విమానాలకు ఇంధనం...పాడైన ఆహారంతో...!

Food Waste Turned Into Jet Fuel - Sakshi

వాషింగ్టన్‌: మీ ఇంట్లో ఆహారం ఎక్కువగా వృథా అవుతుందా...! మిగిలిపోయిన ఆహారాన్ని సింపుల్‌గా చెత్త బుట్టలో వేస్తున్నారా...! భవిష్యత్తులో మాత్రం అలా చేయకండి. చెత్తబుట్టలో వేసిన ఆహారాన్ని జాగ్రత్తగా దాచండి. మీరు పాడేసేది ఆహారాన్నే కాదు.. డబ్బులను కూడా ... వీడేవండి బాబు..! ఇలా చెప్తున్నాడు అనుకుంటున్నారా... అవును మీరు వినందీ నిజమే, భవిష్యత్తులో పాడైపోయిన ఆహారం మీకు కాసులను కురిపించనున్నాయి. అది ఎలా అని వాపోతున్నారా..! పాడైపోయిన ఆహారంతో విమానాలకు ఇంధనాన్ని తయారుచేయవచ్చును.

ఆహార వ్యర్థాలను  విమానయాన ఇంధనంగా  మార్చడానికి అమెరికా పరిశోధకులు ఒక మార్గాన్ని కనుగొన్నారు. దీంతోపాటుగా  విమానాల నుంచి  విడుదలయ్యే కార్బన్‌ను నియంత్రించవచ్చును. అంతేకాకుండా గ్రీన్‌హాజ్‌ ఉద్గారాలను 165 శాతం తగ్గించవచ్చును. ఆహార వ్యర్థాల నుంచి రిలీజ్‌ అయ్యే మిథేన్‌ వాయువును అరికట్టవచ్చును.ఈ వ్యర్థాలతో పారఫిన్‌ అనే  ఇంధనాన్ని తయారుచేయవచ్చునని పరిశోధకులు తెలిపారు. ఈ ఇంధనాన్ని జెట్‌ విమానాలకు వాడొచ్చు. ప్రస్తుతం విమాయానరంగ సంస్థలకు ప్రయాణీకుల సంఖ్య గణనీయంగా పెరిగిన,  అదే స్ధాయిలో ఉద్గారాలను తగ్గించలేకపోతున్నాయి.

పాడైన ఆహారం నుంచి పారాఫిన్‌...
పరిశోధకుల నివేదిక  ప్రకారం.. పాడైన ఆహారాన్ని, కార్లలో , ఇతర హెవీ వెహికల్లో వాడే   ఇంధనం బయోడిజీల్‌ మాదిరిగానే పారఫిన్‌ను తయారుచేయవచ్చునని పేర్కొన్నారు. సింథటిక్‌ ఇంధనాన్ని తయారుచేయడానికి వంటనూనె, పనికి రాని కొవ్వు పదార్థాలు , నూనె , గ్రీజు అవసరమౌతాయి. వీటి కలయికతో డీజీల్‌ను పొందవచ్చు. అదే మాదిరిగా కొన్ని ప్రత్యేక పద్ధతులనుపయోగించి జెట్‌ ఫ్యూయల్‌ను తయారుచేయవచ్చును. అందుకుగాను పరిశోధకులు ప్రత్యామ్నాయ పద్ధతులతో ఆహార వ్యర్థాలను , జంతువుల ఎరువు, వ్యర్థజలాలను జెట్‌ హైడ్రోకార్బన్‌ ఇంధనంగా తయారుచేసే పద్ధతిని అభివృద్ధి పరిచారు.

తొందరగా ఆవిరయ్యే ఫాటీ ఆసిడ్స్‌తో సులువుగా జెట్‌ ఫ్యూయల్‌ను తయారుచేయవచ్చునని అమెరికా జాతీయ పునరుత్పాదక శక్తి పరిశోధన సంస్ధ కు చెందిన సీనియర్‌ ఇంజనీరు డెరేక్‌ వార్డన్‌ తెలిపారు.  పాడైన ఆహారంతో తయారైన జెట్‌ ప్యూయల్‌తో  2023లో సౌత్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌తో కలిసి మొట్టమొదటి టెస్ట్‌ ఫ్లైట్‌ను పరీక్షంచనున్నారు.

(చదవండి: గూగుల్‌​ మ్యాప్స్‌ కొత్త ఆప్‌డేట్‌.. !)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top