breaking news
Medchal Assembly Constituency
-
ప్రశ్నార్థకంగా మేడ్చల్ నేతల రాజకీయ భవిష్యత్
మేడ్చల్: ఐదేళ్ల క్రితం వరకు తెలంగాణలో ఉన్న అన్ని రకాల స్ధానిక సంస్థల ప్రజాప్రతినిధుల పాలనతో రాష్ట్రంలో ఏకైక నియోజకవర్గంగా ఉన్న మేడ్చల్ ప్రజాప్రతినిధుల పదవుల సంఖ్య తగ్గిపోవడంతో రాజకీయంగా వెలవెలబోతుంది. మేడ్చల్ నియోజకవర్గంలో గతంలో జిల్లా పరిషత్, మండల పరిషత్ సభ్యులు, గ్రామాలకు సర్పంచ్‌లు, పట్టణాలకు కౌన్సిలర్లు, చైర్మన్లు, మేయర్లు, కార్పొరేటర్లు ఇలా అన్ని రకాల పాలన ఉండేది. ప్రస్తుతం మేడ్చల్ నియోజకవర్గంలో మూడు మున్సిపాలిటీలు మినహాయించి ఏడింటినీ, మూడు కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయడంతో నాడు 900 మంది ప్రజా ప్రతినిధులు ఉన్న సంఖ్య నేడు కేవలం 84కు పడిపోయింది.మేడ్చల్‌లో 60 మంది గ్రామ సర్పంచ్‌లు, 37మంది ఎంపీటీసీ సభ్యులు, 202 మంది కౌన్సిలర్లు, ఐదు మంది ఎంపీపీలు, ఐదుగురు జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్, 7 మంది చైర్మన్లు, ముగ్గురు మేయర్లు, 600 మంది వరకు వార్డు సభ్యులు ఉండేవారు. ప్రస్తుతం మేడ్చల్‌లో ఎల్లంపేట్, మూడు చింతలపల్లి, అలియాబాద్ (Aliabad) మున్సిపాలిటీలు మాత్రమే మిగిలాయి. ఎల్లంపేట్లో 24, మూడు చింతలపల్లిలో 24 వార్డులు, అలియాబాద్‌లో 20 వార్డులు ఉన్నాయి. ఈ లెక్కన 68 మంది కౌన్సిలర్లు ఉండనున్నారు. మొత్తంగా చూస్తే వార్డు సభ్యులు, కో– ఆప్షన్ సభ్యులతో కలిపి చూస్తే 900 వరకు ఉన్న సంఖ్య నేడు 100కు పరిమితమవుతోంది.భారీగా తగ్గిన ప్రాబల్యం.. జీహెచ్ఎంసీలో విలీనం కాకముందు 20 నుంచి 30 వరకు ఒక్కో మున్సిపాలిటీలో ప్రజా ప్రతినిధులు ఉండగా.. విలీనంతో ఒక్కో మున్సిపాలిటీకి ఒక్కొక్కరు లేదా ఇద్దరు మాత్రమే ఉండనున్నారు. మేడ్చల్ మున్సిపాలిటీలో 23 వార్డులు ఉండగా.. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో విలీనంతో రెండు డివిజన్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఇద్దరు నేతలు మాత్రమే ప్రజాప్రతినిధులు అయ్యే అవకాశం ఏర్పడింది.గుండ్లపోచంపల్లిలో 15 వార్డులకు ఒక డివిజన్, నాగారంలో 18కి 1 , దమ్మాయిగూడలో 20కి 2 , ఘట్కేసర్లో 18 మందికి 2, పోచారంలో 18కి ఒక డివిజన్ మాత్రమే వచ్చాయి. తూంకుంటలో 16 స్థానంలో ఒక డివిజన్ వచ్చాయి. జవహర్‌నగర్‌లో 28 మంది కార్పొరేటర్లు ఉండగా.. ప్రస్తుతం ఇద్దరు, బోడుప్పల్లో కార్పొరేటర్లు ఉండగా.. ప్రస్తుతం ఇద్దరు, పీర్జాదిగూడలో 26కు ఇద్దరు కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహించనున్నారు. 299 మంది కౌన్సిలర్లు, కార్పొరేటర్లుండగా.. తాజాగా కేవలం 16 సీట్లు మాత్రమే ఉన్నాయి. నేతల ఆశలు ఆవిరి..సీట్లు ఎన్ని ఉన్నా.. గెలిచేది ఒకరే అయినప్పటికీ పోటీచేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకునే వారు అన్ని పార్టీల్లో ఉంటారు. కనీసం పోటీ చేసేందుకు స్థానాలు కూడా కరువయ్యాయి. ఒక్క పార్టీ నుంచి ఒక్కరు పోటీ చేసినా ఒక్క స్థానం ముగ్గురు పోటీ చేయడం పక్కా.. కొన్ని స్థానాల్లో 5 వరకు ఉంటాయి. ఏ లెక్కన చూసినా మేడ్చల్ రాజకీయ నాయకులకు కనీసం ఎన్నికల్లో పోటీ చేశామనే సంతృప్తి సైతం లేకుండా పోయింది. మూడు ఉంటాయా పోతాయా..?మేడ్చల్ నియోజకవర్గంలోని మెజారిటీ ప్రాంతం హైదరాబాద్ మహానగర పాలక సంస్థలో విలీనం కావడంతో మిగిలిన 3 మున్సిపాలిటీలు ఉంటాయా.. పోతాయా.. అనే చర్చ మొదలైంది. తర్వాత లక్ష్యం ఆ మూడే అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే మిగిలిన మూడింటితో వార్డుల విభజన పూర్తైంది. జీహెచ్ఎంసీ పాలకవర్గం సమయం ముగిసిన వెంటనే మిగిలిన ఎల్లంపేట్, అలియాబాద్, మూడు చింతలపల్లి మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో విలీనమవుతాయని నేతలు చెబుతున్నారు.ఆశలు.. నిరాశేజీహెచ్ఎంసీలో (GHMC) విలీనంతో ఎన్నో ఏళ్ల నుంచి ఎప్పటికైనా ఓ ప్రజా ప్రతినిధి కావాలని సమయం, డబ్బు వృథా చేసుకుని రాజకీయం చేస్తున్న అన్ని పార్టీల నేతల ఆశలు అడియాశలయ్యాయి.చదవండి: ఐబొమ్మ రవి కేసులో కొత్త మలుపులుపాలన భారం..గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లు, మున్సిపాలిటీలు ఉన్న సమయంలో 2 నుంచి 3 వేల మందికి ముగ్గురు ప్రజా ప్రతినిధులు, మండల అధికారి, మున్సిపల్ కమిషనర్ ఉండే వారు. వారిపైన డీపీఓ, సీఈఓ, కలెక్టర్లు మండల అధికారులు ఎంతో పాలన వ్యవస్థ ఉండేది. ప్రస్తుతం మేడ్చల్ నియోజకవర్గంలో 4 సర్కిళ్లను ఏర్పాటు చేసి వాటిలో 3–4 డివిజన్లు ఏర్పాటు చేయడంతో సర్కిల్‌కు 1 డిప్యూటీ కమిషనర్, డివిజన్‌కు 1 కార్పొరేటర్, జోన్‌కు 1 జోనల్ కమిషనర్, జోనల్ కమిషనర్‌పైన 1 మేయర్, కమిషనర్ మాత్రమే ఉండటంతో గతంతో పోలిస్తే ప్రజలకు పాలన మాత్రం దూరం కావడం కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయికి ఎదుగుతున్న మేడ్చల్‌ను ఏకంగా నగరంలో విలీనం చేసి నగర పాలన చేస్తుంటే పాలనకు ప్రజలు ఆమడ దూరంలో కనిపిస్తున్నారు. -
మంత్రి మల్లారెడ్డి స్థిర ఆస్తులు రూ.90.24 కోట్లు
హైదరాబాద్: మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి చామకూర మల్లారెడ్డి స్థిర ఆస్తులు విలువ(భూములు, భవనాల విలువ) రూ.90,24,08,741 ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో తెలిపారు. ఇందులో ఆయన సతీమణి చామకూర కల్పనా స్థిర ఆస్తుల విలువ రూ.38,69,25,565 పేర్కొన్నారు. తమ స్థిర ఆస్తులు(భూములు, భవనాలు) సూరారం, దూలపల్లి, అలియాబాద్, జీడిమెట్ల, యాడారం, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ ప్రాంతాల్లో ఉన్నట్లు మంత్రి మల్లారెడ్డి తెలిపారు. అలాగే, వివిధ బ్యాంకుల్లో తీసుకున్న అప్పులు(లోన్లు) రూ.7,39,94,301 కాగా, ఇందులో ఆయన సతీమణి కల్పనా పేరుతో ఉన్న అప్పులను రూ.4,48,95,098 తెలిపారు. అలాగే, చరా ఆస్తులు(వివిధ బ్యాంకుల్లో నగదు డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు) రూ.5,70,64,666 ఉన్నట్లు పేర్కొన్న మంత్రి మల్లారెడ్డి, ఇందులో సతీమణి కల్పనకు సంబంధించివి రూ.72,39,185గా తెలిపారు. వాహనాలకు సంబంధించిన వివరాలతోపాటు చేతిలో నగదు ఉన్నట్లు గానీ ఎన్నికల అఫిడవిట్లో ఆయన పేర్కొనలేదు. 2018 ఎన్నికల అఫిడవిట్లో ఇలా.. 2018 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీహెచ్.మల్లారెడ్డి ఎన్నికల అఫిడవిట్లో స్థిర ఆస్తులు విలువ రూ.49,26,79,933 చూపించారు. అలాగే, 2014లో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల అఫిట్విట్లో మల్లారెడ్డి తన స్థిర ఆస్తుల విలువ రూ.48,85,25,332 గా పేర్కొన్నారు. -
మేడ్చల్ నియోజకవర్గాన్ని ఎవరు శాసించబోతున్నారు..?
మేడ్చల్ నియోజకవర్గం మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రముఖ విద్యాసంస్థల అదినేత చామకూర మల్లారెడ్డి గెలుపొందారు. 2014 ఎన్నికలలో ఆయన మల్కాజిగిరిలో టిడిపి పక్షాన ఎమ్.పిగా గెలిచి ఆ తర్వాత టిఆర్ఎస్లో చేరిపోయారు. ఈ ఎన్నికలలో మేడ్చల్ నుంచి అసెంబ్లీకి పోటీచేసి తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్ది, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిపై 88066 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. ఇక్కడ టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న సుధీర్ రెడ్డికి 2018లో టిక్కెట్ ఇవ్వలేదు. మల్లారెడ్డి గెలిచిన తర్వాత కెసిఆర్ క్యాబినెట్లో మంత్రి అయ్యారు. మల్లారెడ్డికి 167009 ఓట్లు రాగా, లక్ష్మారెడ్డికి 78943 ఓట్లు వచ్చాయి. ఇక్కడ పోటీచేసిన బిజెపి అభ్యర్ధి నక్కా ప్రబాకర్ గౌడ్‌కు సుమారు 25800 ఓట్లు వచ్చి మూడో స్థానంలో నిలిచారు. మల్లారెడ్డి సామాజిక పరంగా రెడ్డి వర్గానికి చెందినవారు. మేడ్చల్ నియోజకవర్గంలో ఎనిమిదిసార్లు రెడ్డి సామాజికవర్గ నేతలు, మూడుసార్లు బిసి నేతలు, రెండుసార్లు ఎస్.సి.నేతలు, ఒకసారి బ్రాహ్మణ నేత గెలుపొందారు.మొత్తం 13 సార్లు ఎన్నికలు జరగ్గా, కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ లు కలిసి ఏడుసార్లు గెలిస్తే, టిడిపి నాలుగుసార్లు గెలిచింది. టిఆర్ఎస్ రెండుసార్లు గెలిచింది. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ఇక్కడ నుంచి 1978లో గెలిచాకే ముఖ్యమంత్రి అయ్యారు. చెన్నారెడ్డి మొత్తం ఆరుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. వికారాబాద్, తాండూరులలో రెండేసి సార్లు, ఒకసారి సనత్నగర్లోను ఆయన గెలుపొందారు. గతంలో ఈయన నీలం, కాసు మంత్రివర్గాలలో సభ్యునిగా ఉన్నారు. కేంద్రంలో మంత్రి పదవి కూడా నిర్వహించిన ఈయన నాలుగు రాష్ట్రాలకు గవర్నరుగా ఉన్నారు. ఒకసారి చెన్నారెడ్డి ఎన్నిక చెల్లదని కోర్టు ప్రకటించింది. అదే సమయంలో మొదల్కెన తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి, తెలంగాణ ప్రజా సమితి పార్టీని విజయపథంలో నడిపించిన ఘనత పొందారు. మేడ్చల్‌లో రెండుసార్లు గెలిచిన సమిత్రాదేవి మరో మూడుసార్లు ఇతర చోట్ల గెలిచారు. టిడిపిలో జడ్పి ఛైర్మన్‌గా రాజకీయ రంగ ప్రవేశం చేసి, మంత్రి పదవిని అలంకరించిన టి.దేవేందర్‌గౌడ్ ఇక్కడ మూడుసార్లు విజయం సాధించారు. ఎన్.టిఆర్., చంద్రబాబు క్యాబినెట్లలో సభ్యునిగా ఉన్న దేవేందర్‌గౌడ్ 2008 నాటికి టిడిపిని వదలి సొంతంగా పార్టీని నవతెలంగాణ పేరిట ఏర్పాటు చేసి కొంత కాలం తెలంగాణ సాధన ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ తరువాత ఆ పార్టీని ప్రజారాజ్యంలో విలీనం చేసి మల్కాజిగిరి లోక్‌సభకు, ఇబ్రహీంపట్నం అసెంబ్లీకి పోటీచేసి రాజకీయంగా ఎదురుదెబ్బ తిన్నారు.ఆ తర్వాత తిరిగి టిడిపిలో పునః ప్రవేశించి రాజ్యసభ సభ్యుడయ్యారు. ఇక్కడ నుంచి పోటీచేసి గెలుపొందినవారిలో సుమిత్రాదేవి, ఉమా వెంకట్రామిరెడ్డి, కె.సురేంద్రరెడ్డి, దేవేందర్‌గౌడ్, మల్లారెడ్డి కూడా మంత్రి పదవులు చేశారు. మేడ్చల్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..


