breaking news
Intelligence community
-
నిఘా... పచ్చి దగా!
సాక్షి, అమరావతి రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాల్సిన ఇంటెలిజెన్స్ విభాగం ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమే పని చేస్తోంది అనడానికి ఇది మరో నిదర్శనం. ఓటమి భయంతో ఉన్న చంద్రబాబును గట్టున పడేసే బాధ్యతను భుజానికెత్తుకున్న ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు తన పరిధి దాటి వ్యవహరించారని చెప్పడానికి పలు ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. ఏబీ వెంకటేశ్వరరావు నిఘా విధులను వదిలేసి, చంద్రబాబు నిర్వహించే టీడీపీ సమావేశాలు, మంత్రివర్గ సమావేశాలకు స్వయంగా హాజరైన సంగతి తెలిసిందే. ఇది చాలదన్నట్టు ఏకంగా టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకుల వాట్సాప్ గ్రూపుల్లోనూ ఉండి వారి దిశానిర్దేశం చేస్తున్నారనే అభియోగాలున్నాయి. దీనికితోడు ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల వివరాలను సేకరించడం విమర్శలకు తావిస్తోంది. ప్రతిపక్ష అభ్యర్థులపైనే గురి రాష్ట్రవ్యాప్తంగా సొంత సామాజికవర్గానికి చెందిన అధికారులను ఇంటెలిజెన్స్ డీఎస్పీలుగా నియమించుకున్న ఏబీ వెంకటేశ్వరరావు వారి నుంచి రాజకీయ కోణంలోనే నివేదికలను రప్పించుకున్నారు. కొద్ది రోజుల క్రితం రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వైఎస్సార్సీపీ అభ్యర్థులపై నిఘా పెట్టారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులను నీడలా వెంటాడిన ఇంటెలిజెన్స్ సిబ్బంది పలు కీలక వివరాలు సేకరించారు. ఉదాహరణకు అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో కాపు రామచంద్రారెడ్డి, పాటిల్ అజయ్‌కుమార్‌రెడ్డి వైఎస్సార్సీపీ టిక్కెట్ ఆశిస్తున్నారని, రామచంద్రారెడ్డికి టిక్కెట్ ఇస్తే అజయ్‌కుమార్‌రెడ్డి వర్గం సహకరించదంటూ సమాచారం సేకరించి, తమ బాస్‌కు నివేదిక అందజేశారు. ఈ నివేదిక ఇచ్చిన కొద్ది రోజులకే మాజీ ఎమ్మెల్యే పాటిల్ వేణుగోపాల్‌రెడ్డి, ఆయన తనయుడు పాటిల్ అజయ్‌కుమార్‌రెడ్డి టీడీపీ చేరడం గమనార్హం. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ రాజకీయ సమీకరణలు, అభ్యర్థుల బలబలాలను అంచనా వేసేందుకు ఇంటెలిజెన్స్ విభాగాన్ని వాడుకున్నట్లు తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ సిబ్బంది ఇచ్చే నివేదిక ఆధారంగానే టీడీపీ రాజకీయ వ్యూహాలను రచించుకుంటోంది. పార్టీ ఫిరాయింపులు, టీడీపీలో చేరికల వెనుక పచ్చ చొక్కా తొడుక్కున్న ఏబీ వెంకటేశ్వరరావు కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వైఎస్సార్సీపీ అభ్యర్థి వ్యక్తిగతం, ఆర్థిక పరిస్థితి, అతడిపై ఏమైనా కేసులు ఉన్నాయా? వివాదాల్లో ఉన్నాడా? అనే ప్రాథమిక వివరాలు సేకరించారు. అంతటితో ఆగకుండా ప్రతిపక్ష అభ్యర్థి కుటుంబ పరిస్థితి, కుటుంబంలో ఎంత మంది సభ్యులున్నారు? వారిలో ఏమైనా వివాదాలు ఉన్నాయా? వారి రాజకీయ, సామాజిక పరిస్థితి ఏమిటి? అనే వివరాలు కూడా తీసుకున్నారు. వైఎస్సార్సీపీ తరపున బరిలోకి దిగనున్న ఆ అభ్యర్థి ఎంతమేరకు పోటీ ఇస్తాడు? ఇంకా ఎవరెవరు సీటు ఆశించారు? ఒకరికి టిక్కెట్ ఇస్తే మిగిలిన వారు సహకరిస్తారా? అనే సమాచారం తీసుకున్నారు. ఏ నియోజకవర్గంలో ఎవరు బలమైన అభ్యర్థి, ఎవరు బలహీనంగా ఉన్నారు? సమీకరణలు ఎవరికి కలిసి వస్తాయి అనే కోణంలోనూ ఆరా తీసి నివేదిక రూపొందించారు. ఇలా క్షేత్రస్థాయిలో ఇంటెలిజెన్స్ సిబ్బంది సేకరించిన వివరాలను ఏబీ వెంకటేశ్వరరావు ఎవరికి నివేదిస్తారో తెలియంది కాదు. -
ఎన్నికలపై ఉగ్రపంజా
ఇండియన్ ముజాహిదీన్ అనుమానిత సభ్యుడు యాసిన్ భత్కల్ అరెస్టుకు ప్రతీకారం తీర్చుకోవడానికి ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతంలో దాడులకు దిగాలని మరో ఉగ్రవాద సంస్థ సిమి ప్రయత్నిస్తున్నట్టు గూఢచార వర్గాలకు సమాచారం అందింది. దీంతో ఢిల్లీలోని ఏడు సీట్ల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు, నాయకులందరికీ తగిన రక్షణ కల్పించాలని పోలీసుశాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. న్యూఢిల్లీ: నిషేధిత ఉగ్రవాద సంస్థలు సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా రాజధానిలో దాడులు చేయడం/నాయకులను అపహరించడానికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నట్టు నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో ఢిల్లీ పోలీసుశాఖ అన్ని పోలీసు స్టేషన్లకు హెచ్చరికలు జారీ చేసింది. ఇండియన్ ముజాహిదీన్ కీలక సభ్యుడిగా అనుమానిస్తున్న యాసిన్ భత్కల్ అరెస్టుకు ప్రతీకారం తీర్చుకునేందుకు ఈ సంస్థ సభ్యులు దేశరాజధానిలో దాడులకు తెగబడవచ్చని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఏడు సీట్ల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు, నాయకులందరికీ తగిన రక్షణ కల్పించాలని పోలీసుశాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి జనాదరణ పెరగడాన్ని సహించలేని నిషేధిత స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ (సిమి) కార్యకర్తలు మళ్లీ కార్యకలాపాలు ప్రారంభించినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. ప్రజలు ఓటింగ్‌లో పాల్గొనకుండా నిరోధించేందుకు సిమి కార్యకర్తలు ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో బాంబు పేలుళ్లకు తెగించే అవకాశాలను తోసిపుచ్చలేమని సీనియర్ పోలీసు అధికారి ఒకరు అన్నారు. ఆప్ జాతీయ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్, కాం గ్రెస్ ఉపాధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీని కూడా ఉగ్రవాద సంస్థలు లక్ష్యంగా చేసుకునే అవకాశాలున్నాయని సమాచారం. అబ్దూస్ సుభాన్ ఖురేషి ఎలియాస్ తాఖీర్ వంటి సిమి సభ్యులు జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పర్యటిస్తూ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నట్టు నిఘా వర్గాలకు సమాచారం అందింది. లష్కరే తోయిబా నేతృత్వంలో సిమి..ఇండియన్ ముజాహిదీన్‌ను (ఐఎం) ఏర్పాటు చేసింది. ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాం తం (ఎన్సీఆర్)లో దాడులు చేయాలని ఐఎం నాయకుడు తెహిసిన్ అఖ్తర్ ఎలియాస్ మోనూ వ్యూహాలు రచిస్తున్నాడని అధికారవర్గాలు తెలిపాయి. ఢిల్లీ, రాజస్థాన్, మహారాష్ట్ర, గోవా, ఇతర రాష్ట్రాలకు వచ్చి విదేశీయులను అపహరించాలని మోనూ భావిస్తున్నట్టు యాసిన్ పోలీసుల విచారణలో తెలిపాడు. మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జైలు గత నుంచి గత ఏడాది తప్పించుకుపారిపోయిన సిమి ఉగ్రవాదులు కూడా దాడులకు తెగబడే అవకాశాలు ఉన్నట్టు గుర్తించారు. దక్షణాదిలో చురుగ్గా కార్యకలాపాలు కొనసాగిస్తున్న అల్ ఉమ్మా కార్యకర్తలు సిమికి సహకరించవచ్చని సమాచారం. సిమి తో అల్ ఉమ్మాకు చాలా కాలంగా సంబంధాలు ఉన్నా, ఇది ఉత్తరాదిలో ఎప్పుడూ దాడులకు పాల్పడలేదు. ఈ నేపథ్యంలో ఢిల్లీ, జాతీయ రాజధానిలో భద్రత సంబంధిత అంశాలపై చర్చించడానికి నగర పోలీసులు, సంబంధిత అధికారులు వచ్చే వారం సమావేశం కానున్నారు. యాసిన్ భత్కల్‌కు మరోసారి నిరాశే ఢిల్లీలో 2008 వరుస పేలుళ్ల కేసులో కీలక నిందితు డు యాసిన్ భత్కల్‌కు బెయిల్ ఇవ్వడానికి స్థానిక కోర్టు మళ్లీ తిరస్కరించింది. ఇతని అనుచరుడు అసదుల్లా అఖ్తర్‌కు కూడా నిరాశ తప్పలేదు. ఈ కేసు దర్యాప్తు పూర్తి చేయడానికి వీలుగా ఈ ఇద్దరిని మరోసారి 15 రోజుల కస్టడీకి ఇవ్వాలన్న ఢిల్లీ స్పెషల్‌సెల్ పోలీసుల విజ్ఞప్తిని అడిషనల్ సెషన్స్ జడ్జి దయాప్రకాశ్ అంగీకరించారు. గ్రేటర్ కైలాష్‌లో 208, సెప్టెంబర్ 13న జరిగిన పేలుళ్లపై వీరిద్దరి ప్రశ్నించాల్సి ఉందని పోలీసులు న్యాయమూర్తికి విన్నవించారు. దీంతో ప్రస్తుతం మహారాష్ట్ర పోలీసు ల అదుపులో ఉన్న భత్కల్, అఖ్తర్‌ను వచ్చే మూడు న విచారణకు హాజరుపర్చాలని ఆదేశిస్తూ జడ్జి దయాప్రకాశ్ ప్రొడక్షన్ వారంట్లు జారీ చేశారు. ఈ కేసుతో ప్రమేయమున్న ఆసియా దేశస్తుడి గురించి కేంద్ర నిఘావర్గాలు కొంత సమాచారం ఇచ్చినందునే, వీరిద్దరి కస్టడీ కోరుతున్నామని స్పెషల్‌సెల్ న్యాయమూర్తికి విన్నవించింది.