Hindu Makkal Katchi Announces Cash Prize For Anyone Who Kicks Sethupathi - Sakshi
Sakshi News home page

Vijay Sethupathi: సేతుపతిని తన్నిన వారికి రివార్డు ప్రకటించిన బీజేపీ నాయకుడు

Nov 9 2021 4:27 PM | Updated on Nov 9 2021 5:13 PM

Hindu Makkal Katchi Announces Cash Prize For Anyone Who Kicks Sethupathi - Sakshi

Hindu Makkal Katchi Announces Cash Prize For Anyone Who Kicks Sethupathi: తమిళ సూపర్‌స్టార్‌ విజయ్‌ సేతుపతిపై బెంగుళూరుఎయిర్‌పోర్టులో దాడి జరిగిన సంగతి తెలిసిందే. గాంధీ అనే వ్యక్తి సేతుపతిపై దాడికి యత్నించగా ఆ వీడియో వైరల్‌గా మారింది. ఇటీవలె ఈ ఘటనపై స్పందించిన సేతుపతి..ఇది చిన్న గొడవ అని, వీడియోలు వైరల్‌ కావడంతో జనాలు దీన్ని పెద్ద సమస్యగా చూస్తున్నారంటూ కొట్టిపారేశారు. తాజాగా హిందూ మక్కల్ కట్చి అనే ఒక హిందూ సంస్థ తమిళ సూపర్‌స్టార్‌ సేతుపతిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.చదవండి: ఎయిర్‌పోర్టులో దాడి: అసలేం జరిగిందో వివరించిన సేతుపతి

విజయ్‌ సేతుపతిని తన్నిన వారికి ఒక్క కిక్‌కు రూ. 1000రూపాయలు బహుమతిగా ఇస్తామని ప్రకటించడం సంచలనంగా మారింది. దీనిపై సంస్థ చీఫ్‌  అర్జున్‌ సంపత్‌ స్పందిస్తూ..స్వాతంత్ర్య సమరయోధుడు దైవతిరు పసుంపోన్ ముత్తురామలింగ తేవర్ అయ్యను, దేశాన్ని సేతపతి అవమానించాడని..ఆయన క్షమాపణ చెప్పేవరకు ఎక్కడ కనిపించినా కొట్టాలని కాంట్రవర్సీ కామెంట్లు చేశారు. 

చదవండి: కొత్త ఇంట్లోకి బిగ్‌బాస్‌ ఫేమ్‌ గంగవ్వ గృహప్రవేశం
భర్త అరెస్ట్‌.. హాస్పిటల్‌లో నటి పూనమ్‌ పాండే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement