Lakshmikantham
-
నాణ్యత లేని సరుకులను వెనక్కి పంపండి
అనంతపురం అర్బన్ : క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని పేద క్రైస్తవులకు కానుక కింద అందిస్తున్న సరుకుల్లో నాణ్యత లోపిస్తే వెనక్కి పంపాలని అధికారులను జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం ఆదేశించారు. స్థానిక మార్కెట్ యార్డులోని పౌర సరఫరాల సంస్థకు సంబంధించిన మండల స్థాయి స్టాక్ పాయింట్‌ను ఆయన ఆదివారం సందర్శించారు. క్రిస్మస్ కానుక సరకుల నాణ్యతను పరిశీలించారు. పాడైనట్లు గుర్తించిన సరుకుని డీలర్లకు పంపించవద్దని ఆదేశించారు. -
దేశాభివృద్ధిలో యూనివర్సిటీలదే కీలక పాత్ర
ఐఐసీటీ డెరైక్టర్ లక్ష్మీకాంతం ఘనంగా మహిళా వ ర్సిటీ స్నాతకోత్సవం యూనివర్సిటీ క్యాంపస్ : దేశాభివృద్ధిలో యూనివర్సిటీలదే కీలకపాత్రని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (హైదరాబాద్) డెరైక్టర్ ఎం.లక్ష్మీకాంతం అన్నారు. శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో బుధవారం 15వ స్నాతకోత్సవం నిర్వహించారు. ఈ స్నాతకోత్సవానికి గవర్నర్ హాజ రు కాలేదు. దీంతో వీసీ రత్నకుమారి చాన్సలర్ హోదాలో డిగ్రీలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గౌరవ డాక్టరేట్ అందుకున్న లక్ష్మీకాంతం స్నాతకోపన్యాసంచేశారు. ప్రస్తుతం మనదేశంలో అపారమైన జ్ఞానసంపద ఉందన్నారు. ఎంతోమంది మేధావులు ఉన్నప్పటికీ వారిజ్ఞానం సమాజానికి, దేశానికి ఉపయోగించుకోలేక పోతున్నామన్నారు. సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, మ్యాన్‌ఫ్యాక్చరింగ్, మేనేజ్మెంట్స్కిల్స్ తోడైతే అద్భుతాలు చోటు చేసుకుంటాయన్నారు. విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థలు దేశాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన మానవ సంపదను తయారు చేయాలన్నా రు. సమాజంలోని సమస్యలను పరిష్కరించే దిశగా విశ్వవిద్యాలయాలు పరిశోధనలు చేయాలని కోరారు. ఇవన్నీ జరగాలంటే విశ్వవిద్యాలయాల్లో నాణ్యమైన విద్య అందాలన్నా రు. విశ్వవిద్యాలయాల్లో మౌలిక సదుపాయాలు, వసతులు, పరిశోధన పరికరాలు అందించినప్పుడే అవి నాణ్యమైన విద్యను అందించగలవన్నారు. గొప్ప మహిళలను ప్రతి మహి ళ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. శాస్త్రసాంకేతిక రంగాల్లో మహిళల పాత్ర పెంచడం ద్వారా మహిళా సాధికారత సాధించవచ్చన్నారు. అయితే ప్రస్తుతం ఈ రంగంలో మహిళలపై వేధింపులు చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఎంతోమంది మహిళలను విద్యావంతులను చేసి సమాజానికి అందిస్తోందన్నారు. విద్యార్థినుల సందడి నాలుగు సంవత్సరాల తర్వాత స్నాతకోత్సవం జరగడంతో వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థినులు వారి కుటుంబ సభ్యులతో వచ్చారు. స్నాతకోత్సవం ముగిశాక పాతమిత్రులను కలసి ముచ్చట్లు చెప్పుకుంటూ సందడి చేశారు. కఠిన శ్రమతోనే విజయం విద్యార్థులు తమ రంగంలో విజయం సాధించాలంటే కఠిన శ్రమ తప్ప వేరే ప్రత్యామ్నాయాలు లేవన్నారు. విద్యార్థులు మొదట స్పష్టమైన, బలమైన లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు కొత్త విషయాలను తెలుసుకోవాలని, కఠిన శ్రమతో సాధన చేస్తే విజయం సాధించగలరని చెప్పారు. వీసీ రత్నకుమారి తన ప్రసంగంలో విశ్వవిద్యాలయం సాధించిన ప్రగతిని వివరించారు. 1948 మందికి డిగ్రీలు స్నాతకోత్సవంలో 1948 మందికి డిగ్రీలు ప్రదానం చేశా రు. 71 మందికి బంగారుపతకాలు, 13 బుక్‌ప్రైజ్‌లు, 13 మందికి నగదు బహుమతులు, 117 మందికి పీహెచ్‌డీలు, 15 మందికి ఎంఫిల్ డిగ్రీలు, 986 మందికి పీజీలు, 588 మందికి డిగ్రీలు, 242 మందికి దూరవిద్యా డిగ్రీలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఎం.విజయలక్ష్మి, డీన్లు ఎంవీ. రమణమ్మ, ఈ.మంజు పాల్గొన్నారు. -
రూ.3,630 కోట్లు వార్షిక రుణ ప్రణాళిక
కలెక్టరేట్ : 2014-15 ఆర్థిక సంవత్సరానికి రూ.3,630.44 కోట్లతో జేసీ లక్ష్మీకాంతం వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బ్యాంకర్లు, అధికారులతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో 26వ వార్షిక రుణ ప్రణాళిక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ వివిధ బ్యాంకు అధికారులు రైతులకు పంటరుణాలు, ప్రభుత్వ రాయితీలు సకాలంలో అందించాలన్నారు. రైతులను ఏమాత్రం ఇబ్బందులకు గురి చేయకూడదని, జిల్లాలోని బంగారు తల్లి, జననీ సురక్ష యోజన పథకం లబ్ధిదారులకు జీరో బ్యాలెన్స్ ఖాతాలు తెరవడాలని సూచించారు. గతేడాది నిర్ధేశించిన లక్ష్యాలను బ్యాంకు అధికారులు పూర్తిగా సాధించలేదని, ఈ ఏడాదిలో వంద శాతం సాధించి రైతులకు లబ్ధి చేకూర్చాలన్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఎస్బీహెచ్ లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో రూ.3,630.44 కోట్లతో వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు. ప్రియారిటీ కింద రూ.3,205.64 కోట్లు, నాన్ ప్రియారిటీ కింద రూ.424.80 కోట్లు చొప్పున ప్రణాళికలు తయారు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాదిలో రైతులను ఇబ్బందులు పెట్టకుండా రుణ అర్హత కార్డు ఉన్న వారిని గుర్తించి ఆ రైతులకు రుణాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయా బ్యాంకు అధికారులను, సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. వ్యవసాయం, ఎస్సీ, బీసీ, మైనార్టీ, వికలాంగుల, రాజీవ్ యువశక్తిపై గతేడాదిలో సాధించిన ఫలితాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో లీడ్‌బ్యాంక్ మేనేజర్ శర్మ, ఆర్బీఐ ఆర్వోజే పుల్లారెడ్డి, నాబార్డ్ మేనేజర్ రవి, బ్యాంకు అధికారులు మహ్మద్‌ఖాన్, దక్షిణేశ్వర్, వినయ్‌కుమార్, రాజేందర్, జేడీఏ రోజ్‌లీల, స్టేప్ సీఈవో వెంకటేశ్వర్లు, బీసీ కార్పోరేషన్ ఈడీ నారాయణరావు, మైనార్టీ సంక్షేమ శాఖ ఈడీ శాస్త్రీ, అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు.