kathakali
-
కథాకళి: ఓ వర్షం రాత్రి
జిగ్నేష్‌కి అతని క్లాస్మేట్ కావ్యమణి ఐదేళ్ళ తర్వాత అకస్మాత్తుగా మెట్రోలో తారసపడింది. ఇద్దరూ ఒకే స్టేషన్ లో దిగాక జిగ్నేష్ ఆమెని ఎదురుగా ఉన్న కాఫీ షాప్‌కి ఆహ్వానించాడు. మోమోస్ తిని, కాఫీ తాగుతూ ఒకరి గురించి మరొకరు చెప్పుకున్నారు. కావ్యమణికి పెళ్ళై విడాకులు కూడా అయ్యాయని తెలిశాక అతను ఆహ్వానించాడు.‘‘మా ఆవిడ పుట్టింటికి వెళ్ళింది. ఈ రాత్రికి మా ఇంటికి రారాదు? నువ్వు వర్కింగ్ ఉమెన్ ్స హాస్టల్లో ఉంటున్నావు కాబట్టి ఎవరి అనుమతి అవసరం లేదు.’’‘‘ఆలోచిస్తాను. ఇందుకు మెంటల్‌గా నేను ప్రిపేర్ అవడానికి కొంత సమయం పడుతుంది. సాయంత్రం ఐదు తర్వాత ఫోన్ చేస్తాను.’’ కావ్యమణి జవాబు చెప్పింది. ‘‘నేను వంట కూడా బాగా చేస్తాను.’’ జిగ్నేష్ ‘వంట’ పదాన్ని ఒత్తి పలుకుతూ చెప్పాడు. ఆరున్నర దాకా అతను ఆమె ఫోన్ చేస్తుందా, లేదా అనే ఆదుర్దాకి గురయ్యాడు. ఆరు ముప్ఫై ఐదుకి కావ్యమణి నుంచి ఫోన్ వచ్చింది. ‘‘మీ ఇంటికి ఎలా రావాలో లొకేషన్ పంపు. నేను ఎనిమిదిన్నరకి రావచ్చా?’’‘‘ష్యూర్ అండ్ థాంక్స్.’’ విప్పారిన మొహంతో చెప్పాడు.అతను ఎనిమిదింటికి బియ్యం నానపెట్టాడు. ఫ్రిజ్ తెరచి కూరగాయలు తరిగి సిద్ధం చేశాడు. ఎనిమిదింపావుకి ఆకాశంలో మబ్బులు కనిపించాయి. మెరుపులని చూసి వర్షం వస్తుందని అనిపించాక కావ్యమణి రావటం విరమించుకుంటుందా అని భయపడ్డాడు.వంటపనిలో ఉండగా డోర్ బెల్ మోగితే తలుపు తెరిచాడు. మంచి పెర్ఫ్యూమ్ వాసన. కావ్యమణి వచ్చింది. ఆమె తన హెల్మెట్‌ని సోఫా మీద ఉంచి అడిగింది.‘‘నా స్కూటీని కార్ పార్క్‌లో నీ కారు వెనక పార్క్ చేశాను. ఓకే కదా?’’‘‘ఓకే.’’ఆమె ఫ్రెంచ్ డోర్‌ని తెరిచి బాల్కనీలోకి వెళ్ళి ఆకాశంలోకి కొద్ది క్షణాలు చూసి మళ్ళీ లోపలకి వచ్చి అడిగింది.‘‘స్నాక్స్ ఏమైనా ఉన్నాయా? ఆకలిగా ఉంది.’’‘‘కూర్చో. నాలుగైదు నిమిషాల్లో బర్గర్ చేస్తాను.’’అతను బర్గర్ పేటీని డీప్ఫ్రీజర్లోంచి తీసి, రెండువైపులా నెయ్యి స్ప్రే చేసి, ఏర్ ఫ్రైయర్లో ఉంచి, మూడు నిమిషాల తర్వాత వెనక్కి తిప్పాడు. ఈలోగా టొమాటో, ఉల్లిపాయలు, కొత్తిమీర కోసి, బర్గర్ బన్ మధ్యకి కోసి పెనం మీద కాల్చాడు. బర్గర్లో అన్నిటినీ పెట్టేముందు టొమాటో, మస్టర్డ్, చిల్లీ సాస్‌లు వేశాడు.‘‘బావుంది. బావుంది కాదు. ఎక్సలెంట్.’’ చెప్పి ఆమె జీరో కోక్ తాగింది.జిగ్నేష్ భార్య పుట్టింటికి కానుపుకి వెళ్ళి నాలుగు నెలలైంది. అతనికి అప్పటి నించి స్త్రీ సంపర్కం లేదు. తొందరగా ఉంది.‘‘వాతావరణం బావుంది కదా?’’ బాల్కనీలోంచి ఫ్రెంచ్ డోర్ ద్వారా చల్లటి గాలి వీస్తూండటంతో అడిగాడు.‘‘అవును. మనకి చక్కటి మూడ్ ఇచ్చే వాతావరణం.’’ కావ్యమణి చెప్పింది.ఆమెకి తన భార్య నైటీ ఇచ్చాడు. అతని ఎదురుగానే దాన్ని మార్చుకుంది. ఆమెని కౌగిలించుకుని చుంబించబోయాడు. అకస్మాత్తుగా ఫ్రెంచ్ డోర్ లోంచి తూనీగలు, రెక్కల పురుగులు, వందల సంఖ్యలో లోపలికి రాసాగాయి. అతను ఆమెని వదిలి ఫ్రెంచ్ డోర్ మూయబోయాడు.‘‘ఒద్దు.’’ కావ్యమణి అతన్ని ఆపి చెప్పింది.‘‘ఒద్దేమిటి? దీపం పురుగులు.’’ ఆశ్చర్యంగా చెప్పాడు.కావ్యమణి నేలరాలిన ఓ పురుగుని తీసి పరిశీలించి చూసి ఆనందంగా చెప్పింది.‘‘ఉసుళ్ళు.’’‘‘ఉసుళ్ళా?’’‘‘అవును. వీటిని ఉసుళ్ళు అంటాం. మీ ఇంటి దగ్గరలో చెదల పుట్టలు ఉండి ఉండాలి. వాటికి ఎండాకాలం వానకి రెక్కలు వచ్చి, మూకుమ్మడిగా పుట్టలోంచి బయటికి వస్తాయని, వీటి ఆయుష్షు నాలుగైదు గంటలు మాత్రమేనని చిన్నప్పుడు మా నాయనమ్మ చెప్పింది. ఇవి ప్రొటీన్ ఫుడ్ అని తెలుసా? వీటిని వేయించుకుని తింటాం. చాలా రుచిగా ఉంటాయి. చాలా కాలానికి భలే దొరికాయి.’’కావ్యమణి ఓ బేసిన్ లో నేలరాలిన ఉసుళ్ళని ఏరి, వాటి ట్రాన్స్పరెంట్ రెక్కలను తుంచి, పురుగులను బేసిన్ లో వేయడాన్ని జిగ్నేష్ అసహ్యంగా చూశాడు. ఆమె ఆ పనిని అరగంటకి పైగా పూర్తి చేశాక స్టవ్ వెలిగించి, ఆ పురుగులను నూనెలో వేయించి ఉప్పు కారం కలిపి రెండు ప్లేట్లలో పెట్టి తెచ్చింది.‘‘తిను. చాలా టేస్టీ.’’‘‘నో. థేంక్స్. నువ్వే తిను.’’ఆమె వాటిని తింటూంటే చెప్పాడు.‘‘నేను బయటికి వెళ్ళొస్తాను.’’అతను ఆ రాత్రి తిరిగి రాలేదు. మర్నాడు ఉదయం అతను వచ్చేసరికి కావ్యమణి ఆఫీస్‌కి వెళ్ళడానికి సిద్ధమై, అతని కోసం ఎదురుచూస్తోంది.‘‘రాత్రి నువ్వు రానని టెక్స్ట్ మెసేజ్ ఇచ్చావు. ఏమైంది?’’ అడిగింది.‘‘అర్జంట్‌గా ఆఫీస్ పని చేయాల్సివచ్చింది.’’ఆమె వెళ్ళాక అతను బేసిన్ ను, బాణలిని చెత్త డబ్బాలో పడేసి, ఆఫీస్‌కి వెళ్ళడానికి సిద్ధమవుతూ అనుకున్నాడు.‘ఇంకా నయం. త్వరపడి కావ్యమణి పెదాలని ముద్దు పెట్టుకోలేదు’ ∙మల్లాది వెంకట కృష్ణమూర్తి -
కథాకళి: ఫటాఫట్
అతని శ్రావ్యమైన కంఠం, మెత్తని నడవడిక అతనిలోని దుర్మార్గానికి తెరలని ఆమె ఆలస్యంగా తెలుసుకుంది.ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సుజీవ్ ఆమెని ఇంటర్వ్యూ చేశాడు. ఆమె అందం అతన్ని ఆకర్షించింది. పౌడర్ తప్ప మరే మేకప్ లేని, కనుబొమలని కట్ చేసుకుని దిద్దుకోని ఆమె సహజమైన అందం, ఆమె చురుకుదనం అతన్ని ఆకర్షించాయి.సుజీవ్ తండ్రి ఉద్యోగరీత్యా తూర్పు గోదావరి జిల్లాకి పోలీస్ సూపరింటెండెంట్. ఆయన అన్యాయార్జితంతో తన పేర స్థాపించిన ఫైనా¯Œ ్స కంపెనీని సుజీవ్ మేనేజ్ చేస్తున్నాడు. హైద్రాబాద్‌లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ఇరవై ఆరు అంతస్తుల భవంతిలో, టాప్ ఫ్లోర్లో ఐదువేల చదరపు అడుగుల విస్తీర్ణం గల అపార్ట్మెంట్లో సుజీవ్ ఒంటరిగా ఉంటాడు. అది సుజీవ్ తండ్రి అక్రమసంపాదనతో తన భార్య పేర కొన్న ఆస్తి.ఓరోజు ఆఫీస్‌లో లంచ్ చేస్తూ సుజీవ్ ఆమె వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నించి తెలుసుకున్నాడు. ‘‘నా భార్యకి పబ్ కల్చర్ అంటే ఇష్టం. వద్దన్నానని అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. నేను వెళ్ళి బతిమాలి తెస్తానని ఎదురుచూసింది. కాని విడాకులు తీసుకుంటానని ఆమె ఊహించలేదు. నువ్వు అన్నీ ఫటాఫట్ చేసేస్తూంటావు. మన వ్యాపారానికి అది ముఖ్యం. నీకు అభ్యంతరం లేకపోతే మన పెళ్ళి గురించి మీ పెద్దలతో మాట్లాడతాను.’’ఆమె దిమ్మెరపోయింది. తను ఎక్కడ? అతను ఎక్కడ? ఆమె గాల్లో తేలుతూ ఇంటికి వెళ్ళింది. వారం తర్వాత ఆమె అర్జెంట్ కాగితాల మీద సంతకాలు తీసుకోడానికి అతని అపార్ట్మెంట్కి వచ్చింది. అతను చొరవ తీసుకుంటే ఆమె సిగ్గుగా అభ్యంతరం చెప్పింది తప్ప ఎదురు తిరగలేదు.మూడు వారాల తర్వాత ఓరోజు ఆమెకి సుజీవ్ నించి ‘నువ్వు అర్జెంట్‌గా నా ఇంటికి వస్తావా?’ అనే మెసేజ్ వచ్చింది. ‘మా నాన్నగారికి వడదెబ్బ కొట్టి ఇప్పుడే తేరుకుంటున్నారు. అందుకే సెలవు పెట్టాను సర్. ఆయన్ని చూసుకోవాలి’ సమాధానం పంపింది.‘‘పర్సనల్‌గా మాట్లాడాలి. ఓ అరగంట వచ్చి వెళ్ళలేవా?’’ ఫోన్ చేసి అడిగాడు.‘‘సరే సర్.’’ అతని కంఠంలోని అభ్యర్థనని గుర్తించి చెప్పింది.‘‘జాగ్రత్తమ్మా. నగరంలో హీట్ వేవ్‌తో రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయని టీవీలో చూపిస్తున్నారు.’’ తల్లి హెచ్చరించింది. ఆమెని చూడగానే సుజీవ్ చెప్పాడు.‘‘మా నాన్నగారు చిక్కుల్లో పడ్డారు. బయటపడటానికి ఒకరిని మంచి చేసుకోవాలి. లేదా ఆయన ఉద్యోగం ఊడొచ్చు.’’‘‘అయ్యో.’’‘‘అందుకు నువ్వో మనిషిని సంతోషపెట్టాలి.’’‘‘నాకు అర్థం కాలేదు సర్.’’ అయోమయంగా చూస్తూ చెప్పింది.‘‘అర్థం కాకపోడానికి ఏంలేదు. నన్ను సంతోషపెట్టినట్లే. అతన్ని వచ్చే బుధవారం మన ఆఫీస్ గెస్ట్ హౌస్‌లో కలుసుకోవచ్చు.’’ఆమె తను విన్నది నమ్మలేకపోయింది. తనని పెళ్ళి చేసుకుంటానని అడిగిన ఇతనేనా ఈ మాట అన్నది? అతను తనని పెళ్ళి చేసుకోడని ఆమెకి వెంటనే తట్టింది. ఆమె దుఃఖం కోపంగా మారడంతో కంఠం పెంచి చెప్పింది.‘‘సారీ! నేను అలాంటిదాన్ని కాదు. నేను ఇప్పుడే రాజీనామా చేస్తున్నాను.’’‘‘నీకా అవకాశం లేదు. ఆ ఏíసీబీ డైరెక్టర్ని నువ్వు తృప్తి పరచాలి.’’అతను లేప్‌టాప్‌లో వాళ్ళిద్దరి రతికేళి వీడియోని ప్లే చేసాడు.‘‘ఏమిటిది? ఏమిటీ మోసం?’’ ఆమె మరోసారి నిర్ఘాంతపోతూ గట్టిగా అరిచింది.‘‘దీన్ని మీ తల్లిదండ్రులు చూడకూడదనుకుంటే, బుధవారం ఎక్కడ పికప్ చేయటం నీకు సౌకర్యమో చెప్పు.’’తను బ్లాక్మెయిల్లో చిక్కుకుందని ఆమెకి అర్థమైంది. ఆమె కన్నీళ్ళు ఆపుకుంటూ లేచి మెట్లెక్కి టెర్రేస్లోకి వెళ్ళింది.ఆమె ఏకాంతంగా ఏడవడం కోసం పైకెళ్ళిందని సుజీవ్కి అర్థమైంది. పది నిమిషాలు గడిచినా ఆమె రాకపోవడంతో అతను టెర్రేస్లోకి వెళ్ళాడు. తలుపు వెనక పొంచి ఉన్న ఆమె చటుక్కున మెట్లమీదకి వెళ్ళి టెర్రేస్ తలుపు మూసి గడియ పెట్టింది.‘‘తలుపు తీయి. ఏమిటిది?’’ సుజీవ్ తలుపు బాదుతూ అరిచాడు.తలుపు తెరచుకోలేదు. పావుగంట తర్వాత ఇక ఆమె తలుపు తెరవదని బోధపడింది. పిట్టగోడ మీంచి దూకడానికి వీలులేకుండా లోపలివైపు ఆరడుగుల ఎత్తున గ్లాస్ వాల్ ఉండటంతో, అతను కింద రోడ్ మీద వారిని సహాయం కోరే అవకాశం లేకపోయింది. ఎక్కడా నీడ కనిపించలేదు. ఎండకి చెమటతో అతని షార్ట్స్, టీషర్ట్ తడిసిపోయాయి. టీషర్ట్ విప్పి తల మీద కప్పుకున్నాడు. అతని ఒంట్లోని నీరు చెమట రూపంలో కారిపోతూ దాహంతో నాలుక పిడచకట్టుకు పోయింది. లేప్టాప్లోని తమ వీడియోని డిలీట్ చేశాక, టీవీ చూస్తూ కాలక్షేపం చేసిన ఆమె సూర్యాస్తమయ సమయంలో పైకెళ్ళి టెర్రేస్ తలుపు తెరిచింది. ఆమె ఆశించినట్లుగా నేల మీద మగతగా పడున్న సుజీవ్కి వడదెబ్బ కొట్టింది. చక్కెర, ఉప్పు నీళ్ళు తాగించి, సెలైన్ ఎక్కిస్తే అతను జీవిస్తాడని ఆమెకి తెలుసు. అతన్ని కిందకి మోసుకెళ్ళి పక్క మీద పడుకోబెట్టింది. అతను ఏం జరుగుతోందో కూడా అర్థం కానంత అపస్మారకంలో ఉన్నాడు. ఆమెని వంచించడానికి సుజీవ్ ఏ మంచాన్ని ఆయుధంగా చేసుకున్నాడో ఆ మంచం మీదే ఆ రాత్రి ఆమె ఫటాఫట్ నిర్ణయంతో ప్రాణం వదిలాడు. ∙మల్లాది వెంకట కృష్ణమూర్తి -
మరో వివాదంలో సెన్సార్ బోర్డు..
త్రివేండ్రం: సెన్సార్ బోర్డుపై మరో సినీ పరిశ్రమ యుద్ధం ప్రకటించింది. కథకళి సినిమాకు యూ సర్టిఫికెట్ ను నిరాకరించినందుకు... మాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఆగ్రహం వ్యక్తం చేసింది. మలయాళ దర్శకులు, నిర్మాతలు సోమవారం త్రివేండ్రంలోని సీబీఎఫ్‑సీ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. షార్ట్ ఫిలిమ్స్ తో ఫేమస్ అయిన యువ దర్శకుడు సజ్జు కన్నానైక్కల్ కథకళి చిత్రానికి దర్శకత్వం వహించారు. చిత్రానికి ప్రాణంలాంటి సన్నివేశాలను బోర్డు అధికారులు కత్తిరించేశారని దర్శకుడు ఆవేదన వ్యక్తం చేశారు. సెన్సార్ బోర్డు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చిత్ర యూనిట్ హైకోర్టును ఆశ్రయించింది. అయితే, నిబంధనలకు అనుగుణంగానే కథకళి సినిమాను సర్టిఫై చేశామని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. కథకళి నిర్మాతల పిటిషన్ స్వీకరించిన హైకోర్టు సీబీఎఫ్ సీ, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కాగా, సినిమా క్లైమాక్స్ లో కథకళి వేషాన్ని వదిలిపెట్టి వ్యక్తి న్యూడ్ గా పరుగెత్తే సీన్ ను తొలగించాలంటూ సీబీఎఫ్ సీ మేకర్స్ కు సూచించింది. దీనిపై స్పందించిన డెరెక్టర్ ఆ సీన్ సినిమాకు సింబాలిక్ రిప్రజెంటేషన్ అని దానిని తీయలేమని వాదిస్తున్నారు. దేశ వ్యతిరేకంగా కానీ, సెక్సువల్ గా కానీ, మహిళలను వేధించడం లాంటి సీన్ లు ఏమి సినిమాలో లేవని.. కేవలం చివరిలో ఒక వ్యక్తి న్యూడ్ గా నడుచుకుంటూ వెళ్తాడని, అది కూడా లాంగ్ షాట్ లో తీశామని సజ్జు తెలిపారు. కానీ, సీబీఎఫ్ సీ బోర్డు చిత్రానికి ‘ఏ’ సర్టిఫికెట్ ఇవ్వడం సమజసం కాదని అన్నారు. కాగా, క్లైమాక్స్, రెండో రీల్ లో బాస్టర్డ్ అనే పదం అక్కడే ఓ వ్యక్తి వస్త్రాలు తీసేసి చితక్కొట్టే సీన్ లను తొలగించాలని బోర్డు తెలిపింది. 83 కట్లు విధించినందుకు ఉడ్తా పంజాబ్ నిర్మాతలు బెంబే హైకోర్టులో న్యాయ పోరాటం చేసిన విషయం తెలిసిందే. -
నన్ను అందుకే వాడుకుంటున్నారు
నన్ను గ్లామర్‌కే వాడుకుంటున్నారని తెగ బాధ పడిపోతోంది నటి క్యాథరిన్ ట్రెసా. కోలీవుడ్‌లో గట్టి పోటీ ఉన్నా అవకాశాలను బాగానే రాబట్టుకుంటోంది ఈ అమ్మడు. తెలుగులో ఇద్దరమ్మాయిలతో చిత్రంలో అందాలారబోతలో దుమ్మురేపిన ఈ దుబాయ్ బ్యూటీ తమిళలోకొచ్చేసరికి మెడ్రాస్ చిత్రంలో పక్కింటి అమ్మాయి తరహా పాత్రలో బాగానే నటించింది. ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణ పొందడంతో ఇకపై అలాంటి నటనకు అవకాశం ఉన్నా మంచి పాత్రలు వస్తాయని ఆశించింది. అయితే అనుకున్నదొక్కటీ అయ్యింది ఒక్కటి అన్నట్టుగా క్యాథరిన్ పరిస్థితి మారింది. ఆ తరువాత విశాల్ సరసన కథకళి, అధర్వతో కణిదన్ చిత్రాల్లో నటించింది. ఆ చిత్రాలు విజయం సాధించినా వాటిలో ఈ అమ్మడు గ్లామర్‌డాల్ పాత్రలకే పరిమితమైంది. దీంతో ఎంతో బాధ పడిపోతున్న క్యాథరిన్ ట్రెసా తనను దర్శక నిర్మాతలు గ్లామర్‌కే వాడుకుంటున్నారని తెగ ఇదైపోతోంది. మోడ్రన్ పేరుతో కురచ దుస్తులు ధరింపజేస్తున్నారని వాపోతోంది. గ్లామరస్ పాత్రలతో అభిమానులు పెరుగుతున్నారన్నది కాస్త సంతోషంగా ఉన్నా మరీ అలాంటి పాత్రలకే ట్రేడ్ మార్క్‌గా మార్చేయడం బాధగా ఉందని పేర్కొంది. ఎన్ని చిత్రాలు చేశామన్నది కాకుండా ఎంత మంచి పాత్రలు పోషించామన్నదే లెక్కకొస్తుందనీ అలా చెప్పుకునే మంచి పాత్రల కోసం ఎదురు చూస్తున్నానని క్యాథరిన్ ట్రెసా అంటోంది.నటనకు అవకాశం ఉన్న పాత్రలు లభిస్తే తన సత్తా చాటుకుంటానని పేర్కొంది. -
ఆ డైరెక్టర్ రెండు సినిమాలు ఒకేరోజు
సినీరంగంలో తమ సినిమాతో తామే పోటీ పడటానికి తారలు ఇష్టపడరు. హీరోయిన్ల విషయంలో ఇలా ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం అప్పుడప్పుడు ఉంటుంది. కానీ, హీరోలు, సాంకేతిక నిపుణుల విషయంలో మాత్రం చాలా అరుదు. చాలా ఏళ్ల కిందట బాలకృష్ణ హీరోగా నటించిన బంగారు బుల్లోడు, నిప్పురవ్వ సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యి రికార్డ్ సృష్టించాయి. కృష్ణ హీరోగా నటించిన సినిమాలు కూడా పలు సందర్భాల్లో తక్కువ గ్యాప్‌లో రిలీజ్ అయ్యాయి. కానీ ఒకే దర్శకుడు తెరకెక్కించిన రెండు సినిమాలు ఒకే రోజు విడుదల అవ్వడం అత్యంత అరుదు. అలాంటి అరుదైన రిలీజ్ ఈ శుక్రవారం జరగనుంది. తమిళ దర్శకుడు పాండిరాజ్ తెరకెక్కించిన కథాకళి, మేము సినిమాలు ఒకేరోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన పసంగ 2 సినిమా.. మేము పేరుతో తెలుగులో రిలీజ్ అవుతోంది. తమిళంలో గత ఏడాది డిసెంబర్లోనే రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగులో మాత్రం ఆలస్యంగా ఈ వారం రిలీజ్ అవుతోంది. ఈ సినిమాతో పాటు ఇదే దర్శకుడి, డైరెక్షన్లో తెరకెక్కిన కథాకళి సినిమా కూడా తమిళ్లో జనవరిలోనే రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను కూడా తెలుగులో ఈ శుక్రవారమే రిలీజ్ చేస్తున్నారు నిర్మాతలు. అలా ఒకే దర్శకుడి రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవ్వటం టాలీవుడ్ సరికొత్త రికార్డ్. -
స్టార్ హీరోలతో ఢీ అంటున్న డబ్బింగ్ స్టార్
టాలీవుడ్లో సంక్రాంతి సీజన్‌కు చాలా ప్రాధాన్యం ఉంటుంది. అందుకే స్టార్ హీరోలు టాప్ టెక్నీషియన్లు తమ సినిమాలు సంక్రాంతి బరిలో విడుదల చేయడానికి ఉత్సాహం చూపిస్తారు. అదే బాటలో ఈ సంక్రాంతికి టాలీవుడ్ టాప్ స్టార్లు తమ సినిమాలతో రెడీ అవుతున్నారు. సంక్రాంతి హీరోగా పేరున్న బాలయ్య డిక్టేటర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తుండగా, నాగార్జున సోగ్గాడే చిన్నినాయన సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. తొలిసారిగా బాబాయ్‌తో ఢీ అంటూ అబ్బాయి ఎన్టీఆర్ కూడా నాన్నకు ప్రేమతో సినిమాతో అదే సీజన్‌ను టార్గెట్ చేస్తున్నాడు. తెలుగులోనే టాప్ హీరోలు బెర్త్ కోసం వేచి చూస్తుంటే కోలీవుడ్ యంగ్ హీరో విశాల్ మాత్రం తన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ కథకళిని సంక్రాంతికే రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాడట. తన సొంత నిర్మాణ సంస్థ ద్వారా పాండ్యరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు విశాల్. అందుకే తమిళ వర్షన్‌కు ప్రకటించిన సంక్రాంతి సీజన్లోనే తెలుగు వర్షన్‌ను కూడా రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు. ఇటీవలే నడిగర్ సంఘం ఎలక్షన్లలో సత్తా చాటిన విశాల్, టాలీవుడ్ సంక్రాంతి బరిలో ఎంతవరకు నిలబడతాడో చూడాలి.


