breaking news
kranthi kumar reddy suicide
-
క్రాంతికుమార్ ఆత్మహత్యకు కారణం ఏమిటి?
సాక్షి, అమరావతి: దళిత యువకుడు పేరుపోగు క్రాంతికుమార్ ఆత్మహత్య ఘటనపై హైకోర్టు బుధవారం తీవ్రంగా స్పందించింది. విజయవాడ, కృష్ణలంక అప్పటి సీఐ నాగరాజు వేధింపుల వల్ల క్రాంతికుమార్ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై సీబీఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లో హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, విజయవాడ కమిషనర్, నార్త్ జోన్ ఏసీపీ, కృష్ణలంక ఇన్స్పెక్టర్లతో పాటు క్రాంతికుమార్ ఆత్మహత్యకు కారణమని ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి సీఐ నాగరాజుకు నోటీసులు జారీచేసింది. ఈ వ్యవహారంలో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నమోదైన కేసులో 30 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. క్రాంతికుమార్ ఆత్మహత్య ఘటనపై ఇచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని పిటిషనర్‌ను ఒత్తిడి చేయవద్దని పోలీసులను ఆదేశించింది. పిటిషనర్ కుటుంబ సభ్యులను ఏ రకంగానూ బెదిరించరాదని కూడా స్పష్టంచేసింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కుంచం మహేశ్వరరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కాపు యువకుడు సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో కూడా అప్పటి సీఐ నాగరాజు ప్రధాన నిందితుడు కావడం గమనార్హం. ఆ ఉదంతంపై సుప్రీంకోర్టు బుధవారం ఆగ్రహం వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. ఫిర్యాదు ఉపసంహరణకు బెదిరింపులు తన ఆత్మహత్యకు సీఐ నాగరాజు కారణమంటూ ఈ ఏడాది మే 21న క్రాంతికుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎలాంటి దర్యాప్తు చేయడం లేదని, అందువల్ల దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ తండ్రి పేరుపోగు వెంకటేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది పాలేటి మహేశ్వరరావు వాదనలు వినిపిస్తూ ‘దర్యాప్తు విషయంలో కాపు యువకుడు సాయికృష్ణ లాకప్‌డెత్ కేసుకు ఇస్తున్న ప్రాధాన్యతను దళిత యువకుడైన క్రాంతికుమార్ కేసుకు ఇవ్వడంలేదు. పైగా కుమారుడి మృతిపై ఇచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలంటూ పోలీసులు రోజూ పిటిషనర్‌పై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. దీని వెనుక విజయవాడ నార్త్ జోన్ ఏసీపీ ఉన్నారు. ప్రైవేటు గూండాలు కూడా ఇంటికి వస్తూ కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తును సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేయాలి’ అని విన్నవించారు. -
విజయవాడలో ఇంత అరాచకమా.. నిద్రపోతున్నారా..?
-
హోటల్ గదిలో వ్యక్తి ఆత్మహత్య
మిర్యాలగూడ (నల్లగొండ జిల్లా): నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని వైష్ణవి హోటల్ గదిలో ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన బుధవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి .. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఇనుమల్ల నెల్లూరు గ్రామానికి చెందిన క్రాంతి కుమార్ రెడ్డి(28) మంగళవారం సాయంత్రం వైష్ణవి హోటల్లో దిగాడు. కాగా, బుధవారం ఉదయం హోటల్ సిబ్బంది తలుపు కొట్టినా తీయలేదు. మధ్యాహ్నం సమయంలో భోజనం కోసం మరో సారి తలుపు కొట్టారు. ఎంతకీ తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా క్రాంతి ఫ్యాన్‌కు ఉరి వేసుకొని కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతుడి బంధువులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


