breaking news
jet fuel
-
విమాన ఛార్జీలు తగ్గించిన ఎయిర్ ఏషియా ఎక్స్
మలేషియాకు చెందిన తక్కువ ఖర్చుతో విమాన సర్వీసులు అందించే ఎయిర్ఏషియా ఎక్స్ (AirAsia X) ప్రయాణికులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. జెట్ ఇంధన ధరలు తగ్గుముఖం పట్టడంతో జూన్ 15 నుంచి విమాన టికెట్ ఛార్జీలను సుమారు 5 శాతం మేర తగ్గించినట్లు సంస్థ సీఈఓ బో లింగం వెల్లడించారు. ఇంధన ధరల మార్పులను ప్రతి వారం సమీక్షిస్తూ అవసరానికి అనుగుణంగా ఛార్జీలను సవరించనున్నట్లు ఆయన తెలిపారు.గత కొద్ది నెలలుగా మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, ముఖ్యంగా అమెరికా–ఇరాన్ ఘర్షణల ప్రభావంతో జెట్ ఇంధన ధరలు భారీగా పెరిగి విమానయాన రంగాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. దీంతో ఎయిర్ఏషియా ఎక్స్ కొన్ని మార్గాల్లో సర్వీసులను తగ్గించడంతో పాటు ఇంధన సర్‌చార్జీలు విధించి, టికెట్ ధరలను కూడా పెంచాల్సి వచ్చింది. ఏప్రిల్‌లో కొన్ని రూట్లలో ఛార్జీలు 30–40 శాతం వరకు పెరిగినట్లు సంస్థ ప్రకటించింది.అయితే ఇటీవల అమెరికా–ఇరాన్ మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందం కుదరడంతో అంతర్జాతీయ మార్కెట్లో జెట్ ఇంధన ధరలు గణనీయంగా తగ్గాయి. మార్చి చివర్లో బ్యారెల్‌కు 242 డాలర్ల వరకు ఎగిసిన సింగపూర్ జెట్ ఫ్యూయల్ ధర ప్రస్తుతం సుమారు 112 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ పరిణామం విమానయాన సంస్థలకు కొంత ఊరటనిచ్చిందని బో లింగం పేర్కొన్నారు.ఇంధన వ్యయాల పెరుగుదల కారణంగా ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఎయిర్ఏషియా ఎక్స్ నష్టాలను నమోదు చేసింది. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా కొన్ని నష్టదాయక మార్గాలను నిలిపివేయడం, విమానాల వినియోగాన్ని తగ్గించడం, సరఫరాదారులు, లీజింగ్ భాగస్వాములతో ఒప్పందాలను పునఃసమీక్షించడం వంటి చర్యలు చేపట్టింది.సామర్థ్య పునరుద్ధరణ దిశగా అడుగులు వేస్తున్న సంస్థ ఆగస్టు నాటికి కార్యకలాపాలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే పాత విమానాలను దశలవారీగా విరమించి, ఇంధన సామర్థ్యం ఎక్కువగా ఉన్న కొత్త ఎయిర్‌బస్ A321LR విమానాలను వచ్చే ఏడాది నుంచి సేవల్లోకి తీసుకురానుంది. 2027 చివరి నాటికి తొలి ఎయిర్‌బస్ A220 జెట్లను అందుకోవాలని కూడా సంస్థ భావిస్తోంది. -
డీజిల్, జెట్ ఇంధనంపై విండ్‌ఫాల్ ట్యాక్స్ పెంపు!
పశ్చిమాసియా యుద్ధం, అంతర్జాతీయ మార్కెట్లో మారుతున్న ముడిచమురు సమీకరణాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా ఇంధన కొరత రాకుండా చూసేందుకు, ఎగుమతిదారులు అనవసర లబ్ధి పొందకుండా అడ్డుకట్ట వేసేందుకు డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని ప్రభుత్వం పెంచింది. సవరించిన కొత్త ధరలు ఈరోజు నుంచి అమలులోకి వస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తన అధికారిక నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. అయితే, సామాన్యుడిపై భారం పడకుండా దేశీయ వినియోగం కోసం సరఫరా అయ్యే పెట్రోల్, డీజిల్ ధరలపై ఎలాంటి సుంకాలు పెంచకపోవడం గమనార్హం.విండ్‌ఫాల్ ట్యాక్స్ అంటే..ఏదైనా ఒక పరిశ్రమ లేదా కంపెనీ తమ సొంత కష్టం లేదా అదనపు పెట్టుబడి లేకుండా అనుకోకుండా మారిన అంతర్జాతీయ పరిస్థితులు లేదా బాహ్య కారణాల వల్ల భారీగా లాభ పడినప్పుడు (విండ్‌పాల్ గెయిన్స్) ఆ అదనపు లాభాలపై ప్రభుత్వం విధించే ప్రత్యేక పన్నునే విండ్‌ఫాల్ ట్యాక్స్ అంటారు.సవరించిన పన్నుల వివరాలు..ఎగుమతులను నిరుత్సాహపరిచి, దేశీయ మార్కెట్ అవసరాలను తీర్చడమే లక్ష్యంగా కేంద్రం ఈ పన్నును సవరించింది.ఇంధనం రకంపాత సుంకం (లీటరుకు)సవరించిన కొత్త సుంకం (లీటరుకు)మార్పుడీజిల్రూ. 13.5రూ. 14.0రూ. 0.50 పెంపుజెట్ ఇంధనంరూ. 9.5రూ.12.5రూ.3 పెంపు -
విమానాల కొనుగోలు ప్రణాళిక వాయిదా?
టాటా గ్రూప్ సారథ్యంలోని విమానయాన సంస్థ ఎయిరిండియా ఆర్థిక ఒడిదొడుకుల నేపథ్యంలో కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. సంస్థ ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు వీలుగా కొత్త విమానాల డెలివరీలను వాయిదా వేయడంతో పాటు, తన ప్రతిష్టాత్మక విస్తరణ ప్రణాళికలను తాత్కాలికంగా పక్కన పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో తాము ఆర్డర్ చేసిన సుమారు 500 విమానాల డెలివరీ ప్రక్రియను మందగించేలా (స్లో డౌన్) చేయడంపై ప్రముఖ విమాన తయారీ సంస్థలైన ‘ఎయిర్‌బస్ ఎస్ఈ’, ‘బోయింగ్ కో’లతో ఎయిరిండియా చర్చలు జరుపుతున్నట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదిక వెల్లడించింది.భారీ చెల్లింపులు తప్పించుకునేందుకా?సాధారణంగా విమానయాన సంస్థలు జెట్ విమానాల కొనుగోలుకు సంబంధించిన చెల్లింపులను చాలా సంవత్సరాల పాటు విడతల వారీగా చెల్లిస్తాయి. అయితే, మొత్తం కొనుగోలు ధరలో సింహభాగం..అంటే దాదాపు 80 శాతం నిధులను విమానాన్ని అప్పగించే (డెలివరీ) సమయంలోనే చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం డెలివరీలను వాయిదా వేసుకోవడం ద్వారా తయారీదారులకు చెల్లించాల్సిన ఈ భారీ వ్యయాన్ని తాత్కాలికంగా తగ్గించుకోవచ్చని, తద్వారా ప్రస్తుత నిధుల కొరత నుంచి ఉపశమనం పొందవచ్చని ఎయిరిండియా వ్యూహాత్మకంగా యోచిస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి.దీనితో పాటు కొత్త దేశీయ, అంతర్జాతీయ గమ్యస్థానాలకు సర్వీసులు ప్రారంభించే ప్రణాళికలపై సంస్థ పునసమీక్ష జరుపుతోంది. లాభదాయకంగా లేని కొన్ని పాత మార్గాలను పూర్తిగా నిలిపేయాలని నిర్ణయించింది. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నూతన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం వంటి కీలక ఎయిర్‌పోర్ట్‌ల్లో తమ కార్యకలాపాల ప్రారంభాన్ని వాయిదా వేయాలని చూస్తోంది. ఇప్పటికే వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఎయిరిండియా గత నెలలో అంతర్జాతీయ విమాన సామర్థ్యాన్ని తాత్కాలికంగా 27 శాతం (జూన్ - ఆగస్టు మధ్య 145 వారపు విమానాలు), దేశీయ విమాన సామర్థ్యాన్ని 22 శాతం వరకు తగ్గించిన సంగతి తెలిసిందే.ఇందుకు దారితీసిన కారణాలుపశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల తరచూ గగనతలం మూసివేత.గత ఏడాది మార్చి నుంచి పాకిస్థాన్ వైపు గగనతలాన్ని శాశ్వతంగా మూసివేయడం వల్ల విమాన ప్రయాణ సమయం, ఇంధన ఖర్చులు పెరగడం.అంతర్జాతీయ మార్కెట్లో విమాన ఇంధన (ఏటీఎఫ్) ధరలు భగ్గుమనడం.అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ క్షీణించడం.ఎయిర్ ఇండియా ప్రతినిధి ఏమన్నారంటే..బ్లూమ్‌బెర్గ్ నివేదికపై ఎయిరిండియా ప్రతినిధి స్పందిస్తూ... ఈ వార్తలు కేవలం ఊహాజనితమైనవని కొట్టిపారేశారు. తమ ఫ్లీట్‌ను ఆధునీకరించడానికి, దీర్ఘకాలిక పరివర్తన ప్రణాళికను అమలు చేయడానికి సంస్థ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: ఒక్కసారిగా బంగారం ధరలు రివర్స్.. తెలుగు రాష్ట్రాల్లో.. -
పెట్రోల్, డీజిల్ అమ్మకాలు అప్..
వ్యవసాయానికి డిమాండ్ పెరగడం, వేసవి ప్రారంభంతో వాహన ఎయిర్ కండిషనింగ్ అవసరం వంటి అంశాలతో భారత్‌లో మేనెల పెట్రోల్ డీజిల్ అమ్మకాలు పెరిగాయని తాజా గణాంకాలు తెలిపాయి. ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. న్యూఢిల్లీ: దేశంలో అత్యధికంగా వినియోగించే ఇంధనం– డీజిల్‌కు డిమాండ్ ( మొత్తం డిమాండ్‌లో ఐదింట రెండు వంతుల వాటా) గత ఏడాది మేతో పోలిస్తే మేలో 9.3 శాతం పెరిగి 7.46 మిలియన్ టన్నులకు చేరుకుంది. ఏప్రిల్‌లో డిమాండ్ పెరుగుదల 6.7 శాతం. ► నెలవారీగా చూస్తే డీజిల్ డిమాండ్ ఏప్రిల్‌లో 7.16 మిలియన్ టన్నులుకాగా, మేలో 4.2 శాతం పెరుగుదలతో 7.46 మిలియన్ టన్నులకు చేరింది. ► ఇక పెట్రోల్ అమ్మకాలు వార్షికంగా 10.4 శాతం పురోగతితో 3.08 మిలియన్ టన్నులకు చేరింది. నెలవారీగా చూస్తే డిమాండ్ 16.5 శాతం పెరిగింది. ► పారిశ్రామిక, వ్యవసాయ కార్యకలాపాలు పుంజుకోవడంతో మార్చి ద్వితీయార్థం నుంచి పెట్రోలు, డీజిల్ విక్రయాలు పెరిగాయి. మార్చి ప్రథమార్థంలో వార్షిక ప్రాతిపదికన పెట్రోల్ విక్రయాలు 1.4 శాతం, డీజిల్ 10.2 శాతం తగ్గాయి. ► ఉష్ణోగ్రత పెరుగుదలతో ఎయిర్ కండిషనింగ్ అవసరాలు పెరగడమూ మేలో వినియోగం పెరగడానికి ఒక కారణం. ► రబీ పంటలు– ఎక్కువగా గోధుమలు, బార్లీ, ఆవాలు, నువ్వులు, పెసల పంటకాలం అక్టోబర్–డిసెంబర్ మధ్య ప్రారంభమవుతుంది. నూర్పిడికాలం ఏప్రిల్ నుండి జూన్ వరకు ఉంటుంది. హార్వెస్టింగ్, ట్రాక్టర్ల అవసరాలు డీజిల్ డిమాండ్ పెరుగుదలకు దారితీస్తుంది. ► కోవిడ్ సంక్షోభంలో ఉన్న 2021మే నెలతో పోల్చితే పెట్రోల్ వినియోగం తాజా సమీక్షా నెల్లో 72 శాతం పెరిగింది. మహమ్మారి ముందు 2019 మే నెలతో పోల్చితే 23.7 శాతం ఎగసింది. ► మే 2021తో పోల్చితే డీజిల్ వినియోగం 52.5 శాతం, మే 2019తో పోల్చితే 6.8 శాతం ఎగశాయి. పరిశ్రమ మాట.. ప్రభుత్వ, ప్రైవేట్ మూలధన వ్యయం పెరగడంతో భారత ఆర్థిక వ్యవస్థ వేగం పుంజుకుంది. సేవల రంగం పటిష్టంగా ఉండగా తయారీ రంగం కూడా పుంజుకుంది. దేశంలో చమురు డిమాండ్‌కు బలమైన పారిశ్రామిక కార్యకలాపాలు మద్దతునిస్తున్నాయి. వ్యవసాయ రంగంలో డిమాండ్ పుంజుకోవడం ఇంధన డిమాండ్‌కు మద్దతు నిస్తోంది. నీటిపారుదల విభాగంలో పైపుల వినియోగం ఇంధన డిమాండ్‌కు కారణంగా ఉన్న మరో కీలక అంశం. జెట్ ఫ్యూయల్‌కు డిమాండ్ ఏవియేషన్ రంగం నిరంతర సేవల పునఃప్రారంభంతో విమానాశ్రయాలలో భారత్ మొత్తం ప్రయాణీకుల రద్దీ కోవిడ్ ముందస్తు స్థాయికి చేరువవుతోంది. ఈ నేపథ్యంలో జెట్ ఫ్యూయెల్ డిమాండ్ మే నెల్లో 2022 ఇదే నెల్లో పోల్చితే 8.7 శాతం పెరిగి 6,09,800 టన్నులకు ఎగసింది. 2021 మేతో పోల్చితే 137 శాతం పెరిగింది. అయితే కోవిడ్ ముందస్తు విషయానికి వస్తే, 2019 మేనెలతో పోల్చితే 5.3% తక్కువగానే నమోదయ్యింది. అలాగే ఏప్రిల్ 2023తో (6,13,900 టన్నులు) పోల్చినా డిమాండ్ 0.7% తక్కువగానే ఉంది. వంట గ్యాస్ అమ్మకాలూ అప్ మరోవైపు వంట గ్యాస్ ఎల్పీజీ అమ్మకాలు వార్షికంగా మేలో 10% పెరిగి 2.4 మిలియన్ టన్నులకు చేరింది. ఎల్పీజీ వినియోగం 2021 మేతో పోల్చితే 13%, కోవిడ్ ముందస్తు కాలం 2019 మేతో పోల్చితే 19.6 % ఎగసింది. నెలవారీ డిమాండ్ చూసి నా (2023 ఏప్రిల్) మేనెల్లో ఎల్పీజీ డిమాండ్ 11.3 శాతం పెరిగింది. ఏప్రిల్‌లో డిమాండ్ 2.19 మిలియన్ టన్నులు. -
విండ్ ఫాల్ టాక్స్‌పై కేంద్రం కీలక నిర్ణయం
-
విండ్‌ఫాల్ టాక్స్ కోత: వారికి భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: విండ్‌ఫాల్ టాక్స్ పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది డీజిల్, క్రూడ్ ఆయిల్, జెట్ ఇంధన రవాణాపై విండ్‌ఫాల్ పన్ను తగ్గించింది. ఈ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారి చేసింది. డీజిల్, విమాన ఇంధన రవాణాపై లీటర్‌కు 2 రూపాయలు పన్ను తగ్గుతుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది, ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం పెట్రోలుపై రూ.6 (లీటరుకు) ఎగుమతి పన్నును కూడా రద్దు చేసింది. దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపై పన్నును కూడా దాదాపు 27 శాతం తగ్గించింది. టన్నుకు 23,250 రూపాయల నుంచి తగ్గించి రూ.17 వేలుగా ఉంచింది. అంతర్జాతీయంగా చమురు రేట్టు తగ్గడంతో దేశీ చమురు ఉత్పత్తి దారులు, రిఫైనర్లపై విండ్‌ఫాల్ పన్నును తగ్గించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. విండ్‌ఫాల్ టాక్స్ విధించిన ఒక నెలలోపే కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. సవరించిన రేట్లు నేటి (జూలై 20) నుంచే అమలులోకి వచ్చాయి. ప్రభుత్వం ప్రకటించిన విండ్‌ఫాల్ ట్యాక్స్ తగ్గింపు, ఎగుమతులపై సుంకాల కోత పెట్రోలియం రంగానికి భారీ ఊరటనిస్తుందని పరిశ్రమ పెద్దలు వ్యాఖ్యానించారు. ఫలితంగా రిలయన్స్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్, ఆయిల్ ఇండియా లిమిటెడ్ లాంటి ఆయిల్ మార్కెటింగ్ సంస్థలకు ప్రయోజనం సమకూరనుంది. ట్యాక్స్ తగ్గింపుతో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐఓసీఎల్, ఓఎన్జీసీ షేర్లలో కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. మరోవైపు అంతర్జాతీయంగా మార్కెట్లో క్రూడాయిల్ ధరలు మళ్లి పుంజుకున్నాయి. చాలాకాలం తరువాత ఇటీవల 100 డాలర్ల దిగువకు చేరిన బ్యారెల్ ధర మళ్లీ పైకెగసింది. బ్రెంట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో బ్యారెల్ క్రూడాయిల్ 107.23 డాలర్లు పలుకుతోంది. -
విమానాలకు ఇంధనం...పాడైన ఆహారంతో...!
వాషింగ్టన్: మీ ఇంట్లో ఆహారం ఎక్కువగా వృథా అవుతుందా...! మిగిలిపోయిన ఆహారాన్ని సింపుల్‌గా చెత్త బుట్టలో వేస్తున్నారా...! భవిష్యత్తులో మాత్రం అలా చేయకండి. చెత్తబుట్టలో వేసిన ఆహారాన్ని జాగ్రత్తగా దాచండి. మీరు పాడేసేది ఆహారాన్నే కాదు.. డబ్బులను కూడా ... వీడేవండి బాబు..! ఇలా చెప్తున్నాడు అనుకుంటున్నారా... అవును మీరు వినందీ నిజమే, భవిష్యత్తులో పాడైపోయిన ఆహారం మీకు కాసులను కురిపించనున్నాయి. అది ఎలా అని వాపోతున్నారా..! పాడైపోయిన ఆహారంతో విమానాలకు ఇంధనాన్ని తయారుచేయవచ్చును. ఆహార వ్యర్థాలను విమానయాన ఇంధనంగా మార్చడానికి అమెరికా పరిశోధకులు ఒక మార్గాన్ని కనుగొన్నారు. దీంతోపాటుగా విమానాల నుంచి విడుదలయ్యే కార్బన్‌ను నియంత్రించవచ్చును. అంతేకాకుండా గ్రీన్హాజ్ ఉద్గారాలను 165 శాతం తగ్గించవచ్చును. ఆహార వ్యర్థాల నుంచి రిలీజ్ అయ్యే మిథేన్ వాయువును అరికట్టవచ్చును.ఈ వ్యర్థాలతో పారఫిన్ అనే ఇంధనాన్ని తయారుచేయవచ్చునని పరిశోధకులు తెలిపారు. ఈ ఇంధనాన్ని జెట్ విమానాలకు వాడొచ్చు. ప్రస్తుతం విమాయానరంగ సంస్థలకు ప్రయాణీకుల సంఖ్య గణనీయంగా పెరిగిన, అదే స్ధాయిలో ఉద్గారాలను తగ్గించలేకపోతున్నాయి. పాడైన ఆహారం నుంచి పారాఫిన్... పరిశోధకుల నివేదిక ప్రకారం.. పాడైన ఆహారాన్ని, కార్లలో , ఇతర హెవీ వెహికల్లో వాడే ఇంధనం బయోడిజీల్ మాదిరిగానే పారఫిన్‌ను తయారుచేయవచ్చునని పేర్కొన్నారు. సింథటిక్ ఇంధనాన్ని తయారుచేయడానికి వంటనూనె, పనికి రాని కొవ్వు పదార్థాలు , నూనె , గ్రీజు అవసరమౌతాయి. వీటి కలయికతో డీజీల్‌ను పొందవచ్చు. అదే మాదిరిగా కొన్ని ప్రత్యేక పద్ధతులనుపయోగించి జెట్ ఫ్యూయల్‌ను తయారుచేయవచ్చును. అందుకుగాను పరిశోధకులు ప్రత్యామ్నాయ పద్ధతులతో ఆహార వ్యర్థాలను , జంతువుల ఎరువు, వ్యర్థజలాలను జెట్ హైడ్రోకార్బన్ ఇంధనంగా తయారుచేసే పద్ధతిని అభివృద్ధి పరిచారు. తొందరగా ఆవిరయ్యే ఫాటీ ఆసిడ్స్‌తో సులువుగా జెట్ ఫ్యూయల్‌ను తయారుచేయవచ్చునని అమెరికా జాతీయ పునరుత్పాదక శక్తి పరిశోధన సంస్ధ కు చెందిన సీనియర్ ఇంజనీరు డెరేక్ వార్డన్ తెలిపారు. పాడైన ఆహారంతో తయారైన జెట్ ప్యూయల్తో 2023లో సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌తో కలిసి మొట్టమొదటి టెస్ట్ ఫ్లైట్‌ను పరీక్షంచనున్నారు. (చదవండి: గూగుల్ మ్యాప్స్ కొత్త ఆప్డేట్.. !) -
ఎయిర్ ఇండియాకు మరో షాక్
సాక్షి, న్యూఢిల్లీ : సంక్షోభంలో కూరుకుపోయిన ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను కష్టాలు వీడటం లేదు. విమానాలకు ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్‌ను సమకూర్చే చమురు కంపెనీలకు రూ 4500 కోట్ల మేర చెల్లింపులు బకాయి ఉండటంతో ఆయా సంస్థలు ఇంధన సరఫరాలను నిలిపివేశాయి. ఏడు నెలల నుంచి తమకు రావాల్సిన బకాయిలను ఎయిర్ ఇండియా క్లియర్ చేయలేదని చమురు కంపెనీల ఉన్నతాదికారులు పేర్కొన్నారు. బకాయిలు పేరుకుపోవడంతో కొచ్చి, పుణే, పాట్నా, రాంచీ, వైజాగ్, మొహాలీ విమానాశ్రయాల్లో జెట్ ఇంధన సరఫరాను నిలిపివేయాలని ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌లు నిర్ణయించాయి. జెట్ ఇంధనం కొనుగోలు చేసిన 90 రోజుల వరకూ చెల్లింపులు జరిపేలా ఎయిర్ ఇండియాకు క్రెడిట్ వ్యవధి ఉన్నా ఎయిర్ ఇండియా సకాలంలో చెల్లింపులు జరపడంలేదని, క్రెడిట్ వ్యవధి ఇప్పుడు 200 రోజులు దాటినా చెల్లింపులు లేవని చమురు కంపెనీలకు చెందిన ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు. మూడు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలకు ఎయిర్ ఇండియా రూ 4500 కోట్ల మేర బకాయిలు పడింది. భారీ బకాయిలు ఉన్నా ఎయిర్ ఇండియా ప్రస్తుతం కేవలం రూ 60 కోట్లు చెల్లించేందుకే ముందుకు వచ్చిందని మరో అధికారి వెల్లడించారు. మూడు చమురు సంస్ధలు కలిపి బకాయిలపై గత వారం ఎయిర్ ఇండియాకు లేఖ రాశాయి. తక్షణమే బకాయిలు క్లియర్ చేయకుంటే జెట్ ఇంధన సరఫరాను నిలిపివేస్తామని ఈ లేఖలో ఎయిర్ ఇండియాను ఆయా కంపెనీలు హెచ్చరించాయి. బకాయిల చెల్లింపులపై సమగ్ర ప్రణాళికతో ముందుకు రావడంలో విఫలమవడంతో ఎయిర్ ఇండియాకు ఇంధన సరఫరాలను నిలిపివేయాలనే నిర్ణయం తీసుకోక తప్పలేదని మూడు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు వెల్లడించాయి. కాగా ఎయిర్ ఇండియా నిర్వహణ సామర్ధ్యం మెరుగ్గా ఉన్న సంస్థ రుణ భారం రూ 58,000 కోట్లకు పైగా చేరిందని ఎయిర్ ఇండియా ప్రతినిధి పేర్కొన్నారు. నిధుల సమీకరణ సంక్లిష్టంగా మారడంతో చెల్లింపులు, రుణాల క్లియరెన్స్‌లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆ ప్రతినిధి వెల్లడించారు. -
విమాన ప్రయాణీకులకు చార్జీల షాక్..
సాక్షి, న్యూఢిల్లీ : పండుగ సీజన్లో విమాన ప్రయాణీకులకు ఎయిర్‌లైన్స్ షాక్ ఇవ్వనున్నాయి. ఏవియేషన్ టర్భైన్ ఇంధనంపై కస్టమ్స్ సుంకాన్ని ప్రభుత్వం పెంచిన క్రమంలో పెరిగిన వ్యయాన్ని ప్రయాణీకులకు బదలాయించాలని విమానయాన సంస్థలు నిర్ణయించాయి. విమాన చార్జీలను నేరుగా పెంచకుండా వేరే చార్జీల రూపంలో వడ్డన ఉండే విధంగా ఎయిర్‌లైన్స్ సంసిద్దమయ్యాయి. పెరుగుతున్న ఇంధన ధరలు, విపరీతమైన పోటీ కారణంగా ప్రయాణీకులపై భారం మోపలేకపోవడం ఎయిర్‌లైన్స్‌పై ఒత్తిడి పెంచుతున్నాయని, తాజాగా ప్రభుత్వం జెట్ ఇంధనంపై కస్టమ్స్ సుంకం పెంచిన క్రమంలో చార్జీల పెంపు మినహా మరో ప్రత్యామ్నాయం లేదని ఎయిర్‌లైన్స్ భావిస్తున్నాయి. ఎయిర్‌లైన్స్ నిర్వహణ వ్యయంలో ప్రధానమైన ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్‌పై 5 శాతం కస్టమ్స్ సుంకం విధించాలని ప్రభుత్వం గత నెల నిర్ణయం తీసుకుంది. ప్రయాణం రద్దు చేసుకున్న సందర్భంలో అధిక చార్జీలను వసూలు చేయడంతో పాటు, ప్రయాణ తేదీల్లో మార్పు, ఆన్‌బోర్డ్ మీల్స్, బ్యాగేజ్ ఫీజు, కార్గో చార్జీలు, అదనపు బ్యాగేజ్ చార్జీలను భారీగా దండుకోవాలని విమానయాన సంస్థలు యోచిస్తున్నాయి. -
గగనతలంలో ఎలక్ట్రిక్ ప్లేన్ల సందడి
-
గగనతలంలో ఎలక్ట్రిక్ ప్లేన్ల సందడి
న్యూయార్క్: పెరుగుతున్న వాయు కాలుష్యానికి చెక్ పెట్టడంతో పాటు ఇంధన ఖర్చులను ఆదా చేసేందుకు త్వరలో గగనతలంలో ఎలక్ట్రిక్ విమానాలు సందడి చేయనున్నాయి. మరో పదేళ్లలో పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ కమర్షియల్ ప్లేన్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఈజీజెట్ అమెరికన్ ఇంజనీరింగ్ స్టార్టప్‌తో కలిసి పనిచేస్తోంది. 335 మైళ్ల దూరం ప్రయాణించగల ఎయిర్‌క్రాఫ్ట్‌ను డిజైన్ చేయడంపై అమెరికాకు చెందిన రైట్ ఎలక్ట్రిక్ కసరత్తు ప్రారంభించింది. ఈజీజెట్ విమానాల్లో ఇప్పుడు ప్రయాణించే వారి సంఖ్యలో 20 శాతం మందిని చేరవేయగల సీటింగ్ కెపాసిటీతో ఈ ఎలక్ట్రిక్ ప్లెయిన్‌ను డిజైన్ చేస్తున్నారు. వీటి కమర్షియల్ ఉత్పత్తులను వేగవంతం చేసేందుకు రైట్ ఎలక్ట్రిక్.. ఈజీజెట్‌తో కలిసి పనిచేస్తుంది. బ్యాటరీతో నడిచే విమానాలు ఇంధన వ్యయాలను తగ్గించడమే కాక, తక్కువ దూరాల ప్రయాణానికి అనువుగా ఉంటాయని, వాయు కాలుష్య నివారణకూ ఇవి ఉపకరిస్తాయని నిపుణులు చెబుతున్నారు. పర్యావరణంపై తక్కువ ప్రభావం చూపేలా ఎలక్ట్రిక్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, విమానయాన పరిశ్రమ సైతం ఎలక్ట్రిక్ బాట పట్టాల్సిన అవసరం ఉందని ఈజీజెట్ సీఈవో కార్లన్ మెకాల్ చెప్పారు. -
నీలగిరి చెట్ల నుంచి జెట్ ఇంధనం!
మెల్బోర్న్: తక్కువ కర్బన ఉద్గారాలు వెలువరించే జెట్ విమానాల ఇంధనాన్ని యూకలిప్టస్(నీలగిరి) చెట్లను ఉపయోగించి తయారు చేయొచ్చని తేలింది. ‘ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల యూకలిప్టస్(జామాయిల్)చెట్లను పెంచినట్లయితే విమానయాన పరిశ్రమకు కావాల్సిన 5 % ఇంధనాన్ని వాటి నుంచి తయారు చేయొచ్చు’ అని ఆస్ట్రేలియన్ నేషనల్ వర్సిటీకి చెందిన కార్స్టెన్ కుల్హీమ్ పేర్కొన్నారు. మొత్తం ఈ పరిశ్రమ ద్వారా 2 శాతం కార్బన్ డై ఆక్సైడ్ విడుదల అవుతోంది. శిలాజ ఇంధనాలతో పోల్చితే యూకలిప్టస్ ఇంధనం ఖరీదైందని, కాకపోతే వీటివల్ల కార్బన్‌డై ఆక్సైడ్ తక్కువగా విడుదలవుతుందన్నారు. జెట్ విమానాలకు శిలాజేతర ఇంధనాలు వాడడం కాస్త కష్టమని, అయితే పునరుత్పాదక ఇథనాల్, బయోడీజిల్ కొంతమేరకు ఫర్వాలేదని చెప్పారు. యూకలిప్టస్ నూనెలో మోనోటర్పీన్లు ఉంటాయని, వాటిని అధిక శక్తినిచ్చే ఇంధనాలుగా మార్చొచ్చని తెలిపారు. -
దెయ్యం చెట్లతో జెట్ విమానాలకు ఇంధనం
కాన్బెర్రా: ఆస్ట్రేలియాలో ప్రఖ్యాతిగాంచిన ఘోస్ట్ గమ్ చెట్లతో జెట్ విమానాలకు ఇంధనాన్ని ఉత్పత్తి చేయనున్నారు. ఈ మేరకు ఆస్ట్రేలియాకు చెందిన ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ(ఏఎన్‌యూ)కు చెందిన శాస్త్రవేత్తలు వివరాలు వెల్లడించారు. యూకలిప్టస్ ఆయిల్ లో లభించే మోనోటర్పన్స్ అనే పదార్థాలను ఉపయోగించుకుంటూ ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేయవచ్చని, దీనిని జెట్ లకు ఉపయోగించవచ్చని పేర్కొన్నారు. క్షిపణులకు, జెట్ విమానాలకు తక్కువ కర్బన సమ్మేళనాలు ఉండే ఇంధనం మాత్రమే సరిపోతుందని, ఇది ఆస్ట్రేలియాలో ఉన్న గమ్ చెట్ల ద్వారా సాధ్యం అవుతుందని చెప్పారు. ఏఎన్‌యూ బయాలజీ రీసెర్చ్ విభాగం అధ్యక్షుడు కార్స్టెన్ కులీమ్ మాట్లాడుతూ గమ్ చెట్లు కూడా యూకలిప్టస్ కుటుంబానికే చెందిన మొక్కలే అని ఒకసారి స్పష్టమైతే ఇక వాటి నుంచి ప్రపంచంలోని విమానాలకు ఐదుశాతం ఇంధనాన్ని ఈ చెట్ల ద్వారా ఉత్పత్తి చేయవచ్చని అన్నారు. ఇప్పటికే వీటిద్వారా పేపర్ ను తయారు చేస్తున్నారు.


