స్టార్ హీరోలతో ఢీ అంటున్న డబ్బింగ్ స్టార్ | vishal kathakali planing for sankranthi release | Sakshi
Sakshi News home page

స్టార్ హీరోలతో ఢీ అంటున్న డబ్బింగ్ స్టార్

Dec 16 2015 12:36 PM | Updated on Jul 15 2019 9:21 PM

స్టార్ హీరోలతో ఢీ అంటున్న డబ్బింగ్ స్టార్ - Sakshi

స్టార్ హీరోలతో ఢీ అంటున్న డబ్బింగ్ స్టార్

టాలీవుడ్లో సంక్రాంతి సీజన్కు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అందుకే స్టార్ హీరోలు టాప్ టెక్నీషియన్లు తమ సినిమాలు సంక్రాంతి బరిలో రిలీజ్ చేయడానికి ఉత్సాహం చూపిస్తారు.

టాలీవుడ్లో సంక్రాంతి సీజన్కు చాలా ప్రాధాన్యం ఉంటుంది. అందుకే స్టార్ హీరోలు టాప్ టెక్నీషియన్లు తమ సినిమాలు సంక్రాంతి బరిలో విడుదల చేయడానికి ఉత్సాహం చూపిస్తారు. అదే బాటలో ఈ సంక్రాంతికి టాలీవుడ్ టాప్ స్టార్లు తమ సినిమాలతో రెడీ అవుతున్నారు. సంక్రాంతి హీరోగా పేరున్న బాలయ్య డిక్టేటర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తుండగా, నాగార్జున సోగ్గాడే చిన్నినాయన సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. తొలిసారిగా బాబాయ్తో ఢీ అంటూ అబ్బాయి ఎన్టీఆర్ కూడా నాన్నకు ప్రేమతో సినిమాతో అదే సీజన్ను టార్గెట్ చేస్తున్నాడు.

తెలుగులోనే టాప్ హీరోలు బెర్త్ కోసం వేచి చూస్తుంటే కోలీవుడ్ యంగ్ హీరో విశాల్ మాత్రం తన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ కథకళిని సంక్రాంతికే రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాడట. తన సొంత నిర్మాణ సంస్థ ద్వారా పాండ్యరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు విశాల్. అందుకే తమిళ వర్షన్కు ప్రకటించిన సంక్రాంతి సీజన్లోనే తెలుగు వర్షన్ను కూడా రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు. ఇటీవలే నడిగర్ సంఘం ఎలక్షన్లలో సత్తా చాటిన విశాల్, టాలీవుడ్ సంక్రాంతి బరిలో ఎంతవరకు నిలబడతాడో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement