నా భర్తను ఎందుకు అరెస్ట్‌ చేశారో చెప్పడం లేదు: వంశీ భార్య | Vallabhaneni Vamsi Wife Comments On Police | Sakshi
Sakshi News home page

నా భర్తను ఎందుకు అరెస్ట్‌ చేశారో చెప్పడం లేదు: వంశీ భార్య

Feb 13 2025 3:25 PM | Updated on Feb 13 2025 4:38 PM

Vallabhaneni Vamsi Wife Comments On Police

నందిగామ మాజీ ఎమ్మెల్యే జగన్మోహనరావుతో కలిసి వల్లభనేని వంశీ సతీమణి కృష్ణలంక పోలీస్ స్టేషన్ చేరుకున్నారు.

సాక్షి, విజయవాడ: తన భర్తను ఎందుకు అరెస్ట్‌ చేశారో చెప్పడం లేదని వంశీ భార్య పంకజశ్రీ అన్నారు. పోలీసులు వివరాలు ఏమీ చెప్పడంలేదని.. లోపల ఏం జరుగుతుందో తెలియడం లేదన్నారు.  ఏ కేసులో అరెస్ట్‌ చేశారో చెప్పడం లేదని.. ఎఫ్‌ఆర్‌ కాపీ కూడా ఇవ్వడం లేదని వంశీ భార్య ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా, నందిగామ మాజీ ఎమ్మెల్యే జగన్మోహనరావుతో కలిసి వల్లభనేని వంశీ సతీమణి కృష్ణలంక పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. ఆమెను పోలీస్ స్టేషన్‌లోకి పోలీసులు అనుమతించకపోవడంతో వంశీ భార్య, పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. మమ్మల్ని ఎందుకు అనుమతించడం లేదని పోలీసులను ప్రశ్నించారు. ఆయన ఆరోగ్యంపై ఆందోళనగా ఉందన్నారు. తమను పోలీస్‌స్టేషన్‌ లోపలికి రానివ్వడం లేదని.. తన భర్తను చూసేందుకు లోపలికి పంపాలని పంకజశ్రీ కోరారు. చివరికి వంశీ భార్యను మాత్రమే స్టేషన్‌ లోపలికి పోలీసులు పంపించారు.

వంశీని టీడీపీ నేతలు టార్గెట్‌ చేశారు: జగన్మోహన్‌రావు
వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావు మాట్లాడుతూ.. వంశీని టీడీపీ నేతలు టార్గెట్‌ చేశారని మండిపడ్డారు. లోకేష్‌ చెప్పడం వల్లే అక్రమ కేసులు బనాయించారని.. ఇలాంటి విష సంస్కృతిని అందరూ ఖండించాల్సిందేనన్నారు. కక్ష సాధింపులో భాగంగానే అరెస్టులన్నారు. రాజ్యాంగ వ్యవస్థ మీద తమకు నమ్మకం ఉందని జగన్మోహన్‌రావు అన్నారు.

వల్లభనేని వంశీ అరెస్ట్‌ చెల్లదు: లాయర్‌ చిరంజీవి
సుప్రీంకోర్టు నిబంధనలను పోలీసులు పాటించడం లేదని వంశీ తరఫు లాయర్‌ చిరంజీవి అన్నారు. వల్లభనేని వంశీ అరెస్ట్‌ చెల్లదని.. ఆయనను కావాలనే  అరెస్ట్‌ చేశారన్నారు. ఏం కేసులు పెట్టారో తెలీదు. పోలీస్ స్టేషన్‌లో వంశీ లేరని అబద్ధాలు చెబుతున్నారు, ఎవరు ఫిర్యాదు చేశారు? కేసు ఎందుకు పెట్టారో చెప్పడం లేదు. వంశీ లాయర్‌నని చెప్పినా లోపలకి అనుమతించడం లేదు. పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగం ఏపీలో నడుస్తోంది. వంశీ చాలా ధైర్యంగా ఉన్నారు. తప్పుడు కేసులతో వంశీని ఎవరూ ఏం చేయలేరు’’ అని అడ్వకేట్‌ చిరంజీవి అన్నారు.

వల్లభనేని వంశీ అరెస్ట్ పై భార్య పంకజశ్రీ ఫస్ట్ రియాక్షన్

Advertisement
 
Advertisement
Advertisement