breaking news
	
		
	
  investigantion pending
- 
      
                   
                               
                   
            ప్రియుడి మత్తులో భర్తపై హత్యాయత్నం!
అక్రమ సంబంధాలంటే.. హత్యలు చేసే మగాళ్లను చాలాకాలం నుంచి చూస్తున్నాం కానీ.. ప్రియుడి కోసం భర్తను హత్య చేసే స్త్రీల గురించి అరుదుగానే విని ఉంటాం. తాజాగా ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీలోని సుభాష్ నగర్ ప్రాంతంలో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. ప్రియుడి మాయలో పడ్డ ఓ మహిళ భర్త అడ్డు తొలగించుకునేందుకు నిద్రమాత్రలను ప్రయోగించింది. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనలో తానొకటి తలిస్తే.. విధి ఇంకోటి తలచిందన్నట్లు ఆమె ప్రయత్నం బెడిసికొట్టింది. వివరాలు ఇలా ఉన్నాయి...ఆరోగ్యశాఖలో పని చేసి రిటైర్ అయిన వైద్యుడు అతడు. కూతురు పెళ్లయిపోవడంతో ఇంట్లో భార్య, భర్తలు మాత్రమే ఉంటున్నారు. సౌరభ్ సక్సేనా అనే ఎలక్ట్రిషియన్ అప్పుడప్పుడూ ఇంటికి వచ్చిపోతూండే వాడు. ఈ క్రమంలోనే అతడికి, వైద్యుడి భార్యకు సాన్నిహిత్యం పెరిగింది. ఈ విషయం తెలిసిన భర్త.. తగదని భార్యను వారించాడు. ఆమె వినలేదు సరికదా.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసే ప్లాన్ చేసింది. నిద్రమాత్రలు కలిపిన పాలను భర్తకు ఇచ్చింది. పాలు తాగిన ఆ వ్యక్తి అపస్మారక స్థితికి చేరుకోగానే.. ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది. సౌరభ సక్సేనా, ఆ మహిళ ఇద్దరూ ముందుగా సీసీటీవీ కెమెరాలను ఆఫ్ చేశారని, ఆ తరువాత సృ్పహ తప్పి పడి ఉన్న భర్తను ఇంకో గదిలోకి లాక్కెళ్లారు. మెడకు ఉరి బిగించి.. ఒక సుత్తితో అతడిపై దాడి చేశారు. చెక్‌బుక్, బ్యాంకు పాస్‌బుక్కులను స్వాధీనం చేసుకున్నారు. ఆస్తి పత్రాలపై బలవంతంగా సంతకాలు పెట్టించే ప్రయత్నమూ చేశారు కానీ.. కథలో ట్విస్ట్ ఇక్కడే చోటు చేసుకుంది. సౌరభ్‌కు తాగుడు అలవాటు ఎక్కువ. ఈ తతంగమంతా నడుస్తున్న సమయంలో మనోడికి మందు తాగాలనిపించింది. ప్రియురాలు వారించినా వినలేదు. మందు కావాల్సిందేనని పట్టుబట్టాడు. చేసేదేమీ లేక ఆమె భర్త తాగే ఖరీదైన మద్యం తెచ్చి ఇచ్చింది. ఫ్రీగా వచ్చిందనుకున్నాడో ఏమో కానీ.. ఫుల్లుగా తాగేశాడు. మత్తు ఎక్కువై అక్కడే పడిపోయాడు. ఈ లోపు నిద్ర మాత్రల మత్తులోనే ఉన్న వైద్యుడు ఎలాగోలా కష్టపడి పక్కింటి తలుపు తట్టగలిగాడు. జరిగిందంతా వారికి వివరించగలిగాడు. పక్కింటోళ్ల ఫిర్యాదుతో పోలీసులు ఇంటికి వచ్చేసరికి సౌరభ సక్సేనా ఎలాగోలా పారిపోయాడు. వైద్యుడి భార్య, సౌరభ్ సక్సేనాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. - 
      
                    
పుష్కర విచారణ ముగిసేదెప్పుడు ?

 
 రేపటితో ముగియనున్న గడువు 
 
 నేడు మరోసారి విచారణ
 
 ఇప్పటికి మూడుసార్లు గడువు పెంపు
 
 ఆధారాలు సమర్పించని ప్రభుత్వ శాఖలు 
 
 సాక్షి, రాజమహేంద్రవరం: 
 గోదావరి మహా పుష్కరాల తొలి రోజున జరిగిన తొక్కిసలాటపై విచారణ కొనసా.....గుతూనే ఉంది. ఏకసభ్య కమిష¯ŒSకు ప్రభుత్వ శాఖలు ఏడాదిన్నరగా ఆధారాలు సమర్పిస్తూనే... ఉన్నాయి. ఇప్పటికి కూడా కొన్ని ప్రభుత్వ శాఖలు ఇంకా ఆధారాలు సమర్పించాల్సి ఉంది. దీనిపై కమిష¯ŒS ఎన్నిసార్లు కోరినా ప్రభుత్వ శాఖల స్పందన అంతంత మాత్రంగానే ఉంది. 2015 జూలై 14న గోదావరి మహా పుష్కరాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు రాజమహేంద్రవరంలోని పుష్కర ఘాట్‌లో తొక్కిసలాట జరిగి పుణ్య స్నానాలకు వచ్చిన 29 మంది దుర్మరణంపాలయ్యారు. మరో 51 మంది గాయపడ్డారు. గాయపడిన వారిపై కూడా పోలీసు, రెవెన్యూ శాఖల లెక్కలు భిన్నంగా ఉన్నాయి. వీవీఐపీలు పుష్కరఘాట్లకు రావడం, గంటల కొద్దీ ప్రజలను బారికేడ్ల ద్వారా నిలువరించి ఒక్కసారిగా వదలడంతో తోపులాట జరిగిందని జిల్లా కలెక్టర్ ప్రాథమిక నివేదిక ఇచ్చారు. అనంతరం ప్రభుత్వం ఘటనపై సమగ్ర విచారణ కోసమంటూ జస్టిస్ సీవై సోమయాజులు నేతృత్వంలో ఏకసభ్య కమిష¯ŒS వేసింది.ఆరు నెలల్లో విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని గడువు విధించింది. అయితే సీఎం చంద్రబాబు కుటుంబం పుష్కర ఘాట్‌లో స్నానమాచరించడం, డాక్యుమెంటరీ కోసం ప్రజలను నిలిపివేయడం వల్లనే ప్రమాదం జరిగిందని రాజకీయ పార్టీల నేతలు, న్యాయవాదులు, ప్రజా సంఘాలు బలంగా ఆరోపించాయి. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా కమిష¯ŒSకు సమర్పించాయి. విచారణ పూర్తయితే సీఎం చంద్రబాబు, సాధారణ భక్తులు స్నానం చేసే పుష్కర ఘాట్‌లోకి వీవీఐపీలను అనుమతించిన అధికారులు దోషులుగా తేలే అవకాశం ఉందని ప్రభుత్వ శాఖలు విచారణ సమయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. తమ వద్ద ఉన్న ఆధారాలను ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నాయి. కమిష¯ŒS అడిగినా కూడా అరకొరగా ఇస్తూ కాలం వెళ్లదీస్తున్నాయి. దీనిపై కమిష¯ŒS కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా కూడా ప్రభుత్వ శాఖలకు చీమ కుట్టినట్లుగా లేదు. జియోగ్రాఫికల్ చానెల్ చిత్రీకరించిన డాక్యుమెంటరీని కూడా ఎడిట్ చేసి ఇచ్చారని ప్రభుత్వానికి వ్యతిరేకంగా అఫిడవిట్ దాఖలు చేసిన వారు పేర్కొంటున్నారు. 
 మూడోసారి కూడా రిక్త హస్తమేనా? 
 ప్రభుత్వ శాఖలు ఆధారాలు సమర్పించకపోవడంతో ప్రభుత్వం ఇచ్చిన ఆరు నెలల గడువులోపు ఏకసభ్య కమిష¯ŒS విచారణ పూర్తి చేయలేకపోయింది. దీంతో కలెక్టర్ వినతి మేరకు ప్రభుత్వం ఇప్పటి వరకు మూడుసార్లు గడువు పొడిగించింది. కమిష¯ŒSకు ఇచ్చిన గడువు ఆరు నెలలు గత ఏడాది మార్చి 29తో ముగియగా జూ¯ŒS 29 వరకు మరో మూడు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు నెల తరువాత జారీ చేసింది. ఆ సమయంలో కూడా విచారణ పూర్తి కాకపోవడంతో రెండోసారి సెప్టెంబర్ 29 వరకు మరో మూడు నెలలు గడువు ఇస్తూ రెండో దఫా గడువు పెంచారు. ఈసారి కూడా దాదాపు 24 రోజుల అనంతరం పెంచిన గడువుపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పుడు కూడా ప్రభుత్వ శాఖలు సహకరించకపోవడంతో విచారణ పూర్తి కాలేదు. దీంతో మూడోదఫా ఈ ఏడాది జనవరి 29 వరకు నాలుగు నెలలపాటు గడువు పెంచుతూ నెల తరువాత ప్రభుత్వం జారీ చేసింది.మూడుసార్లు గడువు పెంచిన ప్రభుత్వం వాటికి సంబంధించిన జీవోలు మాత్రం ప్రతిసారీ దాదాపు నెల రోజుల తరువాత జారీ చేయడం విచారణను సాగ దీయడమేనని అఫిడవిట్ దాఖలు చేసిన వారు ఆరోపిస్తున్నారు. పెంచిన గడువు 29తో ముగుస్తోంది. శనివారం మరోసారి కమిష¯ŒS విచారణ చేపడుతోంది. ఈ సారైనా విచారణ ఎంత వరకు వచ్చిందన్న దానిపై కమిష¯ŒS ఒక స్పష్టత ఇస్తుందని అఫిడవిట్ దాఖలు చేసిన వారు ఆశిస్తున్నారు.
 ఆధారాలు సమర్పించడంలో 
 అధికారుల నిర్లక్ష్యం... 
 విచారణ ప్రారంభమై ఏడాదిన్నర గడుస్తోంది. ఇప్పటి వరకు పూర్తి కాలేదు. అధికారులు వాస్తవాలను కమిష¯ŒS ముందు పెట్టకపోవడంతోనే ఈ జాప్యం జరుగుతోంది. కమిష¯ŒS అడిగినా సరైన స్పందన లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అందుకు ఉదాహరణ నేషనల్ జియోగ్రఫీ చానల్ ఫుటేజీని ఎడిట్చేసి ఇవ్వడమే. విచారణ పూర్తికి అవసరమైన సమాచారం కాకుండా అనవసరమైన వివరాలు కమిష¯ŒSకు ఇస్తున్నారు. పోలీసు విచారణ కూడా ఇప్పటి వరకూ పూర్తి కాలేదంటున్నారు. 
 – ముప్పాళ్ల సుబ్బారావు, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు, రాజమహేంద్రవరం. 
 
 ప్రజా ధనాన్ని వృథా చేస్తున్నారు 
 ఏడాదిన్నరవుతున్నా ఇప్పటికీ విచారణ పూర్తి కాలేదు. చంద్రబాబు దోషిగా తేలుతాడన్న భయంతోనే విచారణను నాన్చుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వ శాఖలను తన ఇష్టానుసారం ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వ శాఖలకు స్వేచ్ఛ లేకుండా పోయింది. అధికారులు స్వేచ్ఛగా తమ పని చేయలేకపోతున్నారు. అందుకు నిదర్శనమే ఇప్పటి వరకు ఆధారాలు సమర్పించకపోవడం. విచారణ పొడిగిస్తూ ప్రజా ధనాన్ని వృథా చేస్తున్నారు. 
 – జక్కంపూడి విజయలక్ష్మి, వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యురాలు. 
 
 చంద్రబాబే బాధ్యుడు కాబట్టి...
 పుష్కరాలు తానే నిర్వహించానని సీఎం చంద్రబాబు పదే పదే చెప్పారు. ఇదే విషయం కమిష¯ŒS ముందు ఆధారాలతో నేను సమర్పించాను. అధికారులు నిజాలు చెప్పాలి. కమిష¯ŒS వాటినే ప్రభుత్వానికి సమర్పిస్తుంది. కానీ అధికారులు నిజాలు చెప్పేందుకు ముందుకు రావడంలేదు. డాక్యుమెంటరీ చిత్రీకరణ వల్లే తొక్కిసలాట జరిగింది. ఈ అఘాయిత్యానికి కారణం చంద్రబాబే. ఇది అందరికీ తెలుసు. ఈ ఘటనలో చంద్రబాబే ముద్దాయి అవుతాడు. పొరపాటు జరిగిందని చంద్రబాబు ఒప్పుకుంటే సరిపోతుంది. కానీ మానవ ప్రమేయం లేదని వాదిస్తాడు. విచారణ కోసం మళ్లీ గడువు ఇస్తారు. చివరికి అధికారులు సహకరించడం లేదని కమిష¯ŒS ప్రభుత్వానికి చెప్పే అవకాశం ఉంది. 
 – ఉండవల్లి అరుణ్‌కుమార్, పార్లమెంట్ మాజీ సభ్యుడు
 


