jaspal rana
-
జస్పాల్ రాణా మృతి: గుండెపోటు విషయంలో బహుపరాక్!
భారత దిగ్గజ షూటర్, కోచ్ జస్పాల్ రాణా శుక్రవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. నిజానికి ఆయన ప్రయాణంలో ఉండగానే.. ఆసుపత్రికి చేరుకునే ముందు కూడా ఛాతీ నొప్పి కొనసాగింది. అక్కడ వైద్యులు ఆయన పరిస్థితిని స్థిరీకరించినప్పటికీ, గుండె పంపింగ్ సామార్థ్యం ఫెయిలై మృతి చెందారు. అంతేగాదు వైద్యులు ఆయన మరణం భారతదేశంలో మధ్య వయస్కులలో పెరుగుతున్న గుండె సంబంధిత మరణాలపై ఆందోళన రేకెత్తించింది. చాలామంది తేలిగ్గా కొట్టిపారేయడంతోనే ఆ టైంలో గోల్డెన్ అవర్ని పోగొట్టుకుని ప్రాణాలు కోల్పోతున్నారంటూ చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో గుండె సంబంధిత సమస్యలను గోల్డెన్ అవర్లోనే గుర్తించి ఎలా ప్రాణాలు రక్షించుకోవాలో సవివరంగా తెలుసుకుందామా.ప్రముఖ భారత షూటర్, కోచ్ జస్పాల్ రాణా విషాద మరణం, గుండెపోటు కేవలం వృద్ధులకు, అనారోగ్యవంతులకు మాత్రమే వస్తుందనే అపోహపై చర్చలను లేవనెత్తింది. వైద్యుల ప్రకారం, రాణాకు తెలియకుండానే మూడు రోజుల పాటు గుండెపోటుతో బాధపడ్డట్టు సమాచారం. ఆ తర్వాత ఆయన వైద్య సహాయం తీసుకున్నారు. అక్కడికి రాణాకు అత్యవసర చికిత్స విజయవంతంగా అందించినప్పటికీ, ఆ ఆలస్యం చివరికి ప్రాణాంతకంగా మారింది. గుండెపోటు విషయంలో ప్రతి నిమిషం విలువైనదేనని ఆయన ఉదంతం గట్టిగా గుర్తుచేస్తుంది. సన్నగా, దృఢంగా, కండరాలతో ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్లు కాదని హెచ్చిరిస్తున్నారు వైద్యులు. అంతేగాదు చాలామటుకు పలు కేసుల్లో 30 ఏళ్ల మగవారిలోనే ఈ గుండెపోటు ప్రమాదం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ఇందుకు ఆహారం, జీవనశైలి వంటివే కారణాలని చెబుతున్నారు వైద్యులు.ఇక్కడ జస్పాల్ రాణా కూడా విదేశాలకు ప్రయాణిస్తున్నప్పుడూ తీవ్రమైన ఛాతీ అసౌకర్యాన్ని అనుభవించాడు. కానీ ఆ లక్షణాలు ఎసిడిటీ లేదా గ్యాస్ట్రిక్ డిస్ట్రెస్ (జీర్ణకోశ సమస్య)కు సంబంధించినవిగా భావించాడు. పైగా ప్రయాణం కొనసాగించాడు. ఆ క్షణమే తక్షణ వైద్య సహాయం తీసుకోవాల్సి ఉంది, కానీ ఆయన తీసుకోకపోవడంతో గుండె పనితీరు బలహీనమై వైఫల్యానికి దారితీసిందని చెబుతున్నారు వైద్యులు. నిజానికి రాణా మొదట్లో కోలుకుంటున్నట్లు కనిపించినా..ఆ తర్వాత ఆయన కార్డియాక్ రప్చర్ (గుండె పగిలిపోవడం) సంభవించిందని వైద్యులు తెలిపారు. ఇది తీవ్రమైన గుండెపోటు తర్వాత సంభవించే ఒక అరుదైన ప్రాణాంతక సమస్యగా పేర్కొన్నారు వైద్యులు.గోల్డెన్ అవర్ ఎందుకు ముఖ్యం?గుండెపోటు ప్రారంభమైన తర్వాత మొదటి 60 నిమిషాలను హృద్రోగ నిపుణులు "గోల్డెన్ అవర్" అని పిలుస్తారు. ఈ సమయంలో, సత్వర చికిత్స గుండె కండరాల నష్టాన్ని గణనీయంగా తగ్గించి, మనుగడ అవకాశాలను మెరుగుపరుస్తుంది. గుండెపోటు సమయంలో ప్రతి నిమిషం విలువైనది. రోగులు మొదట్లో కోలుకుంటున్నట్లు కనిపించినప్పటికీ, చికిత్సలో జాప్యం కోలుకోలేని గుండె నష్టం, ప్రాణాంతక సమస్యల ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.ముఖ్యంగా కొన్ని గంటలకు మించి ఆలస్యం అయితే గుండెకు కోలుకోలేని నష్టం వాటిల్లుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకసారి రక్త సరఫరా నిలిచిపోతే, గుండె కండర కణాలు చనిపోవడం ప్రారంభిస్తాయి. చికిత్సను ఎంత ఆలస్యం చేస్తే, గుండె వైఫల్యం, ప్రమాదకరమైన అరిథ్మియాలు, కార్డియోజెనిక్ షాక్, గుండె పగిలిపోవడం వంటి సమస్యల ప్రమాదం అంత తీవ్రంగా ఉంటుంది. అందుకే కీలకమైన ముందస్తు చికిత్స అందించడం వల్ల రోగిని అనేక సంభావ్య సమస్యల నుంచి కాపాడవచ్చు అని చెబుతున్నారు. కానీ లక్షణాలు అందరికీ ఒకేలా ఉండవ్..గుండెపోటును తరచుగా గుర్తించలేకపోవడానికి ఒక కారణం ఏమిటంటే, దాని లక్షణాలు ఎల్లప్పుడూ తీవ్రమైన ఛాతీ నొప్పిగా కనిపించవు. సాధారణ హెచ్చరిక సంకేతాలు:ఛాతీలో ఒత్తిడి, బరువుగా అనిపించడం, బిగుతుగా ఉండటం లేదా నొప్పిచేయి, దవడ, మెడ, భుజం లేదా వీపుకు వ్యాపించే నొప్పిఆయాసంఅధికంగా చెమట పట్టడంవికారం లేదా వాంతులుతల తిరగడం లేదా అసాధారణమైన అలసటఎసిడిటీగా పొరబడే పై పొట్టలో అసౌకర్యందాదాపు మూడింట ఒక వంతు గుండెపోటులను మొదట్లో అజీర్ణం, కండరాల ఒత్తిడి లేదా అలసటగా కొట్టిపారేయవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.యువకుల్లోనే అధికం ఎందుకంటే..గతంలో కంటే ఇప్పుడు యువకులలో గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నాయని కార్డియాలజిస్టులు చెబుతున్నారు. నిశ్చల జీవనశైలి, ఎక్కువసేపు కూర్చోవడం, పొగాకు వాడకం, సరిగా నిద్రపోకపోవడం, ఒత్తిడి, మధుమేహం, ఊబకాయం, అధిక స్క్రీన్ సమయం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు తదితరాలే కారణమని చెబుతున్నారు. అలాగే కుటుంబ చరిత్రలో చిన్నవయసులోనే ఈ సమస్య బారిన పడినట్లయితే అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే శారీరకంగా దృఢంగా ఉండటం, లేదా సాధారణ శరీర బరువుని కలిగి ఉండటం అనేది హృదయ సంబంధ వ్యాధుల దరిచేరవని కాదు అని హెచ్చరిస్తున్నారు వైద్యులు.తీసుకోవాల్సిన జాగ్రత్తులు..క్రమం తప్పకుండా రక్తపోటు, కొలెస్ట్రాల్, మధుమేహం పరీక్షలు చేయించుకోవడంధూమపానం, పొగాకు అలవాట్లకు దూరంగా ఉండటం. వారానికి కనీసం 150 నిమిషాలు వ్యాయామం చేయడంపండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటి గుండెకు మేలు చేసే ఆహారం తీసుకోవడంఆరోగ్యకరమైన నిద్ర అలవాట్లను పాటించడంఒత్తిడిని సమర్థవంతంగా నిర్వహించడం(చదవండి: ఏరోస్పేస్ ఉద్యోగాన్ని వదిలి కేఫ్..! ఏడాదికి రూ. 1.44 కోట్లు..) -
భారత షూటింగ్ దిగ్గజం జస్పాల్ రాణా కన్నుమూత
భారత క్రీడా రంగంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. షూటింగ్ దిగ్గజం, ద్రోణాచార్య అవార్డు గ్రహీత జస్పాల్ రాణా(49) గుండెపోటుతో కన్నుమూశారు. ఇటీవల జర్మనీలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ ముగించుకుని భారత బృందంతో కలిసి తిరిగి వస్తుండగా విమానంలో ఆయనకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది.దీంతో ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన వెంటనే ఆయనను సాకేత్‌లోని మ్యాక్స్ ఆసుపత్రికి తరలించి అత్యవసరంగా యాంజియోప్లాస్టీ(స్టెంట్) చేశారు. రాబోయే రోజుల్లో మరో స్టెంట్ వేయాలని వైద్యులు తెలిపారు. జస్పాల్ రాణా పరిస్ధితి నిలకడగా ఉందని, కోలుకుంటున్నారని వార్తలు వచ్చాయి. కానీ శుక్రవారం ఉదయం పరిస్థితి విషమించడంతో ఆయన తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI) అధికారికంగా ధ్రువీకరించింది.తిరుగులేని ఛాంపియన్జస్పాల్ రాణా కేవలం కోచ్‌గానే కాకుండా, స్టార్ పిస్టల్ షూటర్‌గా ఎన్నో పతకాలను కొల్లగొట్టి దేశాన్ని గర్వపడేలా చేశాడు. 1990ల కాలంలో భారత షూటింగ్లో ఆయన తిరుగులేని శక్తిగా ఎదిగారు. ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు పసిడి పతకాలు అందించారు. ముఖ్యంగా 2006 దోహా ఆసియా క్రీడల్లో ప్రపంచ రికార్డును సమం చేస్తూ గోల్డ్ మెడల్ సాధించారు. కామన్వెల్త్ గేమ్స్‌లో ఏకంగా 9 స్వర్ణ పతకాలతో కలిపి మొత్తం 15 పతకాలను కొల్లగొట్టారు. దీంతో ఆయనకు చిన్న వయస్సులోనే అర్జున అవార్డు దక్కింది. షూటింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించాక, దేశంలో అత్యుత్తమ షూటర్లను తయారుచేసే పనిలో జస్పాల్ నిమగ్నమయ్యారు. పారిస్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు సాధించిన స్టార్ షూటర్ మను భాకర్‌కు ఈయనే వ్యక్తిగత కోచ్. సౌరభ్ చౌదరి, అనీష్ భాన్వాలా వంటి అద్భుతమైన షూటర్లను తీర్చిదిద్దినందుకు గానూ 2020లో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను 'ద్రోణాచార్య' అవార్డుతో సత్కరించింది. జస్పాల్ ప్రస్తుతం భారత పిస్టల్ షూటింగ్ విభాగానికి హై-పెర్ఫార్మెన్స్ కోచ్‌గా ఉన్నారు. -
సౌరభ్ చౌదరి ఎక్కడ? రైఫిల్ సమాఖ్యపై మండిపడ్డ మను కోచ్
ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత స్టార్ షూటర్ మను భాకర్ రెండు కాంస్య పతకాలు సాధించిన విషయం విధితమే. అయితే ఆమె విజయంలో కీలక పాత్ర పోషించిన కోచ్ జస్పాల్ రాణా.. ఒలింపిక్స్ భారత షూటర్ల సెలక్షన్ పాలసీపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సెలక్షన్ విధానాల వల్ల యువ షూటర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని రాణా అసహనం వ్యక్తం చేశాడు. "ఫెడరేషన్ సెలక్షన్ పాలసీ ప్రతీ ఆరు నెలలకోసారి మారుతుంది. ఈ విషయం గురించి ఇప్పటికే క్రీడా మంత్రితో నేను మాట్లాడాను. ఫెడరేషన్ నుంచి సెలక్షన్ పాలసీని తెప్పించుకోని, ఓసారి పరిశీలించాలని కోరాను.అది చూశాక వారు ఏ నిర్ణయం తీసుకున్న మేము కట్టుబడి ఉంటాము. ఆ తర్వాత ఈ విషయం గురించి అస్సలు చర్చించం. షూటర్లకు అండగా నిలిస్తే కచ్చితంగా వారి ప్రదర్శనలలో మనం మార్పులు చూస్తాం. భారత షూటింగ్ ఫెడరేషన్ విధి విధానాల వల్ల ఎంతో మంది యువ షూటర్లు ముందుకు వెళ్లలేకపోతున్నారు. భారత్‌లో అత్యుత్తమ షూటర్లు ఎంతో మంది ఉన్నారు. కానీ వారికి సపోర్ట్‌గా నిలిచే వారు ఎవరూ లేరు. పిస్టల్ షూటర్ సౌరభ్ చౌదరి ఎక్కడ? ఆసియా గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ పిస్టల్ షూటర్ జితూ రాయ్ ఎక్కడ? వీరిగురించి ఎవరూ మాట్లడటం లేదు. పారిస్‌లో నాలుగో స్థానంలో నిలిచిన (10మీ ఎయిర్ రైఫిల్ షూటర్) అర్జున్ బాబుటా గురించి అస్సలు చర్చే లేదు. అతను స్వల్ప తేడాతో పతకాన్ని కోల్పోయాడు. మళ్లీ అతడిని ఈ ప్లాట్‌ఫామ్‌కు తీసుకు రావాలని ఎవరూ ఆలోచించడం లేదని" పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జస్పాల్ రాణా పేర్కొన్నాడు. -
నాడు కోచ్‌తో మనూ గొడవ.. కట్ చేస్తే!
మనూ భాకర్.. ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత్‌కు తొలి పతకం అందించిన క్రీడాకారిణి. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో కాంస్యం గెలిచిన ఈ హర్యానా అమ్మాయి.. భారత్ తరఫున మెడల్ గెలిచిన తొలి మహిళా షూటర్‌గా రికార్డు సాధించింది. ఇప్పటికే ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పతకాలు అందుకున్న మనూ భాకర్ ఖాతాలో.. ఇప్పుడు ఒలింపిక్ మెడల్ కూడా చేరింది. టోక్యోలో నిరాశ ఎదురైనా పడిలేచిన కెరటంలా మనూ ‘బుల్లెట్’లా దూసుకొచ్చిన తీరు అద్భుతం. అయితే, ఈ ప్రయాణంలో 22 ఏళ్ల మనూకు తన తండ్రి రామ్‌కిషన్ భాకర్ ప్రోత్సాహంతో పాటు.. కోచ్ జస్పాల్ రాణా.. ‘‘పెద్దన్న’’లా క్షమించి, మళ్లీ శిక్షణ తీరు నేడు ఈ స్థాయికి చేరుకోవడానికి ఉపయోగపడింది. ఏమిటా కథ?!మనూ భాకర్ కెరీర్లో రెండు వేర్వేరు సందర్భాలు ఆమె ప్రస్థానంలో కీలకంగా నిలిచాయి. 2018–2019 సమయంలో మనూ వరుస విజయాలతో అద్భుత ఫామ్‌లో ఉంది. ఆ సమయంలో భారత జట్టు (పిస్టల్)కు మాజీ ఆటగాడు జస్పాల్ రాణా కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆ సమయంలో 17 ఏళ్ల ఒక టీనేజర్ ఎలా దుందుడుగా, ఆవేశంగా ఉంటారో భాకర్ కూడా అదే తరహా మానసిక స్థితిలో ఉంది. కోచ్‌పై ఆగ్రహం.. ఎందుకంటే?రాణా కఠినమైన కోచింగ్ శైలి నచ్చక ఆమె బహిరంగంగానే చిన్న చిన్న విమర్శలు చేస్తూ వచ్చింది. కొంత కాలం తర్వాత ఇది మరింత పెరిగింది. మనూ వేర్వేరు ఈవెంట్లలో ఆడితే ఆమె విఫలమయ్యే అవకాశం ఉందని 10 మీటర్ల ఎయిర్ పిస్టల్పైనే దృష్టి పెట్టాలంటూ రాణా సూచించాడు.మీ అహానికి అభినందనలు25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో మరో షూటర్ చింకీ యాదవ్‌ను ప్రోత్సహించడాన్ని భాకర్ వ్యక్తిగతంగా తీసుకొని కోచ్‌పై మరింత ఆగ్రహాన్ని పెంచుకుంది. చివరకు టోక్యో ఒలింపిక్స్‌కు కొన్ని నెలల ముందు ఢిల్లీ వరల్డ్ కప్‌లో ఇది పూర్తిగా బయటపడింది. 10 మీటర్ల ఈవెంట్లో చింకీ స్వర్ణం గెలవగా, మనూ కాంస్యానికే పరిమితమైంది. దాంతో మనూ ‘ఆనందం దక్కింది కదా... మీ అహానికి అభినందనలు’ అంటూ రాణాకు మెసేజ్ చేసింది.‘సర్...నాకు మీరు మళ్లీ కోచింగ్ ఇస్తారా’ ఆ వాక్యాలను రాణా తన టీషర్ట్‌పై వెనుక భాగంలో రాసుకొని మైదానమంతా తిరిగాడు. దాంతో మనూతో అక్కడే అన్ని సంబంధాలు ముగిసిపోయాయి! కాలక్రమంలో రెండేళ్లు గడిచాయి. ఏడాది క్రితం మనూలో కొత్త మథనం మొదలైంది. తాను ఒలింపిక్ పతకం గెలవాలంటే సరైన దారి మళ్లీ సరైన కోచ్‌ను ఎంచుకోవడమే అనిపించింది. ఎంతో మథనం తర్వాత రాణాకు ‘సర్...నాకు మీరు మళ్లీ కోచింగ్ ఇస్తారా’ అని మెసేజ్ చేసింది.ఒక పెద్దన్న తరహాలో రాణా కూడా స్పందించాడు. గత అనుభవాన్ని మనసులోంచి తీసేసి శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. సంవత్సర కాలంలో తనదైన శైలిలో ఆమెకు కోచింగ్‌తో పాటు ఇతర అన్ని సన్నాహకాల్లో అండగా నిలుస్తూ ఇప్పుడు ఒలింపిక్ పతకం వరకు తీసుకొచ్చాడు. వారి సన్నాహాల్లో ఒక ఆసక్తికర అంశం ఉంది.లక్ష్యంగా పెట్టుకున్న పాయింట్లు సాధించలేనప్పుడు తగ్గిన పాయింట్లలో ఒక్కో పాయింట్‌కు 10 యూరోల చొప్పున జరిమానా విధించి దానిని అక్కడి పేదవారికి దానం చేయాలనేది ఒక షరతు! ఇప్పుడూ భాకర్ వయసు 22 ఏళ్లే... కానీ గతంతో పోలిస్తే ఎంతో పరిపక్వతతో వ్యవహరించిన ఆమె విజయానికి బాటలు వేసుకుంది. పతకం కోసం పోటీ పడిన సమయంలో జనంలో కూర్చొని ఉన్న రాణాను చూస్తూ ధైర్యం తెచ్చుకున్నానని, తమ శ్రమ ఫలితాన్నందించిందన్న మనూ... రాణాకు తాను ఎంతో రుణపడి ఉన్నానని చెప్పడం విశేషం.శాపం తొలగిపోయిందిఇక రాణా స్పందిస్తూ.. ‘‘నా మనసుకు ఇప్పుడు ఉపశమనంగా ఉంది. టోక్యో నుంచి కొనసాగుతున్న శాపం తొలగినట్లనిపించింది. నాటి ఓటమి నుంచి పూర్తిగా కోలుకున్నామని చెప్పలేను. అయితే, మనూ మెడల్ సాధించడం మాకు నిజంగా బిగ్ రిలీఫ్. ప్రతి విషయంలోనూ అతిగా స్పందించడం నాకూ అలవాటే. అయితే, ఆమె మరోసారి నన్ను సంప్రదించినపుడు తనకు నో చెప్పలేకపోయాను. ఇద్దరం మళ్లీ కొత్తగా ప్రయాణం మొదలుపెట్టాం. తను ఇప్పుడు పరిణతి సాధించిన అథ్లెట్. తన విజయానికి ప్రధాన కారణం ఇదే’’ అని ట్రిబ్యూన్‌తో పేర్కొన్నాడు.-సాక్షి, క్రీడా విభాగం -
ఆట నుంచి ఓటు దాకా...
బ్యాట్ పట్టినవారు, బాక్సింగ్ చేసిన వారు, ఈత కొట్టిన వారు, షూటింగ్ చేసిన వారు.... ఇలా ఆటగాళ్లెందరో ఓటు వేటగాళ్లుగా మారారు. ఆట మైదానంలో చూపిన నేర్పునే ఓటు మైదానంలోనూ చూపిస్తామంటూ ముందుకొచ్చారు. సినీ స్టార్ల తరువాత అంతటి క్రేజున్న ఆటగాళ్లు ఈ సారి కూడా ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఫుట్ బాల్ కింగ్ బైచుంగ్ భూటియా తృణమూల్ కాంగ్రెస్ తరఫున గోల్ కొడతానంటున్నారు. చిరునవ్వుల క్రికెటర్ మహ్మద్ కైఫ్ కాంగ్రెస్ తరఫున ఫీల్డింగ్ చేస్తున్నారు. ఇక షూటర్ రాజ్యవర్ధన్ రాథోర్ బిజెపి తరఫున గురి తప్పనంటున్నారు. ఇప్పటి వరకూ స్టేడియం నుంచి చట్టసభకు పోటీపడ్డ ఆటగాళ్లెవరో చూద్దాం. మన్సూర్ అలీఖాన్ పటౌడీ - మధ్యప్రదేశ్ లోని భోపాల్ నుంచి రంగంలోకి దిగిన ఈ స్టైలిష్ నవాబు ఎన్నికల్లో మాత్రం గెలవలేకపోయారు. అంతకు ముందు ఆయన 1971 లో హర్యానా నుంచి పోరాడారు. కానీ గెలవలేకపోయారు. దేశానికి క్రికెట్ పిచ్చి అంటని రోజుల్లో ఆయన పోరాడి ఓడారు. చేతన్ చౌహాన్ - ఇండియన్ క్రికెట్ లో అద్భుతమైన ఓపెనర్లలో ఒకరుగా పేరొందిన చేతన్ రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. బిజెపి నేతగా నిలిచారు.ఆయన అమ్రోహా నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించారు. అస్లాం షేర్ ఖాన్ - ఈ హాకీ షేర్ మధ్య ప్రదేశ్ లోని సాగర్ నుంచి రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఈయనది కాంగ్రెస్ పార్టీ. అయితే ప్రస్తుతం ఆయన పరిస్థితి, మన హాకీ టీమ్ పరిస్థితి ఒకటేలా ఉంది. జ్యోతిర్మయ్ సిక్దర్ - ఈ స్విమ్మింగ్ ఛాంపియన్ సీపీఎం తరఫున కృష్ణనగర్ (పశ్చిమ బెంగాల్) నుంచి 2004 లో గెలిచింది. 2009 లో మాత్రం ఆమెకన్నా గజ ఈతగత్తె అయిన మమతా బెనర్జీ వేగానికి తలవంచక తప్పలేదు. జస్పాల్ రాణా - ఈ ఏస్ షూటర్ 2009 లో తెహ్రీ గఢ్ వాల్ (ఉత్తరాఖండ్) నుంచి బిజెపి తరఫున పోటీ చేశారు. కానీ గురి తప్పింది. ఆ తరువాత 2012 లో ఆయన బిజెపి వదిలి కాంగ్రెస్ లో చేరారు. ఈ సారి అంచనా తప్పింది. కీర్తి ఆజాద్ - బ్యాట్ తోనూ, నోటి తోనూ సమానంగా ఆడగల కీర్తి ఆజాద్ తండ్రి భగవత్ ఝా ఆజాద్ ఒకప్పటి బీహార్ ముఖ్యమంత్రి. తండ్రి సహా కాంగ్రెస్ నుంచి బిజెపి టీమ్ లో చేరాడు. దర్భంగా ఎంపీ అయ్యాడు. ఈ సారి మళ్లీ రెండో ఇన్నింగ్స్ ఆడతానంటున్నాడు. నవజ్యోత్ సింగ్ సిద్ధు - అద్భుతమైన వాక్చాతుర్యం, సమయస్ఫూర్తి ఉన్న సిద్ధు రెండుసార్లు అమృతసర్ ఎంపీగా గెలిచారు. మోడీ వీరాభిమాని అయినా 2014 బిజెపీ టీమ్ లో ఈయనకు చోటు దక్కలేదు. మహ్మద్ అజారుద్దీన్ - క్రికెట్ లో ఈయన బ్యాట్ మాత్రమే మాట్లాడింది. ఎంపీగా నోరు మాట్లాడుతుందేమో అని అంతా అనుకున్నారు. కానీ ఆయన అయిదేళ్లలో రెండే రెండు సార్లు నోరు విప్పి మాట్లాడారు. అయిదంటే అయిదు ప్రశ్నలు వేశారు. ఈ సారి రాజస్తాన్ నుంచి లక్ ట్రై చేసుకుంటున్నారు. మనోహర్ ఐచ్ - నాలుగున్నర అడుగుల ఐచ్ ఒకప్పటి మిస్టర్ యూనివర్స్. ఎనభై ఏళ్లు వచ్చినా కండల వీరుడిగానే నిలిచాడు. ఈయన బిజెపి తరఫున బెంగాల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ మధ్యే ఐచ్ చనిపోయారు.


