న్యూజిలాండ్ మహిళల హ్యాట్రిక్ | New Zealand women's in hat-trick | Sakshi
Sakshi News home page

న్యూజిలాండ్ మహిళల హ్యాట్రిక్

Mar 22 2016 12:51 AM | Updated on Sep 3 2017 8:16 PM

తమ పురుషుల జట్టుకు తగ్గట్టుగానే టి20 మహిళల ప్రపంచకప్‌లోనూ న్యూజిలాండ్ వరుస విజయాలతో .....

 ఆస్ట్రేలియాపై విజయం
 
నాగ్‌పూర్: తమ పురుషుల జట్టుకు తగ్గట్టుగానే టి20 మహిళల ప్రపంచకప్‌లోనూ న్యూజిలాండ్ వరుస విజయాలతో దూసుకెళుతోంది. సోమవారం గ్రూప్ ‘ఎ’లో భాగంగా పటిష్ట ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఇది కివీస్‌కు వరుసగా మూడో విజయం. దీంతో సెమీస్ బెర్త్‌ను దాదాపు ఖాయం చేసుకుంది. టాస్ నెగ్గి బ్యాటింగ్ తీసుకున్న ఆసీస్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 103 పరుగులు చేసింది.

కివీస్ ఆఫ్ స్పిన్నర్ లీగ్ కాస్పెరెక్ (13/3) టాప్ ఆర్డర్‌ను బెంబేలెత్తించింది. . ఎలీస్ పెర్రీ (48 బంతుల్లో 42; 3 ఫోర్లు; 1 సిక్స్), జొనాస్సెన్ (22 బంతుల్లో 23; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు.లెగ్ స్పిన్నర్ ఎరిన్‌కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కివీస్ మహిళలు 16.2 ఓవర్లలో నాలుగు వికెట్లకు 104 పరుగులు చేశారు. ఓపెనర్లు ప్రీస్ట్ (27 బంతుల్లో 34; 5 ఫోర్లు; 1 సిక్స్), బేట్స్ (25 బంతుల్లో 23; 1 ఫోర్; 1 సిక్స్)  రాణించడంతో కివీస్ అలవోకగా నెగ్గింది.



 

Advertisement
 
Advertisement
Advertisement