breaking news
Alice Perry
-
ఐసీసీ వన్డే, టి20 జట్లలో స్మృతి మంధాన
దుబాయ్: భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధానకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించిన వార్షిక వన్డే, టి20 జట్లలో చోటు దక్కింది. ఈ ఏడాది కనబరిచిన ప్రదర్శన ఆధారంగా ఐసీసీ వార్షిక అవార్డులు, వుమెన్ టీమ్స్ ఆఫ్ ఇయర్‌ను ఎంపిక చేస్తారు. 23 ఏళ్ల ఈ భారత ఓపెనర్ రెండు టెస్టులతోపాటు 51 వన్డేలు, 66 టి20లు ఆడింది. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో ఆమె 3476 పరుగులు చేసింది. ఈ సీజన్లో స్మృతి అద్భుతంగా రాణించింది. ఐసీసీ మహిళల వన్డే జట్టులో భారత్ నుంచి ఆమెతో పాటు బౌలర్లు జులన్ గోస్వామి, పూనమ్ యాదవ్, శిఖా పాండేలకు చోటు దక్కగా... టి20 జట్టులో ఆల్‌రౌండర్ దీప్తి శర్మ, స్పిన్నర్ రాధా యాదవ్ కూడా ఎంపికయ్యారు. ఐసీసీ ఇరు జట్లకు మెగ్ లానింగ్ (ఆ్రస్టేలియా) కెపె్టన్‌గా వ్యవహరిస్తుంది. కాగా... ఆ్రస్టేలియాకే చెందిన ఎలీస్ పెర్రీ ‘క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’... ‘వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’గా ఎంపికైంది. ఎలిస్ పెర్రీ వన్డేల్లో ఈ సీజన్లో 73.50 సగటుతో 441 పరుగులు చేయడంతోపాటు 21 వికెట్లు తీసింది. ఈ ఏడాది ఆమె మూడు ఫార్మాట్లలోనూ నిలకడగా రాణించింది. మహిళల టి20 క్రికెట్లో 1000 పరుగులు చేయడంతోపాటు 100 వికెట్లు తీసిన తొలి క్రికెటర్‌గా గుర్తింపు పొందింది. టి20 ఫార్మాట్లో ఆసీస్‌కే చెందిన అలీసా హీలీ ‘క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు సొంతం చేసుకుంది. -
న్యూజిలాండ్ మహిళల హ్యాట్రిక్
ఆస్ట్రేలియాపై విజయం నాగ్‌పూర్: తమ పురుషుల జట్టుకు తగ్గట్టుగానే టి20 మహిళల ప్రపంచకప్‌లోనూ న్యూజిలాండ్ వరుస విజయాలతో దూసుకెళుతోంది. సోమవారం గ్రూప్ ‘ఎ’లో భాగంగా పటిష్ట ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఇది కివీస్‌కు వరుసగా మూడో విజయం. దీంతో సెమీస్ బెర్త్‌ను దాదాపు ఖాయం చేసుకుంది. టాస్ నెగ్గి బ్యాటింగ్ తీసుకున్న ఆసీస్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 103 పరుగులు చేసింది. కివీస్ ఆఫ్ స్పిన్నర్ లీగ్ కాస్పెరెక్ (13/3) టాప్ ఆర్డర్‌ను బెంబేలెత్తించింది. . ఎలీస్ పెర్రీ (48 బంతుల్లో 42; 3 ఫోర్లు; 1 సిక్స్), జొనాస్సెన్ (22 బంతుల్లో 23; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు.లెగ్ స్పిన్నర్ ఎరిన్‌కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కివీస్ మహిళలు 16.2 ఓవర్లలో నాలుగు వికెట్లకు 104 పరుగులు చేశారు. ఓపెనర్లు ప్రీస్ట్ (27 బంతుల్లో 34; 5 ఫోర్లు; 1 సిక్స్), బేట్స్ (25 బంతుల్లో 23; 1 ఫోర్; 1 సిక్స్) రాణించడంతో కివీస్ అలవోకగా నెగ్గింది.