LPG cooking gas
-
గ్యాస్ కొరత : ఐఐటీ బాంబే అద్భుత ఆవిష్కారం
ఇరాన్ వార్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొంది. భారతదేశంలో కూడా పెట్రోల్, డీజిల్,ఎల్పీజీ సరఫరాపై తీవ్ర ఆందోళన నెలకొంది. పెరుగుతున్న గ్యాస్ ధరలు,ఎల్పిజి (LPG) కొరత ఉన్న నేపధ్యంలో ఐఐటీ బాంబే తన క్యాంపస్‌లోని వంటశాలలను ఎల్పిజి కొరత నుంచి బయటపడేలా, ఒక వినూత్న మార్గాన్ని కనుగొంది. దేశంలో చమురు, గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం పదే పదే హామీ ఇస్తున్నప్పటికీ పలు ప్రాంతాల్లో ఇంధన కొరత కనిపిస్తోంది. ముంబైలోని 20శాతం హోటళ్లు మూసివేశారు. ఈ నేపథ్యంలో వీరి ఆవిష్కారం ప్రాధాన్యతను సంతరించుకుంది. కెమికల్ ఇంజనీరింగ్ విభాగంలోని ప్రొఫెసర్ సంజయ్ మహాజని నేతృత్వంలో 2014లో ఈ పరిశోధన ప్రారంభమైంది. క్యాంపస్‌లో కుప్పలుగా పేరుకుపోయే ఎండుటాకులను తొలగించడం, పారవేయడం లాంటివి సవాలుగా మారడంతో వారిలో కొత్త ఆలోచన మెదిలింది. దీన్ని శక్తిగా మార్చే ఆలోచన చేశారు.ఐఐటీ బాంబే 'బయోమాస్ గ్యాసిఫికేషన్'దశాబ్ద కాలం సుదీర్ఘ పరిశోధన తర్వాత, ఎండుటాకులను సమర్థవంతమైన వంట ఇంధనంగా మార్చే 'బయోమాస్ గ్యాసిఫికేషన్' (Biomass Gasification) సాంకేతికతను వారు రూపొందించారు. ఈ ప్రయోగాల్లో అనేక సవాళ్లు తప్పలేదు వీరికి. మొదట్లో పొగ రావడం, 'క్లింకర్స్' (వ్యర్థాలు పేరుకుపోయి వ్యవస్థ ఆగిపోవడం) వంటి సమస్యలు ఎదురయ్యాయి. కానీ 2016 నాటికి ఈ సమస్యలను అధిగమించి పేటెంట్ పొందారు. 2017లో ఎనర్జీ సైన్స్ విభాగం నుండి ప్రొఫెసర్ సందీప్ కుమార్ చేరడంతో బర్నర్ డిజైన్ మరింత మెరుగుపడింది. 2024 నాటికి ఈ వ్యవస్థను స్టాఫ్ క్యాంటీన్లో విజయవంతంగా ఏర్పాటు చేశారు.#WATCH | Mumbai, Maharashtra: The Indian Institute of Technology (IIT) Bombay has developed an indigenous technology to combat the rising prices and potential shortages of LPG (cooking gas). Through its patented biomass gasification technology, the institute has successfully… pic.twitter.com/rVVIFDrKGV— ANI (@ANI) March 31, 2026లాభాలు ప్రస్తుతం క్యాంటీన్లలో 30శాతం నుండి 40శాతం వరకు ఎల్పిజి వాడకం తగ్గింది. హాస్టల్ మెస్సుల్లో కూడా వీటిని ఏర్పాటు చేయడం ద్వారా ఏడాదికి రూ.50 లక్షల వరకు ఆదా చేయవచ్చని అంచనా. అంతేకాదు ఇది పర్యావరణ హితం కూడా. ఏటా దాదాపు 8 టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను ఇది తగ్గిస్తుంది. ఈ వ్యవస్థ 60శాతం థర్మల్ ఎఫిషియన్సీతో పనిచేస్తుంది. చాలా తక్కువ ఉద్గారాలను విడుదల చేస్తుంది.#WATCH | Mumbai, Maharashtra: IIT Bombay Professor Sanjay Mahajani says, "I am a faculty member here in the Department of Chemical Engineering at IIT Bombay. My research focuses on gasification and energy conversion. These dried leaves and twigs—if we simply burn them—they do, in… https://t.co/kxKaTbH3hv pic.twitter.com/E5qHmO4u5Y— ANI (@ANI) March 31, 2026మరింత విస్తరణకేవలం క్యాంపస్‌లకే పరిమితం కాకుండా, పరిశ్రమలు మరియు భారీ వంటశాలలలో కూడా ఈ సాంకేతికతను వాడేలా విస్తరించాలని ఐఐటీ బృందం భావిస్తోంది. అంతేకాకుండా, 2019 నుండి ఐఐటీ బాంబే ప్రతిరోజూ 2 టన్నుల తడి వ్యర్థాలను శక్తిగా మార్చే 'బయోమెథనేషన్' ప్లాంట్‌ను కూడా నిర్వహిస్తోంది.ఇదీ చదవండి: బెంగళూరులో విషాదం: తెలంగాణ టెకీ దంపతుల ఆత్మహత్యప్రొఫెసర్ సంజయ్ మహాజని ఏమంటారంటే..తన పరిశోధన గ్యాసిఫికేషన్ , శక్తి మార్పిడిపై కేంద్రీకృతమై ఉందని, ఈనేపథ్యంలోనే క్యాంపస్‌లోని ఈ వ్యర్థ పదార్థంలోనే సహజంగానే శక్తి ఉన్నప్పుడు, దానిని మన అంతర్గత అవసరాల కోసం ఎందుకు ఉపయోగించుకోకూడదని ఆలోచించామనీ ఐఐటి బొంబాయి ప్రొఫెసర్ సంజయ్ మహాజని చెప్పారు. ఈ వ్యర్థాలను దహనం చేసినప్పుడు, అది ముఖ్యంగా పార్టిక్యులేట్ మ్యాటర్ రూపంలో గణనీయమైన ఉద్గారాలను ఉత్పత్తి చేస్తుంది. దీన్ని గణనీయంగా తగ్గించే విధంగా తాము గ్యాసిఫైయర్ డిజైన్‌ను రూపొందించామన్నారు.ఈ ప్రక్రియ ద్వారా ఉత్పత్తి అయ్యే వాయువును 'ప్రొడ్యూసర్ గ్యాస్' అంటారు. ఇలా ప్రధానంగా కార్బన్ మోనాక్సైడ్ , హైడ్రోజన్‌లను వెంటనే దహనం చేస్తేఉద్గారాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ వాయువును దహనం చేసినప్పుడు, విడుదలయ్యే శక్తి ద్వారా ఆవిరి ఉత్పత్తి అవుతుంది. దీన్ని ప్రాథమికంగా, నీటిని ఆవిరిగా మారుస్తాం, ఇది ఆహార తయారీకి ఉపయోగించే ఆవిరి ఆధారిత వంట పరికరాలను,ఇతర ఉపకరణాలను నడపడానికి శక్తినిస్తుందని వివరించారు. ఇదీ చదవండి: తండ్రితో గొడవ, నాలుగేళ్ల బాలుడిపై ఇంత ప్రతీకారమా? -
కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల కేటాయింపు షురూ
దేశవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు, కేటరింగ్ విభాగాలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్ల పంపిణీ ప్రక్రియను వివిధ రాష్ట్రాలు ప్రారంభించాయి. ఢిల్లీ సహా దాదాపు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ కేటాయింపులు అమల్లోకి వచ్చాయి.ప్రాధాన్యత క్రమంలో పంపిణీప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) రోజువారీ సగటు వినియోగంలో 20 శాతం మేర నియంత్రిత పంపిణీ కోసం కేటాయించాయి. ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో రోజుకు సుమారు 1,800 సిలిండర్లను ఈ విధానం కింద పంపిణీ చేయనున్నారు. ముఖ్యంగా ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకుని పంపిణీలో ఐదు స్థాయిల ప్రాధాన్యతను నిర్ణయించారు:స్థాయి 1, 2: విద్యాసంస్థలు, ఆసుపత్రులు, రైల్వేలు, విమానాశ్రయాలకు అత్యున్నత ప్రాధాన్యత.స్థాయి 3: రెస్టారెంట్లు, భోజనశాలలకు 42 శాతం వాటా.స్థాయి 4: హోటళ్లు, గెస్ట్ హౌస్‌లు, ట్రస్టులకు 4 శాతం కేటాయింపు.స్థాయి 5: డెయిరీలు, బేకరీలు, స్వీట్ షాపులకు 11 శాతం కేటాయింపు.రాష్ట్రాల వారీగా..కేంద్ర మార్గదర్శకాలను అనుసరించి ఇప్పటికే ఢిల్లీ, బిహార్, హరియాణా, రాజస్థాన్ రాష్ట్రాలు అధికారిక ఉత్తర్వులు జారీ చేశాయి. గృహ వినియోగ గ్యాస్ మళ్లింపును అరికట్టడానికి, వాణిజ్య అవసరాలకు అంతరాయం కలగకుండా చూడటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పెట్రోలియం శాఖ స్పష్టం చేసింది. ఈ నూతన విధానం వల్ల పండుగల సీజన్లో, రద్దీ సమయాల్లో వాణిజ్య గ్యాస్ కొరత తలెత్తకుండా ఉంటుందని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.ఇదీ చదవండి: కార్పొరేట్ సారథులకు అగ్నిపరీక్ష -
గ్యాస్ సిలిండర్ ధర రూ.3000 అవుతుంది..!
కోల్‌కతా: జల్పైగురి జిల్లాలోని ధుప్గురి ఉపఎన్నికల ప్రచార కార్యక్రమంలో తృణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్ బెనర్జీ బీజేపీ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే ఈసారి గ్యాస్ ధర రూ.3000 అవుతుందని అన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్‌పై రూ.200 తగ్గించడంపై స్పందిస్తూ డైమండ్ హార్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీ బీజేపీ పార్టీపైనా ప్రధాని నరేంద్ర మోదీపైనా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రధాని గ్యాస్ సిలిండర్ ధరను తగ్గిస్తూ ఇది రక్షాబంధన్ కానుక అంటారు.. ఏ.. రక్షాబంధన్ ఐదేళ్లకు ఒక్కసారే వచ్చిందా ఏంటి? ఎన్నికలు దగ్గర పడుతున్నందున ప్రధాని కొత్త డ్రామాకు తెర తీశారన్నారు. 2024 ఎన్నికల్లో ఒకవేళ బీజేపీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే మాత్రం గ్యాస్ ధర రూ.3000కు చేరుతుందని అన్నారు. అదే కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే మాత్రం ఒక సిలిండర్ ధర కేవలం రూ.500కే అందిస్తామని అన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని అన్నారు.. మీకెవరికైనా ఆ డబ్బులు వచ్చాయా అని ప్రశ్నించారు. కేంద్రం ఆ డబ్బులు ఇవ్వకపోగా ఉపాధి హామీ నిధులను నిలిపివేసిందని అన్నారు. వందరోజుల పని దినాలు పథకం కింద పని చేసిన వారికి కూడా డబ్బులు ఎగ్గొట్టారని ఆరోపణలు చేశారు. పైగా వారంతా ఇక్కడికొచ్చి బాంగ్లాదేశ్ నినాదమైన 'జోయ్ బెంగాల్' ని ఇక్కడ బెంగాల్లో నినదించి ఈ ప్రాంతాన్ని అవమానిస్తారు. సెప్టెంబర్ 5న జరగబోయే ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని ఘోరంగా ఓడించాలని ఈ ఓటమికి ఆ అభ్యర్థి ఇంట్లో నుంచి బయటకు రావడానికి కూడా సిగ్గుపడాలని ప్రజలను అభ్యర్ధించారు. ఈ దెబ్బతో బీజేపీ పార్టీకి ప్రజల బలం ఏమిటో తెలిసి రావాలని అన్నారు. ఈ సందర్బంగా అభిషేక్ ఈ ఉపఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే సీఎంతో మాట్లాడి ధుప్గురికి మూడు నెలలో సబ్ డివిజన్ హోదా కల్పిస్తామని అన్నారు. అభిషేక్ బెనర్జీ వ్యాఖ్యలపై స్పందించిన ప్రతిపక్ష నేత సువెందు అధికారి.. ముందు ఆశా వర్కర్ల జీతాలు, గ్రూపు-డి ఉద్యోగుల జీతాలు ఎందుకంత తక్కువగా ఉన్నాయని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రంతో సమానంగా డీఏ చెల్లించే విషయమై ఎంతకాలం ఎదురుచూడాలని ప్రశ్నించారు. మరో బీజేపీ నేత సమీక్ భట్టాచార్య మాట్లాడుతూ.. అభిషేక్ బెనర్జీకి రాజ్యాంగం పట్ల కొంచెం కూడా గౌరవం లేదని ఉంటే ఎన్నికల సమయంలో ఆచరణసాధ్యం కానీ హామీలు ఇచ్చేవారు కాదని విమర్శించారు. ভোট মরশুমে মানুষের মন জয় করতেই রান্নার গ্যাসের দাম ২০০ টাকা কমিয়েছে কেন্দ্রের জনবিরোধী বিজেপি সরকার। আগামী দিনে কেন্দ্রের সরকার বদলে গেলে গ্যাসের দাম কমে ৫০০ টাকা হয়ে যাবে।#TrinamooleNaboJowar #WestBengal #Jalpaiguri pic.twitter.com/eATYbLdtv8 — Trinamoole Nabo Jowar (@TMCNaboJowar) September 2, 2023 ఇది కూడా చదవండి: ఇకపై బహుభార్యత్వం నిషేధం.. డిసెంబర్లో బిల్లు -
పెట్రో డిమాండ్ ఢమాల్
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా పెట్రోలు వినియోగం భారీగా పడిపోయింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. రవాణా సౌకర్యాలు స్థంభించిపోయాయి. దీంతో వంటగ్యాస్ మినహా అన్ని పెట్రోలియం ఉత్పత్తుల డిమాండ్ భారీగా క్షీణించింది. ఏప్రిల్‌లో భారతదేశ ఇంధన వినియోగం రికార్డు స్థాయిలో 50 శాతం పడిపోయింది. పరిశ్రమ గణాంకాల ప్రకారం ఏప్రిల్ మొదటి అర్ధభాగంలో ఇంధన వినియోగానికి సంబంధించిన పెట్రోల్ అమ్మకాలు 64 శాతం తగ్గాయి, డీజిల్ అమ్మకాలు 61 శాతం కీణించాయి. అంతేకాదు దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా రద్దు కావడంతో ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ఎటిఎఫ్) వినియోగం 94 శాతం పడిపోయింది. అయితే వంటగ్యాస్ వినియోగం మాత్రం 21శాతం పుంజుకుంది. ప్రధానంగా ప్రభుత్వం పేదప్రజలకు ఏప్రిల్ 1 నుండి 15 వరకు ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు ప్రకటించిన కారణంగా ఈ వృద్ది నమోదైంది. మొత్తం మీద పెట్రోలియం ఉత్పత్తి అమ్మకాలు 50 శాతం తగ్గాయి. ఇప్పటివరకు ఇదే అతిపెద్ద క్షీణత అని పరిశ్రమ పెద్దలు చెబుతున్నారు. కాగా 2019 ఏప్రిల్‌లో భారతదేశంలో 2.4 మిలియన్ టన్నుల పెట్రోల్ విక్రయం నమోదైనాయి. డీజిల్ వినియోగం 7.3 మిలియన్ టన్నులు. 6,45,000 టన్నుల ఏటీఎఫ్ విక్రయాలు నమోదయ్యాయి. కరోనా వైరస్ విస్తరణను అడ్డుకునే క్రమంలో దేశంలో మార్చి 25 నుంచి 21 రోజుల లాక్డౌన్ ప్రకటించారు. అనంతరం దీన్ని మే 3వ తేదీ వరకు పొడిగించారు. అయితే ఏప్రిల్ 20వ తేదీనుంచి ఇ-కామర్స్ కంపెనీలపై ఆంక్షలను ఎత్తివేయనుంది. అలాగే పోర్ట్, ఎయిర్ కార్గోలాంటి ఇతర కార్యకలాపాలు పునఃప్రారంభం కానున్నాయి. -
గ్యాస్ మంట
న్యూఢిల్లీ: వంటగ్యాస్ ఎల్పీజీ ధర అమాంతం పెరిగింది. సిలిండర్‌పై ఒక్కసారిగా రూ.144.5 పెంచుతూ కేంద్రం అసాధారణ నిర్ణయం తీసుకుంది. దీంతో ఢిల్లీలో రూ.714గా ఉన్న సిలిండర్ ధర రూ.858.50కి చేరుకుంది. 2014 జనవరి తర్వాత వంటగ్యాస్ ధర ఇంత భారీస్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరల పెరుగుదలే ఇందుకు కారణమని సమాచారం. అయితే కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్‌కు ఇచ్చే సబ్సిడీని పెంచడం కొంతవరకు ఊరటనిచ్చింది. ఇంతకు ముందు రూ.153.86 రాయితీ ఇవ్వగా దాన్ని రూ.291.48కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన (పీఎమ్‌యూవై) లబ్ధిదారులకు సబ్సిడీని రూ.174.86 నుంచి రూ.312.48కు పెంచింది. సాధారణంగా ప్రతినెలా ఒకటో తారీఖున ధరలను సమీక్షిస్తుంటారు. అయితే ఈసారి రాయితీని భారీగా పెంచడంతో అనుమతుల ప్రక్రియలో జాప్యంతో రెండు వారాలు ఆలస్యమైందని అధికారులు తెలిపారు. అయితే ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు వెలువడిన మరుసటి రోజే వంటగ్యాస్ ధర పెంచడం గమనార్హం. కాగా, ఈ పెంపుపై విపక్షాలు తీవ్రస్థాయిలో స్పందించాయి. వంటగ్యాస్ ధరను పెంచుతూ బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజల జేబులకు చిల్లు పెట్టేలా ఉందని కాంగ్రెస్ పేర్కొంది. ఢిల్లీ ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతోనే కేంద్రం వంటగ్యాస్ ధరను పెంచిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్ ధరను పెంచడం పేద ప్రజలపై తీసుకున్న ‘క్రూరమైన చర్య’అని బీఎస్పీ అధినేత్రి మాయావతి అభివర్ణించారు. -
షాకింగ్ : వంటగ్యాస్ ధరకు రెక్కలు..
సాక్షి, న్యూఢిల్లీ : సబ్సిడీయేతర వంట గ్యాస్ ధర బుధవారం వరసగా ఆరోసారి ఎగబాకింది. మెట్రో నగరాల్లో భారీగా పెరిగిన ఎల్పీజీ ధరలు బుధవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఢిల్లీ, ముంబై నగరాల్లో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్‌కు వరుసగా రూ 144.5, రూ 145 వరకూ పెంచినట్టు ఇండేన్ బ్రాండ్ నేమ్‌తో వంటగ్యాస్‌ను సరఫరా చేసే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పేర్కొంది. తాజా పెంపుతో సబ్సిడీయేతర ఎల్పీజీ రేట్లు ఢిల్లీలో రూ 858, ముంబైలో రూ 829, చెన్నైలో రూ 881, కోల్‌కతాలో రూ 896కు పెరిగాయి. కాగా ఏటా 12 సిలిండర్లను ప్రభుత్వం సబ్సిడీకి అందచేస్తుండగా, అదనపు సిలిండర్‌ను మార్కెట్ ధరకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఎల్పీజీ ధరలు, రూపాయి మారకం రేటు ఆధారంగా ప్రభుత్వం నెలవారీ సబ్సిడీలను వినియోగదారులకు అందిస్తోంది. -
తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధరలు
సాక్షి, న్యూఢిల్లీ : నూతన సంవత్సర కానుకగా మహిళలకు తీపికబురు అందింది. వంట గ్యాస్ ధరను సిలిండర్‌కు రూ 5.91 మేరకు తగ్గిస్తున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. నెలరోజుల వ్యవధిలో వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గడం ఇది రెండోసారి కావడం గమనార్హం. తగ్గించిన వంట గ్యాస్ ధరలు సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి. డిసెంబర్ 1న సబ్సిడీతో కూడిన వంటగ్యాస్ సిలిండర్ ధరను రూ 6.52 మేర తగ్గించారు. జూన్ నుంచి ఆరు సార్లు వరుసగా సిలిండర్ ధర పెంపు తర్వాత తొలిసారిగా డిసెంబర్ 1న ధరలు దిగివచ్చాయి. కాగా సబ్సిడీయేతర సిలిండర్ ధరను రూ 120.50 తగ్గించినట్టు ఐఓసీ తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్లో ఎల్పీజీ ధరలు తగ్గడం, డాలర్‌తో రూపాయి విలువ బలపడటంతో వంట గ్యాస్ ధరలు దిగివచ్చాయని ఐఓసీ వెల్లడించింది. -
బండ బాదుడు
సాక్షి,సిటీ బ్యూరో: మహానగరంలో ఎల్పీజీ వంట గ్యాస్ వినియోగదారులు నిలువు దోపిడీకి గురవుతున్నారు.. సిలిండర్ డోర్ డెలివరీ సమయంలో రీఫిల్ నిర్ణీత ధరకంటే అదనంగా వసూలు చేస్తున్నారు. వినియోగదారులు సిలిండర్ ధరపై డెలివరీ బాయ్స్‌కు అదనపు చెల్లించేది చిల్లర రూపాయిలు కదా.. అనుకొని తేలికగా తీసుకుటుండంతో అది కాస్తా డిమాండ్‌గా మారింది. ఫలితంగా అదనపు వసూళ్లు డెలివరీ బాయ్స్‌కు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ప్రస్తుతం సిలిండర్ రీఫిల్ ధర రూ.667.50 ఉండగా డెలివరీ బాయ్స్ వినియోగదారుల నుంచి బలవంతంగా వసూలు చేస్తోంది రూ.690లు. అంటే నిర్ణీత ధర కంటే రూ.22.50 ఎక్కువగా వసూలు చేస్తున్నారు. ఇందు కోసమే గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు బిల్లుల వసూళ్లలో స్వైపింగ్ మిషన్ జోలికి వెళ్లడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలకు తూట్లు గ్యాస్ ఏజెన్సీలు నిబంధనలకు తూట్లు పొడుస్తున్నాయి. రీఫిల్ డోర్ డెలివరీ భారాన్ని డెలివరి బాయ్స్‌పై వదిలేసి చేతులు దులుపుకుంటున్నారు. ఫలితంగా చమురు సంస్థలు నిర్దేశించిన ఎల్పీజీ వంట గ్యాస్ నిర్ణీత ధర అమలు కావడం లేదు. గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు రీఫిల్ ధర, గ్యాస్, డోర్ డెలివరీ చార్జీ (రవాణా, హమాలీ, నిర్వహణ)లతో కలుపుకొని బిల్లింగ్ చేసి వినియోగదారులకు సరఫరా చేయాల్సి ఉంటుంది. చమురు సంస్థల నిర్ధేశించిన ధరనే బిల్లింగ్ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్లు వినియోగదారులకు సిలిండర్ సరఫరా భారాన్ని డెలివరీ బాయ్స్‌పై పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. వాస్తవంగా డెలివరీ బాయ్స్‌కు ఏజెన్సీలు కనీస వేతనాలను అమలు చేయాల్సి ఉండగా కొందరు నామమాత్రంగా వేతనాలు అందిస్తున్నారు, మరికొందరు సిలిండర్ డెలివరీపై కమీషన్ మాత్రమే ఇస్తున్నారు. ఫలితంగా డెలివరీ బాయ్స్ వినియోగదారుల నుంచి అదనంగా వసూలు చేయడం సర్వ సాధారణంగా మారింది. నిబంధన ప్రకారం బాయ్స్ డోర్ డెలివరీ సమయంలో ప్రత్యేక పరికరంతో రీఫిల్ నిర్ణీత బరువు పరిమాణాన్ని వినియోగాదారులకు చూపించాలి. అయితే ఈ విధానం ఎక్కడా అమలవుతున్న దాఖలాలు కానరావడం లేదు. కేవలం బిల్లింగ్‌పై అదనపు బాదుడు ధ్యాస తప్ప బరువు చూపించాలన్నా.. నిబంధనలను డెలివరీ బాయ్స్ మరిచి పోయారు. నిబంధనలివీ. వినియోగదారుడు ఆన్లైన్లో గ్యాస్ రీఫిల్ బుక్ చేసుకున్న తర్వాత బిల్లింగ్ చేసి డోర్ డెలివరీ చేయాలి ఏజెన్సీ నుంచి 5 కిలో మీటర్ల వరకు ఉచితంగా డోర్ డెలవరీ ఇవ్వాలి. ఏజెన్సీ నుంచి 6 కిలో మీటర్ల నుంచి 15 కిలో మీటర్లు ఉంటే రవాణ చార్జీల పేరిట రూ.10 వసూలు చేయాలి. 16 –30 కిలో మీటర్లు దూరం ఉంటే రవాణా చార్జీలు పేరిట రూ. 15 వసూలు చేయాలి వినియోగదారుడు సిలిండర్ రీఫిల్‌ను గ్యాస్ కంపెనీ గోదాముకు వెళ్లి తీసుకుంటే బిల్లులో రూ.8 మినహాయించాలి, గ్రేటర్లో వంటగ్యాస్ వినియోగదారులు ః 29.18 లక్షలు ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీలు ః 115 ప్రతిరోజు గ్యాస్ బుకింగ్ ః 80 వేలు ప్రతిరోజు సిలిండర్ సరఫరా ః 60 వేలు డెలివరీ బాయ్స్ ః 1150 ప్రస్తుతం వంటగ్యాస్ నిర్ణీత ధర ః రూ. 667.50 వినియోగదారుడు చెల్లించాల్సింది ః రూ. 667.50 డెలివరీ బాయ్స్ వసూలు చేస్తోంది ః రూ. 690 వినియోగదారుడిపై అదనపు భారం ః రూ.22.50 -
గ్యాస్ సబ్సిడీకి డిక్లరేషన్ తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: ‘మీ ఎల్పీజీ వంట గ్యాస్‌పై సబ్సిడీ కొనసాగాలా? అయితే మీ వార్షిక ఆదాయంపై తక్షణమే హామీ (డిక్లరేషన్) పత్రాన్ని డిస్ట్రిబ్యూటర్‌కు సమర్పించండి. లేదంటే www.mylpg.in లో లాగిన్ అయి ఆన్లైన్లో డిక్లరేషన్ ఇవ్వండి. కేంద్ర ప్రభుత్వం వార్షిక ఆదాయం రూ.10 లక్షలకు మించి ఉన్న కుటుంబాలకు వంట గ్యాస్ రాయితీని నిలిపివేయాలని ఆదేశించింది’... అంటూ ప్రధాన ఆయిల్ కంపెనీల నుంచి గ్యాస్ వినియోగదారుల మొబైల్ ఫోన్లకు సంక్షిప్త సమాచారం అందుతోంది. తాజా నిబంధనలతో వార్షికాదాయం రూ.10 లక్షలు మించిన కుటుంబాలకు వంటగ్యాస్‌పై రాయితీకి కత్తెర పడనుంది. ఆయిల్ కంపెనీలు ఆధార్ సీడింగ్, ఐటీ శాఖ సహకారంతో అధిక ఆదాయ వర్గాలను గుర్తించాయి. వినియోగాదారుల నుంచి డిక్లరేషన్ రాబట్టేందుకు చర్యలు చేపట్టాయి.


