సూపర్‌ సెబాస్టియన్‌  | Sabastian Sawe becomes the first man to win a marathon in under two hours | Sakshi
Sakshi News home page

సూపర్‌ సెబాస్టియన్‌ 

Apr 27 2026 6:09 AM | Updated on Apr 27 2026 6:11 AM

Sabastian Sawe becomes the first man to win a marathon in under two hours

పురుషుల మారథాన్‌లో కొత్త ప్రపంచ రికార్డు

2 గంటల్లో మారథాన్‌ రేసును ముగించిన తొలి అథ్లెట్‌గా ఘనత  

లండన్‌: ప్రతిష్టాత్మక లండన్‌ మారథాన్‌ రేసులో కెన్యా అథ్లెట్‌ సెబాస్టియన్‌ సావీ అద్భుతం చేశాడు. నిర్ణీత 42.195 కిలోమీటర్ల దూరాన్ని 1 గంట 59 నిమిషాల 30 సెకన్లలో పూర్తి చేసి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా మారథాన్‌ రేసును 2 గంటల్లోపు ముగించిన తొలి అథ్లెట్‌గా సెబాస్టియన్‌ గుర్తింపు పొందాడు. 

ఇదే రేసులో రెండో స్థానంలో నిలిచిన యోమిఫ్‌ కెజెల్చా (ఇథియోపియా) 1 గంట 59 నిమిషాల 41 సెకన్లలో గమ్యానికి చేరాడు. తద్వారా 2 గంటల్లో మారథాన్‌ పూర్తి చేసిన రెండో అథ్లెట్‌గా నిలిచాడు. జేకబ్‌ కిప్లిమో (ఉగాండా) 2 గంటల 28 సెకన్లలో రేసును ముగించి మూడో స్థానంలో నిలిచాడు. సెబాస్టియన్, కెజెల్చా, కిప్లియో ఒకేరోజు ప్రపంచ రికార్డును బద్దలు కొట్టడం విశేషం. 2023 నుంచి కెల్విన్‌ కిప్టుమ్‌ పేరిట ఉన్న మారథాన్‌ ప్రపంచ రికార్డును (2 గంటల 35 సెకన్లు; చికాగో మారథాన్‌) ఆదివారం ఈ ముగ్గురూ సవరించారు.   

Advertisement
 
Advertisement
Advertisement