breaking news
Krishna lanka police station
-
బెజవాడ బాస్ భారీ డీల్!
సాక్షి, అమరావతి: విజయవాడ పోలీస్ బాస్ రూటే సెప‘రేటు’. కాపు యువకుడు గాదె సాయికృష్ణను విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ లాకప్‌లోనే మాయం చేసిన దారుణం రాష్ట్రాన్నే నివ్వెరపరచగా.. మరోవైపు పోలీసు బాస్ అక్రమాలు మరింతగా బట్టబయలవుతున్నాయి. రూ.300 కోట్ల అక్రమ డిపాజిట్లతో ఖాతాదారులను బురిడీ కొట్టించిన ఓ ప్రైవేటు ఆర్థిక సంస్థకు అనుకూలంగా ఆయన కథ నడిపించిన తీరు అధికారిక వైట్ కాలర్ నేరాన్ని తలపిస్తోంది. సీఐడీ, ఈడీల కళ్లు గప్పేందుకు ఆ కేసును నీరుగార్చిన తీరు.., ఆ సంస్థ మేనేజ్మెంట్తో భారీ డీల్ కుదుర్చుకున్న వైనం విస్మయపరుస్తోంది. ప్రభుత్వ పెద్దలు రెడ్‌బుక్ కుట్రల కేసులను దర్యాప్తు చేస్తున్న సమయంలోనే విజయవాడ కేంద్రంగా భారీ దందాలకు పాల్పడాలన్నది ఆయన ఉద్దేశమన్నది స్పష్టమవుతోంది. ప్రస్తుతం పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ డీల్ కథా కమామిషు ఇదిగో ఇదీ..రూ.300 కోట్ల అక్రమ డిపాజిట్ల దందాఅద్వైక ట్రేడింగ్ కంపెనీ విజయవాడ కేంద్రంగా ఆర్థిక అక్రమాలకు పాల్పడింది. రిజర్వ్ బ్యాంకు నిబంధనలను ఉల్లంఘిస్తూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వద్ద కనీసం రిజిస్ట్రేషన్ కూడా చేసుకోకుండా ఖాతాదారుల నుంచి అక్రమ డిపాజిట్లు వసూలు చేసింది. అధిక వడ్డీ ఆశ చూపించి దాదాపు 1,500 మంది ఖాతాదారుల నుంచి రూ.300 కోట్లకు పైగా డిపాజిట్లు అక్రమంగా వసూలు చేసి, వారిని బురిడీ కొట్టించింది. ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాల్లో 70 మందికి పైగా ఏజంట్లను నియమించుకుని డిపాజిట్లు సేకరించింది. అనంతరం వడ్డీలు చెల్లించడం నిలిపివేసింది. దీనిపై ఖాతాదారులు ప్రశ్నించినా సరైన సమాధానం ఇవ్వకుండా ముఖం చాటేసింది. ఓ ఖాతాదారుడు ఫిర్యాదు చేయడంతో కంపెనీపై గత ఏడాది జూన్‌లో కేసు నమోదు చేశారు. మోసపోయిన ఖాతాదారులు దాదాపు 1,500 మంది విజయవాడ పోలీసులకు గోడు వెళ్లబోసుకున్నారు. డిపాజిట్ పత్రాలు, ఇతర ఆధారాలు సమర్పించారు. దాంతో ఈ కేసుపై విజయవాడ పోలీసులు సమగ్ర దర్యాప్తు చేసి డిపాజిటర్లకు న్యాయం చేస్తారని అంతా భావించారు. అదే సమయంలో పోలీస్ బాస్ రంగంలోకి దిగారు. అద్వైక ట్రేడింగ్ కంపెనీ యాజమాన్య ప్రతినిధులను పిలిపించారు. కేసు సమగ్రంగా విచారిస్తే అక్రమ డిపాజిట్లు మొత్తం వెనక్కి ఇవ్వాల్సి రావడంతోపాటు.. తీవ్ర శిక్ష పడుతుందని తనదైన శైలిలో బెదిరించారు. తన డీల్ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. అందుకు యాజమాన్య ప్రతినిధులు సమ్మతించినట్టు సమాచారం. దాంతో పోలీస్ బాస్ చకచకా పావులు కదిపారు.రూ.300 కోట్ల మోసం.. రూ.53 లక్షల కేసు1,500 మంది నుంచి రూ.300 కోట్లకుపైగా అక్రమ డిపాజిట్లు వసూలు చేసిన ఈ ఆర్థిక మోసం కేసును నిబంధనల ప్రకారం సీఐడీ దర్యాప్తు చేయాలి. మార్గదర్శి చిట్‌ఫండ్స్, అగ్రిగోల్డ్ కేసులను సీఐడీనే విచారించింది. కేసు వివరాలను, ఎఫ్ఐఆర్ కాపీని కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి నివేదించాలి. దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడించాలి. కానీ ఈ కేసును సీఐడీ పరిధిలోకి, ఈడీ దృష్టికి వెళ్లకుండా పోలీస్ బాస్ కనికట్టు చేశారు. అందుకే ఒక్క ఖాతాదారుడు ఇచ్చిన ఫిర్యాదుకే పరిమితమై.. ఈ కేసును కేవలం రూ.53 లక్షల మోసానికే పరిమితం చేశారు. మిగిలిన 1,500 మంది ఫిర్యాదును పట్టించుకోలేదు. ఇలా ఈ కేసు విజయవాడ పోలీసుల పరిధి దాటిపోకుండా అడ్డుకట్ట వేశారు. బాసే కేసును గుప్పిట్లో పెట్టుకున్నారు. ఇందుకోసం ఆ కంపెనీ మేనేజ్మెంట్తో భారీ డీల్ కుదుర్చుకుని కేసును మసిపూసి మారేడు కాయ చేసేశారు. ప్రైవేటు బ్యాంకు ఖాతాకు మళ్లింపుటాస్క్ఫోర్స్ విభాగంలోని తనకు అనుకూలమైన అధికారులతో కలిసి పోలీస్ బాస్ ఈ దందాలో రెండో అంకానికి తెరతీశారు. అద్వైక ట్రేడింగ్ కంపెనీ 70 మంది ఏజంట్ల ద్వారా డిపాజిట్లు సేకరించగా, కేసును 9 మందికే పరిమితం చేశారు. కేవలం ఒక్క మేనేజర్‌ను నిందితుడిగా చేర్చారు. అక్రమ డిపాజిట్లు వసూలు చేసిన కంపెనీ యాజమాన్యాన్ని కేసు నుంచి తప్పించేశారు. ఈ వ్యవహారంలో పెద్ద భాగాన్నే డీల్ మొత్తంగా ఒప్పందం కుదుర్చుకున్నారని సమాచారం. ఆ మొత్తాన్ని కూడా చట్టం కళ్లుగప్పి తమ ఖాతాలో పడేట్టు చేసుకున్నారు. ఓ ప్రైవేటు బ్యాంకులో ఖాతా తెరిచి, అందులోకి డీల్ మొత్తాన్ని దశలవారీగా డిపాజిట్ చేయించినట్టు తెలుస్తోంది. దీనిని టాస్క్‌ఫోర్స్ విభాగంలో ఇద్దరు అధికారులు పర్యవేక్షించినట్ల సమాచారం. మోసపోయిన డిపాజిట్‌దారుల ఆవేదనను ఏమాత్రం పట్టించుకోకుండా అద్వైక ట్రేడింగ్ కంపెనీతో డీల్ కుదుర్చుకుని కేసును నీరుగార్చిన తీరు విస్మయపరుస్తోందని పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. -
సాయికృష్ణ లాకప్‌డెత్‌పై తల్లి న్యాయ పోరాటం
సాక్షి, అమరావతి: కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో అతడి తల్లి విజయలక్ష్మి తన న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. అదృశ్యమైన తన కుమారుడి ఆచూకీ తెలుసుకుని కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని ఇప్పటికే హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసి న్యాయ పోరాటం చేస్తున్న విజయలక్ష్మి తాజాగా మరోసారి హైకోర్టు తలుపుతట్టారు. తన కుమారుడి లాకప్‌డెత్ కేసు దర్యాప్తు బాధ్యతలను స్థానిక పోలీసుల నుంచి తప్పించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) లేదా న్యాయస్థానం సరైనదని భావించే మరేదైనా ఇతర సమర్థవంతమైన స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని అభ్యరి్థస్తూ ఆమె హైకోర్టులో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఈ స్వతంత్ర దర్యాప్తు కేవలం ఆ సంస్థ పరిధిలోనే కాకుండా పూర్తి స్థాయిలో కోర్టు ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగేలా చూడాలని ఆమె హైకోర్టుకు విన్నవించారు. సాయికృష్ణ ఏ పరిస్థితులలో మాయమయ్యాడు? దీని వెనుక ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో ఎటువంటి పక్షపాతం లేకుండా, పారదర్శకంగా స్వతంత్ర విచారణ జరిపించాలని కోరారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరీ, జస్టిస్ సుభేందు శమంతో ధర్మాసనం సోమవారం విచారణ జరపనుంది. 40 రోజుల పాటు కమిషనర్ మౌనంగా ఉన్నారంటే అర్థమేంటి..? ‘కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిబ్బంది, టాస్‌్కఫోర్స్ అధికారులు సాయికృష్ణ అదృశ్యం, సాక్ష్యాల నాశనంలో స్వయంగా భాగస్వాములుగా ఉన్నారని సిట్ తన రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. నిందితులుగా ఉన్న అదే పోలీస్ శాఖే ఈ కేసును విచారిస్తే న్యాయం జరగదు. ఉన్నతాధికారులను కాపాడటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మాకు న్యాయం జరగాలంటే ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించడమే ఏకైక మార్గం. తన అధికార పరిధిలో ఒక వ్యక్తి అదృశ్యం కావడం, పోలీస్ కస్టడీలో మరణం లాంటి తీవ్రమైన ఘటన జరిగితే కనీసం 7 రోజుల్లోగా ఆ ప్రాంత పోలీసు అధిపతి అయిన కమిషనర్‌కు పూర్తి సమాచారం తెలిసిపోతుంది. కానీ ఈ కేసులో సదరు కమిషనర్ 40 రోజుల పాటు పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘకాలం కమిషనర్ స్పందించకపోవడం దేనిని సూచిస్తోందంటే.. ఈ నేరంలో లేదా ఈ విషయాన్ని తొక్కిపెట్టడంలో కేవలం కింది స్థాయి సిబ్బందే కాకుండా ఉన్నత స్థాయి అధికారుల హస్తం కూడా ఉందనే బలమైన అనుమానాలకు తావిస్తోంది. ఈ కుట్రలో పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్ద అధికారుల ప్రమేయం ఉన్నప్పుడు న్యాయం జరుగుతుందని ఆశించడంలో అర్థమే లేదు. ఈ అసాధారణ పరిస్థితుల దృష్ట్యా స్థానిక పోలీసుల దర్యాప్తును నమ్మడానికి వీల్లేదు కాబట్టి, హైకోర్టు వెంటనే జోక్యం చేసుకుని ఈ కేసును సీబీఐకి అప్పగించాలి’ అని సాయికృష్ణ తల్లి హైకోర్టును అభ్యర్థించారు. హైకోర్టుకు ఏదో ఒకటి చెప్పి కేసును మూసేయించాలని చూస్తున్నారు.. ‘ప్రస్తుత దర్యాప్తు కేవలం ఒక్క పోలీస్ అధికారి (నాగరాజు) చుట్టూనే తిరుగుతోంది. కానీ అసలు నిజం ఏమిటంటే కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు చెందిన సిబ్బంది మొత్తం సాయికృష్ణ అదృశ్యం ఘటనలో భాగస్వాములయ్యారు. సాయికృష్ణ ప్రాణాలు తీసి అతడి శరీరాన్ని ఎప్పటికీ దొరకకుండా మాయం చేయాలనే క్రూరమైన ఉద్దేశంతో వీరంతా కలిసి పనిచేశారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ ఈ కుట్రను పూర్తిగా ఛేదించడం లేదు. నేరంలో భాగమైన కృష్ణలంక స్టేషన్ సిబ్బంది అందరినీ వదిలేసి, కేవలం ఆ ఒక్క నిందితుడి నుంచి మాత్రమే సమాచారాన్ని రాబట్టడానికి ప్రయత్నిస్తోంది. ఇది కేవలం కంటితుడుపు చర్య మాత్రమే. తాము దర్యాప్తు చేస్తున్నట్లు హైకోర్టుకు ఏదో ఒక నివేదిక సమర్పించి తద్వారా ఈ హెబియస్ కార్పస్ పిటిషన్‌ను మూసివేయించాలని చూస్తున్నారు. ఒకసారి కోర్టులో ఈ పిటిషన్ మూసివేస్తే ఈ కేసు భవిష్యత్తులో ఎప్పటికీ వెలుగులోకి రాకుండా పూర్తిగా అణచివేయవచ్చని, దోషులను శాశ్వతంగా తప్పించవచ్చని పోలీసులు భావిస్తున్నారు’ అని ఆమె తన పిటిషన్లో ఆరోపించారు. ఫిర్యాదు చేసిన 45 రోజుల తరువాత కేసు నమోదు చేశారు... ‘సాయికృష్ణ అదృశ్యంపై నేను మే 28నే విజయవాడ పోలీస్ కమిషనర్‌కు అధికారికంగా ఫిర్యాదు చేశా. ఒక పౌరుడి ప్రాణానికి సంబంధించిన ఇంతటి తీవ్రమైన విషయంపై, అది కూడా హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ పెండింగ్‌లో ఉన్నప్పటికీ, పోలీసులు జూన్ 19 వరకు కేసు నమోదు చేయకపోవడం వెనుక వారి ఉద్దేశాలు స్పష్టమవుతున్నాయి. కేసు నమోదు చేయడానికి దాదాపు 45 రోజులకు పైగా సుదీర్ఘ జాప్యం జరిగింది. ఈ 45 రోజుల కాలంలో బాధితుడి తల్లిగా నేను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా కదలని యంత్రాంగం, కేవలం ఈ హెబియస్ కార్పస్ పిటిషన్ ద్వారా ఈ వ్యవహారం హైకోర్టు పరిధిలోకి తీసుకొచ్చిన తర్వాతే దిగివచ్చి కేసు నమోదు చేసింది. ఒక వ్యక్తి అదృశ్యమైన వెంటనే ప్రాథమిక చర్యలు చేపట్టాల్సిన పోలీసులు 45 రోజుల పాటు మౌనంగా ఉండి, కోర్టు జోక్యం తరువాతే దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశామని చెప్పడం వారి నిబద్ధతను శంకిస్తోంది. సాయికృష్ణ అదృశ్యమైన తొలి రోజుల్లోనే గాలింపు ప్రారంభించకుండా కేసును కోర్టు విచారణ వరకు లాగడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటంటే.. ఈలోపు పోలీసులకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాధారాలన్నింటినీ పూర్తిగా తుడిచిపెట్టేయడమే’ అని సాయికృష్ణ తల్లి నివేదించారు. హత్యానేరం ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే దర్యాప్తు చేయడమా..? ‘సాయికృష్ణ పోలీసు కస్టడీలో దారుణమైన హింసను ఎదుర్కొన్నాడు. ఆ తర్వాతే అతడిని మాయం చేశారు. ఇదంతా స్థానిక పోలీసుల ఆధ్వర్యంలోనే జరిగింది. చట్టంలో ఒక ప్రాథమిక సూత్రం ఉంది. ఎవరూ కూడా తమ సొంత కేసులో తామే న్యాయమూర్తిగా లేదా దర్యాప్తు అధికారిగా ఉండకూడదు. ఎవరిపై అయితే హత్యానేరం లేదా అక్రమ నిర్బంధం ఆరోపణలు ఉన్నాయో, వారికే దర్యాప్తు చేసే అధికారం ఇస్తే వారు తమ తప్పులను తామే ఎలా ఒప్పుకుంటారు? నిందితులుగా ఉన్న పోలీస్ యంత్రాంగాన్నే ఈ కేసును దర్యాప్తు చేయడానికి అనుమతిస్తే, అది ‘నిష్పక్షపాత, పారదర్శక, స్వతంత్ర దర్యాప్తు లక్ష్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది’ అని విజయలక్ష్మి తన పిటిషన్లో పేర్కొన్నారు. కంటి తుడుపు సిట్ దర్యాప్తుతో ఉపయోగం లేదు... ‘సాయికృష్ణ ఆచూకీ కనిపెట్టడానికి సిట్‌ను ఏర్పాటు చేశామని పోలీసులు కోర్టు ముందు కేవలం మాటల్లోనే చెబుతున్నారు. కానీ, ఆ మాటలకు తగ్గట్టుగా ఎలాంటి చట్టపరమైన ఆధారాలను, నివేదికలను వారు ఇప్పటివరకు కోర్టుకు సమర్పించలేదు. హైకోర్టు విచారణ ప్రారంభమై ఇన్ని రోజులవుతున్నా, పోలీసులు ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయలేదు. ఒకవేళ వారు నిజంగానే నిజాయితీగా దర్యాప్తు చేస్తుంటే, ఆ నిజాలను అఫిడవిట్ రూపంలో కోర్టుకు తెలపడానికి ఎందుకు వెనుకాడుతున్నారు? సాయికృష్ణ అసలు ఏ పరిస్థితులలో మాయమయ్యాడు? అనే దానికి సంబంధించిన వాస్తవాలను పోలీసులు కోర్టుకు చెప్పకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అందుకే ఈ కంటితుడుపు సిట్ దర్యాప్తులను పక్కనబెట్టి కేసును తక్షణమే సీబీఐ లాంటి స్వతంత్ర సంస్థకు అప్పగిస్తేనే నిజాలు బయటకు వస్తాయి. కోర్టు ఆ దిశగా తగిన ఆదేశాలు జారీ చేయాలి’ అని విజయలక్ష్మి తన పిటిషన్లో హైకోర్టును అభ్యర్థించారు. ఉన్నతాధికారులు ఎందుకు తక్షణమే స్పందించలేదు..? ‘ఒకవేళ కింది స్థాయి పోలీస్ సిబ్బంది సాయి కృష్ణ అరెస్ట్, అదృశ్యం గురించి తమ పైఅధికారులకు ముందే సమాచారం అందించి ఉంటే... అంతటి తీవ్రమైన విషయంలో ఆ ఉన్నతాధికారులు ఎందుకు తక్షణమే స్పందించలేదు? చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోలేదు? అంటే.. వారు కూడా ఈ నేరాన్ని లోపల సమరి్థస్తూ, దాచడానికి ప్రయత్నించారు. ఒకవేళ కింది స్థాయి సిబ్బంది ఈ విషయాన్ని తమ పైఅధికారులకు చెప్పకుండా దాచిపెట్టి ఉంటే... అది నిజాలను తీవ్రంగా తొక్కిపెట్టడం, తమ అధికారిక విధులను నిర్వర్తించడంలో ఘోరంగా విఫలం కావడం కిందకే వస్తుంది. ఒక పౌరుడి ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా ఉన్నతాధికారులు, కిందిస్థాయి అధికారులు ఆ విషయాన్ని దాచగలిగారంటే అక్కడ పర్యవేక్షణ ఎంత దారుణంగా ఉందో సులభంగా అర్థం చేసుకోవచ్చు’ అని విజయలక్ష్మి పేర్కొన్నారు.ఉద్దేశపూర్వకంగానే హైకోర్టును తప్పుదోవ పట్టించారు... ‘సాయికృష్ణ అదృశ్యంపై నేను దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు పలుమార్లు విచారణ జరిపింది. సాయికృష్ణ అసలు ఎవరి కస్టడీలో ఉన్నాడు? అతడిని ఎక్కడ నిర్బంధించారు..? ప్రస్తుతం అతడి పరిస్థితి ఏమిటి? అనే విషయాలపై అప్పుడు కూడా కనీస సమాచారాన్ని పోలీసులు హైకోర్టుకు వెల్లడించలేదు. ఆ తర్వాత సిట్ తన రిమాండ్ రిపోర్టులో సాయికృష్ణను మే 6నే కృష్ణలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, స్పష్టమైన ఆధారాలు దొరికాయని పేర్కొంది. దీన్నిబట్టి చూస్తే జూన్ 2 నుండి కోర్టు విచారణల సమయంలో సాయికృష్ణ అక్రమ నిర్భంధం గురించి, అదృశ్యం గురించి పోలీసులు ఉద్దేశపూర్వకంగానే న్యాయస్థానాన్ని సైతం పక్కదారి పట్టించారని స్పష్టమవుతోంది’ అని ఆమె నివేదించారు. ముందస్తు ప్రణాళికతోనే సాక్ష్యాలను నాశనం చేశారు...‘సాయికృష్ణను ఈ ఏడాది మే 6న ప్రకాశం జిల్లా మార్కాపురంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి విజయవాడ కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌కు తరలించి పోలీస్ కస్టడీలోనే ఉంచారు. దీనిని సిట్ రిమాండ్ రిపోర్ట్ ధృవీకరిస్తోంది. చట్ట ప్రకారం ఏ వ్యక్తినైనా అరెస్ట్ చేస్తే 24 గంటల్లోగా స్థానిక మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాలి. కానీ సాయికృష్ణ్ణను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచకుండా పోలీసులు చట్టాన్ని పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకున్నారు. సాయికృష్ణను స్టేషన్‌కు తీసుకువచ్చిన కాలానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు డిలీట్ చేశారు. ఇది కస్టడీలో అతడిపై జరిగిన హింసను, మరణాన్ని దాచడానికి పోలీసులు అంతా కలిసి సాక్ష్యాలను ముందస్తు ప్రణాళికతో నాశనం చేశారనడానికి బలమైన ఆధారం’ అని విజయలక్ష్మి తన అనుబంధ పిటిషన్లో స్పష్టం చేశారు. -
పోలీసులు ఈ చిన్న లాజిక్‌ను మిస్సయ్యారు సాయి కృష్ణ కేసులో దృశ్యం సీన్ రిపీట్..!
-
CI నాగరాజును ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఏం ప్రశ్నలు అడగనున్నారు.?
-
పోలీసులు అదుపులోకి తీసుకున్నా నోరు విప్పని సీఐ నాగరాజు
-
CI నాగరాజు ఇంటి వద్ద హైటెన్షన్
-
కృష్ణలంక సీసీ ఫుటేజ్ మాయం CI నాగరాజు చేసిన పెద్ద మిస్టేక్
-
ACPతో సంచలన విషయాలు చెప్పిన సాయి కృష్ణ మేనమామ
-
నా జీవితంలో ఎప్పుడూ ఇలాంటి కేసు చూడలేదు: జడ శ్రవణ్
సాక్షి, విజయవాడ: ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ కేసుపై ప్రముఖ న్యాయవాది, జైభీమ్ రావ్ భారత్ పార్టీ వ్యవస్థాపకుడు జడ శ్రవణ్ కుమార్ స్పందించారు. ఈ ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆయన తెలిపారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వంపై, ప్రభుత్వ పెద్దలపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.విజయవాడలో గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏదైనా కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు తప్పనిసరిగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాల్సిన నిబంధన ఉందని అన్నారు. అయితే గాదె సాయికృష్ణ వ్యవహారంలో ఆ నిబంధనలు పాటించలేదని ఆయన అభిప్రాయపడ్డారు.ఇంకా ఆయన ఏమన్నారంటే.. సాయికృష్ణ కేసులో కూటమి ప్రభుత్వ పనితీరు.. ప్రజాస్వామ్యానికి ఒక మాయని మచ్చ. భారతదేశ చరిత్రలో ఇంత హీనమైన, హేయమైన ఘటన ఎప్పుడూ లేదు. ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని మూటకట్టి అటకపై పడేశారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఏ రాజ్యాంగం ప్రకారమైనా తప్పు చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో హాజరుపరచాలి. రాజకీయ నాయకులకు తొత్తులుగా ఉండే కొందరు పోలీసులు చేసేదే లాకప్ డెత్. చట్టాలు అప్ గ్రేడ్ అయినట్లు పోలీసులు కూడా అప్ గ్రేడ్ అయినట్లున్నారుఏపీ హోంమంత్రికి ఓ కత్తెర మంత్రి. ఇన్ విజిబుల్ పోలీసింగ్ అని ఏదో ఒక్క అర్ధం చెబుతున్నారామె. నా పాతికేళ్ల న్యాయవృత్తిలో ఇలాంటి పదాలు నేనెప్పుడూ వినలేదు. లాకప్ డెత్ లు జరిగినపుడు పోలీసులు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారుసాయికృష్ణను చంపేసి బూడిద చేశారని అతని తల్లి ఆరోపిస్తోంది. తన కొడుకుని చూపించమని పోలీసులను సాయికృష్ణ తల్లి వేడుకుంది. సాయికృష్ణ కుటుంబానికి పూర్తి న్యాయం జరిగేవరకూ నేను అండగా ఉంటా. న్యాయపరంగా అవసరమైతే సాయం అందిస్తా. సాయికృష్ణకు జరిగిన అన్యాయం పై కులమతాలకు అతీతంగా అండగా నిలవాలిహోంమంత్రికి చిత్తశుద్ధి ఉంటే.. మే 9 నుంచి ఈరోజు వరకూ ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని బయటపెట్టాలి. స్టేషన్ మొత్తం సిసి కెమెరాలు ఉంటే.. సీఐ రూమ్‌లో సీసీ కెమెరాలు ఎందుకు లేవు. ఏపీలో ప్రతీ స్టేషన్లో ఇంటరాగేషన్ కోసం వ్యక్తిగత రూమ్ లు ఏర్పాటు చేసుకున్నారు. కృష్ణలంక సీఐ వ్యక్తిగత రూమ్‌లో కూడా ఇలాంటివే జరుగుతున్నాయిసాయికృష్ణ మృతి కేసులో ఏ1 ముద్దాయి మంత్రి లోకేష్. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని సృష్టించిన రోజే ఏపీలో లా అండ్ ఆర్డర్ పాతరేశారు. ఏ2 ముద్దాయి సీఎం చంద్రబాబు. చంద్రబాబు కళ్లుండి చూడలేని దృతరాష్ట్రుడు. లోకేష్ దుర్యోధనుడి మాదిరి రెడ్ బుక్ పాలన చేస్తున్నాడు. ఈ కేసులో ఏ3 ముద్దాయి పవన్ కళ్యాణ్. పవన్ తనకు దేవుడిచ్చిన అన్న అని లోకేష్ అంటున్నాడు. పదేళ్లక్రితం ఇదే దేవుడిచ్చిన అన్నను పచ్చి బూతులు తిట్టించింది లోకేష్ కాదా?. కౌరవులకు ఉన్న ఏకైక సోదరి హోంమంత్రి అనిత*తెనాలిలో ఎన్డీపీఎస్ కేసులో ముగ్గురు యువకులను నడిరోడ్డు పై పోలీసులు చితకబాదారు. తెనాలి ఘటన చూశాక న్యాయవాదులు, న్యాయ మూర్తులు నీళ్లులేని బావిలో దూకి చావాలి. చట్టాన్ని కంట్రోల్ చేయాల్సింది న్యాయవ్యవస్థ.. పోలీసులు కాదు. కాపీ కొట్టి పాసై టీచర్ అయిన హోంమంత్రి ఈ విషయం తెలుసుకోవాలి. సొల్లు కబుర్లు సోది కబుర్లు చెప్పడానికి కాదు నీకు హోంమంత్రి పదవి ఇచ్చింది. హెరిటేజ్ మీద ఎవరైనా మాట్లాడగానే సీఎఫ్ఓ మాదిరి హోంమంత్రి తెరపైకి వస్తారు. ఎందుకు సాయికృష్ణ అంశం పై హోంమంత్రి మాట్లాడలేదు. ఎందుకు హోంమంత్రి సీఐపై మాట్లాడలేదు. జడ్జీలను సైతం కొనేద్దామని భావన ఈ పోలీసులు, మంత్రులది.సాయికృష్ణ చనిపోయిన రోజునే పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుకి తెలుసు. సీఎం, హోంమంత్రి మనల్ని కాపాడతాడని సీఐకి సీపీ భరోసా ఇచ్చారు. పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుని తక్షణమే సస్పెండ్ చేయాలి. సీపీతో పాటు ఆరోజే హోంమంతికి కూడా ఈ విషయం తెలుసు. వారం రోజుల తర్వాత సీఎం,డిప్యూటీ సీఎంకు కూడా తెలుసు.. హోంమంత్రిని తక్షణమే బర్త్ రఫ్ చేయాలి. రాజశేఖర్ బాబు ఇక్కడ ఉండగా విచారణ సజావుగా సాగదు. కాబట్టి సీపీగా రాజశేఖర్ బాబును సస్పెండ్ చేయాలి. క్రైమ్ రేట్ తగ్గిందని హోంమంత్రి అద్భుతంగా అబద్ధాలు ఆడుతున్నారు. పోలీస్ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోందని చెబుతున్నారు. ఇలా లాకప్ డెత్ లు చేయడమేనా పోలీస్ వ్యవస్థ అద్భుత పనితీరు?. రెండు కేసులున్న వ్యక్తిని లాకప్ డెత్ చేస్తే.. 40 కేసులున్న చంద్రబాబును ఏ స్టేషన్‌కు పంపిస్తారు?. వందల కోట్లు దోచుకున్నాడని ఆరోపణలున్న లోకేష్ ను ఏ స్టేషన్ కు పంపిస్తారు?. హోంమంత్రి మేకప్ మీద పెట్టిన శ్రద్ధలో కొంచెమైనా నీ శాఖ పై పెడితే బాగుంటుందిఈ రెండేళ్లలో ఆడపిల్లల పై ఏపీలో జరిగిన నేరాల సంఖ్య 44,586. శిక్షలు పడింది కేవలం 541 కేసుల్లో మాత్రమే. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కేవలం నాలుగు కేసుల్లో మాత్రమే శిక్షలు పడ్డాయి. మీరు ప్రెస్ మీట్ లో చెప్పిన డేటా 10 క్లాస్ ఫెయిల్ అయిన మీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చాడా?. హోం శాఖ నిర్వహిస్తున్న హోంమంత్రికి.. డీజీపీకి సిగ్గుండాలిసీఎం సొంత జిల్లాలో కేవలం 10 కేసుల్లో మాత్రమే శిక్షలు పడ్డాయి. డిప్యూటీ సీఎం జిల్లాలో శిక్షపడింది 14 కేసుల్లో మాత్రమే. రాష్ట్రంలో 46 వేల మంది ఆడిపిల్లలకు అన్యాయం జరిగితే ఏనాడైనా వారి ఇంటికి వెళ్లారా డిప్యూటీ సీఎం?. ఉపముఖ్యమంత్రిగా ఉండి మీరు ఏంపీకారు?. పోలీసు వ్యవస్థ పనిచేసే తీరు ఇదేనాగతంతో పోల్చుకుంటే 24 శాతం ఆడపిల్లల పై నేరాలు పెరిగాయి. పోలీస్ డిపార్ట్ మెంట్‌కు క్రెడిట్ ఇవ్వాలని అడగడానికి సిగ్గుందా?. సాయికృష్ణ మృతదేహాన్ని కాని..అతని బూడిదను కానీ ఇచ్చి అప్పుడు క్రెడిట్ తీసుకోండి. సాయికృష్ణ తల్లి కన్నీళ్లకు సమాధానం చెప్పి క్రెడిట్ తీసుకోండి. రాజ్యాంగంలో ప్రతీ ఒక్కరికీ బ్రతికేహక్కుంది. మోకీళ్లు తీసేస్తా ... అరచేతిలో రేఖలు చెరిపేస్తానని డిప్యూటీసీఎం చెబుతుంటే పోలీసులకు ఏం ఇండికేషన్ ఇచ్చినట్లు?. సిగ్గులేకుండా సోషల్ మీడియాలో సాయికృష్ణ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్టులు పెడుతున్నారు. సాయికృష్ణ తల్లి కడుపుకోతతో బాధపడుతోంది. ఆ తల్లికి దళితసోదరులంతా అండగా నిలవాలి. కాపుల ఓట్లు వేయించుకుని పవన్ కాపులను గాలికి వదిలేశారు. ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ జల్సాలు చేస్తున్నారు అని జడ శ్రవణ్ మండిపడ్డారు.ఇదిలా ఉండగా.. గాదె సాయికృష్ణ ఏమయ్యాడు? అనే అంశం ఏపీలో తీవ్ర చర్చకు దారితీసింది. విచారణ నిమిత్తం కృష్ణలంక పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారని, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు, ఈ కేసుకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి అధికారికంగా పోలీసు శాఖ నుండి పూర్తి వివరాలు ఇంకా స్పష్టంగా వెలువడాల్సి ఉంది. -
బడికెళ్లే వయసులో ప్రేమ! ఏంటి రా ఇది
కృష్ణలంక(విజయవాడతూర్పు): వారిద్దరు మైనర్లు. ఒకే పాఠశాలలో బాలిక తొమ్మిదో తరగతి, బాలుడు ఎనిమిదో తరగతి చదువుతున్నారు. ప్రేమ అనే ఆకర్షణకు లోనైన ఆ ఇద్దరు కలసి కనిపించకుండా వెళ్లిపోయిన ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. రాణిగారితోట, సిద్దెం కృష్ణారెడ్డి రోడ్డులోని ఒక ప్రైవేట్ స్కూల్లో యూపీ కుటుంబానికి చెందిన బాలిక తొమ్మిదో తరగతి, రాణిగారితోటకు చెందిన బాలుడు ఎనిమిదో తరగతి చదువుతున్నారు. బుధవారం బాలుడి పుట్టినరోజు కావడంతో స్కూల్‌కు వెళ్లనని ఇంటిలో చెప్పి తండ్రి ఫోన్ తీసుకుని బయటకు వెళ్లి తిరిగి రాలేదు. స్కూల్‌కు వెళ్లి వస్తానని తల్లిదండ్రులకు చెప్పిన బాలిక ఇంటి నుంచి బయలుదేరి స్కూల్‌కు వెళ్లకపోగా తిరిగి ఇంటికి చేరుకోలేదు. వారి తల్లిదండ్రులు స్కూల్ సిబ్బందిని, చుట్టు పక్కల, బంధువులను విచారించినా ఆచూకీ లభించలేదు. వెంటనే పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని తమ పిల్లలు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా పుటేజీ ఆధారంగా ఇద్దరు కలిసి బస్టాండ్‌కు చేరుకుని హైదరాబాద్ బస్సు ఎక్కినట్లు గుర్తించారు. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా హైదరాబాద్ పరిసరాల్లో ఉన్నట్లు నిర్ధారించుకున్న సీఐ నాగరాజు తన సిబ్బంది అక్కడకు పంపి మైనర్లను పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చి వారివారి తల్లిదండ్రులకు అప్పగించారు. -
నా భర్తను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పడం లేదు: వంశీ భార్య
సాక్షి, విజయవాడ: తన భర్తను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పడం లేదని వంశీ భార్య పంకజశ్రీ అన్నారు. పోలీసులు వివరాలు ఏమీ చెప్పడంలేదని.. లోపల ఏం జరుగుతుందో తెలియడం లేదన్నారు. ఏ కేసులో అరెస్ట్ చేశారో చెప్పడం లేదని.. ఎఫ్ఆర్ కాపీ కూడా ఇవ్వడం లేదని వంశీ భార్య ఆవేదన వ్యక్తం చేశారు.కాగా, నందిగామ మాజీ ఎమ్మెల్యే జగన్మోహనరావుతో కలిసి వల్లభనేని వంశీ సతీమణి కృష్ణలంక పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. ఆమెను పోలీస్ స్టేషన్లోకి పోలీసులు అనుమతించకపోవడంతో వంశీ భార్య, పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. మమ్మల్ని ఎందుకు అనుమతించడం లేదని పోలీసులను ప్రశ్నించారు. ఆయన ఆరోగ్యంపై ఆందోళనగా ఉందన్నారు. తమను పోలీస్‌స్టేషన్ లోపలికి రానివ్వడం లేదని.. తన భర్తను చూసేందుకు లోపలికి పంపాలని పంకజశ్రీ కోరారు. చివరికి వంశీ భార్యను మాత్రమే స్టేషన్ లోపలికి పోలీసులు పంపించారు.వంశీని టీడీపీ నేతలు టార్గెట్ చేశారు: జగన్మోహన్రావువైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు మాట్లాడుతూ.. వంశీని టీడీపీ నేతలు టార్గెట్ చేశారని మండిపడ్డారు. లోకేష్ చెప్పడం వల్లే అక్రమ కేసులు బనాయించారని.. ఇలాంటి విష సంస్కృతిని అందరూ ఖండించాల్సిందేనన్నారు. కక్ష సాధింపులో భాగంగానే అరెస్టులన్నారు. రాజ్యాంగ వ్యవస్థ మీద తమకు నమ్మకం ఉందని జగన్మోహన్రావు అన్నారు.వల్లభనేని వంశీ అరెస్ట్ చెల్లదు: లాయర్ చిరంజీవిసుప్రీంకోర్టు నిబంధనలను పోలీసులు పాటించడం లేదని వంశీ తరఫు లాయర్ చిరంజీవి అన్నారు. వల్లభనేని వంశీ అరెస్ట్ చెల్లదని.. ఆయనను కావాలనే అరెస్ట్ చేశారన్నారు. ఏం కేసులు పెట్టారో తెలీదు. పోలీస్ స్టేషన్లో వంశీ లేరని అబద్ధాలు చెబుతున్నారు, ఎవరు ఫిర్యాదు చేశారు? కేసు ఎందుకు పెట్టారో చెప్పడం లేదు. వంశీ లాయర్నని చెప్పినా లోపలకి అనుమతించడం లేదు. పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగం ఏపీలో నడుస్తోంది. వంశీ చాలా ధైర్యంగా ఉన్నారు. తప్పుడు కేసులతో వంశీని ఎవరూ ఏం చేయలేరు’’ అని అడ్వకేట్ చిరంజీవి అన్నారు. -
వేర్వేరు కారణాలతో ముగ్గురి ఆత్మహత్య
సాక్షి, విజయవాడ: నగరంలో గురువారం కలకలం రేగింది. వివిధ కారణాలతో ముగ్గురు వేర్వేరు వ్యక్తులు బలవన్మరణానికి పాల్పడ్డారు. వివరాలు.. నగర శివారులోని వాంబే కాలనీలో నివాసముంటున్న శ్రావణి అనే వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శ్రావణి బలవన్మరణానికి కుటుంబ కలహాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేశామని దర్యాప్తు మొదలైందని విజయవాడ రూరల్ పోలీసులు తెలిపారు. నగర శివారు ప్రాంత గ్రామంలో.. విజయవాడ శివారులో గల ఓ గ్రామంలో వరదారెడ్డి అనే వ్యక్తి ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఆర్ధిక ఇంబందుల కారణంగా వరదా రెడ్డి ఆత్మహత్య చేసుకోవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. బీటెక్ విద్యార్థి కృష్ణలంకలో బీటెక్ విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కొన ఊపిరితో ఉన్న యువతిని విజయవాడలోని ప్రవేట్ ఆసుపత్రి కి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందిందని పోలీసులు తెలిపారు. కాగా, కుటుంబ కలహాల కారణంగానే యువతి చనిపోయిందని కుటుంబసభ్యులు చెప్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నామనీ, దర్యాప్తు మొదలుపెట్టామని పోలీసులు వెల్లడించారు. మృతురాలు ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. -
తల్లి ప్రేమ గెలిచింది
విజయవాడ : పేగుతెంచుకుని పుట్టిన బిడ్డను ఇబ్బందుల కారణంగా ఓ అమ్మ విజయవాడలో వదిలేసింది. చిన్నారిని విడిచి ఉండలేక కొద్ది రోజుల్లోనే వదిలేసిన చోటనే వెదుక్కుంది. ఆ ప్రయత్నం ఫలించడంతో కుమార్తె మళ్లీ తల్లి ఒడికి చేరింది. సినీ ఫక్కీలో జరిగిన ఈ సంఘటన వివరాలు.. గుంటూరు జిల్లా కొలనుకొండ సమీపంలోని వడ్డేశ్వరం గ్రామానికి చెందిన హుస్సేన్‌బీకి ఇద్దరు కుమార్తెలు. మూడు నెలల చిన్న కుమార్తెకు పుట్టుకతోనే గుండెకు చిల్లు ఉండడంతో అనారోగ్యంతో బాధపడుతుండేది. హుస్సేన్‌బీ భర్త బిందెలకు మాట్లు వేస్తూ వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషించేవాడు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల కారణంగా కుమార్తెకు చికిత్స చేయించలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో హుస్సేన్‌బీ కొద్ది రోజుల కిందట చిన్న కుమార్తెను విజయవాడ రాఘవయ్య పార్కు సమీపంలో ఓ ఆస్పత్రి దగ్గర చెత్తకుండీ వద్ద వదిలివె ళ్లింది. కృష్ణలంక రాణీగారితోటకు చెందిన కుంభా కుసుమకుమారి అటుగా వెళ్తుండగా చిన్నారి ఏడుపు వినిపించింది. ఆమె పాపను తీసుకుని సమీపంలోని దుకాణదారులకు ఈ విషయం చెప్పి తన అడ్రస్ ఇచ్చింది. చిన్నారి కుటుంబసభ్యులు ఎవరైనా వస్తే తన వద్దకు పంపాలని సూచించి బాలికను తీసుకుని వెళ్లిపోయింది. అనంతరం అనారోగ్యంతో బాధపడుతోందని గుర్తించి వైద్యులకు చూపించింది. కుమార్తెను వదిలి వెళ్లాక హుస్సేన్‌బీ మనశ్శాంతిగా ఉండలేకపోయింది. తన తల్లి నబీషాకు ఈ విషయం చెప్పింది. ఐదు రోజులు గడిచిన తరువాత హుస్సేన్‌బీ తల్లితో కలిసి నగరానికి వచ్చి కూతురిని వదిలేసిన చోట ఆరా తీసింది. స్థానిక దుకాణదారులు కుసుమకుమారి చిరునామా చెప్పడంతో ఆమె ఇంటికి వెళ్లారు. కుమార్తెను వదిలేయడానికి కారణం చెప్పి తనకు తిరిగి ఇవ్వవలసిందిగా కోరింది. దీంతో వారంతా బుధవారం రాత్రి కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సీఐకి అంతా వివరించారు. కుసుమకుమారి అంగీకారంతో ఆయన చిన్నారిని తల్లికి అప్పగించారు.


