జస్టిస్ వెంకట్రామిరెడ్డి కన్నుమూత | Justice venkatramireddi away | Sakshi
Sakshi News home page

జస్టిస్ వెంకట్రామిరెడ్డి కన్నుమూత

Feb 19 2015 12:51 AM | Updated on Sep 2 2017 9:32 PM

హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అడపా వెంకట్రామిరెడ్డి (84) కన్నుమూశారు.

సాక్షి, హైదరాబాద్: హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అడపా వెంకట్రామిరెడ్డి (84) కన్నుమూశారు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ కిమ్స్ లో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు. ఎర్రగడ్డలోని హిందూ శ్మశాన వాటికలో గురువారం ఉదయం 10 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుమారుడు భాస్కర్‌రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం, మెల్లంపూడిలో ఆయన జన్మించారు. 1987 నుంచి 1993 వరకు హైకోర్టు న్యాయమూర్తిగా, ఆ తర్వాత రాష్ట్ర వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement