Kenyan Athlete
-
రికార్డు ‘బ్రేక్’
ఏ క్రీడలో అయినా... రికార్డులు ఉండేది బద్దలు కావడానికే. అసాధ్యం అనుకున్న రికార్డులు సైతం అద్భుత ప్రదర్శన ముందు తలవంచాల్సిందే. ఇటీవల పురుషుల మారథాన్‌లో కెన్యా అథ్లెట్ సెబాస్టియన్ సావీ కూడా ఇలాంటి అద్భుతాన్ని ఆవిష్కరించాడు. ప్రతిష్టాత్మక లండన్ మారథాన్‌లో ఈ కెన్యా అథ్లెట్... 1 గంట 59 నిమిషాల 30 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఇప్పటి వరకు మారథాన్‌ను రెండు గంటల లోపు ఎవరూ పూర్తి చేయలేకపోగా... ఆ ఘనత సాధించిన తొలి అథ్లెట్‌గా సెబాస్టియన్ సావీ చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. వేర్వేరు క్రీడాంశాల్లో ఇలాంటి మరికొన్ని రికార్డులను ఓసారి పరిశీలిస్తే... సాహో... సెబాస్టియన్ మారథాన్‌లో కెన్యా రన్నర్లకు తిరుగులేదని సెబాస్టియన్ సావీ మరోసారి నిరూపించాడు. ఈ నెల 26న లండన్ మారరథాన్లో అతడు 42.195 కిలోమీటర్ల దూరాన్ని 1 గంట 59 నిమిషాల 30 సెకన్లలోనే చేరుకొని రికార్డు నెలకొల్పాడు. 2023లో కెన్యాకే చెందిన కెలి్వన్ కిప్టుమ్ 2 గంటల 35 సెకన్లలో మారథాన్ రేసును పూర్తి చేసి ప్రపంచ రికార్డు సృష్టించగా... తాజాగా సెబాస్టియన్ దీన్ని సవరించాడు. భారత్ విషయానికి వస్తే... సావన్ భర్వాల్ ఇటీవల 48 ఏళ్ల జాతీయ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ నెల 12 రోటెర్డామ్ మారథాన్‌ను సావన్ 2 గంటల 11 నిమిషాల 58 సెకన్లలో పూర్తి చేశాడు. దీంతో దిగ్గజ అథ్లెట్ శివనాథ్ సింగ్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డు బద్దలైంది. 1978లో శివనాథ్ సింగ్ 2 గంటల 12 నిమిషాల్లో గమ్యాన్ని చేరగా... ఇప్పుడు రెండు సెకన్ల తేడాతో సావన్ నేషనల్ రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. 15సార్లు రికార్డు బద్దలు... పురుషుల పోల్‌వాల్ట్‌లో స్వీడన్‌కు చెందిన అర్మాండ్ డుప్లాంటిస్ రికార్డు స్థాయిలో ఏకంగా 15 సార్లు ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. ఈ విభాగంలో ప్రస్తుతం 6.31 మీటర్ల ఎత్తు దూకి డుప్లాంటిస్ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసుకున్నాడు. 2020 నుంచి డుప్లాంటిస్ ఈ రికార్డును తిరగరాస్తూ వస్తున్నాడు. అయితే అంతకుముందు ఉక్రెయిన్‌కు చెందిన సెర్గీ బుబ్కా 1993లో నమోదు చేసిన రికార్డు (6.15 మీటర్లు) 21 ఏళ్ల పాటు చెక్కుచెదరకుండా ఉంది. 2014లో దాన్ని ఫ్రాన్స్‌కు చెందిన రెనాడ్ లావిలెనీ (6.16 మీటర్లు) బ్రేక్ చేయగా... ఆ తర్వాత నుంచి డుప్లాంటిస్ జోరు కొనసాగిస్తున్నాడు.41 ఏళ్ల తర్వాత... మహిళల 400 మీటర్ల పరుగులో నెదర్లాండ్స్‌కు చెందిన ఫెమ్కే బోల్ 41 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. 2023, ఫిబ్రవరి 19న జరిగిన పోటీల్లో బోల్ 400 మీటర్ల దూరాన్ని 49.26 సెకన్లలో పూర్తి చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. అంతకుముందు 1982లో చెకోస్లోవేకియాకు చెందిన జర్మిలా క్రాటోచ్విలోవా 49.59 సెకన్లతో రికార్డు సృష్టించగా... నాలుగు దశాబ్దాల తర్వాత నెదర్లాండ్స్ అథ్లెట్ దీన్ని బద్దలు కొట్టింది.35 ఏళ్లుగా పదిలంగా... పురుషుల లాంగ్‌జంప్‌లో 23 ఏళ్లుగా నిలిచి ఉన్న ప్రపంచ రికార్డును అమెరికా అథ్లెట్ 1991లో బద్దలు కొట్టగా... అప్పటి నుంచి ఈ రికార్డు అతడి పేరిటే ఉంది. అమెరికాకు చెందిన మైక్ పావెల్ 1991 ఆగస్టు 30న వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 8.95 మీటర్ల దూరం దూకి ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతకుముదు ఈ ఘనత అమెరికాకే చెందిన బాబ్ బీమన్ పేరిట ఉంది. బాబ్ 1968లో 8.90 మీటర్ల దూరం లంఘించాడు.కెన్యా అథ్లెట్లదే హవా...మహిళల మారథాన్‌లో బ్రిటన్ రన్నర్ పౌలా రాడ్‌క్లిఫ్ నెలకొల్పిన రికార్డు 16 ఏళ్ల పాటు పదిలంగా కొనసాగింది. 2003లో రాడ్‌క్లిఫ్ 42.195 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల 15 నిమిషాల 56 సెకన్లలో పూర్తి చేయగా... 2019లో కెన్యా అథ్లెట్ బ్రిగిడ్ కొస్గెయ్ 2 గంటల 14 నిమిషాల 4 సెకన్లలో గమ్యాన్ని చేరి రికార్డు బ్రేక్ చేసింది. ఈ విభాగంలో ప్రస్తుతం కెన్యాకే చెందిన రుత్ చెప్గెటిచ్ (2 గంటల 9 నిమిషాల 56 సెకన్లు) పేరిట ఈ రికార్డు ఉంది. గ్యారీ సోబర్స్ పేరిట 36 ఏళ్లు... టెస్టు క్రికెట్లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు సుదీర్ఘ కాలం వెస్టిండీస్ దిగ్గజం గ్యారీ సోబర్స్ పేరిటే ఉంది. 1958లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో సోబర్స్ 365 పరుగులు చేశాడు. 36 ఏళ్ల తర్వాత 1994లో ఈ రికార్డును విండీస్‌కే చెందిన బ్రియాన్ లారా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో 375 పరుగులతో సవరించాడు. ఆ తర్వాత 2003లో ఆ్రస్టేలియా ప్లేయర్ మాథ్యూ హెడెన్ జింబాబ్వేపై 380 పరుగులతో లారా రికార్డును బ్రేక్ చేయగా... 2004లో లారా మరోసారి ఇంగ్లండ్‌పై 400 పరుగులు చేసి తిరిగి ఆ రికార్డును తన పేరిట మార్చుకున్నాడు. అప్పటి నుంచి ఈ ఘనత లారా పేరిటే కొనసాగుతోంది. → నాలుగేళ్ల క్రితం భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు థామస్ కప్ గెలుచుకుంది. 73 ఏళ్ల ఈ టోర్నమెంట్ చరిత్రలో భారత జట్టు థామస్ కప్ గెలవడం అదే మొదటిసారి. → ఇటీవల ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరడం ద్వారా భారత యువ షట్లర్ ఆయుశ్ శెట్టి 61 ఏళ్ల రికార్డును తిరగరాశాడు. చివరిసారిగా భారత్ నుంచి 1965లో దినేశ్ ఖన్నా ఈ టోర్నమెంట్లో ఫైనల్ ఆడారు. → భారత బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి 2023లో ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలుచుకున్నారు. ఈ టోర్నీ చరిత్రలో డబుల్స్ విభాగంలో భారత్‌కు ఇదే తొలి పసిడి పతకం కాగా... ఓవరాల్‌గా 1965లో దినేశ్ ఖన్నా తర్వాత 58 ఏళ్లకు మరోసారి భారత్‌కు ఈ టోర్నమెంట్లో బంగారు పతకం లభించింది. → ఆంధ్రప్రదేశ్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ 2018 ఏప్రిల్‌లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ అందుకున్నాడు. 1980లో మన దేశం నుంచి చివరిసారిగా ప్రకాశ్ పదుకోన్ ఈ ఘనత సాధించగా... 38 ఏళ్ల తర్వాత శ్రీకాంత్ దానిని పునరావృతం చేశాడు. → 2019 బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలుచుకోవడం ద్వారా సాయిప్రణీత్ 36 ఏళ్ల రికార్డు బ్రేక్ చేశాడు. 1983లో భారత్ నుంచి చివరిసారిగా ప్రకాశ్ పదుకోన్ ఈ టోర్నమెంట్లో పతకం గెలిచాడు. సాయిప్రణీత్ తర్వాత భారత్ నుంచి 2021లో కిడాంబి శ్రీకాంత్ రజతం... లక్ష్య సేన్ కాంస్యం... 2023లో ప్రణయ్ కాంస్యం సాధించారు. → బ్యాడ్మింటన్ మహిళల విభాగంలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన తొలి భారత ప్లేయర్‌గా పీవీ సింధు రికార్డు సృష్టించింది. 2019లో సింధు ఈ ఘనత అందుకుంది. వరుస ఒలింపిక్స్‌లో (2016లో రజతం; 2020లో కాంస్యం) పతకాలు సాధించిన తొలి భారత మహిళా ప్లేయర్‌గానూ సింధు చరిత్రకెక్కింది.మరికొన్ని... బ్యాడ్మింటన్‌లో ఇలాంటి రికార్డులు చాలా ఉన్నాయి. భారత్ తరఫున తొలిసారి ప్రకాశ్ పదుకోన్ 1980లో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టైటిల్ సాధించగా... 21 ఏళ్ల తర్వాత పుల్లెల గోపీచంద్ ఈ రికార్డును బద్దలు కొట్టాడు. ఆ తర్వాత మరే భారత షట్లర్ ఆల్ ఇంగ్లండ్ టోర్నమెంట్లో విజేతగా నిలవలేకపోయాడు. –సాక్షి క్రీడావిభాగం -
సూపర్ సెబాస్టియన్
లండన్: ప్రతిష్టాత్మక లండన్ మారథాన్ రేసులో కెన్యా అథ్లెట్ సెబాస్టియన్ సావీ అద్భుతం చేశాడు. నిర్ణీత 42.195 కిలోమీటర్ల దూరాన్ని 1 గంట 59 నిమిషాల 30 సెకన్లలో పూర్తి చేసి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా మారథాన్ రేసును 2 గంటల్లోపు ముగించిన తొలి అథ్లెట్‌గా సెబాస్టియన్ గుర్తింపు పొందాడు. ఇదే రేసులో రెండో స్థానంలో నిలిచిన యోమిఫ్ కెజెల్చా (ఇథియోపియా) 1 గంట 59 నిమిషాల 41 సెకన్లలో గమ్యానికి చేరాడు. తద్వారా 2 గంటల్లో మారథాన్ పూర్తి చేసిన రెండో అథ్లెట్‌గా నిలిచాడు. జేకబ్ కిప్లిమో (ఉగాండా) 2 గంటల 28 సెకన్లలో రేసును ముగించి మూడో స్థానంలో నిలిచాడు. సెబాస్టియన్, కెజెల్చా, కిప్లియో ఒకేరోజు ప్రపంచ రికార్డును బద్దలు కొట్టడం విశేషం. 2023 నుంచి కెల్విన్ కిప్టుమ్ పేరిట ఉన్న మారథాన్ ప్రపంచ రికార్డును (2 గంటల 35 సెకన్లు; చికాగో మారథాన్) ఆదివారం ఈ ముగ్గురూ సవరించారు. -
హాఫ్ మారథాన్‌లో పెరెస్ ప్రపంచ రికార్డు
గిడినియా (పోలాండ్): ప్రపంచ అథ్లెటిక్స్ హాఫ్ మారథాన్ చాంపియన్‌షిప్‌లో మహిళల విభాగంలో కెన్యా అథ్లెట్ పెరెస్ జెప్చిర్చిర్ కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. శనివారం జరిగిన రేసులో 27 ఏళ్ల పెరెస్ 21.0975 కిలోమీటర్ల దూరాన్ని గంటా 5 నిమిషాల 16 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 5న ప్రేగ్లో గంటా 5 నిమిషాల 34 సెకన్లతో తానే నెలకొల్పిన ప్రపంచ రికార్డును పెరెస్ తిరగరాసింది. కెజెటా (జర్మనీ–1గం:05ని.18 సెకన్లు), యాలెమ్జెర్ఫ్ యెహుఅలావ్ (ఇథియోపియా–1గం:05ని.19 సెకన్లు) రజత, కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు. పురుషుల విభాగంలో జేకబ్ కిప్లిమో (ఉగాండా) 58 నిమిషాల 49 సెకన్లలో గమ్యానికి చేరి చాంపియన్‌గా నిలిచాడు. ప్రపంచ హాఫ్ మారథాన్‌లో టైటిల్ నెగ్గిన తొలి ఉగాండా రన్నర్‌గా కిప్లిమో గుర్తింపు పొందాడు. -
కెన్యా అథ్లెట్ దుర్మరణం
నైరోబి: కెన్యాకు చెందిన ప్రముఖ అథ్లెట్, ప్రపంచ మాజీ చాంపియన్ నికోలస్ బెట్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బుధవారం పశ్చిమ కెన్యాలో జరిగిన కారు ప్రమాదంలో 28 ఏళ్ల బెట్ దుర్మరణం పాలయ్యాడని స్థానిక పోలీసులు తెలిపారు. అతనికి రెండు సంవత్సరాల వయస్సున్న ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. 2015లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ 400 మీటర్ల హర్డిర్స్లో బెట్ స్వర్ణం సాధించాడు. దీంతో పాటు చైనాలో జరిగిన షార్ట్ డిస్టెన్స్ హర్డిల్స్ టైటిల్... రెండు సార్లు ఆఫ్రికా హర్డిల్స్ చాంపియన్‌షిప్ సొంతం చేసుకొని చరిత్ర సృష్టించాడు. బెట్ మృతిపై కెన్యా అథ్లెటిక్ సమాఖ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. క్రీడా రంగంలో అతని లోటు పూడ్చలేనిదని పేర్కొంది. -
జాక్వెలిన్ ఎందుకలా చేసింది?
ఎవరైనా పోటీలో ఎందుకు పాల్గొంటారు? గెలవడానికే కదా! మరి జాక్వెలిన్ అలా చేసిందేంటి? డీహైడ్రేట్ అయిపోయి దాదాపు పరుగెత్తలేకపోతున్న పోటీదారుడికి మంచినీళ్లు అందించింది. అంతేనా, అతను మళ్లీ పుంజుకునే వరకూ వెన్నంటి ఉంది. ఫలితంగా రేసులో ఓడిపోయింది. ఫస్ట్ ప్రైజ్ ద్వారా వచ్చే డబ్బుతో బతుకు చక్కదిద్దుకోవచ్చని.. ఎక్కడో కెన్యా నుంచి వచ్చి చైనాలో ఓడిపోయింది. కానీ మనిషిగా గెలిచింది. మానవత్వాన్ని గెలిపించింది. ఏమైనా లాభం ఉదంటారా? కెన్యాకు చెందిన జాక్వెలిన్ నైతెపీ కిప్లిమో.. చాలా మంది ఆఫ్రికన్ అథ్లెట్లలాగే పేదరికంలో పుట్టింది. కఠోరమైన దైనందిన జీవితమే వాళ్లను కఠినంగా.. ఎలాంటి లక్ష్యాన్నైనా ఛేధించగల బాణాలుగా తయారుచేస్తుంది. అప్పటికే మారథాన్ రన్నింగ్ రేసుల్లో పలు విజయాలు సాధించిన జాక్వెలిన్.. 2010లో చైనాలో జరిగిన జెంగ్ కయి అంతర్జాతీయ మారథాన్ పోటీలో పాల్గొంది. జెంగ్షూ నగరంలో ఆ పోటీల్లో ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన అథ్లెట్లు పాల్గొంటారు. మొత్తం 42 కిలోమీటర్ల రేసు. దివ్యాంగులు సైతం పెద్ద సంఖ్యలో పోటీ పడే రేసు ఇదే కావడం గమనార్హం. కళ్లులేనివాళ్లు కుక్కల సాయంతో నడవొచ్చు లేదా పరుగెత్తొచ్చు. అలా నాటి పోటీ ప్రారంభమైన చాలా సేటికి.. జాక్వెలిన్ పక్కగా చేతులు లేని చైనీస్ రన్నర్ ఒకరు పరుగెత్తాడు. కొద్దిసేపటి తర్వాత ఒంట్లో నీరంతా చెమటగా బయటికెళ్లడంతో అతను డీ హైడ్రేట్ అయిపోయాడు. ఇది గమనించిన జాక్వెలిన్ ట్రాక్ పక్కనే ఉంచిన మంచినీళ్ల బాటిల్ ను తీసుకుని, అతనికి అందించింది. మొండి చేతులతో నీళ్లు తాగిన ఆ చైనీస్ రన్నర్ కాస్త కుదుటపడ్డాడు. మళ్లీ దాహం వేస్తే అతనికి నీళ్లెవరు అందిస్తారు? అందుకే 28 కిలోమీటర్లు అతనితోపాటే పరుగెత్తింది జాక్వెలిన్! పోటీ చివరిదశలో తప్పక ఒంటరిగా.. వేగంగా పరుగెత్తింది. కానీ రేసులో గెలవలేకపోయింది. రెండో స్థానంతో సరిపెట్టుకుంది. చాలా మంది ఉద్యోగులు అసహ్యించుకునే సోమవారాన్ని ఉల్లాసభరితంగా మార్చే క్రమంలో కొందరు నెటిజన్లు ట్విట్టర్ లో #MondayMotivation పేరుతో తమను ఇన్ స్పైర్ చేసిన, తెలిసిన స్ఫూర్తిదాయక వ్యక్తుల గురించి పోస్టులు పెడుతుంటారు. అలా ఆగస్టు 31న హర్ష్ జియోంకా అనే వ్యక్తి జాక్వెలిన్ కు సంబంధించిన ఫొటోను పోస్ట్ చేశాడు. 'జాక్వెలిన్.. ఓ సంచలన స్ఫూర్తి' అంటూ మిగతవారు ఆమెకు జేజేలుకొడుతూ సోమవారంనాడు స్ఫూర్తిదాయకంగా గడిపారు.


