. చందు నాయక్ అనే వ్యక్తి వాకింగ్ చేస్తుండగా నలుగురు దుండగులు వచ్చి కాల్పులు జరిపారు. షిఫ్ట్ కార్ లో వచ్చి నలుగురు వ్యక్తులు కాల్పులు జరిపారని స్థానికులు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం.నిందితుల కోసం 10 బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నాం. స్పాట్లో 7 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నాం. క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించాం. స్పాట్లో దొరికిన బుల్లెట్లను చూస్తే ఒకే వెపన్తో ఫైరింగ్ చేసినట్టు ఉన్నాయి. 2022లో జరిగిన హత్య కేసులో చందు నాయక్ నిందితుడిగా ఉన్నాడు. కాగా, ఈ కాల్పుల ఘటనలో ఎస్వోటీ పోలీసుల ఎదుట నలుగురు లొంగిపోయారు. ఐదుగురి మధ్య ఆర్థిక లావాదేవీలే చందునాయక్ హత్యకు కారణమని పోలీసులు చెబుతున్నారు. మృతుడు చందునాయక్‌తో పాటు ఈ నలుగురు ఓ హత్య కేసులో నిందితులు. -
HYD: మార్నింగ్ వాకర్స్‌పైకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు మహిళలు మృతి
సాక్షి, హైదరాబాద్: బండ్లగూడ సన్ సిటీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మార్నింగ్ వాకర్స్‌పైకి కారు దూసుకెళ్లడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. వారిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వీరంతా కూడా బండ్లగూడ లక్ష్మీనగర్‌కు చెందిన మహిళలుగా గుర్తించారు. రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. Bandlaguda, Hyderabad : A speeding car rammed into morning walkers killing two women and a child. The incident happened on July 4. #Hyderabad #CCTV pic.twitter.com/NxN8wLC0q6— TIMES NOW (@TimesNow) July 4, 2023 చదవండి: బంజారాహిల్స్.. స్పా ముసుగులో వ్యభిచార ముఠా గుట్టురట్టు.. -
ఖైరతాబాద్‌లో కారు బీభత్సం
సాక్షి, హైదరాబాద్ : నిత్యం రద్దీగా ఉండే ఖైరతాబాద్ సిగ్నల్స్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. ఎర్రమంజిల్ నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ ఎక్కుతుండగా అతివేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్ని బలంగా ఢీకొట్టి అవతలివైపు పడిపోయింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో అటువైపుగా వాహనాలేవీ రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. స్థానికులు, మార్నింగ్ వాక్కు వచ్చిన వారు వెంటనే స్పందించి క్షతగాత్రులను కారు నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఓ మహిళ కూడా ఉన్నారు. ఈ ఘటనతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. -
నెక్లెస్ రోడ్డులో తనిఖీలు... బైకులు సీజ్
హైదరాబాద్: నగరంలోని నెక్లెస్ రోడ్డులో నగర పోలీసులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 60 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ బైక్‌లను పోలీసు స్టేషన్‌కు తరలించారు. నెక్లెస్ రోడ్డులో బైక్ రేసింగ్ చేస్తూ తమకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారని మార్నింగ్ వాకర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అదికాక ఆదివారం సెలవు దినం కావడంతో బైక్ రేసింగ్ చేసేందుకు పెద్ద సంఖ్యలో యువకులు ఈ రోజు తెల్లవారుజామునే నెక్లెస్ రోడ్డు చేరుకున్నారు. గతంలో నగర శివార్లులోని గండిపేటలో యువకులు భారీ ఎత్తున బైకు రేసింగ్‌లు నిర్వహించేవారు. దీంతో స్థానికులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు తమ తనిఖీలను ముమ్మురం చేశారు. దాంతో బైక్ రేసింగ్‌లకు యువకులు నెక్లెస్ రోడ్డును ఎంచుకున్నారు. -
ఇన్సాన్కా పెహచాన్.. జాన్వర్కా నిశాన్
ప్రశాంతంగా ఉండే కేబీఆర్ పార్క్‌లో మార్నింగ్ వాకర్స్ ఉలిక్కిపడ్డారు. ఓ మృగం తుపాకీతో మనిషిపై దాడి చేసి తప్పించుకు పారిపోయింది. యావత్ యంత్రాగం ఆ మృగాన్ని వెతికి పట్టుకునే ప్రయత్నంలో తలమునకలై ఉంది. పంజా విసిరిన ఆ మృగం పట్టుబడేంత వరకూ ఆ మనిషికి అపాయం పొంచి ఉన్నట్టే. సరిగ్గా వారం కిందట ఇదే కేబీఆర్ పార్క్ గేట్ నంబర్ 1 నుంచి ఓ మృగం తప్పించుకుంది. మనిషి ముసుగు తొడుక్కుని జనారణ్యంలో కలసిపోయింది. ఆ రోజు ఇంత హడావుడి జరగలేదు. ఇంత మంది స్పందించలేదు. ఎందుకంటే అది ప్రాణాపాయం కాదు. పైగా ఈ మృగం పబ్లిగ్గా పంజా విసరలేదు. కానీ ఆ మృగం మన మధ్యే తిరుగుతోంది.అనువు దొరికితే ఏ అమాయక ఆడపిల్లనో కబళించేందుకు మాటు వేసింది. ఆ రోజు నేను మార్నింగ్ వాక్కు కేబీఆర్ పార్క్‌కు వెళ్లాను. పార్కింగ్ గేట్ దగ్గర ఓ చారల చొక్కా ఆకారం గేటును ఆనుకుని నిలబడి ఉంది.. ఎవరి కోసమో ఎదురుచూస్తున్నట్టు ! యథాలాపంగా లోపలికి వెళ్లబోతున్న నాకు కనిపించిన ఆ దృశ్యం మనసులో రిజిస్టర్ కావడానికి సమయం పట్టింది. క్యాజువల్ వాకర్లా ఉన్న అతని రెండు చేతులు ప్యాంట్ జేబులో జుగుప్సాకరంగా ఆడుతున్నాయి. ఓ మై గాడ్ ! వచ్చే పోయే స్త్రీలను చూస్తూ అతని ఆలోచనలు వికృత నాట్యం చేస్తున్నాయని అర్థమయ్యే సరికి నాకు బుర్ర తిరిగిపోయింది. మానసిక అత్యాచారం.. సూటిగా అతని కళ్లలోకి చూడగానే తడబ డ్డాడు నేను గేటు దాటి పార్కులోకి నడుస్తున్నానే గానీ మనసంతా రెస్ట్‌లెస్‌గా ఉంది. పార్కులో నడుస్తున్న మహిళలను అతను ఫిజికల్‌గా కాకపోయినా.. మానసికంగా రేప్ చేస్తున్నట్టనిపించింది. అందులో నేను ఒకదాన్ని కదా. ఈ జంతువు బహిరంగంగా ఇలా చేస్తుంటే, వల్నరబుల్గా కనిపించిన స్త్రీలను ఏం చేస్తాడో అన్న ఊహ రాగానే వెనక్కి తిరిగాను. నిస్సిగ్గుగా అతడు అక్కడే నిలబడి ఉన్నాడు. ఫోన్లో కెమెరా ఆన్ చేసి అతని వైపు తిప్పి నడవడం మొదలుపెట్టాను. ఇది గమనించి అతను కార్ల వెనక్కి వెళ్లి దాక్కున్నాడు. నడుస్తున్న మరో ఇద్దరు యువకులను ఆపి విషయం చెప్పి ఎదిరిద్దామని కూడగట్టుకుని బయల్దేరేలోపే ఆ చారల చొక్కా జనారణ్యంలో కలసి పోయింది. ఆ మృగం పారిపోయింది. ఆ యువకులు తిరిగి నడక సాగించారు. మౌనమె మన ఘోష.. ఈ మృగాన్ని నేనొక్కదాన్నే కాదు ఇంకా ఎందరో అక్కడ చూసి ఉంటారు. నడిచే వాళ్లు పార్కింగ్‌లో డ్రైవర్లు, పక్క షాపులో వాళ్లు, పళ్లు అమ్ముకునే వాళ్లు అంత మందీ చూడకుండా ఉండే అవకాశమే లేదు. చూసీ చూడనట్టు ఉండటమే మంచితనమా. ప్రశ్నించే ధైర్యం లేకనా లేదా ఇది ప్రశ్నించాల్సిన అంశమే కాదా..? ఇలాంటి మదోన్మాదులు తయారయ్యేందుకు ప్రధాన కారణం మన నిశ్శబ్దం. ‘నేను మంచి వ్యక్తిని నాతో అందరూ మంచితనంతో వ్యవహరించాలి కానీ నేను చెడును నిలదీయను’ ఇదీ మన సగటు నగర జీవి వైఖరి. భారత దేశం ‘రేప్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్’ అనిపించుకునే దిశగా అడుగులు వేస్తోంది. తప్పించుకున్న ఇలాంటి ఎన్ని మృగాలు మనిషి ముసుగులో మన మధ్య తిరుగుతున్నాయో. సగటున రోజుకు 93 అత్యాచారాలు నమోదవుతున్న మన దేశంలో నమోదు కాని లైంగిక దాడులు ఎన్ని జరుగుతున్నాయి? ఈ ఆర్టికల్ చదివే వ్యవధిలో ఒకరిపై అత్యాచారం జరిగి ఉంటుంది. ఇద్దరు లైంగికంగా వేదనకు గురై ఉంటారు. ప్రశ్నే ఆయుధం.. ‘నిర్భయ’ విప్లవం తర్వాత మధ్యప్రదేశ్‌లో అదే రీతిలో జరిగిన లైంగిక దాడుల గురించి విన్నాం. మదోన్మాదానికి రాలిపోయిన పసి మొగ్గలనీ చూశాం. కానీ అన్నింటికీ ‘నిర్భయ’ తీరులో స్పందన మాత్రం చూడలేదు. లైంగిక హింసపై మనం ఎందుకింత సహనం ప్రదర్శిస్తున్నాం? వెంటనే ప్రతిస్పందిచగలగడం, నిశ్శబ్దాన్ని ఛేదించడం మనకు అలవాటు కావాలి. ఆ రోజు నాతోపాటు ఆ మృగాన్ని చూసిన మరికొంత మంది వెంటనే ప్రశ్నించి ఉంటే అతని ప్రవర్తనకు ఆస్కారం ఉండేది కాదు. జనం అలెర్ట్‌గా ఉన్నారన్న భయం అతనిలో లేకపోవడం వల్లే అంత నిస్సిగ్గుగా ఆ మృగం తిరుగాడింది. ఎవరూ ఏమీ చేయరన్న భరోసా మనం ఇవ్వడం వల్ల ఎక్కడో ఓ ఆడపిల్లను మనం ప్రమాదం అంచున నిలబెట్టినట్టే. ఎక్కడ నేను ఫొటో తీస్తానన్న భయానికి ఈ మృగం పారిపోయింది. కానీ మరో చోట నిశ్శబ్దాన్ని అలుసుగా తీసుకుని లైంగికంగా దాడి చేయదన్న గ్యారంటీ ఏంటి? బీ అవేర్. మన నగరం సురక్షితం అని అనుకోవాలంటే మనం అలెర్ట్‌గా ఉండాలి. మౌనం వీడండి. కేవలం ఇలాంటి ఉన్మాదులనే కాదు, చిన్న చిన్నవిగా అనిపించే ట్రాఫిక్ తప్పులు, వెకిలి వేధింపులు ఏవైనా సరే సహకరించకండి. ప్రశ్నించండి. నా దృష్టిలో ప్రశ్నే ఆయుధం.