breaking news
john kelly
-
ఆయన నా రియల్ స్టార్.. ట్రంప్ కీలక మార్పు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో కీలక మార్పు చేశారు. ఇప్పటి వరకు అమెరికా అంతర్గత వ్యవహారాలను పర్యవేక్షించిన కార్యదర్శి జనరల్ జాన్ కెల్లీని శ్వేతసౌద సిబ్బంది చీఫ్గా నియమించారు. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 'ఈ విషయం చెప్పేందుకు నేను చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాను. ఇప్పుడే నేను జనరల్/సెక్రటరీ జాన్ ఎఫ్ కెల్లీని వైట్ హౌస్ స్టాఫ్ చీఫ్గా ప్రకటించాను. ఆయన గొప్ప అమెరికన్. గొప్ప నాయకుడు. అంతర్గత వ్యవహారాల కార్యదర్శిగా ఆయన బృహత్తర విధులు నిర్వర్తించారు. నా పరిపాలన వర్గంలో ఆయన నిజమైన స్టార్' అంటూ ట్రంప్ పేర్కొన్నారు. కెల్లీ రెయిన్స్ ప్రీబస్ స్థానంలో పనిచేయనున్నారు. -
‘పాస్వర్డ్స్ చెబితేనే అమెరికా రానిస్తాం’
వాషింగ్టన్: ఇక నుంచి వీసాకోసం వచ్చేవారు తాము ఉపయోగిస్తున్న సోషల్ మీడియా పాస్ వర్డ్స్ను చెప్పేటట్లయితేనే రావాలని అమెరికా అడగనుంది. తమ దేశ భద్రతా చర్యల్లో భాగంగా ఇప్పటికే ఏడు ముస్లిం దేశాల దేశాలపై నిషేధం విధించిన నేపథ్యంలో తాజాగా చేసిన ఈ ప్రకటన మరింత ఆందోళన సృష్టించనుంది. ఇక నుంచి అమెరికా వచ్చే వారి వివరాలు చాలా క్షుణ్ణంగా పరిశీలించాలని ఇప్పటికే ట్రంప్ అన్ని దేశాల రాయబార కార్యాలయానికి ఆదేశాలు పంపించిన విషయం తెలిసిందే. దీని ప్రకారం పలు మార్గదర్శకాలు వారికి సూచించినట్లు తెలిసింది. ఇందులో భాగంగా ఇక నుంచి తమ దేశానికి వచ్చే వారు తాము ఉపయోగిస్తున్న సామాజిక అనుసంధాన వేదికల వివరాలు, వాటి పాస్వర్డ్లు కచ్చితంగా వీసాకు ముందు ధృవపత్రాలను తనిఖీ చేసే అధికారులకు కచ్చితంగా చెప్పాలని కోరనున్నారు. ముఖ్యంగా ఇప్పటికే నిషేధం విధించిన ప్రధాన ముస్లిం దేశాల నుంచి వచ్చే వారి విషయంలో ఈ కఠిన నిబంధనలు అమలుచేయాలని భావిస్తున్నారు. ‘మేం నిషేధం విధించిన దేశాల వారిని రాకుండా ఆపడం కష్టం కావొచ్చు.. ఒక వేళ వారు వస్తే కచ్చితంగా ఈ వివరాలు మాత్రం అడుగుతాం. అవి ఇస్తేనే వీసాకు అనుమతిస్తాం. అవిస్తే వారు ఎలాంటి వెబ్సైట్లు చూస్తున్నారనే విషయం మాకు తెలుస్తుంది. ఒకవేళ వాళ్లు పాస్ వర్డ్స్ చెప్పకుంటే రావొద్దు’ అని అమెరికా అంతర్గత రక్షణ వ్యవహారాల కార్యదర్శి జాన్ కెల్లీ చెప్పారు.