breaking news
kicks off
-
కేక్ మిక్సింగ్ సందడి షురూ!
హైదరాబాద్ నగరంలో అప్పుడే కేక్ మిక్సింగ్ (Cake Mixing), గ్రేప్ స్టాంపింగ్ సందడి మొదలైంది. సాధారణంగా కేక్ మిక్సింగ్ కార్యక్రమాలు డిసెంబర్లో విరివిగా జరుగుతుండటం విదితమే. కానీ ట్రెడిషనల్ పద్ధతిలో కనిసం రెండు నెలల ముందుగానే ఈ కేక్ మిక్సింగ్ నిర్వహించి ఆల్కహాల్స్తో సోకింగ్ చేస్తారు. ఇలా చేసిన కేక్ మిక్సింగ్‌తో డిసెంబర్ మొదటి వారం నుంచి ప్లమ్ కేక్ తయారు చేస్తుంటారు. అంతేకాకుండా ఫ్రాన్స్ సంస్కృతిలో భాగమైన గ్రేప్ స్టాంపింగ్ చేసి సోకింగ్ చేస్తారు. ఈ సంస్కృతి గత కొన్ని సంవత్సరాలుగా నగరంలో కూడా పాత పద్దతులతోనే నిర్వహిస్తున్నారు. సంప్రదాయం, వినోదం, గ్లామర్ మేళవించిన ఈ కేక్ మిక్సింగ్, గ్రేప్ స్టాంపింగ్ ఈవెంట్స్ హైదరాబాద్ నగరానికి కొత్త అనుభూతిని జోడిస్తున్నాయి. నగరంలోని కొన్ని ఫైవ్ స్టార్ హోటల్స్ ఈ కేక్ మిక్సింగ్‌ను ఇప్పుడే నిర్వహించి సోకింగ్ చేస్తున్నాయి. –సాక్షి, సిటీబ్యూరో పాశ్చాత్య దేశాల్లోనే కాదు నగరంలోనూసెప్టెంబర్ మధ్య నుంచి డిసెంబరు వరకు నిర్వహించే కేక్ మిక్సింగ్, గ్రేప్ స్టాంపింగ్ విరివిగా చేస్తున్నారు. ముఖ్యంగా స్టార్ హోటళ్లు, లగ్జరీ రిసార్ట్స్ ఈ ఈవెంట్స్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాయి. నగరంలోని నోవోటెల్ ఎయిర్ పోర్ట్ ఈ కేక్ మిక్సింగ్, గ్రేప్ స్టాంపింగ్ కార్యక్రమాన్ని మొట్ట మొదటగా చేసి ఈ ఏడాది సంబరాలకు నాంది పలికింది. సంప్రదాయం, ఆధునికత మేళవించిన ఈ మిక్సింగ్, స్టాంపింగ్ ఈవెంట్స్‌లో ఆరోగ్య సూత్రాలు కూడా దాగున్నాయి. ముఖ్యంగా కేక్ మిక్సింగ్‌లో ఆల్మండ్, కిస్మిస్, పిస్తా, ఆప్రికాట్, బ్లాక్ రెసిన్, యెల్లో రెసిన్, క్యాష్యూనట్స్ వంటి విభిన్న రకాల డ్రై ఫ్రూట్స్‌తో ఆల్కహాల్ కలిపి కేక్ మిక్సింగ్ చేస్తారు. వీటికి పలు రకాల స్పైసెస్ కూడా కలుపుతారు. ఈ మిశ్రమాన్ని దాదాపు 2 నెలల వరకూ సోకింగ్ (నిల్వ) చేస్తారు. ఈ పద్దతిలో ఆల్కహాల్‌తో డ్రై ఫ్రూట్స్ కలిసి అద్భుతమైన ఫ్లేవర్ అందిస్తుంది. ఈ సోకింగ్ ద్వారా తయారైన మిశ్రమంతో చేసేదే అసలైన ప్లమ్ కేక్. దీనికి డిసెంబర్ నెలలో ముఖ్యంగా క్రిస్మన్, న్యూ ఇయర్ సీజన్లో ప్రత్యేక ఆహార పదార్థంగా స్వీకరిస్తారు. సరికొత్త ట్రెండ్.. ఫ్రాన్స్‌లో ప్రసిద్ది చెందిన గ్రేప్ స్టాంపింగ్ పద్ధతిని గత కొన్ని సంవత్సారాలుగా భాగ్యనగరంలోనూ వైన్ తయారికి సరికొత్త సంస్కృతిగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఎంపిక చేసిన ద్రాక్షపళ్లను పెద్ద చెక్క బుట్టలో వేసి కేవలం మనుషులు మాత్రమే పాదాలతో తొక్కి ఒక వేడుకలా నిర్వహిస్తారు. ఈ స్టాంపింగ్‌లో భాగంగా వచ్చిన ద్రాక్ష రసాన్ని సోకింగ్ చేసి వైన్‌గా తయారు చేస్తారు. నగరంలో సందడిగా జరగుతున్న ఇలాంటి కార్యక్రమాలు హైదరాబాద్‌కు వస్తున్న అంతర్జాతీయ ప్రతినిధులను విశేషంగా అలరిస్తున్నాయని స్టార్ హోటల్ యాజమాన్యం తెలుపుతోంది. సోషల్ మీడియా ప్రభావంగతంలో పాశ్చాత్య దేశాల్లో ప్రత్యేకంగా జరుపుకునే ఈ సంబరాలు సోషల్ మీడియా ప్రభావంతో ట్రెండింగ్‌లోకి వస్తున్నాయి. ఈ తరహా ట్రెండ్స్ హైదరాబాద్ నగర వాసుల జీవితాల్లో భాగం అయ్యేందుకు సామాజిక మాధ్యమాలు కారణమవుతున్నాయి. ముఖ్యంగా స్టార్ హోటళ్లు, లగ్జరీ రిసార్ట్స్ ఈ ఈవెంట్స్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాయి. ఇది కేవలం ఫెస్టివల్ ముందస్తు శుభారంభమే కాదు, సంస్కృతి, కమ్యూనిటీ స్పిరిట్‌కి నిదర్శనంగా నిలుస్తోంది. రానున్న రోజుల్లో ఈ ఈవెంట్స్ మరింత విస్తృతమవుతాయని, మరింత మందిని ఆకట్టుకుంటాయని నోవోటెల్ హోటల్ ప్రధాన చెఫ్ అమన్న రాజు చెబుతున్నారు. వేవ్ ఆఫ్ హ్యాపీనెస్.. కేక్ మిక్సింగ్ అనేది క్రిస్మస్ సెలబ్రేషన్స్‌కి ముందుగా నిర్వహించే సంప్రదాయం. ఇందులో డ్రై ఫ్రూట్స్, నట్స్, కాండీడ్ ఫ్రూట్స్, మసాలాలు, వైన్స్ కలిపి ఒక ప్రత్యేకమైన మిక్స్ తయారు చేశాం. దీనిని సోకింగ్ చేయడం వల్ల దీని రుచి, సుగంధం ఎక్కువవుతుంది. ఆ మిశ్రమం డిసెంబర్లో జరిగే కేక్ బేకింగ్‌కు ఉపయోగిస్తాం. దాదాపు 160 కిలోల ఈ మిశ్రమం సోకింగ్ తరువాత 250 కిలోల ప్లమ్ కేక్ తయారీకి సరిపోతుంది. దీనిని సిగ్నేచర్ క్రిస్మస్ కేక్‌ల కోసం వినియోగిస్తాం. ప్రముఖ పేస్ట్రీ చెఫ్ దివ్య గోప్పనగారి ఆధ్వర్యంలో ఈ మిక్సింగ్ చేశాం. అంతేకాకుండా వేవ్ ఆఫ్ హ్యాపీనెస్ పేరుతో 25 అడుగుల పొడవైన కేక్ కూడా తయారు చేశాం. దీంతో పాటు గ్రేప్ స్టాంపింగ్ కూడా నిర్వహించాం. వైన్ తయారీకి నిర్వహించే ఈ పద్ధతిలో మనుఫులు మాత్రమే తమ పాదాలతో ద్రాక్షా పళ్లను తొక్కుతూ, డ్యాన్స్ చేస్తారు. ఇదొక ఫన్–ఫొటోజెనిక్ సందడి. స్టాంపింగ్ కోసం పెద్ద తోట్లను ద్రాక్షాలతో నింపి మంచి మ్యూజిక్‌తో పెద్దలు చిన్నారులతో ఓ వేడుకలా నిర్వహించాం. – సుఖ్బీర్ సింగ్, జనరల్ మేనేజర్, నోవోటెల్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్. -
'ఆ స్టార్ హీరోను తన్నిన వారికి నగదు బహుమతి'..సంచలన ప్రకటన
Hindu Makkal Katchi Announces Cash Prize For Anyone Who Kicks Sethupathi: తమిళ సూపర్‌స్టార్ విజయ్ సేతుపతిపై బెంగుళూరుఎయిర్పోర్టులో దాడి జరిగిన సంగతి తెలిసిందే. గాంధీ అనే వ్యక్తి సేతుపతిపై దాడికి యత్నించగా ఆ వీడియో వైరల్‌గా మారింది. ఇటీవలె ఈ ఘటనపై స్పందించిన సేతుపతి..ఇది చిన్న గొడవ అని, వీడియోలు వైరల్ కావడంతో జనాలు దీన్ని పెద్ద సమస్యగా చూస్తున్నారంటూ కొట్టిపారేశారు. తాజాగా హిందూ మక్కల్ కట్చి అనే ఒక హిందూ సంస్థ తమిళ సూపర్‌స్టార్ సేతుపతిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.చదవండి: ఎయిర్‌పోర్టులో దాడి: అసలేం జరిగిందో వివరించిన సేతుపతి విజయ్ సేతుపతిని తన్నిన వారికి ఒక్క కిక్కు రూ. 1000రూపాయలు బహుమతిగా ఇస్తామని ప్రకటించడం సంచలనంగా మారింది. దీనిపై సంస్థ చీఫ్ అర్జున్ సంపత్ స్పందిస్తూ..స్వాతంత్ర్య సమరయోధుడు దైవతిరు పసుంపోన్ ముత్తురామలింగ తేవర్ అయ్యను, దేశాన్ని సేతపతి అవమానించాడని..ఆయన క్షమాపణ చెప్పేవరకు ఎక్కడ కనిపించినా కొట్టాలని కాంట్రవర్సీ కామెంట్లు చేశారు. చదవండి: కొత్త ఇంట్లోకి బిగ్‌బాస్ ఫేమ్ గంగవ్వ గృహప్రవేశం భర్త అరెస్ట్.. హాస్పిటల్లో నటి పూనమ్ పాండే -
నో మాస్క్: అధికారులపై మహిళ వీరంగం..జుట్టు పట్టుకొని!
కరోనా ప్రారంభమైనప్పటి నుంచి.. అంటే దాదాపు ఏడాదిన్నరగా మాస్కు ధరించడం, భౌతిక దూరం అనివ్యార్యమైపోయింది. వ్యాక్సిన్లు వచ్చినా మహమ్మారిని అడ్డుకునేందుకు కోవిడ్ నిబంధనలను పాటించడం తప్పనిసరి అయ్యింది. కరోనా తగ్గినట్లే తగ్గి కొత్త కొత్త అవతారాల్లో పుట్టుకొస్తుంది. అందుకే మాస్క్ ధరించకుండా గుంపులు గుంపులుగా తిరుగుతున్న వారిపై ఇప్పటికీ పోలీసులు జరిమానా విధిస్తున్నారు. అయితే ఎంత ప్రయత్నించినా కొందరిలో మార్పు రావడం లేదు. మొండి వైఖరి వీడకుండా తనకు నచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. అంతేగాక కరోనా మార్గదర్శకాలను పాటించాలని కోరిన వారిపై దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా మాస్క్ ధరించమని అడగిన అధికారులపై ఓ మహిళ రెచ్చిపోయింది. ఈ ఘటన దేశ రాజధాని డిల్లీలో చోటుచేసుకుంది. పీరాగారి మెట్రో స్టేషన్ సమీపంలో సోమవారం కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై అధికారులు చలాన్లు విధిస్తున్నారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు మహిళలను ఆపి మాస్క్ ఎందుకు ధరించలేదని ప్రశ్నించారు. మాస్క్ లేనందుకు జరిమానా కట్టాలని చలాన్ విధించారు. దీంతో మహిళలకు అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తరువాత ఇద్దరిలో ఓ మహిళా.. విధుల్లో ఉన్న అధికారులపై దాడికి తెగబడింది. చెంపదెబ్బలు కొడుతూ, వారిపై పిడిగుద్దుల వర్షం కురిపించింది. అధికారుల జుట్టు పట్టుకొని వీరంగం సృష్టించింది. ఆమెను ఆపేందుకు అక్కడి వారు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఇక దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
పట్టించుకోలేదని పెళ్లికూతురిని తన్నేసింది..
బీజింగ్ : పెంపుడు కుక్కలు తమ యజమానిపై విపరీతమైన ప్రేమను కురిపిస్తూ చాలా విశ్వాసంగా ఉంటాయి. తమను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే కొంచెం అప్సెట్ కూడా అవుతాయి. కుక్కలకు కూడా ఇలాంటి ఫీలింగ్స్ ఉంటాయా అంటే..ఈ వీడియో చూస్తే అవుననే అంటారు. చైనాకు చెందిన 25 ఏళ్ల కావో అనే మహిళ శాన్ జియు అనే కుక్కను పెంచుకుంటుంది. ఈ మధ్యే పెళ్లి ఫిక్సయ్యింది. దీంతో పెళ్లిపనుల్లో కాస్త బిజీబిజీగా ఉంటూ కుక్కను పట్టించుకోలేదు. అంతే కుక్కకు కోపం వచ్చి పెళ్లి వేదికపైనే పెళ్లికూతురిని ఓ తన్ను తన్నేసింది. చైనాలోని బోజౌలో జరిగిన పెళ్లి వేడుకలో నూతన వధూవరులు కుక్కను తీసుకొని ఫోటోలకు ఫోజులిస్తుండగా శాన్ జియు తన యజమానిని కడుపులో ఒక్క ఒదుటున తన్నేసింది. అంతేకాకుండా తనను దగ్గరకు తీసుకున్న పెళ్లికొడుకును మాత్రం ముద్దులతో ముంచెత్తింది. (శ్రీమతి కోరిక : టెర్రస్ ఎక్కిన స్కార్పియో ) అనుకోకుండా జరిగిన ఈ సంఘటనతో పెళ్లికూతురు సహా అక్కడున్న అతిథులంతా షాక్ అయ్యారు. కుక్కకు కోపమోస్తే ఇలా ఉంటుంది కాబోలంటూ నవ్వుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్తా వైరల్ అయ్యింది. పెళ్లిలో కుక్క చేసిన ఈ క్యూట్ ఎమోషనే హైలెట్‌గా నిలిచిందంటూ పెళ్లికూతురు కావో సైతం చమత్కరించింది. పెళ్లి హడావిడిలో ఉండి కొన్ని రోజులు పట్టించుకోకపోయే సరికి శాన్ జియుకి కోపం వచ్చిందని, అయితే తన భర్తతో మాత్రం చాలా అల్లరి చేస్తూ ఉత్సాహంగా ఉంటుందని చెప్పుకొచ్చింది. (ఆన్లైన్ గేమ్ ఆడుతుండగా భూకంపం.. ) Pet #dog 'kicks away' his bride owner as newlyweds try to pose for nuptial photos with him pic.twitter.com/hW9drz8smh — Hans Solo (@thandojo) October 30, 2020 -
అమెజాన్‌లో స్మార్ట్ఫోన్లపై ఇవాల్టి బొనాంజా
న్యూఢిల్లీ: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ లో ఇటీవలి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఆఫర్ ను మిస్ అయ్యామని ఫీల్ అవుతున్నారా...? డోంట్ వర్రీ.. మీ లాంటి వారికోసం ఇలాంటి ధమాకా సేల్ ఆఫర్ మళ్లీ మొదలైంది. అక్టోబర్ 17 నుంచి అక్టోబర్ 20 వరకు ఫెస్టివల్ సేల్ ను ప్రారంభించినట్టు అమెజాన్ ప్రకటించింది. ముఖ్యంగా ఫోన్ లవర్స్ కోసం అద్భుతమైన ఆఫర్లు రడీగా ఉన్నాయి. సిటీ కార్డు వినియోగదారులకు సైట్లో 10 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్, కేవలం యాప్ ద్వారా అదనంగా మరో 15 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ అందుబాటులో ఉంది. వీటితో పాటు అమెజాన్ ఎలక్ట్రానిక్ వస్తువులు, గాడ్జెట్లు, వంటగది ఉపకరణాలు, దుస్తులు మరియు పాదరక్షలు తదితర అమ్మకాల్లో వివిధ ఆఫర్లు అందిస్తోంది. స్మార్ట్ ఫోన్లపై ఇవాల్టి బ్లాక్ బస్టర్ డీల్స్ ఇలా ఉన్నాయి. మోటో జీ4 ప్లస్ అసలు ధర: రూ 14,999; రాయితీ ధర రూ 13,499 లెనోవా వైబ్ అసలు ధర: రూ 11,999; రాయితీ ధర రూ 9,999 శాంసంగ్ 5 ప్రో అసలు ధర: రూ 11,190; రాయితీ ధర రూ 9,990 ఒన్ ప్లస్ అసలు ధర: రూ 22,990; రాయితీ ధర రూ 19.990 కూల్ ప్యాడ్ మెగా 2.5డీ అసలు ధర: రూపాయలు 6,999; రాయితీ ధర రూ 5,999 మోటో జీ4 ప్లే ప్రైస్: రూ. 8,999; అదనంగా రూ 1,000 క్యాష్ బ్యాక్ శాంసంగ్ 7 ప్రో అసలు ప్రైస్: రూ. 9,190; రాయితీ ధర రూ 7,990 మోటో జీ4 అసలు ధర రూ 12,499; రాయితీ ధర రూ 10,499 లెనోవా వైబ్ కే 5 అసలు ధర, రూ. 7,499; రాయితీ ధర రూ 6,999