jacob duffy
-
T20 WC: చరిత్ర సృష్టించిన కెనడా బ్యాటర్.. ప్రపంచ రికార్డు
కెనడా క్రికెటర్, భారత మూలాలు ఉన్న యువరాజ్ సమ్రా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ టోర్నీలో సెంచరీ బాదిన అతి పిన్న వయస్కుడిగా ప్రపంచ రికార్డు సాధించాడు. తాజా ఎడిషన్‌లో భాగంగా పటిష్ట న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో యువరాజ్ ఈ ఘనత సాధించడం విశేషం.58 బంతుల్లోనేటీ20 వరల్డ్‌కప్-2026లో భాగంగా గ్రూప్-డి నుంచి న్యూజిలాండ్- కెనడా (NZ vs CAN) మధ్య మంగళవారం నాటి మ్యాచ్‌లో.. టాస్ గెలిచిన కెనడా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో కెనడా ఓపెనర్ యువరాజ్ సమ్రా ఆకాశమే హద్దుగా చెలరేగాడు.పందొమ్మిదేళ్ల ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ కేవలం 58 బంతుల్లోనే శతక్కొట్టాడు. మొత్తంగా 65 బంతులు ఎదుర్కొన్న యువరాజ్ సమ్రా 11 ఫోర్లు, ఆరు సిక్స్‌లు బాది 110 పరుగులు సాధించాడు. తద్వారా టీ20 ప్రపంచకప్ చరిత్రలో తక్కువ బంతుల్లోనే సెంచరీ బాదిన అతి పిన్నవయస్కుడిగా యువరాజ్ నిలిచాడు.A HISTORIC MILESTONE! 🙌Canada’s Yuvraj Samra creates history with a breathtaking century, becoming the youngest centurion in T20Is! 🫡ICC Men’s #T20WorldCup | #NZvCAN | LIVE NOW ➡️ https://t.co/uuKxoyS6gX pic.twitter.com/bCbK9u8AIq— Star Sports (@StarSportsIndia) February 17, 2026 173 పరుగులు ఇక కివీస్‌తో మ్యాచ్‌లో యువరాజ్ శతకం (110)తో ఆకట్టుకోగా.. మరో ఓపెనర్, కెప్టెన్ దిల్‌ప్రీత్ బజ్వా 36 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. మిగిలిన వారిలో నవనీత్ ధలీవాల్ (10) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేయగా.. నికోలస్ కిర్టాన్ (2) విఫలమయ్యాడు. హర్ష్ థాకర్ 3, దిలాన్ హెలిగర్ 8 పరుగులతో అజేయంగా నిలిచారు.ఫలితంగా కెనడా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి 173 పరుగులు స్కోరు చేసింది. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, కైలీ జెమీషన్, జేమ్స్ నీషమ్ తలా ఒక వికెట్ తీయగా.. యువరాజ్ రూపంలో జేకబ్ డఫీ కీలక వికెట్ దక్కించుకున్నాడు.టీ20 ప్రపంచకప్ టోర్నీలో అతి పిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాళ్లు🏏యువరాజ్ సమ్రా (కెనడా)- చెన్నై వేదికగా న్యూజిలాండ్ మీద 2026లో 19 ఏళ్ల 141 రోజుల వయసులో🏏అహ్మద్ షెహజాద్ (పాకిస్తాన్)- మిర్పూర్ వేదికగా బంగ్లాదేశ్ మీద 2014లో 22 ఏళ్ల 127 రోజుల వయసులో🏏సురేశ్ రైనా (ఇండియా)- గ్రాస్ ఐస్లెట్ వేదికగా సౌతాఫ్రికా మీద 2010లో 23 ఏళ్ల 156 రోజుల వయసులో🏏అలెక్స్ హేల్స్ (ఇంగ్లండ్)- ఛట్టోగ్రామ్ వేదికగా శ్రీలంక మీద 2014లో 25 ఏళ్ల 83 రోజుల వయసులో🏏గ్లెన్ ఫిలిప్స్ (న్యూజిలాండ్)- సిడ్నీ వేదికగా శ్రీలంక మీద 2022లో 25 ఏళ్ల 327 రోజుల వయసులో సెంచరీ.కివీస్ గెలుపుఇక ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 15.1 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. గ్లెన్ ఫిలిప్స్ (36 బంతుల్లో 76), రచిన్ రవీంద్ర 39 (బంతుల్లో 59) మెరుపు ఇన్నింగ్స్‌తో అజేయంగా నిలిచి.. జట్టు గెలుపును ఖరారు చేశారు.చదవండి: గంభీర్‌కు గోల్డెన్ ఆఫర్!.. హెడ్‌కోచ్ పదవికి గుడ్‌బై? -
మూడు ఫార్మాట్లు ఆడగల టాప్-5 క్రికెటర్లు వీరే!
క్రికెట్ ప్రపంచంలో ప్రస్తుతం పొట్టి ఫార్మాట్‌దే హవా. ప్రపంచవ్యాప్తంగా టీ20 క్రికెట్‌కు ఉన్న ఆదరణ రోజురోజుకీ పెరుగిపోతోంది. న్యూజిలాండ్, సౌతాఫ్రికాకు చెందిన పలువురు కీలక ఆటగాళ్లు సైతం ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడేందుకు వీలుగా సెంట్రల్ కాంట్రాక్టు వదులుకుని.. జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నారు.ఇలాంటి తరుణంలో మూడు ఫార్మాట్లలో ఆడగల క్రికెటర్ల సంఖ్య తగ్గిపోవడం సహజమే. అయితే, నవతరంలో టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్‌కు సరిగ్గా సరిపోయే ఆటగాళ్లకు సైతం కొదువలేదు. ఈ జాబితాలో టాప్-5లో ఉన్న ప్లేయర్లపై ఓ లుక్కేద్దామా?హ్యారీ బ్రూక్మూడు ఫార్మాట్లలో ఇంగ్లండ్ పతనావస్థకు చేరిన వేళ హ్యారీ బ్రూక్ రూపంలో ఓ యువ ఆటగాడు జట్టుకు ఊపిరిలూదాడు. టెస్టు, వన్డే, టీ20లలో అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యంతో ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్నాడు. అతడి రాకతో ఇంగ్లండ్ మిడిలార్డర్ సమస్య తీరిపోయింది. అంతేకాదు నాయకత్వ లక్షణాలు పుష్కలంగా కలిగి ఉన్న 26 ఏళ్ల బ్రూక్.. వన్డే, టీ20 జట్లకు కెప్టెన్ కూడా అయ్యాడు.ఇప్పటి వరకు అంతర్జాతీయ కెరీర్లో 34 టెస్టులు, 35 వన్డేలు, 52 టీ20లు ఆడిన హ్యారీ బ్రూక్.. ఆయా ఫార్మాట్లలో 3034, 1170, 1012 పరుగులు సాధించాడు. టెస్టుల్లో పది సెంచరీలు సాధించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. వన్డేల్లో ఇప్పటికి రెండుసార్లు శతక్కొట్టాడు.యశస్వి జైస్వాల్రెండున్నరేళ్ల క్రితం టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ముంబై బ్యాటర్ యశస్వి జైస్వాల్. టెస్టుల్లో అడుగుపెట్టగానే సెంచరీలు, డబుల్ సెంచరీతో సత్తా చాటిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. ఓపెనర్‌గా జట్టులో స్థిరపడిపోయాడు.అయితే, వన్డే, టీ20లలో ఆడే సత్తా ఉన్నా.. టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్‌మన్ గిల్ కారణంగా ఈ ఓపెనింగ్ బ్యాటర్‌కు జట్టులో చోటు కరువైంది. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 23 ఏళ్ల జైసూ 28 టెస్టుల్లో.. ఏడు శతకాలు, రెండు డబుల్ సెంచరీలు బాది 2511 పరుగులు సాధించాడు. ఇక నాలుగు వన్డేల్లో 171, 23 టీ20 మ్యాచ్‌లలో 723 పరుగులు చేశాడు. ఇటీవల సౌతాఫ్రికాతో సిరీస్ సందర్భంగా తన తొలి వన్డే శతకాన్ని నమోదు చేశాడు.మార్కో యాన్సెన్సౌతాఫ్రికా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు మార్కో యాన్సెన్. దిగ్గజ జాక్వెస్ కలిస్ వారసుడిగా జట్టులో అతడు లేని లోటును పూడుస్తున్నాడు. ఆరడుగుల ఎనిమిది ఇంచుల ఎత్తు ఉండే మార్కో.. మూడు ఫార్మాట్లలోనూ దుమ్ములేపుతున్నాడు.ఇప్పటికి సౌతాఫ్రికా తరఫున 25 ఏళ్ల రైట్ హ్యాండర్ బ్యాటర్.. 21 టెస్టుల్లో 624, 32 వన్డేల్లో 553, 23 టీ20లలో 195 పరుగులు చేశాడు. ఇక లెఫ్టార్మ్ పేసర్ ఖాతాలో టెస్టుల్లో 89, వన్డేల్లో 49, టీ20లలో 21 వికెట్లు ఉన్నాయి.జేకబ్ డఫీ31 ఏళ్ల జేకబ్ డఫీ న్యూజిలాండ్ తరఫున ఆల్ ఫార్మాట్ పేసర్‌గా సత్తా చాటుతున్నాడు. ఈ ఏడాదే టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఈ కుడిచేతి వాటం బౌలర్ ఇప్పటికి 4 మ్యాచ్‌లు ఆడి ఏకంగా 25 వికెట్లు కూల్చాడు.అదే విధంగా.. 19 వన్డేల్లో 35, 38 టీ20 మ్యాచ్‌లలో కలిపి 53 వికెట్లు కూల్చిన డఫీ.. ప్రపంచ బ్యాటర్లకు సరికొత్త ముప్పుగా అవతరించాడు.కామెరాన్ గ్రీన్ఆస్ట్రేలియా యువ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 26 ఏళ్ల ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్.. ఇటీవల ఐపీఎల్ మినీ వేలం-2026లో సరికొత్త చరిత్ర సృష్టించాడు.కోల్‌కతా నైట్ రైడర్స్ ఇతడి కోసం ఏకంగా 25.20 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా.. వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన విదేశీ ఆటగాడిగా గ్రీన్ నిలిచాడు. టీ20 ఫార్మాట్‌తో పాటు వన్డే, టెస్టుల్లో కూడా గ్రీన్ రాణిస్తున్నాడు.ఇప్పటికి ఆస్ట్రేలియా తరఫున 36 టెస్టులు, 31 వన్డేలు, 21 టీ20లు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 1658, 782, 521 పరుగులు సాధించాడు. అదే విధంగా ఈ రైటార్మ్ పేసర్ ఖాతాలో 38 టెస్టు, 20 వన్డే, 12 టీ20 వికెట్లు ఉన్నాయి.చదవండి: వైభవ్ సూర్యవంశీకి అత్యున్నత పురస్కారం -
ప్రపంచ బ్యాటర్లకు సరికొత్త ముప్పు
ప్రపంచ బ్యాటర్లకు సరికొత్త తలనొప్పి వచ్చి పడింది. అతడి పేరు జేకబ్ డఫీ. ఈ 31 ఏళ్ల కివీ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ప్రస్తుతం ప్రపంచ బ్యాటర్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు. డఫీ పేరు తలచుకుంటేనే అగ్రశ్రేణి బ్యాటర్లు సైతం బెంబేలెత్తిపోతున్నారు. డఫీ ప్రదర్శనలు ఆ స్థాయిలో ఉన్నాయి మరి.ఈ ఏడాది మూడు ఫార్మాట్లలో అత్యుత్తమ ప్రదర్శనలు కనబర్చడంతో పాటు లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచిన డఫీ అంతర్జాతీయ క్రికెట్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాడు. విమర్శకులు, విశ్లేషకులు, మాజీలు డఫీ ప్రదర్శనలు చూపి ఔరా అంటున్నారు. బ్యాటింగ్ ప్రపంచానికి సరికొత్త ముప్పు ముంచుకొచ్చిందని అభిప్రాయపడుతున్నారు.డఫీకి పేస్‌తో పాటు స్వింగ్ చేయగల సామర్థ్యం కూడా ఉన్నందున మంచినీళ్ల ప్రాయంగా వికెట్లు తీయగలుగుతున్నాడు. విండీస్‌తో తాజాగా ముగిసిన మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇది నిరూపితమైంది. ఈ సిరీస్‌లో డఫీని ఎదుర్కొనేందుకు విండీస్ బ్యాటర్లు తెగ ఇబ్బంది పడ్డారు. డఫీ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేసి ఏకంగా 23 వికెట్లు పడగొట్టాడు. డఫీ విజృంభణతో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను న్యూజిలాండ్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది.విండీస్‌తో టెస్ట్ సిరీస్‌లో డఫీ ప్రదర్శనలు..తొలి టెస్ట్: 5-34 & 3-122రెండో టెస్ట్: 1-33 & 5-38మూడో టెస్ట్: 4-86 & 5-42టెస్ట్‌ల్లో విశ్వరూపం2020లో టీ20 అరంగేట్రం, 2022లో వన్డే అరంగేట్రం చేసిన డఫీ.. ఈ ఏడాదే టెస్ట్ అరంగేట్రం చేశాడు. టెస్ట్‌ల్లోకి వచ్చీ రాగానే డఫీ విశ్వరూపం ప్రదర్శించాడు. అప్పటిదాకా కొనసాగిన స్టార్క్, బుమ్రా, సిరాజ్, కమిన్స్ లాంటి ఫాస్ట్ బౌలర్ల హవాకు గండికొట్టాడు. డఫీ ప్రదర్శనల ముందు పై నలుగురు ప్రదర్శనలు చిన్నబోయాయి. స్టార్క్ కొద్దోగొప్పో పోటీ ఇవ్వగలిగాడు కానీ, మిగతా ముగ్గురు డఫీ ముందు తేలిపోయారు.లీడింగ్ వికెట్టేకర్టెస్ట్ల్లో పట్టపగ్గాల్లేకుండా దూసుకుపోయిన డఫీ.. ఈ ఏడాది పరిమిత ఓవర్ల ఫార్మాట్లలోనూ తన మార్కు చూపించాడు. టీ20ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగి, వన్డేల్లోనూ సత్తా చాటాడు. ఈ క్రమంలో ఈ ఏడాది లీడింగ్ వికెట్ టేకర్‌గా (మూడు ఫార్మాట్లలో) అవతరించాడు. డఫీ ఈ ఏడాది మొత్తం 81 వికెట్లు తీసి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. రెండో స్థానంలో ఉన్న జింబాబ్వే బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానీకి (65), న్యూజిలాండ్‌కే చెందిన మ్యాట్ హెన్రీకి (65) డఫీకి మధ్య 16 వికెట్ల తేడాతో ఉంది. ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన న్యూజిలాండ్ బౌలర్‌గానూ డఫీ రికార్డుల్లోకెక్కాడు. గతంలో ఈ రికార్డు రిచర్డ్ హ్యాడ్లీ (1985లో 79 వికెట్లు) ఉండేది.ఫార్మాట్లవారీగా ఈ ఏడాది డఫీ ప్రదర్శనలు..టీ20లు- 35 వికెట్లుటెస్ట్లు- 25 వికెట్లువన్డేలు- 21 వికెట్లుఓ క్యాలెండర్ ఇయర్లో న్యూజిలాండ్ తరఫున అత్యుత్తమ ప్రదర్శనలు..జేకబ్ డఫీ (2025లో 81 వికెట్లు)రిచర్డ్ హ్యాడ్లీ (1985లో 79)డేనియల్ వెటోరి (2008లో 76)ట్రెంట్ బౌల్ట్ (2015లో 72)ఈ ఏడాది డఫీ ప్రదర్శనలకు చాలామంది మాజీల లాగే టీమిండియా మాజీ రవిచంద్రన్ అశ్విన్ కూడా ముగ్దుడయ్యాడు. ఆశ్విన్ తాజాగా ఓ ట్వీట్ చేస్తూ డఫీ ప్రదర్శనలను ఆకాశానికెత్తాడు. టెస్ట్‌ల్లో సూపర్ ఫామ్‌లో ఉన్న డఫీ, ప్రస్తుతం టీ20ల్లో నంబర్ వన్ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. డఫీని ఇటీవల జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో ఆర్సీబీ రూ. 2 కోట్ల బేస్ ధరకు సొంతం చేసుకుంది. డఫీ ఇప్పటివరకు 4 టెస్ట్‌లు, 19 వన్డేలు, 38 టీ20లు ఆడి వరుసగా 25, 35, 53 వికెట్లు తీశాడు.


