
Vijay Sethupathis Reaction About His Attack : తమిళ సూపర్‌స్టార్ విజయ్‌సేతుపతిపై ఇటీవలె ఎయిర్‌పోర్టులో దాడి జరిగిన సంగతి తెలిసిందే. విభిన్న పాత్రలతో సూపర్‌స్టార్‌గా తెలుగు, తమిళ నాట ఎంతోమంది అభిమానుల మనసు చూరగొన్నసేతుపతిపై ఆగంతకుడు దాడి చేయడం సోషల్‌మీడియాలో చర్చకు దారితీసింది. ఘటనకు రకరకాలు ఊహాగానాలు తెరమీదకు వచ్చాయి. తాజాగా ఈ ఉదంతంపై స్వయంగా విజయ్ సేతుపతి స్పందించారు. చదవండి: పునీత్ చనిపోయి నేటికి 11రోజులు.. వేలాదిగా జనం క్యూ..
'నిజానికి ఇది చిన్న ఘటన. దాడి జరగానికి ముందే ఆ వ్యక్తి మా వ్యక్తిగత సిబ్బందితో గొడవపడ్డాడు. విమానం ఎయిర్ పోర్టులో విమానం ల్యాండ్ అయ్యాక కూడా ఇది కొనసాగింది. ఆ సమయంలో అతనుతాగిన మైకంలో ఉన్నాడు. అందుకే మతిస్థిమితం కొల్పోయి ఆ విధంగా ప్రవర్తించాడు. వీడియోలు వైరల్ కావడంతో జనాలు దీన్ని పెద్ద సమస్యగా చేస్తున్నారు. అయినా ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఫిల్మ్ మేకర్ అయిపోతున్నారు' అంటూ వ్యంగంగా బదులిచ్చారు.
ఇక వ్యక్తిగత సిబ్బందిని నియమించుకోకపోవడంపై స్పందిస్తూ.. 'నాకు సెక్యూరిటీ గార్డులను నియమించుకోవడం ఇష్టం ఉండదు. నేను ఎప్పుడు కూడా నా స్నేహితుడితోనే ప్రయాణిస్తాను. అతను నాకు 30ఏళ్లుగా తెలుసు. ఇప్పుడు అతను నాకు మెనేజర్‌గా కూడా ఉన్నాడు. నా అభిమానులను కలవడానికి, మాట్లాడటానికి నేను ఇష్టపడతాను. ఈ ఘటన జరిగినంత మాత్రానా నేను ఏమీ మారిపోను. ఇప్పుడు కూడా అభిమానులను కలుస్తూనే ఉంటాను' అని పేర్కొన్నారు.
చదవండి:ప్రియుడితో సీక్రెట్ 'రోకా' ఫంక్షన్ చేసుకున్న కత్రినా!
ఆ విషయంలో సామ్‌ను ఫాలో అవుతున్న చై!