Jonassen
-
ఢిల్లీ అలవోకగా...
బెంగళూరు: ఈ సీజన్ మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీలో ఢిల్లీ క్యాపిటల్స్ నిలకడైన విజయాలతో దూసుకెళ్తోంది. మంగళవారం జరిగిన పోరులో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఢిల్లీ ఆరు వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌పై ఘనవిజయం సాధించింది. ముందుగా గుజరాత్ నిర్ణీ త 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. భారతి ఫుల్మాలి (29 బంతుల్లో 40 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) జట్టును ఆదుకుంది.డాటిన్ (24 బంతుల్లో 26; 5 ఫోర్లు) మెరుగ్గా ఆడింది. మరిజాన్ కాప్, శిఖా పాండే, అనాబెల్ సదర్లాండ్ తలా 2 వికెట్లు తీశారు. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ 15.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జెస్ జొనాసెన్ (32 బంతుల్లో 61 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), షఫాలీ వర్మ (27 బంతుల్లో 44; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగారు. ఆరంభంలోనే దెబ్బ... మొదట బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ జట్టులో బ్యాటర్లు మూకుమ్మడిగా చేతులెత్తేశారు. నాలుగో ఓవర్లో హర్లీన్ (5), లిచ్‌ఫీల్డ్ (0)లను అవుట్ చేసిన మరిజాన్ కాప్ దెబ్బ తీసింది. మరుసటి ఓవర్లో శిఖాపాండే వరుస బంతుల్లో బెథ్ మూని (10), కాశ్వీ గౌతమ్ (0)లను అవుట్ చేయడంతో ఇరవై పరుగులకే 4 కీలక వికెట్లను కోల్పోయింది.కాసేపటికి కెప్టెన్ ఆష్లీ గార్డ్నర్ (3), డియాండ్ర డాటిన్‌లు స్వల్ప వ్యవధిలో నిష్క్రమించడంతో 60/6 వద్ద గుజరాత్ కుదేలైంది. ఈ దశలో లోయర్ ఆర్డర్ బ్యాటర్ భారతి, తనూజ (16) ఏడో వికెట్‌కు 51 పరుగులు జోడించడంతో స్కోరు 100 దాటింది. ధనాధన్... సులువైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ ఆరంభంలోనే కెప్టెన్ మెగ్‌లానింగ్ (3) వికెట్‌ను కోల్పోయింది. స్టార్ బ్యాటర్‌ను అవుట్ చేశామన్న ఆనందం గుజరాత్‌కు ఎంతోసేపు నిలువలేదు. ఓపెనర్ షఫాలీ వర్మ, వన్‌డౌన్ బ్యాటర్ జెస్ జొనాసెన్ ధాటిగా ఆడటంతో పరుగులు వేగంగా వచ్చాయి. జెస్ బౌండరీలతో అలరించగా, షఫాలీ భారీ సిక్సర్లతో అదరగొట్టింది. వీరిద్దరు 31 బంతుల్లోనే 74 పరుగులు జత చేశారు. షఫాలీ జోరుకు గార్డ్నర్ అడ్డుకట్ట వేయగా, జెమీమా (5), అనాబెల్ (1) స్వల్ప వ్యవధిలో నిష్క్రమించినా... 26 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేసుకున్న జొనాసెన్ మిగతా లాంఛనాన్ని చకచకా పూర్తి చేసింది. నేడు జరిగే మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌తో ముంబై ఇండియన్స్ ఆడుతుంది. స్కోరు వివరాలు గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్: బెత్ మూనీ (సి) నికీ (బి) శిఖా పాండే 10; హర్లీన్ డియోల్ (సి) బ్రైస్ (బి) మరిజాన్ కాప్ 5; లిచ్‌ఫీల్డ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) మరిజాన్ కాప్ 0; ఆష్లీ గార్డ్నర్ (బి) టిటాస్ సాధు 3; కాశ్వీ (సి) నికీ (బి) శిఖా పాండే 0; డియాండ్రా (బి) అనాబెల్ 26; తనూజ (రనౌట్) 16; భారతి (నాటౌట్) 36; సిమ్రన్ (సి) లానింగ్ (బి) అనాబెల్ 5; మేఘన (బి) జెస్ జొనాసెన్ 0; ప్రియా మిశ్రా (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 127. వికెట్ల పతనం: 1–16, 2–16, 3–20, 4–20, 5–41, 6–60, 7–111, 8–121, 9–122. బౌలింగ్: శిఖా పాండే 3–0–18–2, మరిజాన్ కాప్ 4–1–17–2, టిటాస్ సాధు 2–0–15–1, అనాబెల్ 4–0–20–2, మిన్ను మణి 4–0–21–0, జెస్ జొనాసెన్ 3–0–24–1. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: మెగ్ లానింగ్ (బి) కాశ్వీ 3; షఫాలీ వర్మ (ఎల్బీడబ్ల్యూ) (బి) గార్డ్నర్ 44; జెస్ జొనాసెన్ (నాటౌట్) 61; జెమీమా (సి) భారతి (బి) తనూజ 5; అనాబెల్ (సి) బెత్ మూనీ (బి) కాశ్వీ 1; మరిజాన్ కాప్ (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (15.1 ఓవర్లలో 4 వికెట్లకు) 131. వికెట్ల పతనం: 1–14, 2–88, 3–114, 4–115. బౌలింగ్: డియాండ్ర 4–0–30–0, కాశ్వీ 4–0–26–2, ఆష్లీ గార్డ్నర్ 3–0–33–1, మేఘన 1–0–8–0, ప్రియా 1.1–0–18–0, తనూజ 2–0–13–1. -
లానింగ్, జొనసెన్ చెలరేగగా...
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్ మరోసారి భారీ స్కోరుతో విజయాన్ని అందుకుంది. మంగళవారం జరిగిన పోరులో ఢిల్లీ 42 పరుగుల తేడాతో యూపీ వారియర్స్‌పై జయభేరి మోగించింది. ముందుగా క్యాపిటల్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగుల స్కోరు చేసింది. కెప్టెన్ మెగ్ లానింగ్ (42 బంతుల్లో 70; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జెస్ జొనసెన్ (20 బంతుల్లో 42 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన యూపీ వారియర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 169 పరుగులకే పరిమితమైంది. సహచరులు తడబడినా... తాహ్లియా మెక్‌గ్రాత్ (50 బంతుల్లో 90 నాటౌట్; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) అసాధారణ పోరాటం చేసి అజేయంగా నిలిచింది. లానింగ్ అర్ధ సెంచరీ తొలి రెండు ఓవర్లు నెమ్మదిగా ఆడిన ఓపెనర్లు లానింగ్, షఫాలీ ఆ తర్వాత భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. షబ్నిమ్ ఐదో ఓవర్లో లానింగ్ ఒక సిక్స్, రెండు బౌండరీలతో 16 పరుగులు పిండుకుంది. రాజేశ్వరి వేసిన ఆరో ఓవర్లో షఫాలీ ఫోర్ కొడితే లానింగ్ మూడు బౌండరీలతో రెచ్చిపోయింది. పవర్ ప్లేలో ఢిల్లీ స్కోరు 62/0. మరుసటి ఓవర్లోనే షఫాలీ (17; 1 ఫోర్, 1 సిక్స్) ఆటను తాహ్లియా ముగించగా, మెగ్ లానింగ్ మాత్రం తన ధాటిని కొనసాగించి 32 బంతుల్లో (7 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధించింది. తర్వాత కాసేపు వాన ఆటంకపరిచింది. ఆట తిరిగి మొదలయ్యాక 11వ ఓవర్లో ఢిల్లీ స్కోరు 100 దాటింది. స్వల్ప వ్యవధిలో మరిజన్ (16; 2 ఫోర్లు), లానింగ్ నిష్క్రమించారు. తర్వాత వచ్చిన జెమిమా (22 బంతుల్లో 34 నాటౌట్; 4 ఫోర్లు), క్యాప్సీ (10 బంతుల్లో 21; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కూడా ఢిల్లీ వేగాన్ని కొనసాగించారు. ఆఖర్లో జొనసెన్ భారీ సిక్సర్లతో విరుచుకుపడింది. దీంతో ఆఖరి 4 ఓవర్లలో ఢిల్లీ 58 పరుగులు సాధించడంతో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ 200 మార్క్ దాటింది. మెక్‌గ్రాత్ ఒంటరి పోరాటం కొండంత లక్ష్యం ముందుంటే యూపీ వారియర్స్ టాపార్డర్ నిర్లక్ష్యంగా వికెట్లను పారేసుకుంది. కెప్టెన్ అలీసా హీలీ (17 బంతుల్లో 24; 5 ఫోర్లు), శ్వేత (1), కిరణ్ నవ్‌గిరే (2) ‘పవర్ ప్లే’లోనే పెవిలియన్కెళ్లారు. తర్వాత వచ్చిన వారిలో తాహ్లియా ఒంటరిపోరాటం చేసింది. దీప్తి శర్మ (12), దేవిక వైద్య (21 బంతుల్లో 23; 2 ఫోర్లు)లు దూకుడుగా ఆడబోయి వెనుదిరిగారు. బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించిన జొనసెన్ స్పిన్ బౌలింగ్‌తో యూపీని చావుదెబ్బ తీసింది. మెక్‌గ్రాత్ 36 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న మెక్‌గ్రాత్... ఆఖరి ఓవర్లలో ఆమె ఫోర్లు, సిక్సర్లు బాదడంతో యూపీ 150 పైచిలుకు స్కోరు చేయగలిగింది. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: మెగ్ లానింగ్ (బి) రాజేశ్వరి 70; షఫాలీ (సి) నవ్‌గిరే (బి) తాహ్లియా 17; మరిజన్ (సి) దీప్తిశర్మ (బి) ఎకిల్‌స్టోన్ 16; జెమిమా నాటౌట్ 34; క్యాప్సీ (సి) ఎకిల్‌స్టోన్ (బి) షబ్నిమ్ 21; జొనసెన్ నాటౌట్ 42; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 211. వికెట్ల పతనం: 1–67, 2–96, 3–112, 4–144. బౌలింగ్: షబ్నమ్ 4–0–29–1, అంజలీ 3–0–31–0, రాజేశ్వరి గైక్వాడ్ 2–0–31–1, తాహ్లియా మెక్‌గ్రాత్ 3–0–37–1, దీప్తిశర్మ 4–0–40–0, సోఫీ ఎకిల్‌స్టోన్ 4–0–41–1. యూపీ వారియర్స్ ఇన్నింగ్స్: హీలీ (సి) జెమిమా (బి) జొనసెన్ 24; శ్వేత (సి) తానియా (బి) మరిజన్ 1; కిరణ్ నవ్‌గిరే (సి) క్యాప్సీ (బి) జొనసెన్ 0; తాహ్లియా మెక్‌గ్రాత్ నాటౌట్ 90; దీప్తిశర్మ (సి) రాధ (బి) శిఖా 12; దేవిక (సి) రాధ (బి) జొనసెన్ 23; సిమ్రన్ నాటౌట్ 6; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 169. వికెట్ల పతనం: 1–29, 2–31, 3–31, 4–71, 5–120. బౌలింగ్: మరిజన్ 4–1–29–1, శిఖాపాండే 4–0–18–1, జెస్ జొనసెన్ 4–0–43–3, నోరిస్ 2–0–25–0, క్యాప్సీ 4–0–25–0, రాధ 1–0–11–0, అరుంధతి 1–0–14–0. డబ్ల్యూపీఎల్‌లో నేడు గుజరాత్ జెయింట్స్ Vs బెంగళూరు రాత్రి గం. 7:30 నుంచి స్పోర్ట్స్ 18 చానెల్లో, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
న్యూజిలాండ్ మహిళల హ్యాట్రిక్
ఆస్ట్రేలియాపై విజయం నాగ్‌పూర్: తమ పురుషుల జట్టుకు తగ్గట్టుగానే టి20 మహిళల ప్రపంచకప్‌లోనూ న్యూజిలాండ్ వరుస విజయాలతో దూసుకెళుతోంది. సోమవారం గ్రూప్ ‘ఎ’లో భాగంగా పటిష్ట ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఇది కివీస్‌కు వరుసగా మూడో విజయం. దీంతో సెమీస్ బెర్త్‌ను దాదాపు ఖాయం చేసుకుంది. టాస్ నెగ్గి బ్యాటింగ్ తీసుకున్న ఆసీస్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 103 పరుగులు చేసింది. కివీస్ ఆఫ్ స్పిన్నర్ లీగ్ కాస్పెరెక్ (13/3) టాప్ ఆర్డర్‌ను బెంబేలెత్తించింది. . ఎలీస్ పెర్రీ (48 బంతుల్లో 42; 3 ఫోర్లు; 1 సిక్స్), జొనాస్సెన్ (22 బంతుల్లో 23; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు.లెగ్ స్పిన్నర్ ఎరిన్‌కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కివీస్ మహిళలు 16.2 ఓవర్లలో నాలుగు వికెట్లకు 104 పరుగులు చేశారు. ఓపెనర్లు ప్రీస్ట్ (27 బంతుల్లో 34; 5 ఫోర్లు; 1 సిక్స్), బేట్స్ (25 బంతుల్లో 23; 1 ఫోర్; 1 సిక్స్) రాణించడంతో కివీస్ అలవోకగా నెగ్గింది.