నెక్లెస్ రోడ్డులో తనిఖీలు... బైకులు సీజ్ | 60 bikes seized in necklace road | Sakshi
Sakshi News home page

నెక్లెస్ రోడ్డులో తనిఖీలు... బైకులు సీజ్

Dec 14 2014 9:32 AM | Updated on Aug 21 2018 6:22 PM

నగరంలోని నెక్లెస్ రోడ్డులో నగర పోలీసులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 60 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్: నగరంలోని నెక్లెస్ రోడ్డులో నగర పోలీసులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 60 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ బైక్లను పోలీసు స్టేషన్కు తరలించారు. నెక్లెస్ రోడ్డులో బైక్ రేసింగ్ చేస్తూ తమకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారని మార్నింగ్ వాకర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అదికాక ఆదివారం సెలవు దినం కావడంతో బైక్ రేసింగ్ చేసేందుకు పెద్ద సంఖ్యలో యువకులు ఈ రోజు తెల్లవారుజామునే నెక్లెస్ రోడ్డు చేరుకున్నారు.

గతంలో నగర శివార్లులోని గండిపేటలో యువకులు భారీ ఎత్తున బైకు రేసింగ్లు నిర్వహించేవారు. దీంతో స్థానికులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు తమ తనిఖీలను ముమ్మురం చేశారు. దాంతో బైక్ రేసింగ్లకు యువకులు నెక్లెస్ రోడ్డును ఎంచుకున్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement