బౌలింగ్‌ చేసిన ప్రతీసారి రక్తపు వాంతులు

Australias John Hastings struggles with mystery lung condition - Sakshi

సిడ్నీ: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ జాన్‌ హేస్టింగ్స్‌ అంతుచిక్కని జబ్బుతో బాధపడుతున్నాడు. ఊపిరితిత్తుల్లో సమస్య వల్ల బౌలింగ్‌ చేసిన ప్రతిసారీ రక్తపు వాంతులు అవుతుండడంతో భవిష్యత్తుపై అతడు ఆందోళన చెందుతున్నాడు. ‘ఇప్పుడు బౌలింగ్‌ చేసిన ప్రతిసారీ రక్తం వాంతి చేసుకుంటున్నా. కేవలం బౌలింగ్‌ చేస్తేనే.. పరిగెత్తితే కాదు. నేను బాక్సింగ్‌, రోయింగ్‌ చేయగలను. బరువులూ ఎత్తగలను. కానీ కేవలం బౌలింగ్‌ చేసినప్పుడే అలా జరుగుతోంది.

మ్యాచ్‌ సందర్భంగా బౌలింగ్‌ చేసినపుడు ఊపిరితిత్తుల నుంచి రక్తం ఎగజిమ్మి.. దగ్గినపుడు అది నోటి ద్వారా బయటకు వస్తోంది. దీని వల్ల దీర్ఘకాలంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకపోవచ్చు అని వైద్యులు కచ్చితంగా చెప్పట్లేదు. ఇకపై నేను బౌలింగ్‌ చేస్తానో లేదో’అని హేస్టింగ్స్‌ అన్నాడు. ఆస్ట్రేలియా తరపున ఓ టెస్టు, 9 టీ20లు, 29 వన్డేలు ఆడిన 32 ఏళ్ల హేస్టింగ్స్‌ గత కొన్నేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నాడు. దాంతో అతని కెరీర్‌ ప్రమాదంలో పడింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top