breaking news
Lung disease
-
Health: నిమోనియా హానియా? ఎవరికి ఎక్కువ ముప్పు?
మన ఊపిరితిత్తులు అనునిత్యం శ్వాస తీసుకుంటూ నిరంతరాయం పనిచేస్తూనే ఉంటాయి. అలా అవి ఏమాత్రం విశ్రాంతి లేకుండా శ్వాస తీసుకుంటూనే ఉండాలి. అప్పుడే ్రపాణాలు నిలుస్తాయి. ఈ ప్రక్రియలో ముక్కు నుంచి తీసుకున్న గాలి... ఊపిరితిత్తుల్లోని అతి చివరి అంచె అయిన ‘ఆల్వియోలై’ అనే గాలి గది (ఎయిర్ శ్యాక్)ని చేరాలి. ఈ ఆల్వియోలై నుంచే బయటి నుంచి మనం తీసుకున్న ఆక్సిజన్ మన దేహంలోని అన్ని అవయవాల్లోని కణాలకు అందడమూ, అలాగే లోపలి కలుషితమైన గాలి అక్కడి నుంచే బయటికి రావడం వంటి ‘గ్యాసెస్ ఎక్స్ఛేంజ్’ ప్రక్రియ చోటుచేసుకుంటుంది. ఏదైనా కారణం వల్ల ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ రావడం వంటి కారణాలతో... గాలి గదిలో (ఆల్వియోలైలో) ఇన్ఫ్లమేషన్ కారణంగా అందులోకి చీము లేదా తెమడ / ఫ్లెమ్ వంటి ద్రవాలు నిండటంతో శ్వాసకు అంతరాయం కలిగితే అది నిమోనియా సమస్యకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో నిమోనియా అంటే ఏమిటో చూద్దాం.నిమోనియా సమస్య ప్రధానంగా బ్యాక్టీరియా (ఉదా: స్ట్రెప్టోకోకస్), వైరస్‌లూ (ఉదా: ఫ్లూ అలాగే రెస్పిరేటరీ సిన్సీషియల్ వైరస్), ఫంగైలతో పాటు ఏవైనా ఆహార పదార్థాలూ, ద్రవాలు (ఉదా: ఆహారం, నీళ్లు వంటివి) ఊపిరితిత్తులోకి చేరడం వల్ల వచ్చే అవకాశాలెక్కువ.కారణాలు..బాక్టీరియా వల్ల – స్టెఫలోకాకస్ బ్యాక్టీరియా (ఇది పెద్దల్లో సాధారణంగా వచ్చేందుకు కారణమవుతుంది), హీమోఫీలస్ (పిల్లల్లో సాధారణంగా దీనివల్ల వస్తుంది), గ్రామ్‌నెగెటివ్, అనరోబిక్, టీబీ బ్యాక్టీరియా మొదలైన బ్యాక్టీరియాల వల్ల.వైరస్ వల్ల – ఇన్ఫ్లుయెంజా, రెస్పిరేటరీ సిన్సీషియల్ వైరస్... వంటి వైరస్‌లతో పాటు తరచూ వచ్చే కొత్త వైరస్ల వల్ల కూడా నిమోనియా రావచ్చు. ఏదైనా వైరస్ విజృంభించి ఒక చోట ఎపిడమిక్‌లా వచ్చి, తన ప్రభావం చూపిన తర్వాత నిమోనియాకు దారితీసే అవకాశాలు ఎక్కువ. ఆ వైరస్ సోకిన తర్వాత బాధితుల్లో రోగనిరోధక శక్తిని బట్టి నిమోనియా వచ్చే అవకాశాలు ఆధారపడి ఉంటాయి.ఫంగస్ వల్ల కూడా.కొద్ది ప్రదేశంలోనే ఎక్కువమంది ఉండటం (ఓవర్ క్రౌడింగ్)ఆల్కహాల్ అలవాటుతో– (దీని వల్ల వ్యక్తుల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగానూ రోగనిరోధక శక్తి (డిఫెన్స్ మెకానిజం) తగ్గుతుంది. మత్తులో దగ్గడం కూడా తక్కువే. దాంతో లోన ఉన్న పడని పదార్థాలు అక్కడే ఉండిపోవడంతో నిమోనియా రావచ్చు.మైక్రో యాస్పిరేషన్ – మనకు తెలియకుండానే ద్రవాలు గొంతునుంచి శ్వాసనాళంలోకి జారిపోతుంటాయి. ఆ ప్రక్రియనే మైక్రోయాస్పిరేషన్ అంటారు. ప్రతివ్యక్తి గొంతులో బ్యాక్టీరియా ఉంటుంది. దీన్నే ఓరోఫ్యారింజియల్ ఫ్లోరా అంటారు. ఆ బ్యాక్టీరియా గొంతు నుంచి శ్వాసనాళాల ద్వారా గాలిగదుల వరకు పోవడం వల్ల కూడా నిమోనియా రావచ్చు.లక్షణాలివే...నిమోనియాలో...జ్వరం, దగ్గు, ఒళ్లునొప్పులు, చలిగా ఉండటం, ఒక్కోసారి ఆకలి లేకపోవడంతెమడ / కఫం (ఫ్లెమ్) ఉండవచ్చు లేదా లేకపోవచ్చు. ఉంటే తెల్లగా / పసుపురంగులో ఒక్కోసారి రక్తపు చారికతోనూ కనిపించవచ్చు.నిమోనియా ఇన్ఫ్లమేషన్ ఊపిరితిత్తి తాలూకు పొర (ప్లూరా)కు చేరినప్పుడు ఛాతినొప్పి కూడా రావచ్చు.నిమోనియా మరీ తీవ్రంగా ఉంటే ఆయాసం కూగా రావచ్చు. ఇక ఇంటస్టిషియల్ నిమోనియాలో దగ్గు ఉండదు. కాని ఆయాసం మాత్రం ఉంటుంది. ఇది ఎంతటి విషమ పరిస్థితికి దారితీస్తుందంటే... ఒక్కోసారి శ్వాసప్రక్రియ ఆగిపోవచ్చు కూడా.ఆస్తమాలో పిల్లికూతలు ఉంటాయి. గాని నిమోనియాలో ఉండవు. గాలి పీలుస్తున్నా అది లోపలికి వెళ్లదు. కారణం... గాలి చేరాల్సిన ప్రదేశమైన గాలిసంచిలోని చీము వంటి ద్రవాలు లేదా తెమడ (ఫ్లెమ్) వంటివి అడ్డంకిగా ఉండవచ్చు. ఇలా గాలిగదిలో పేరుకునే పదార్థాన్ని ‘ఎగ్జుడస్’ అంటారు. ఈ ఎగ్జుడస్ కారణంగా గాలిగదిలోకి ఆక్సిజన్ చేరదు. దాంతో దేహానికీ / దేహంలోని కణాలకూ అవసరమైనంత ఆక్సిజన్ అందదు. ఫలితంగా ఊపిరితిత్తులు పని చేయలేని పరిస్థితి వస్తుంది. దీన్నే ‘హైపాక్సిక్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్’ అంటారు.ఊపిరి అందకపోవడంతో నుదుటిపై చెమటలు పట్టడం, కంగారుగా ఉండటం, గుండె స్పందన వేగం పెరగడం, అయోమయం కారణంగా డీలా పడిపోవడం, బీపీ పడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే దాన్ని ‘సివియర్ నిమోనియా’ అంటారు.కొందరు బాధితుల్లో ఛాతీలో తీక్షణమైన / తీవ్రమైన నొప్పి (షార్ప్ పెయిన్) కూడా రావచ్చు.సమయానికి చికిత్స తీసుకోకపోతే ప్రమాదమే...నిమోనియాకు సమయానికి తగిన చికిత్స తీసుకోకపోతే జబ్బు మరిన్ని కాంప్లికేషన్లకు దారితీయవచ్చు. అంటే... సెప్టిసీమియా (రక్తానికంతా ఇన్ఫెక్షన్ సోకడం, దీన్నే మామూలు భాషలో రక్తం విషపూరితంగా మారడం), రక్తపోటు పడిపోవడం, పక్షవాతం, మూత్రపిండాలు దెబ్బతినడం, మెదడుపై దుష్ప్రభావం పడటం కాంప్లికేషన్లు రావచ్చు. కొందరిలో మరణం కూడా సంభవించవచ్చు.నిమోనియా ఎవరెవరిలో... నిమోనియా ఏ వయసు వారిలోనైనా రావచ్చు. చాలా చిన్న పిల్లలు మొదలుకొని, అరవై ఏళ్లు దాటిన వృద్ధుల వరకు అందరిలోనూ కనిపించవచ్చు. సాధారణంగా ఈ వయసు వారిలో వ్యాధి నిరోధకశక్తి / వ్యాధి నిరోధక వ్యవస్థ పనితీరు తక్కువ కాబట్టి నిమోనియా చిన్నపిల్లల్లోనూ, వయస్సు పైబడ్డవారిలోనూ చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది.ఆహారంలో తగినన్ని పోషకాలు తీసుకోని వాళ్లలో రోగనిరోధక శక్తి తగ్గడంతో.సీఓపీడీ (క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ – బ్రాంకైటిస్, ఎంఫసీమా) వంటి వ్యాధులు ఉన్నవాళ్లలోగుండె సమస్యలు ఉన్నవారిలోస్పీ›్లనెక్టమీ అనే ప్రక్రియ ద్వారా స్పీ›్లన్ తొలగించిన వాళ్లలోపొగతాగేవారిలో... వీళ్లందరిలోనూ నిమోనియా వచ్చే అవకాశాలెక్కువ.మరికొన్ని జబ్బులతో కలసి...మరికొన్ని ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడేవారిలో నిమోనియా సోకడం మామూలే. ఉదాహరణకు... సాధారణంగా డయాబెటిస్ ఉన్న వారు, క్యాన్సర్ కారణంగా కీమోథెరపీ తీసుకుంటున్నావారు, ఎయిడ్స్ బాధితులు, ఆస్తమా ఉన్నవారు, ఆల్కహాల్ ఎక్కువగా తాగేవారిలో నిమోనియా రావడం చాలా సాధారణం. ఇక గర్భవతుల్లో నిమోనియాను గుర్తించి, సరిగా వైద్య చికిత్స ఇవ్వకపోవడం వల్ల అదెన్నో కాంప్లికేషన్లకు దారితీసే ముప్పు ఉంటుంది.వ్యాధి నిర్ధారణబాధితుల్లో కనిపించే లక్షణాలను బట్టి క్లినికల్‌గా.సీబీపీ, సీఎక్స్ఆర్ వంటి చాలా సాధారణ పరీక్షలతో దీన్ని నిర్ధారణ చేయవచ్చు.ఒక్కోసారి అవసరాన్ని బట్టి ఛాతీ సీటీ స్కాన్, కళ్లె పరీక్ష వంటి ఇతర పరీక్షలు కూడా చేయాల్సి రావచ్చు.వీరిలో మరింత జాగ్రత్త అవసరం...బాధితుల్లో రెండు మూడు రోజుల నుంచి జ్వరం, దగ్గు, ఊపిరి అందకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తుంటే నిమోనియా ఉందేమోనని పరీక్షించాలి. డయాబెటిస్, పక్షవాతం, ఆస్తమా, గర్భిణుల్లో వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువ కాబట్టి వారిని చాలా జాగ్రత్తగా పరీక్షించాలి. ఇక ఆసుపత్రుల్లో నిమోనియా సోకే అవకాశాలు ఎక్కువ.నివారణ...పొగతాగే అలవాటు ఉంటే జ్వరం, దగ్గు, ఊపిరి అందకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తుంటే తక్షణం ఆ అలవాటును ఆపేయాలి.బయటి వాతావారణంలో పొగ ఉంటే దానికి ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్త పడాలి.ఆస్తమా రోగులు, బ్రాంకైటిస్ ఉన్నవారు తప్పనసరిగా అది నియంత్రణలోకి వచ్చేలా చికిత్స తీసుకోవాలి.క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. ఫలితంగా నిమోనియా వంటి ఇన్ఫెక్షన్లు తేలిగ్గా సంక్రమించవు.అన్ని పోషకాలూ ఉండే సమతులాహారం తీసుకోవడం వల్ల రోగనిరోధకశక్తి పెరిగి, నిమోనియాతో పాటు అనేక ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కలుగుతుంది.చికిత్సనిమోనియాకు తగిన యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేయాల్సి ఉంటుంది. బాధితులను చాలా నిశితంగా పరిశీలించి యాంటీబయాటిక్స్ మోతాదును డాక్టర్లు చాలా జాగ్రత్తగా నిర్ణయిస్తారు. అందుకే నిమోనియాకు చికిత్స తప్పనిసరిగా డాక్టర్ల పర్యవేక్షణలోనే జరగాలి. సొంతవైద్యం ఎట్టిపరిస్థితుల్లోనూ పనికిరాదు.ఎవరికైనా మూడు రోజులకు పైబడి జ్వరం, ఛాతీనొప్పి, ఊపిరి సరిగా తీసుకోకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి.చిన్నాపిల్లల్లో నిమోనియా!చిన్నపిల్లలందరిలోనూ కనిపించినప్పటికీ... మరీ ముఖ్యంగా ఐదేళ్ల కంటే ఇంకా చిన్నారుల్లో ఇది చాలా ఎక్కువ. పెద్దల్లో వ్యాధి నిరోధక వ్యవస్థ బాగా పనిచేస్తుంటుంది కాబట్టి కాస్త తట్టుకుంటారు. కానీ చిన్నారుల్లో ఇమ్యూనిటీ అంతే బలంగా ఉండకపోవడం వల్ల ఒక్కోసారి ఇది ్రపాణాంతకమూ అయ్యే అవకాశముంది. అయితే ఇప్పుడున్న వైద్యపరిజ్ఞానంతో దీన్ని చాలావరకు సమర్థంగా తగ్గించవచ్చు.స్ట్రెప్టోకాకస్ నిమోనే, గ్రూప్–బి స్ట్రెప్టోకాకస్, స్టెఫలోకాకస్ ఆరియస్ వంటి బ్యాక్టీరియాతో పాటు ఐదేళ్ల కంటే మరీ చిన్న పిల్లల్లో ఇది రెస్పిరేటరీ సిన్సీషియల్ వైరస్, పారా ఇన్ఫ్లుయెంజా వైరస్, అడినోవైరస్ వంటి వైరస్లతోనూ వచ్చే అవకాశం ఉంది. పెద్దల్లోలాగే కొన్ని సందర్భాల్లో ఫంగైలతోనూ నిమోనియా రావచ్చు.లక్షణాలునిమోనియా వల్ల పిల్లలందరిలోనూ ఒకేలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. ఏ కారణంగా నిమోనియా వచ్చిందనే అంశాన్ని బట్టి లక్షణాలు మారుతుంటాయి. అయితే సాధారణంగా కనిపించే లక్షణాలివి...దగ్గు వస్తుంటుంది. ఇది తెమడ/ఫ్లెమ్ను ఉత్పత్తి చేస్తుండటం వల్ల తడిదగ్గు.తీవ్రమైన జ్వరం.ఆకలి తగ్గడం.తీవ్రమైన అలసట, నీరసం, నిస్సత్తువ.కొందరు పిల్లల్లో వాంతులు, విరేచనాలూ కావచ్చు.వైరస్ లేదా బ్యాక్టీరియా కారణంగా నిమోనియా వచ్చినా మొదట్లో లక్షణాలన్నీ దాదాపు ఒకేలా ఉంటాయి. అయితే వైరల్ నిమోనియాలో ఊపిరి తీసుకోవడం కష్టం కావడం, ఆయాసం, ఊపిరి తీసుకుంటున్నప్పుడు శబ్దం రావడం (వీజింగ్) వంటివీ కనిపించవచ్చు. బ్యాక్టీరియా కారణంగా వచ్చే నిమోనియా కంటే వైరల్ నిమోనియా కాస్త ప్రమాదకరం. పిల్లల్లో వణుకు, ఆయాసం, తలనొప్పి, అయోమయం వంటివి కనిపిస్తే అది ఒకింత ప్రమాదకరమని గుర్తించి వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.నిర్ధారణఛాతీ ఎక్స్‌రే.కొన్ని రక్తపరీక్షలు (రక్తంలో ఆక్సిజన్ మోతాదును తెలుసుకునే ఆర్టీరియల్ బ్లడ్‌గ్యాస్ వంటివి)కళ్లె పరీక్ష (స్ఫుటమ్ కల్చర్) : ఈ పరీక్ష వల్లనే నిమోనియాకు అసలు కారణం తెలుస్తుంది.సీటీ స్కాన్ (ఛాతీది)అవసరాన్ని బట్టి అరుదుగా బ్రాంకోస్కోపీ, ఊపిరితిత్తుల్లో నీరు చేరితే దాని పరీక్ష వంటివి చేస్తారు.చికిత్స బ్యాక్టీరియా వల్ల వచ్చే నిమోనియా మంచి యాంటీబయాటిక్స్‌తో తేలిగ్గా తగ్గిపోతుంది. అయితే వైరల్ ఇన్ఫెక్షన్తో నిమోనియా వస్తే దానికి నిర్దిష్టంగా మందులు లేకపోయినా కొన్నిసార్లు యాంటీవైరల్ మందులు ఇస్తారు. ఇలాంటి పిల్లలకు తగినన్ని నీళ్లు తాగించడం, గది బాగా సౌకర్యంగా ఉండటంతో పాటు అందులో తగినంత తేమ ఉండేలా చూడటం, జ్వరం, దగ్గు వంటివి తగ్గడానికి లక్షణాలను బట్టి (సింప్టమాటిక్) చికిత్స ఇవ్వడం వంటివి చేస్తారు.సెకండరీ నిమోనియాపిల్లల్లో ఇంకేదైనా వ్యాధి (ముఖ్యంగా వైరల్ జ్వరాలు) వచ్చాక, అది నిమోనియాకు దారితీస్తే దాన్ని సెకండరీ నిమోనియాగా పరిగణిస్తారు. దీనికి కాస్తంత ప్రమాదకరమైన కండిషన్. అందుకే హాస్పిటల్లో ఉంచి చికిత్స అందించాలి. ఇందులో తీవ్రతను బట్టి రక్తనాళం ద్వారా లేదా నోటి ద్వారా యాంటీబయాటిక్స్ ఇవ్వడం, వాళ్లలో నీరు, లవణాల మోతాదుల నిర్వహణ కోసం సెలైన్ వంటి ఫ్లుయిడ్స్ ఎక్కించడం, ఆక్సిజన్ ఇవ్వడం, పిల్లలు తమంతట తాము కళ్లె / గల్ల / ఫ్లెమ్ తీయలేరు కాబట్టి వారు దాన్ని ఊసేలా వివరించి చెప్పడం, బాగా ఊపిరితీసుకోగలుగుతున్నారా అని చూడాలి. అందుకే చిన్నారుల్లో సెకండరీ నిమోనియా కనిపిప్తే వారిని తప్పనిసరిగా హాస్పిటల్లో ఉంచే చికిత్స అందించడం మంచిది. నివారణపిల్లలకు చిన్నతనంలో ఇచ్చే బీసీజీ, పెర్టుసస్‌లతో పాటు నిమోకోకల్ వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా దీన్ని నివారించవచ్చు. ఇప్పుడు 13 రకాల నిమోనియాలకు తగిన వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. పిల్లలకు రెండు నెలల వయసప్పుడు నిమోనియా వ్యాక్సిన్స్ మొదటి డోసు, రెండేళ్ల పైబడ్డ పిల్లలకు సైతం వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి.అందరు పిల్లలకు ప్రతి ఏడాదీ ఫ్లూ వ్యాక్సిన్ వేయించాలి. వర్షాకాలానికి ముందు (ప్రీ–మాన్సూన్ పీరియడ్‌లో) ప్రతి ఏడాదీ ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇలా తీసుకుంటే వైరల్ ఫ్లూని నియంత్రించవచ్చు.వ్యక్తిగత పరిశుభ్రత పాటించడాన్ని పిల్లలకు నేర్పడం, బాగా దగ్గుతున్న పెద్దలు, వ్యాధిగ్రస్తుల దగ్గరికి వెళ్లకుండా చూస్తూ... పిల్లలను అలాంటివారి నుంచి దూరంగా ఉంచడం, చాలాకాలం పాటు ధాన్యం నిల్వ ఉంచే గరిసెలు, అలాగే కోళ్ల వంటి పెంపుడు పక్షులకు పిల్లలను దూరంగా వంటి కొద్దిపాటి జాగ్రత్తలతో నిమోనియాను చాలావరకు నివారించవచ్చు.చివరిగా... నిమోనియాను యాంటీబయాటిక్స్‌తో చాలావరకు నయం చేయడం సాధ్యమే అయినప్పటికీ... పెద్దల్లోనైనా, పిల్లల్లో జ్వరం, ఆగకుండా దగ్గు వస్తూ, ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు అంత తేలిగ్గా తీసుకోకుండా ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకోవడమే మంచిదని గుర్తుంచుకోవాలి.- డా. రమణ ప్రసాద్, సీనియర్ పల్మునాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్నిర్వహణ : యాసీన్ -
ఐరన్ లంగ్ జీవితం ముగిసింది!
ఒక్లహోమా సిటీ: అమెరికాలో పోలియో మహమ్మారి చిట్టచివరి బాధితురాలు మార్థా అన్ లిలార్డ్ (78) ప్రశాంతంగా కళ్లు మూసింది. ఐదేళ్ల వయసులోనే వ్యాధికి గురై ఇరవై ఏళ్ల మించి బతకదని వైద్యులు పెదవి విరిచేసినా... లిలార్డ్ ఉక్కు ఊపిరితిత్తుల తో జీవితం మొత్తాన్ని గడిపేసిన వ్యక్తిగా మిగిలిపోయింది. పోలియో కారణంగా ఊపిరితిత్తుల కండరాలు పని చేయకపోవడంతో చిన్నప్పటి నుంచి భారీ యంత్రం (ఐరన్ లంగ్) సాయంతోనే ఊపిరి తీసుకునేది. కుడి చేయి పక్షవాతం బారిన పడినా, ఎడమ చేయిని నడుము వద్ద కొద్దిగా మాత్రమే కదిలించగలిగిన లిలార్డ్లో ఉత్సాహానికి మాత్రం కొదవ ఉండేది కాదని, సొంతంగా వంట చేసుకోవడమే కాకుండా... నెట్ బ్రౌజింగ్ చేసేదని, కవితలు రాయడమే కాకుండా.. తన మరణం తాలూకూ వార్తను కూడా ముందుగానే రాసి వెబ్సైట్లో పోస్ట్ చేసిందని చెల్లి సిండీ మెక్ వీ తెలిపారు. రెండు సార్లు కోవిడ్–19 బారిన పడటంతో ఊపిరితిత్తుల సామర్థ్యం బాగా తగ్గిపోయి ఐదేళ్లుగా ఇంటికే పరిమితమైంది. రెండేళ్లుగా రోజు మొత్తం ఐరన్ లంగ్లోనే గడిపిన లిలార్డ్ ఆఖరకు అమెరికాలోని ఓక్లహోమా సిటీలో జూన్ 26న తుదిశ్వాస విడిచారు. దీంతో ఐరన్ లంగ్తో జీవించిన చిట్టచివరి వ్యక్తిగా లిలార్డ్ మిగిలిపోయారు. రెండేళ్ల క్రితమే పాల్ అలెగ్జాండర్ అనే మరో పోలియో పీడితుడు కూడా మరణించడంతో చిట్టచివరి బాధితురాలిగా లిలార్డ్ మిగిలిపోయారు.‘‘లిల్లార్డ్ 20 ఏళ్ల వయసు దాటదని డాక్టర్లు చెప్పారు. కానీ... బతకాలన్న తపన, ఆమె జీవితాన్ని పొడిగించడం మాత్రమే కాదు.. ఆస్వాదించేలా చేసింది.’’అని లిలార్డ్ చెల్లి సిండీ మెక్వీ తెలిపారు. ఐరన్ లంగ్ అనేది ఓ భారీ పరికరం. సిలిండర్ ఆకారంలో ఉంటుంది. మనిషి దాంట్లో పడుకుని ఉంటే తల మాత్రం బయటకు వచ్చి ఉంటుంది. ఇలాంటి ఏర్పాటుతోనే లిలార్డ్ తన జీవితం మొత్తం గడిపింది. చిన్నప్పుడు రెండు గంటలపాటు పాఠశాలకు వెళ్లేదని, మిగిలిన సమయంలో ట్యూటర్లు ఇంటికొచ్చి పాఠాలు చెప్పేవారని సోదరి వివరించారు. ఫోన్ల ద్వారానే షానీ హైస్కూల్లో విద్యాభ్యాసం చేసినట్లు తెలిపారు. విహారయాత్రలకు వెళ్లాలంటే ప్రత్యేకమైన వాహనం వాడేవారని ఐరన్ లంగ్ యంత్రం పట్టేంత తలుపులు ఉన్నాయా? లేదా? అని విచారించుకున్న తరువాతే తండ్రి బయటకు తీసుకెళ్లే వారని వివరించింది. లిలార్డ్ కొంతకా>లం డ్రైవింగ్ కూడా చేయడం ఆమెలోని పట్టుదలకు ప్రతీకలుగా చెప్పవచ్చు.ఇంటర్నెట్ ప్రపంచంలో...లిలార్డ్కు ఆరోగ్య సమస్యలు ఎన్ని ఉన్నా... జీవితంలో కుతూహలాన్ని మాత్రం కోల్పోలేదు. అందుకే పోలియో గురించి మాత్రమే కాకుండా.. ప్రపంచ సంగతులను కూడా ఆమె ఇంటరెŠన్ట్ ద్వారా తెలుసుకునే వారు. 2001 సెప్టెంబర్ 11 ఉగ్రదాడుల తర్వాత లిలార్డ్ కాబోయే భర్త బహాసల్హ్ కూడా ఇంటర్నెట్ చాట్రూమ్లోనే పరిచయమయ్యారు. ఇరవై ఏళ్లకు పైగా ఆన్లైన్లో నడిచిన ప్రేమ ఈ సంవత్సరం ఫిబ్రవరిలో పెళ్లితో సంపూర్ణమైంది. ఈజిప్టుకు చెందిన బహాసల్హ్ అమెరికా వీసా కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో వీరిద్దరి ప్రేమ ఆన్‌లైన్‌కే పరిమితమైంది. ఆమె కవితలు రాసింది, పాటలు రాసింది. తన చావు వార్తను కూడా కూడా ముందుగానే రాసి, ఫ్యూనరల్ హోమ్ వెబ్సైట్లో పోస్ట్ చేసింది. పోలియో వ్యాధి ఒక్క అమెరికాను మాత్రమే కాదు... ప్రపంచాన్ని వణికించిన మహా వ్యాధి ఏటా లక్షల మంది పిల్లల్ని పక్షవాతం బారిన పడేసేది. 1955లో టీకా అందుబాటులోకి రావడంతో ఇది క్రమేపీ తగ్గుముఖం పట్టింది. పోలియోతో కొందరి కాళ్లు చచ్చుబడితే మరికొందరికి ఇతర శరీర భాగాలు పని చేయకుండా పోతాయన్నది తెలిసిన విషయమే. -
బడికి పోలేని చిన్నారి కోసం ‘అవతార్’.. వహ్ అద్భుతం
ఇప్పుడు చెప్పుకోబోయేది అవతార్ సినిమా గురించి కాదు. అంతకు మించిన అద్భుతం గురించే!. కళ్ల ఎదురుగా మనిషి లేకున్నా.. ఉన్నట్లుగా భావించడం, పక్కనే ఉన్నట్లు ఫీలవ్వడం, మాట్లాడడం, చర్చించడం.. ఇవన్నీ కుదిరే పనేనా?. టెక్నాలజీ ఎరాలో అందునా అవతార్ లాంటి రోబోలతో అది సాధ్యమవుతోంది. బెర్లిన్(జర్మనీ) మార్జహ్న్-హెలెర్స్డోర్ఫ్లో జోషువా మార్టినన్గెలి అనే చిన్నారి ఉన్నాడు. అతనికి ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధి ఉంది. ఈ కారణంగా అతని మెడ నుంచి ఓ పైప్ సాయంతో చికిత్స అందిస్తున్నారు పేరెంట్స్. అలాంటప్పుడు స్కూల్‌కి వెళ్లడం వీలుపడదు కదా!. అందుకే జోషువా బదులు.. ఒక అవతార్ రోబోని అతని సీట్లో కూర్చోబెట్టారు. ఏడేళ్ల Joshua Martinangeli బదులు ఈ అవతార్ రోబో పాఠాలు వింటుంది. తోటి విద్యార్థులతో మాట్లాడుతుంది. సరదాగా బదులు ఇస్తుంది. టీచర్ చెప్పే పాఠాలు వింటుంది. అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంతో పాటు అనుమానాలను నివృత్తి చేసుకుంటుంది కూడా. ఇదేలా సాధ్యం అంటే.. ఇంట్లో స్పెషల్ మానిటర్ ముందు కూర్చుని జోషిని.. అవతార్ రోబోకి ఉన్న మానిటర్‌కు కనెక్ట్ చేస్తారు కాబట్టి. అంతే అవతల ఇంట్లో జోషువా ఏం చేప్తే.. అవతార్ అదే బదులు ఇస్తుంది. దీంతో అచ్చం జోషువా పక్కనే ఉన్నట్లు ఫీలైపోతున్నారు కొందరు స్టూడెంట్స్. జోషువా కుటుంబ ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని.. డిస్ట్రిక్ట్ కౌన్సిల్ వాళ్లు ఈ ఆవిష్కరణను ఆ కుటుంబానికి ఉచితంగా అందించారు. కరోనా టైంలో మొత్తం నాలుగు అవతార్ రోబోలను తయారు చేయగా.. ఇప్పుడు స్కూల్‌కి వెళ్లలేని ఆ చిన్నారి కోసం ఒక రోబోను వాడడం రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది. -
బౌలింగ్ చేసిన ప్రతీసారి రక్తపు వాంతులు
సిడ్నీ: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జాన్ హేస్టింగ్స్ అంతుచిక్కని జబ్బుతో బాధపడుతున్నాడు. ఊపిరితిత్తుల్లో సమస్య వల్ల బౌలింగ్ చేసిన ప్రతిసారీ రక్తపు వాంతులు అవుతుండడంతో భవిష్యత్తుపై అతడు ఆందోళన చెందుతున్నాడు. ‘ఇప్పుడు బౌలింగ్ చేసిన ప్రతిసారీ రక్తం వాంతి చేసుకుంటున్నా. కేవలం బౌలింగ్ చేస్తేనే.. పరిగెత్తితే కాదు. నేను బాక్సింగ్, రోయింగ్ చేయగలను. బరువులూ ఎత్తగలను. కానీ కేవలం బౌలింగ్ చేసినప్పుడే అలా జరుగుతోంది. మ్యాచ్ సందర్భంగా బౌలింగ్ చేసినపుడు ఊపిరితిత్తుల నుంచి రక్తం ఎగజిమ్మి.. దగ్గినపుడు అది నోటి ద్వారా బయటకు వస్తోంది. దీని వల్ల దీర్ఘకాలంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకపోవచ్చు అని వైద్యులు కచ్చితంగా చెప్పట్లేదు. ఇకపై నేను బౌలింగ్ చేస్తానో లేదో’అని హేస్టింగ్స్ అన్నాడు. ఆస్ట్రేలియా తరపున ఓ టెస్టు, 9 టీ20లు, 29 వన్డేలు ఆడిన 32 ఏళ్ల హేస్టింగ్స్ గత కొన్నేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నాడు. దాంతో అతని కెరీర్ ప్రమాదంలో పడింది. -
టూత్‌పేస్ట్‌తో ఊపిరితిత్తుల వ్యాధులు దూరం!
మిచిగాన్ : మనిషి ప్రతినిత్యం ఉపయోగించే వాటిలో టూత్పేస్ట్ది ఓ ప్రత్యేక స్థానం. నిజం చెప్పాలంటే టూత్‌పేస్ట్‌తో పళ్లు తోముకున్న తర్వాతే రోజు మొదలవుతుంది అందరికీ. ఇది కేవలం పళ్లని శుభ్రం చేయడానికే కాదు.. ప్రాణాంతక జబ్బులను తరిమికొట్టడానికి ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. టూత్‌పేస్ట్‌లో ఊపిరితిత్తుల సంబంధమైన రోగాలతో పోరాడే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలున్నాయని మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. టూత్‌పేస్ట్‌లో ఉండే ట్రైక్లోసన్ బ్యాక్టీరియాను చంపుతుందని, దాన్ని టుబ్రామిసిన్ అనే యాంటీ బ్యాక్టీరియా జౌషదంతో కలిపినపుడు అది రోగ సంబంధ క్రిములను 99 శాతం చంపగలిగిందని వారు తెలిపారు. ముఖ్యంగా వంశపారపర్యంగా వచ్చే సిస్టిక్ ఫైబ్రోసిస్(ఊపిరితిత్తుల సంబంధమైన వ్యాధి)ను నివారించగల్గిందని పేర్కొన్నారు. అయితే టుబ్రామిసిన్ ఉపయోగించటం వల్ల దుష్ప్రభావాలు ఉండటంతో దీని వాడకాన్ని తగ్గించడం జరిగిందన్నారు. పూర్తిగా కాకుండా కొద్ది మొత్తంలో వాడటం ద్వారా వ్యాధి నివారణకు తోడ్పడుతుందన్నారు. దీనిపై మరిన్ని పరిశోధనలు జరిగి పూర్తి స్థాయిలో నివారణ కనుక్కునే దిశగా అడుగులు వేస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. సిస్టిక్ ఫైబ్రోసిస్ అంటే..? ప్రాణాంతకమైన వ్యాధులలో ఇది ఒకటి. వంశపారపర్యంగా వచ్చే ఈ ఊపిరితిత్తుల వ్యాధి ప్రతి 3000 మందిలో కనిపిస్తుంటుంది. సిస్టిక్ ఫైబ్రోసిస్ కారణంగా ఊపిరితిత్తులలో శ్లేష్మం పేరుకుపోతుంది. ఈ వ్యాధికి కారణమైన బ్యాక్టీరియాను చంపడం చాలా కష్టం. సూడోమోనాస్ ఎరుగినోస అనబడే ఈ బ్యాక్టీరియా బయోఫిల్మ్ రక్షణలో ఉండి మామూలు మందులతో నియంత్రణ కష్టంగా మారుతుంది. -
స్మోక్ చేయకున్నా మహిళలకే అధిక ముప్పు!
వాషింగ్టన్: సాధారణంగా పొగతాగేవారు(స్మోకర్స్) ఊపిరితిత్తుల కేన్సర్ భారిన పడతారని వింటూనే ఉంటాం. తాజాగా స్మోకింగ్ సంబంధిత అంశాలపై జరిపిన ఓ సర్వేలో ఆశ్చర్యకర విషయాలు వెల్లడయ్యాయి. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్రానిక్ డిసీజెస్ పై యూనివర్సిటీ ఆఫ్ టొరంటో చేపట్టిన సర్వేలో మహిళలకే అధికంగా ముప్పు పొంచి ఉంటుందని వెల్లడైంది. స్మోకింగ్ చేయని 50-60 ఏళ్లు పైబడిన మహిళలు, పురుషుల 129535 శాంపిల్స్ పై రీసెర్చ్ చేశారు. ఇందులో 8674 ఆఫ్రికన్ మహిళలు, 2708 ఆఫ్రికన్ పురుషుల శాంపిల్స్, 80 వేల మంది అమెరికా మహిళలు, 37 వేల మంది పరుషుల శాంపిల్స్ పై టొరంటో వర్సిటీకి చెందిన రేచల్ చిషోల్మ్ అనే వ్యక్తి పరిశోధన చేశాడు. స్మోకింగ్ చేయని ఆఫ్రికన్, అమెరికన్ మహిళల్లో 5.2 శాతం మందికి క్రానిక్ అబ్ స్ట్రక్టివ్ పల్మనరీ డిసీస్(సీఓపీడీ) వస్తుండగా, స్మోక్ చేయని మగవారిలో మాత్రం 2.9 శాతం మందికి ఈ వ్యాధి వస్తుందని రీసెర్చ్ లో తేలింది. ఇంకా చెప్పాలంటే స్మోకింగ్ చేయని పురుషులు తమ పక్కన ఉన్న స్మోకర్స్ వల్ల సెకండ్ హ్యాండ్ స్మోకర్లుగా ఉన్నా.. వారిలో మాత్రం ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే అవకాశం మహిళల కంటే చాలా తక్కువగా ఉందని రీసెర్చర్ చిషోల్మర్ వివరించారు. -
జస్టిస్ వెంకట్రామిరెడ్డి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అడపా వెంకట్రామిరెడ్డి (84) కన్నుమూశారు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ కిమ్స్ లో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు. ఎర్రగడ్డలోని హిందూ శ్మశాన వాటికలో గురువారం ఉదయం 10 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుమారుడు భాస్కర్‌రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం, మెల్లంపూడిలో ఆయన జన్మించారు. 1987 నుంచి 1993 వరకు హైకోర్టు న్యాయమూర్తిగా, ఆ తర్వాత రాష్ట్ర వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.


