breaking news
kothagudem 80
-
నాట్యమయూరి
నాట్యం నేర్చుకోవడానికి ఇంట్లో అనుమతి మొదలు ప్రతి ఒక్క దశలోనూ పరీక్షలు ఎదురయ్యాయి ఆమెకు. ఆఖరుకు నాట్యం చేస్తుండగానే వేదిక మీద ఒక్కసారిగా కుప్పకూలిపోవడం వరకు. కాలికి గాయమైందని గజ్జెలను పక్కన పెట్టి కుంగిపోలేదామె. సర్జరీ చేయించుకున్నారు. నడక వరకు ఓకే కానీ క్లాసికల్ డాన్స్ చేయడం కష్టం అని తెలిసిపోయింది. రెండో సర్జరీతో మోకాలి కదలికలు మెరుగయ్యాయి. ఇనుమడించిన ఉత్సాహంతో తిరిగి నాట్యం చేస్తున్నారామె. ఇది మయూరి సినిమా కాదు. ఆమె సుధాచంద్రన్ కాదు. తెలంగాణ, కొత్తగూడెంలో పుట్టి పెరిగిన క్రాంతి నారాయణ జీవితం.‘‘నడవడం వచ్చినప్పటి నుంచి పిచ్చి గంతులేస్తూ ఉండేదాన్ని. నా ఆసక్లిని గమనించిన మా అమ్మ... నాన్నను ఒప్పించి నన్ను డాన్స్ క్లాసులకు పంపించింది. నాట్యప్రదర్శనల కోసం ఇతర ఊర్లకు ఆడపిల్లను పంపించడం ఏమిటంటూ ఏడాదిలోపే అంతరాయం. నాన్నకు హైదరాబాద్‌కు బదలీ కావడంతో నాలోని నాట్యమయూరికి రెక్కలొచ్చాయి. దాదాపుగా అదే సమయంలో ఒక టీవీ షోలో శోభానాయుడి గారి ఇంటర్వ్యూ చూశాను. వృత్తి– ప్రవృత్తిని సమన్వయం చేసుకోగలిగిన నైపుణ్యం గురించి చక్కగా చె ప్పారామె. నేను వెళ్లగానే ఆమె ‘ఇన్నేళ్ల విరామం తర్వాత ఇక నాట్యసాధన అసాధ్యం’ అనడంతో కళ్లనీళ్లపర్యంతం అయ్యాను. అప్పుడు ఒక వారం రోజులు టెస్ట్ పీరియడ్‌గా వచ్చి ప్రాక్టీస్ చేయమన్నారు. ఆ పరీక్షలో నెగ్గి ఆమె శిష్యురాలినయ్యాను.ఇంజినీరింగ్– కూచిపూడిఉస్మానియాలో ఇంజినీరింగ్ చేస్తూ కాలేజ్ నుంచి నేరుగా డాన్స్ క్లాసులకు వెళ్లేదాన్ని. ఎంబీఏ కూడా అలాగే చేశాను. మహీంద్రా అండ్ మహీంద్రాలో ఉద్యోగం చేస్తూ కూడా డాన్స్ ప్రాక్టీస్ కంటిన్యూ చేశాను. ఆ సమయంలో మరో పరీక్ష ముంబయికి ట్రాన్స్ఫర్. నాన్న హైదరాబాద్ బదలీ నాకు డాన్స్ ప్రాక్టీస్‌కి అవకాశం ఇచ్చింది. నా ముంబయి బదలీ డాన్స్ కోసం ఉద్యోగం వదులుకునేటట్లు చేసింది. నాట్యానికే అంకితం కావాలనుకుని ఆంధ్రప్రదేశ్‌లోని కూచిపూడి గ్రామానికి వెళ్లి మాస్టర్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ చేశాను.డాన్స్‌ను గౌరవించే వ్యక్తినే...నా జీవితంలో నాట్యానికి ఉన్న ప్రముఖ స్థానానికి అద్దం పట్టేది నా పెళ్లి చూపులే. పెళ్లి తర్వాత నాట్యసాధన మానేయాలన్న వాళ్లను వద్దని, డాన్్సను గౌరవించే వ్యక్తినే నా జీవితంలోకి స్వాగతించాను. ఇప్పుడు చెప్పండి... కాలికి గాయమైందని నాట్యసాధన మానేయగలనా? నాట్యం ఆగిపోతే నాకు శ్వాస ఆగిపోయినట్లే. కరోనా విరామ సమయాన్ని మా గురువుగారి నాట్యరీతుల మీద ఎం.ఫిల్ చేయడానికి ఉపయోగించుకున్నా’’నని చె ప్పారు క్రాంతి నారాయణ. ఐదు వందలకు పైగా ప్రదర్శనలిచ్చాను. ఆ మధురానుభూతులివన్నీ అంటూ గది నిండుగా ఉన్న జ్ఞాపికలను చూపించారు. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఖమ్మం 66.. కొత్తగూడెం 80
రెండుగా చీలనున్న ఖమ్మం జిల్లా ఎక్సైజ్‌శాఖ నూతన జిల్లా పరిధిలోకి 71 మద్యం దుకాణాలు మహబూబాబాద్‌లోకి బయ్యారం, గార్ల షాపులు కొత్తగూడెంలో మరో మద్యం డిపో ఖమ్మం క్రైం: పునర్విభజనతో జిల్లా ఎక్సైజ్ శాఖ కూడా రెండు ముక్కలు కానుంది. ప్రస్తుతం ఖమ్మం ఎక్సైజ్ యూనిట్ పరిధిలో 78, కొత్తగూడెం యూనిట్ పరిధిలో 71 మద్యం దుకాణాలు ఉన్నాయి. నూతన జిల్లా ఏర్పడనుండటంతో ఖమ్మం యూనిట్ పరిధిలో 66, కొత్తగూడెం యూనిట్ పరిధిలోకి 80 మద్యం దుకాణాలు రానున్నాయి. నూతనంగా ఏర్పడే కొత్తగూడెం జిల్లాలోకి ఇల్లెందు చేరనుండటంతో ఇప్పటి వరకు ఖమ్మం ఎక్సైజ్ యూనిట్ పరిధిలోని ఇల్లెందు ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో ఉన్న పది మద్యం దుకాణాలు, రెండు బార్లు కూడా కొత్తగూడెం జిల్లా పరిధిలోకి వెళ్లనున్నాయి. ఇప్పటి వరకు కొత్తగూడెం యూనిట్ పరిధిలో ఉన్న జూలూరుపాడు, ఏన్కూరులోని మద్యం దుకాణాలు ఖమ్మం యూనిట్లోకి రానున్నాయి. గార్ల, బయ్యారం దుకాణాలు మహబూబాబాద్‌లోకి.. ఇప్పటి వరకు ఖమ్మం ఎక్సైజ్ యూనిట్ పరిధిలో ఉన్న బయ్యారం, గార్ల మండలాల దుకాణాలు నూతన జిల్లా మహబూబాబాద్‌లోకి వెళ్లనున్నాయి. దీనివల్ల ఖమ్మం యూనిట్ పరిధిలో రెండు దుకాణాల సంఖ్య తగ్గనుంది. కొత్తగూడెంలో మరో మద్యం డిపో వైరాలో ఉన్న మద్యం డిపో నుంచే ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా మద్యం సరఫరా అవుతుంది. నూతనంగా కొత్తగూడెం జిల్లా ఏర్పడనుండటంతో అక్కడ మరో డిపోను ఏర్పాటు చేయనున్నారు. దీని కోసం ఎక్సైజ్ ఉన్నతాధికారులు ఐదు ఎకరాల స్థలాన్ని సైతం ఎంపిక చేశారు. మద్యం డిపోతోపాటు ఆ స్థలంలో ఎక్సైజ్ నూతన భవనాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్లే బాసులు ఇక నుంచి ప్రతి జిల్లాకు ఎక్సైజ్ సూపరింటెండెంట్లే జిల్లా బాసులుగా వ్యవహరించనున్నారు. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు రీజనల్ అధికారులుగా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్, ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ వ్యవహరిస్తారు. వీరి కార్యాలయాలు మాత్రం ఖమ్మంలోనే ఉండనున్నాయి. మూడు చెక్‌పోస్ట్‌లు కొత్తగూడెం.. రెండు చెక్ పోస్ట్‌లు ఖమ్మం ఇప్పటి వరకు ఎక్సైజ్ చెక్‌పోస్టులు ఐదు ఉండగా నూతనంగా ఏర్పడే కొత్తగూడెం జిల్లాలోకి భద్రాచలం, అశ్వారావుపేట, కొత్తగూడెం, ఖమ్మం జిల్లా పరిధిలోకి బోనకల్, ముత్తగూడెం రానున్నాయి. ప్రస్తుత్తం జిల్లాలో 44 బార్లు ఉండగా ఖమ్మం యూనిట్ పరిధిలో 32, కొత్తగూడెం యూనిట్ పరిధిలో 12 ఉన్నాయి. నూతనంగా ఏర్పడే జిల్లాలోకి ఇల్లెందు వెళ్లనుండటంతో అక్కడి రెండు బార్లు కొత్తగూడెం యూనిట్ పరిధిలో చేరుతాయి. తగ్గని ఖమ్మం ఎక్సైజ్ ఆదాయం పది మద్యం దుకాణాలు, రెండు బార్లు కొత్తగూడెం జిల్లాలోకి వెళ్తున్నా ఖమ్మం జిల్లా ఎక్సైజ్ పరిధిలో ఎటువంటి ఆదాయం తగ్గదని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. కొత్తగూడెం యూనిట్ పరిధిలో పారిశ్రామిక ప్రాంతం ఉన్నా ఇప్పటి వరకు ఖమ్మం ఎక్సైజ్ యూనిట్ పరిధిలోకి వచ్చే ఆదాయం కంటే తక్కువగానే ఉంటుందని విశ్లేషించారు. సిబ్బంది కూడా మారాల్సిన పనిలేదు మహేశ్‌బాబు, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నూతన జిల్లా ఏర్పడ్డా ఎక్సైజ్‌శాఖలో సిబ్బంది మారాల్సిన అవసరం లేదు. జిల్లాలో ప్రస్తుతం సుమారు 300 మంది ఎక్సైజ్ సిబ్బంది ఉన్నారు. నూతన జిల్లా ఏర్పడిన తర్వాత కూడా ఖమ్మం యూనిట్ పరిధిలో ఉండే సిబ్బందే విధులు నిర్వహిస్తారు. కొత్తగూడెం యూనిట్ పరిధిలో విధులు నిర్వహించే సిబ్బంది ఆ జిల్లాలోనే పనిచేస్తారు. దీనికి సంబంధించిన ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చింది. నూతన జిల్లా ఏర్పాటు తర్వాత గానీ పూర్తిస్థాయిలో స్పష్టత రాదు.