అరంగేట్రంలోనే అదరగొట్టిన ఆర్సీబీ స్పీడ్‌ స్టార్‌ | Jacob Duffy off to dream start in IPL 2026 during RCB vs SRH opener | Sakshi
Sakshi News home page

IPL 2026: అరంగేట్రంలోనే అదరగొట్టిన ఆర్సీబీ స్పీడ్‌ స్టార్‌

Mar 28 2026 8:59 PM | Updated on Mar 28 2026 8:59 PM

Jacob Duffy off to dream start in IPL 2026 during RCB vs SRH opener

న్యూజిలాండ్ స్పీడ్ స్టార్ జాక‌బ్ డ‌ఫీ త‌న ఐపీఎల్ కెరీర్‌ను ఘ‌నంగా ఆరంభించాడు. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌ర‌పున ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో అడుగుపెట్టిన డ‌ఫీ.. త‌న అరంగేట్ర మ్యాచ్‌లోనే అద‌ర‌గొట్టాడు. ఐపీఎల్‌-2026లో భాగంగా చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా జ‌రుగుతున్న తొలి మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ బ్యాట‌ర్ల‌ను డ‌ఫీ బెంబేలెత్తించాడు.

అభిషేక్ శర్మ , ట్రావిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డి వంటి కీలక ఆటగాళ్లను అవుట్ చేసి ప్రత్యర్థి టాప్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. మొత్తంగా డ‌ఫీ త‌న 4 ఓవ‌ర్ల కోటాలో కేవలం 22 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. గతేడాది డిసెంబర్‌లో జరిగిన మినీ వేలంలో రూ. 2 కోట్ల బేస్‌ప్రైస్‌కు ఆర్సీబీ సొంతం చేసుకుంది. ఆర్సీబీ యాజమాన్యం నమ్మకాన్ని డఫీ నిలబెట్టుకున్నాడు. జోష్ హాజిల్‌వుడ్‌, నువాన్ తుషారా లేని లోటను డఫీ భర్తీ చేశాడు. అయితే ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో మాత్రం డఫీ విఫలమయ్యాడు.

తుది జట్లు..
ఆర్సీబీ: విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, రజత్ పాటిదార్(కెప్టెన్‌), జితేష్ శర్మ(వికెట్‌కీపర్‌), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జాకబ్ డఫీ, సుయాష్ శర్మ

సన్‌రైజర్స్‌: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(కెప్టెన్‌/వికెట్‌కీపర్‌), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ
చదవండి: IPL 2026: అభిషేక్‌ శర్మ అట్టర్‌ ప్లాప్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement