breaking news
illegal deposit
-
జరిమానా లెక్క తేల్చాల్సిందే
సాక్షి, హైదరాబాద్, సాక్షి, అమరావతి: మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమ డిపాజిట్ల వసూళ్ల వ్యవహారంలో జరిమానా లెక్కలు ఇంకా తేలాల్సి ఉందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ స్పష్టం చేశారు. ఈ అంశంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ), కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానన్నారు. ‘సత్యం గెలిచింది.. న్యాయం నిగ్గు తేలిందని ఈనాడు చెబుతోంది! అసలు నిజం అంటే ఏమిటి? ప్రధానంగా ఈ కేసు దేనిమీద దాఖలైంది? డిపాజిట్ల సేకరణ సక్రమమా? అక్రమమా? కేసుకు ఇదే మూలం కదా! హెచ్‌యూఎఫ్ కింద రూ.వేల కోట్లు డిపాజిట్ల రూపంలో సేకరించడం ఆర్బీఐ సెక్షన్ 45 ఎస్ ప్రకారం చట్ట విరుద్ధం. దీన్ని వదిలేసి సత్యం గెలిచిందంటూ ఈనాడు ప్రచారం చేస్తోంది. రామోజీ మరణంతో టెక్నికల్ కారణాలతో ఊరట పొంది.. న్యాయం గెలిచిందంటూ ప్రచారం చేసుకుంటున్నారు. నిజానికి ఏ వ్యవస్థా క్లీన్ చిట్ ఇవ్వలేదు. గతంలో హైకోర్టుగానీ ఇప్పుడు సుప్రీంకోర్టుగానీ ఇలా డిపాజిట్లు సేకరించడం సరైనదేనని ఎక్కడా చెప్పలేదు. మార్గదర్శి ఎంతసేపూ సెక్షన్ 45 ఎస్ తమకు వర్తించదంటూ అడ్డగోలుగా వాదించింది. రామోజీ మరణించడంతో సడన్‌గా ప్లేటు ఫిరాయించారు’ అని ఉండవల్లి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో, అనంతరం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ‘రెండు తెలుగు రాష్ట్రాల్లో రామోజీరావు అత్యంత పవర్‌పుల్. సీఎంలను సైతం నిర్ణయించగలిగిన శక్తి సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయి. అయినప్పటికీ మార్గదర్శి డిపాజిట్ల వసూలు చట్ట విరుద్ధమని ఆయనకు స్పష్టంగా తెలుసు కాబట్టే అప్పటికప్పుడు ఆస్తులు అమ్మి మరీ తిరిగి చెల్లిస్తామన్నారు. తను చేసింది తప్పు కాకపోతే ఎందుకు చెల్లిస్తామంటారు? మార్గదర్శి ఫైనాన్షియర్స్ ద్వారా డిపాజిట్ల సేకరణను హఠాత్తుగా నిలిపివేసి ఆ సంస్థను ఎందుకు మూసేశారు? అప్పటిదాకా నాటి వైఎస్సార్ ప్రభుత్వం తనను వేధిస్తోందని న్యాయస్థానాలకు చెప్పిన రామోజీ వెంటనే డిపాజిట్ల సేకరణ నిలిపివేసి తిరిగి చెల్లిస్తామని సుప్రీంకోర్టును కోరారు. తను తప్పు చేయకుంటే ఎందుకు అడిగారు? మార్గదర్శి అక్రమాలపై విచారణకు నియమించిన రంగాచారి కమిషన్ నివేదిక ఇస్తూ.. ఆస్తులు అమ్మితేగానీ డబ్బులు చెల్లించే పరిస్థితిలో లేదని చెప్పారు. రామోజీ దీన్ని నూటికి నూరు శాతం నిజం చేస్తూ డిపాజిట్లు తిరిగి చెల్లించేందుకు తనకు ఉన్న మీడియా చానళ్లను విక్రయించారు. అంటే దాని అర్థం ఏమిటి? నిజంగా చట్టబద్ధంగా చేసి ఉంటే ఆయన ఎవరికైనా లొంగే మనిషేనా? మరి రామోజీ ఇంకెక్కడి కడిగిన ముత్యం? ఇంత అక్రమాలకు పాల్పడినా వైఎస్సార్ ప్రభుత్వం ఆయన్ను అరెస్టు చేయడంగానీ, ఆస్తులను అటాచ్ చేయడంగానీ చేయలేదు’ అని ఉండవల్లి పేర్కొన్నారు. మార్గదర్శి డిపాజిట్ల వసూలు చట్ట విరుద్ధమని ఆర్బీఐ ఎప్పటి నుంచో చెబుతోందని గుర్తు చేశారు. తాజాగా కేంద్రం సైతం పార్లమెంట్లో ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ లిఖితపూర్వకంగా ప్రకటన చేసిందని తెలిపారు. చట్టబద్ధమైన మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లు (అనధికారికంగా డిపాజిట్లను స్వీకరించడం) తేలితే జరిమానా విధించడం, రిజిస్ట్రేషన్ రద్దు చేయడం లాంటి చర్యలను ఆర్బీఐ చేపడుతుందని స్పష్టం చేసిందన్నారు. తన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదని ఉండవల్లి చెప్పారు. ‘రామోజీరావు మరణంతో ఆయనపై క్రిమినల్ కేసు కొనసాగదనేది సాధారణ న్యాయసూత్రమే. తెలంగాణ హైకోర్టు తీర్పుతో రామోజీరావుపై క్రిమినల్ కేసు ముగిసినా.. అక్రమంగా డిపాజిట్లు సేకరించినందుకు విధించాల్సిన జరిమానా అంశాన్ని ఆర్బీఐ తేల్చాలి. ఆర్థిక అంశాలు మిగిలి ఉంటే చట్టపరమైన ప్రక్రియ ద్వారా బకాయిల వసూలుకు అవకాశం ఉంటుందని హైకోర్టు కూడా స్పష్టం చేసింది. నేరం చేసిన మనిషి మరణిస్తే క్రిమినల్ కేసు నిలువదు. కానీ, ఆర్థిక లావాదేవీల బాధ్యతల నుంచి మాత్రం తప్పించుకోలేరు. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45 ఎస్ ప్రకారం.. అక్రమంగా వసూలు చేసిన నగదుకు రెట్టింపు వరకు జరిమానా విధించే నిబంధన ఉంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది’ అని ఉండవల్లి పేర్కొన్నారు.45 ఎస్ ఉల్లంఘన జరిగిందా? లేదా? తేల్చలేదు‘హైకోర్టు తీర్పు తర్వాత అత్యున్నత ధర్మాసనంలో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) ఎందుకు దాఖలు చేశానంటే.. గతంలో సుప్రీంకోర్టు 3 అంశాలపై తేల్చాలని హైకోర్టుకు కేసును తిప్పి పంపింది. వసూలు చేసిన వారందరికీ నగదు చెల్లింపులు జరిగాయా? రిజర్వు బ్యాంక్ చట్టాన్ని ఉల్లంఘించారా? ఇప్పటికే 15–20 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ కేసులో ట్రయల్ కోర్టులో విచారణ కొనసాగించాలా? మూసివేయాలా? వీటిపై తేల్చాలని హైకోర్టుకు ‘సుప్రీం’ సూచించింది. హైకోర్టు కొంత వరకు ఆర్బీఐ చట్టంలోని 45 ఎస్‌ను సమర్థించినా.. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు మాత్రం రామోజీరావు మరణించినందున మేం ప్రాసిక్యూట్ చేయలేమని చెప్పాయి. చనిపోయిన వ్యక్తిపై క్రిమినల్ కేసు నిలబడదన్నది వాస్తవం. ఇదే విషయాన్ని రామోజీరావు చనిపోయిన రోజే మీడియా ఒత్తిడి చేయడంతో చెప్పా. శిక్ష ఉండదు కానీ.. ఎవరికైనా నగదు ఇవ్వాల్సి ఉంటే మాత్రం వారి వారసుల నుంచి వసూలు చేస్తారని చెప్పా. కేసు పెట్టే సమయంలో రామోజీరావును ప్రొప్రైటర్‌గా పేర్కొన్నారు. ప్రొప్రైటర్ చనిపోయారు కనుక.. ఆయన తప్పులకు ఎలాంటి సంబంధం లేదని వారసుల పక్షం వారు వాదించారు. క్రిమినల్ కేసు నిలబడదు. కానీ, 45 ఎస్‌ను ఉల్లంఘిస్తే ఏం చేయాలనేది ఆర్బీఐ చట్టంలో స్పష్టంగా ఉంది. ఎంత నగదైతే డిపాజిటర్ల నుంచి వసూలు చేస్తారో.. అంతకు రెట్టింపు జరిమానా విధించాలి. చట్టం రూపొందించే ముందు ఇన్ని వేల కోట్లు వసూలు చేస్తారని భావించి ఉండరు. హైకోర్టు తీర్పునిస్తూ.. క్రిమినల్ కేసును ముగిస్తున్నాం. సివిల్ లయబిలిటీ (ఆర్థిక అంశాలు) ఉంటే మార్గదర్శి నుంచి ఆర్బీఐ గానీ ఇతరులెవరైనా గానీ వసూలు చేసుకునేందుకు ‘ఓపెన్’గా ఉంచుతున్నామని చెప్పింది. 45 ఎస్ ఉల్లంఘన జరిగిందా? లేదా? తేల్చలేదు. ఆర్బీఐ నా వాదనలను మాత్రమే ప్రస్తావించింది. 45 ఎస్ తేల్చడానికే నేను సుప్రీంను ఆశ్రయించా’ అని ఉండవల్లి పేర్కొన్నారు.ఇరు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి స్పందనే లేదు‘ఎస్ఎల్పీ వేయడానికి ముందే ఏపీ, తెలంగాణ సీఎంలకు, ఆర్బీఐకి లేఖలు రాశా. ప్రభుత్వాల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. నా లేఖకు ఎలాంటి స్పందన ఇవ్వని ఈ ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో మాత్రం వకాలత్ వేసి.. హైకోర్టులో చెప్పిందే మళ్లీ చెప్పాయి. ఆర్బీఐ మాత్రం ‘ఈ విషయాన్ని ఇకపై కొనసాగించబోం’ అని సమాధానం ఇచ్చింది. సెక్షన్ 45 ఎస్ ఉల్లంఘనపై హైకోర్టులో గట్టిగా వాదించిన ఆర్బీఐ.. ఆ తర్వాత ఎందుకు కేసును కొనసాగించబోమని లేఖ ఇచ్చిందో తేలాలి. ఈ అంశాన్ని పార్లమెంట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ దృష్టికి తీసుకెళ్లి ఆర్బీఐ వైఖరిపై ప్రశ్నిస్తా. అవసరమైతే ఆర్బీఐ గవర్నర్‌ను కూడా కమిటీ ముందుకు పిలిపించే అవకాశం ఉంది. పార్లమెంట్ కమిటీకి చైర్మన్‌గా పనిచేసిన అనుభవం నాకుంది. హెచ్‌యూఎఫ్ (హిందూ అవిభక్త కుటుంబం) పేరుతో ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించడంపై రాజ్యసభలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టమైన సమాధానం ఇచ్చింది. ఆర్బీఐ చట్ట ప్రకారం అనుమతి లేకుండా ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించడానికి వీల్లేదంది. నిబంధనలను ఉల్లంఘించే సంస్థలపై ఆర్బీఐ.. వ్యాపార పరిమితులు, జరిమానాలు, రిజిస్ట్రేషన్ రద్దు వంటి చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇదే నా వాదనకు కీలక ఆధారం’ అని ఉండవల్లి తెలిపారు.వ్యక్తిగత కక్షతో కేసు నడపలేదు..‘మార్గదర్శి ఫైనాన్షియర్స్ వ్యవహారంలో వ్యక్తిగత కక్షతో పోరాడటం లేదు. రామోజీరావును నేను వ్యక్తిగతంగా ఎప్పుడూ కలవలేదు. ఈ కేసుతో నాకు ఎలాంటి ఆర్థిక ప్రయోజనం లేదు. ఈ ఉల్లంఘన భవిష్యత్‌లో మరికొందరికి ఉదాహరణగా మారకూడదనే ఉద్దేశంతోనే న్యాయ పోరాటం చేస్తూ వచ్చా. పెద్ద సంస్థలు నిబంధనలు ఉల్లంఘిస్తే భవిష్యత్‌లో మరికొందరూ ఇలానే చేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే చట్టం అందరికీ ఒకేలా వర్తించాలి. చట్ట ఉల్లంఘనకు జరిమానా విధించాల్సిందే. ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించాలంటే సంబంధిత చట్టాల ప్రకారం సంస్థను ఏర్పాటు చేసి, రిజిస్ట్రేషన్ చేసుకుని, ఆర్బీఐ అనుమతులు తీసుకోవాలి. మార్గదర్శి మాత్రం హెచ్యూఎఫ్తో కార్యకలాపాలు నిర్వహించిందనేది నా ప్రధాన అభ్యంతరం. అనారోగ్య కారణాలు, ఆస్పత్రిలో చేరాల్సి రావడంతో ఇటీవల కోర్టుకు వెళ్లలేకపోయా. కోట్ల రూపాయలిచ్చి న్యాయవాదిని నియమించుకునే శక్తి నాకు లేదు. తెలిసిన మంచి సీనియర్ న్యాయవాదిని నియమించాం. పార్టీ ఇన్ పర్సన్‌గా నేనే వాదనలు వినిపించి సమర్థంగా చెప్పేవాడిని. ఏదేమైనా కోర్టు తీర్పును గౌరవిస్తా. న్యాయమూర్తుల అభిప్రాయాలను ప్రశ్నించబోను. కోర్టుకు సంబంధించినంత వరకు ఈ అధ్యాయం ముగిసింది. ఇక జరిమానా, ఆర్థిక బాధ్యతపై ఆర్బీఐ, ప్రభుత్వాలు ఏం చేస్తాయో చూడాలి’ అని ఉండవల్లి చెప్పారు.ఆర్బీఐ తీరు విస్మయకరంమార్గదర్శి ఫైనాన్షియర్స్ వ్యవహారంలో ఇటీవల ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. అది అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇది సీఎం చంద్రబాబు తరహాలో వ్యవస్థల మేనేజ్మెంట్ను గుర్తుకు తెస్తోంది. ఆర్బీఐ మొదటి నుంచి మార్గదర్శి, రామోజీరావులకు వ్యతిరేకంగా హైకోర్టులో గట్టిగా వాదనలు వినిపించింది. అలాంటి ఆర్బీఐ ఇటీవల మార్గదర్శి ఫైనాన్షియర్స్ విషయంలో చేతులెత్తేసింది. రామోజీ అక్రమాలను హైకోర్టులో తీవ్రస్థాయిలో ఎండగట్టిన ఆర్బీఐ ఇటీవల విస్మయకర నిర్ణయం తీసుకుంది. మార్గదర్శి ఫైనాన్షియల్ డిపాజిట్ల అక్రమ వసూళ్ల వ్యవహారాన్ని పట్టించుకునేది లేదని, దీనిపై నిర్ణయం తీసేసుకున్నామని రామోజీ అక్రమాలపై సుదీర్ఘ న్యాయపోరాటం చేసిన నాకు రాతపూర్వకంగా చెప్పింది. కేసు కొట్టివేతపై సుప్రీంకోర్టు నిర్ణయానికి ముందే ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా అనుమానాలున్నాయి.ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45(ఎస్)కు విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరిస్తున్నారని, ఇలా చేయడంపై నిషేధం ఉందని హెచ్చరిస్తూ 1997లో మార్గదర్శి ఫైనాన్షియర్స్కు లేఖ పంపిన రిజర్వ్ బ్యాంక్ హెచ్‌యూఎఫ్‌కు సెక్షన్ 45(ఎస్) వర్తిస్తుందని, అందువల్ల మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఏ రకంగానూ, ఎలాంటి డిపాజిట్లు స్వీకరించడానికి వీల్లేదని తేల్చి చెబుతూ రామోజీరావుకు 1999లో ఆర్బీఐ పంపిన లేఖ మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసును ఇకపై పట్టించుకోవద్దని నిర్ణయం తీసుకున్నామని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌కు ఈ ఏడాది జనవరి 9న ఆర్బీఐ పంపిన లేఖ హెచ్‌యూఎఫ్‌లపై వైవీ సుబ్బారెడ్డి కీలక ప్రశ్నలుఇటీవల ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పార్లమెంట్లో హెచ్‌యూఎఫ్ విషయంలో కేంద్రాన్ని కీలక ప్రశ్నలు అడిగారు. ఆదాయపు పన్ను చట్టపరమైన స్థితికి సంబంధించి హిందూ అవిభక్త కుటుంబం (హెచ్‌యూఎఫ్) హోదా ఏమిటి? హెచ్‌యూఎఫ్‌లు డిపాజిట్లు లేదా ఇతర రూపాల్లో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు అనుమతి ఉందా? హెచ్‌యూఎఫ్ చిట్ ఫండ్ కంపెనీగా లేదా ఎన్‌బీఎఫ్‌సీగా ఏర్పాటు చేసి ప్రజల నుండి డబ్బు వసూలు చేయవచ్చా? ఆర్బీఐ అనుమతి లేకుండా ప్రజల నుండి డబ్బు వసూలు చేసిన కంపెనీలపై ఆర్బీఐ తీసుకున్న చర్యలు ఏమిటి? అన్న ప్రశ్నలు అడిగారు.ప్రజల నుంచి హెచ్‌యూఎఫ్‌లు డిపాజిట్లు తీసుకోవడం చట్టవిరుద్ధమన్న కేంద్రం..ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నలకు కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చారు. ఆర్బీఐ చట్ట నిబంధనల ప్రకారం హెచ్‌యూఎఫ్‌లు (నమోదు కాని సంస్థలు కావడం వల్ల) ఎన్బీఎఫ్సీలు లేదా చిట్ ఫండ్ కంపెనీలుగా నమోదు కాలేవు. అవి ప్రజల నుంచి డబ్బు వసూలు చేయలేవని తేల్చి చెప్పారు. అంతేకాక చిట్ ఫండ్ కంపెనీలకు సంబంధించి నిబంధనల ఉల్లంఘనలను విచారించే అధికారం (ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45–టీ కింద క్రిమినల్ కేసు నమోదు చేయడం) రిజర్వ్ బ్యాంక్, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు సంయుక్తంగా ఉంటుందన్నారు. చట్టబద్ధమైన మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లు తేలితే, ఆర్బీఐ వ్యాపార పరిమితులు విధించడం, ఆర్థికపరమైన జరిమానా విధించడం, రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయడం వంటి నియంత్రణ చర్యలను చేపడుతుందని చెప్పారు.ఆర్బీఐని అడిగే సమాధానం చెప్పిన మంత్రిసాధారణంగా పార్లమెంట్లో ఎవరైనా సభ్యుడు ప్రశ్న అడిగితే సంబంధిత శాఖామంత్రి ఆ శాఖకు చెందిన విభాగాలు, అధికారుల ద్వారా పూర్తి వివరాలు తెప్పించుకుంటారు. వాటిని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటారు. ఆ తరువాతే సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తారు. ఇక్కడ కూడా వైవీ సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్న ఆర్బీఐ పరిధిలోకి వస్తుంది. అందుకే కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి, సమాధానం ఇచ్చే ముందు ఆర్బీఐ నుంచి పూర్తి వివరాలు తెలుసుకున్న తరువాతనే సమాధానం ఇచ్చారు. ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయడం చట్టవిరుద్ధమని చెప్పారు. అలా డిపాజిట్లు వసూలు చేస్తే జరిమానాలు వసూలు చేసే అధికారం ఆర్బీఐకి ఉందని మంత్రి చెప్పారు. దీని ప్రకారం మార్గదర్శి ఫైనాన్షియర్స్ డిపాజిట్ల సేకరణ కూడా చట్ట విరుద్ధమే అవుతుంది. అలాంటప్పుడు మార్గదర్శి ఫైనాన్షియర్స్ డిపాజిట్ల సేకరణ కేసును ఇకపై పట్టించుకోకూడదని నిర్ణయం తీసుకున్నామని ఆర్బీఐ ఎలా చెబుతుంది? ఏ చట్ట నిబంధనల కింద ఈ నిర్ణయం తీసుకుంది? ఏ స్థాయిలో ఈ నిర్ణయం జరిగింది? చట్టపరమైన బాధ్యతలను నిర్వర్తించాల్సిన ఆర్బీఐ ఆ బాధ్యతల నుంచి ఎందుకు తప్పుకుంది? దీని వెనుక ఏం మంత్రాంగం జరిగింది?జరిమానా విధించాల్సిన బాధ్యత ఆర్బీఐపై ఉందిరామోజీరావు చనిపోయారు కాబట్టి, తెలంగాణ హైకోర్టు కేసు కొట్టేసింది.. దాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు సమర్థించింది. మార్గదర్శి, రామోజీరావు తాము చట్ట విరుద్ధంగా డిపాజిట్లు సేకరించామని కోర్టులో అంగీకరించిన నేపథ్యంలో వారికి జరిమానా విధించాల్సిన బాధ్యత ఆర్బీఐపై ఉంది. ప్రజల నిధుల నిర్వహణకు సంబంధించి మార్గదర్శి చట్టబద్ధమైన ఉల్లంఘనలను సైతం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని సుప్రీంకోర్టే విచారణ సందర్భంగా చెప్పింది. ఒకవేళ రామోజీరావు బతికి ఉంటే..? కథ మరోలా ఉండేది. అప్పుడు ఖచ్చితంగా తెలంగాణ హైకోర్టు మార్గదర్శి, రామోజీరావులు డిపాజిట్లు వసూలు చేయడం చట్టవిరుద్ధమా? కాదా? అన్న సంగతిని తేల్చాల్సి వచ్చేది. డిపాజిట్లు వసూలు చేసినట్లు మార్గదర్శినే స్వయంగా అంగీకరిస్తూ అఫిడవిట్ దాఖలు చేసింది. మార్గదర్శి, రామోజీ ప్రధాన వాదన ఏమిటంటే, డిపాజిట్లు వసూలు చేసిన మాట వాస్తవమే అయినప్పటికీ, మొత్తం డబ్బును తిరిగి ప్రజలకు చెల్లించామని చెప్పారు. డిపాజిట్లు వసూలు చేయడం అక్రమమా? సక్రమమా? అన్న దాని జోలికి వెళ్లకుండా, డిపాజిట్లను వెనక్కి ఇచ్చేశామనే ప్రతీ చోటా చెబుతూ వచ్చారు. చట్టవిరుద్ధంగా డిపాజిట్లు సేకరించారా? లేదా? అన్నదే ముఖ్యమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్ నేతృత్వంలోని ధర్మాసనం తేల్చి చెప్పింది.దీనిపైనే ప్రధానంగా విచారణ జరుపుతామని పేర్కొంది. చట్ట విరుద్ధంగా వసూలు చేయడం నేరమా? కాదా? అన్న దానిపైనే దృష్టి కేంద్రీకరిస్తామంది. డిపాజిట్లు వసూలు చేయడానికి, వసూలు చేసిన డిపాజిట్లను వెనక్కి ఇచ్చేయడానికి మధ్య తేడా ఉందని స్పష్టం చేసింది. దీనికి అనుగుణంగానే జస్టిస్ సుజోయ్ పాల్ ధర్మాసనం విచారణ మొదలుపెట్టింది. అనంతరం ఈ వ్యాజ్యాలు మరో ధర్మాసనం ముందుకు వచ్చాయి. ఈ ధర్మాసనం.. మార్గదర్శి డిపాజిట్ల స్వీకరణ చట్ట ప్రకారం జరిగిందా? చట్ట విరుద్ధంగా జరిగిందా? అన్న అంశం జోలికి వెళ్లకుండానే రామోజీ రావు మరణించినందుకు కేసును కొట్టేస్తున్నట్లు తీర్పునిచ్చింది. దీన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు సమర్థించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చొరవ తీసుకుంటే తగిన చర్యలకు ఆస్కారం ఉంటుంది. వాస్తవానికి మార్గదర్శి చట్ట ఉల్లంఘనలపై చర్యలు చేపట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. అయితే ఈ విషయంలో అటు చంద్రబాబు ప్రభుత్వం, ఇటు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం లేదు కాబట్టి, ఆర్బీఐ రంగంలోకి దిగాలి.రెండింతల జరిమానా లేదా రెండేళ్ల జైలుశిక్ష ఆర్బీఐ చట్టం సెక్షన్ 45(ఎస్)కు విరుద్ధంగా వేల కోట్ల రూపాయల మేర డిపాజిట్లు వసూలు చేసినందుకు విధించాల్సిన జరిమానాల నుంచి మార్గదర్శి తప్పించుకుంటున్నట్లేనా? మార్గదర్శి ఫైనాన్షియర్స్, రామోజీరావు ప్రజల నుంచి రూ.2600 కోట్ల మేర డిపాజిట్లు వసూలు చేసినట్లు ఆర్బీఐ హైకోర్టుకు నివేదించింది. ఈ డిపాజిట్ల సేకరణ చట్టవిరుద్ధంగా జరిగిందని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో రామోజీరావు మరణించకుండా ఉండి ఉంటే, ఆయన నేతృత్వంలో నడిచిన డిపాజిట్ల సేకరణ వ్యవహారం చట్టవిరుద్ధమని తేలే అవకాశం ఉండేది. ఇందుకు సెక్షన్ 45(టీ) ప్రకారం వసూలు చేసిన మొత్తానికి రెండింతల జరిమానా లేదా రెండేళ్ల జైలుశిక్ష విధించవచ్చు.మార్గదర్శి1997 నుంచి 2006 వరకు వసూలు చేసిన రూ.2600 కోట్లకు రెండింతలు అంటే రూ.5200 కోట్లు జరిమానాగా చెల్లించాల్సి వచ్చేది. ఎందుకంటే, మార్గదర్శి, రామోజీ రావులు చట్ట నిబంధనలను ఉల్లంఘించారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని ఆర్బీఐ హైకోర్టుకు స్పష్టంగా చెప్పింది. అంతేకాక హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్) లీగల్ పర్సన్కాదని, అది కొందరు వ్యక్తుల సమూహమని, కర్త ద్వారా హెచ్‌యూఎఫ్ పనిచేస్తుందని ఆర్బీఐ తెలిపింది. అందువల్ల హెచ్‌యూఎఫ్ కర్తకు సెక్షన్ 45(ఎస్) వర్తిస్తుందని ఆర్బీఐ తన కౌంటర్లో స్పష్టంగా పేర్కొంది. ఆర్బీఐ తలచుకుంటే మార్గదర్శి నుంచి జరిమానా వసూలు చేసేందుకు అవకాశం ఉంటుంది.హఠాత్తుగా అస్త్రసన్యాసం..మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమ డిపాజిట్ల సేకరణ వ్యవహారంలో రిజర్వ్ బ్యాంక్ హైకోర్టులో గట్టిగా న్యాయ పోరాటం చేసింది. మార్గదర్శికి వ్యతిరేకంగా వాదనలు వినిపించింది. ప్రాథమిక ఆధారాలను సైతం కోర్టు ముందుంచింది. మార్గదర్శి చట్ట ఉల్లంఘనలకు పాల్పడిందని, నిబంధనలకు విరుద్ధంగా ఏకంగా రూ.2600 కోట్లను ప్రజల నుంచి డిపాజిట్ల రూపంలో వసూలు చేసిందని హైకోర్టుకు చెప్పింది. ఇందుకు గాను రామోజీరావును ప్రాసిక్యూట్ చేయాల్సిందేనని స్పష్టం చేసింది. చట్ట నిబంధనల ఉల్లంఘనకు రెండేళ్ల జైలు శిక్ష పడుతుందని చెప్పింది.అంతేకాక వసూలు చేసిన రూ.2600 కోట్ల మొత్తానికి రెండింతల జరిమానా కూడా విధించాలని తేల్చి చెప్పింది. ఈ స్థాయిలో మార్గదర్శిపై న్యాయస్థానంలో పోరాడిన రిజర్వ్ బ్యాంక్ ఇటీవల కాలంలో మౌనందాల్చింది. మార్గదర్శిపై అస్త్రసన్యాసం చేసింది. మార్గదర్శిపై కేసును పట్టించుకునేది లేదని, ఈ మేర నిర్ణయం తీసుకున్నామని ఆర్బీఐ మేనేజర్ ఆశీష్ దర్యాని లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. అంత పోరాడిన ఆర్బీఐ ఎందుకు సడన్‌గా ఇలా మారిపోయిందో సులభంగా అర్థం చేసుకోవచ్చు. మార్గదర్శికున్న పలుకుబడి, ముఖ్యమంత్రి చంద్రబాబు మద్దతు, కేంద్ర పెద్దలకు చంద్రబాబుతో అవసరాలు వెరసి ఆర్బీఐ పోరాటాన్ని నీరుగార్చాయి.నాంపల్లి.. హైకోర్టు.. సుప్రీంకోర్టు.. మళ్లీ హైకోర్టు.. మళ్లీ సుప్రీంకోర్టు...2006లో నా ఫిర్యాదుతో మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమాల డొంక కదిలింది. గత 20 ఏళ్లుగా మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమాలపై న్యాయ పోరాటం చేస్తున్నా. మార్గదర్శి అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధీకృత అధికారి కృష్ణరాజు 2008లో ఇచ్చిన ఫిర్యాదుతో నాంపల్లిలో మొదట విచారణ మొదలైంది. అప్పటి నుంచి హైకోర్టు.. సుప్రీంకోర్టు.. మళ్లీ హైకోర్టు.. చివరకు సుప్రీంకోర్టు వరకు ఈ కేసు నడిచింది. 2024లో సుప్రీంకోర్టు మార్గదర్శి డిపాజిట్ల వ్యవహారాన్ని తెలంగాణ హైకోర్టుకు తిరిగి పంపింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ డిపాజిట్ల సేకరణ వ్యవహారంలో అన్నీ అంశాలపై లోతైన విచారణ జరపాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. అయితే తెలంగాణ హైకోర్టు కేవలం రామోజీ మరణం వరకు పరిమితమై, అత్యంత కీలకమైన డిపాజిట్ల సేకరణలో చట్ట ఉల్లంఘనలను విస్మరించింది. -
రామోజీరావు పట్ల మరోసారి భక్తి చాటుకున్న చంద్రబాబు
-
రూ. 1,000 కోట్లు జమ చేయండి
న్యూఢిల్లీ: గ్రూప్ సంస్థల రూ.25,000 కోట్ల అక్రమ డిపాజిట్ సమీకరణకు సంబంధించి సెబీ కేసులో 15 రోజుల్లోగా రూ. 1,000 కోట్లను ప్రత్యేక ఎస్క్రో ఖాతాలో జమ చేయాలని సహారా గ్రూప్ కంపెనీలను సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. దీనితోపాటు రూ.10,000 కోట్ల సమీకరణకుగాను ముంబైలోని వెర్సోవాలో తన భూమిని అభివృద్ధి చేయడానికి, ఈ విషయంలో జాయింట్ వెంచర్ ఒప్పందంలోకి ప్రవేశించడానికి సైతం సుప్రీం అనుమతించింది. అత్యున్నత న్యాయస్థానం 2012 ఆదేశాలకు అనుగుణంగా ఇన్వెస్టర్ల సొమ్మును తిరిగి ఇవ్వడానికి రూ. 10,000 కోట్ల మొత్తాన్ని సెబీ–సహారా రిఫండ్ ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. లేదంటే.. భూమి విక్రయానికి స్వయంగా చర్యలు జాయింట్ వెంచర్/డెవలప్మెంట్ ఒప్పందాన్ని 15 రోజుల్లోగా కోర్టులో దాఖలు చేయాల్సి చేయాలి. అనంతరం ఈ ఒప్పందానికి అత్యున్నత న్యాయస్థానం ఆమోదముద్ర తప్పనిసరి. లేని పక్షంలో వెర్సోవాలోని 12.15 మిలియన్ చదరపు అడుగుల భూమిని విక్రయించడానికి సుప్రీం తగిన చర్యలు తీసుకుంటుందని న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, ఎంఎం సుందరే‹Ù, బేల ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘సహార సంస్థలు– ఎస్‌ఐఆర్‌ఈసీఎల్, ఎస్‌హెచ్‌ఐసీఎల్ (రెండూ సహారా గ్రూప్ కంపెనీలు)కు మేము 15 రోజుల సమయం మంజూరు చేస్తున్నాము. జాయింట్ వెంచర్/డెవలప్మెంట్ ఒప్పందాన్ని 15 రోజులలోపు దాఖలు చేయకపోతే, వెర్సోవా భూమిని విక్రయానికి కోర్టు చర్యలు చేపడుతుంది’’ అని బెంచ్ పేర్కొంది. ‘‘ఈ పక్రియ కోసం థర్డ్‌పారీ రూ. 1,000 కోట్లు జమచేస్తే, దీనిని సెబీ ఎస్క్రో ఖాతాలో ఉంచడం జరుగుతుంది. ఒకవేళ ఈ కోర్టు ఆమోదం/అనుమతి (జాయింట్ వెంచర్ అగ్రిమెంట్‌కు) మంజూరు చేయకపోతే, ఆ మొత్తాన్ని (జమ చేసిన మొత్తాన్ని) తిరిగి థర్డ్‌పారీ్టకి చెల్లించడం జరుగుతుంది’’అని కూడా ధర్మాసనం వివరించింది.చెల్లింపులకు 10 యేళ్ల సుదీర్ఘ వెసులుబాటు రూ.25,000 కోట్ల తిరిగి డిపాజిట్ చేయడానికి సహారాకు సుప్రీం దాదాపు 10 సంవత్సరాల సుదీర్ఘ సమయం ఇచ్చి ఎంతో వెసులుబాటు కలి్పస్తున్న విషయాన్ని కూడా ధర్మాసనం ఈ సందర్భంగా సంస్థ తరఫున వాదనలు వినిపిస్తున్న కపిల్ సిబల్‌కు గుర్తు చేసింది. ఇదే కేసులో సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతోరాయ్ సుదీర్ఘకాలం తీహార్ జైలులో ఉండాల్సిన పరిస్థితి ఉత్పన్నం కావడం గమనార్హం. తల్లి మరణం అనంతరం అంతిమ సంస్కారాల కోసం జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచి్చన ఆయన, కొద్ది నెలల క్రితం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. -
ముమ్మాటికీ ఆర్థిక నేరస్తుడే..
-
నల్ల‘మార్గ’o ఉక్కిరిబిక్కిరి!
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాల పుట్టలో దాగిన ‘నల్ల’పాములు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. అక్రమ డిపాజిట్ల గుట్టు తేల్చేందుకు సీఐడీ తీసుకుంటున్న చర్యలతో మార్గదర్శి చిట్‌ఫండ్స్ బెంబేలెత్తుతోంది. రూ.కోటి దాటి అక్రమ డిపాజిట్లు చేసిన వారెవరు? వారి వెనుక ఉన్నదెవరు? అన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సీఐడీ చర్యలను వ్యతిరేకించడం ద్వారా అక్రమ డిపాజిట్ల సేకరణను మార్గదర్శి పరోక్షంగా అంగీకరించినట్లైందని పరిశీలకులు పేర్కొన్నారు. బ్యాంకులను కాదని చిట్టీ కంపెనీలోనా? రాష్ట్రంలోని మార్గదర్శి చిట్‌ఫండ్స్ 37 బ్రాంచి కార్యాలయాల పరిధిలో ఇప్పటికే వెయ్యి మందికిపైగా అక్రమ డిపాజిట్‌దారులను సీఐడీ గుర్తించినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటిదాకా 800 మందికిపైగా అక్రమ డిపాజిట్‌దారులకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. డిపాజిట్ చేసిన మొత్తం ఎలా ఆర్జించారు? ఆదాయ మార్గాలను వెల్లడించాలని నోటీసుల్లో పేర్కొంది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) నిబంధనలను పాటించారా? అనే వివరాలను వెల్లడించాలని మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ను ఆదేశించింది. అంత భారీ మొత్తాన్ని జాతీయ బ్యాంకులు, కేంద్ర ఆర్థిక సంస్థల్లో కాకుండా మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో దాచడం సాధారణ అంశం కాదని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. జాతీయ బ్యాంకులు సేవింగ్స్ ఖాతాలపై 5 శాతం కంటే అధికంగా వడ్డీ చెల్లిస్తున్నాయి. మార్గదర్శి కేవలం 5 శాతం వడ్డీనే చెల్లించడం, అదికూడా ఓ రశీదు జారీ చేసి సరిపుచ్చుతున్నా భారీగా డిపాజిట్లు చేయడం వెనుక పెద్ద మతలబే ఉన్నట్లు స్పష్టమవుతోంది. జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలంటే ఆ ఆదాయం ఎలా వచ్చిందో చెప్పాలి. పాన్, ఆధార్ నంబర్ ఇతర వివరాలను సమర్పించాలి. ఆర్బీఐ, ఆదాయపన్ను, సీబీడీటీ అధికారుల దృష్టిలో పడుతుంది. ఆ వివరాలేవీ వెల్లడించేందుకు సుముఖంగా లేనివారు మాత్రమే ఇతర సంస్థల్లో డిపాజిట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే వారు డిపాజిట్ చేసేదంతా నల్లధనమే కాబట్టి. ఇదే తరహా మోసంలో సహారా చైర్మన్‌కు జైలు శిక్ష బడాబాబుల నల్లధనాన్ని గుట్టుచప్పుడు కాకుండా దాచేందుకు మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థ ఓ వేదికగా మారిందన్న వాదనకు తాజా పరిణామాలు బలం చేకూరుస్తున్నాయి. అక్రమ డిపాజిట్ల ద్వారా భారీగా నల్లధనాన్ని చలామణిలోకి తెస్తున్నట్లు స్పష్టమవుతోంది. గతంలోనూ మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట రామోజీరావు ఇలాంటి వ్యవహారాలనే సాగించినట్లు ఆర్థిక నిపుణులు గుర్తు చేస్తున్నారు. అక్రమ డిపాజిట్లు సేకరించిన సహారా పరివార్ లాంటి సంస్థలు తమ డిపాజిట్‌దారుల వివరాలను గోప్యంగా ఉంచటాన్ని ప్రస్తావిస్తున్నారు. సహారా ఇండియా అక్రమ డిపాజిట్ల వ్యవహారం గుట్టు రట్టు కావడంతో సంస్థ చైర్మన్ సుబ్రతోరాయ్‌కు న్యాయస్థానం జైలు శిక్ష విధించడం గమనార్హం. ఈ నేపథ్యంలో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో అక్రమ డిపాజిట్‌దారులకు సీఐడీ నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. బుకాయించబోయి దొరికిన రామోజీ మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో రూ.కోటి కంటే ఎక్కువ మొత్తం డిపాజిట్ చేసిన వారికి సీఐడీ నోటీసులు జారీ చేయడంతో ఈ కేసులో ఏ–1గా ఉన్న సంస్థ చైర్మన్ రామోజీరావు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. తమ డిపాజిట్‌దారులకు నోటీసులు జారీ చేయడాన్ని ఖండిస్తూ మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఓ పత్రికా ప్రకటన జారీ చేసింది. తాము చిట్‌ఫండ్స్ చట్టం, ఆదాయపన్ను చట్టాన్ని సక్రమంగా పాటిస్తున్నట్లు అందులో పేర్కొంది. అయితే ఆర్బీఐ, సీబీడీటీ నిబంధనలను పాటిస్తున్నట్లు ఎక్కడా పేర్కొనకపోవడం గమనార్హం. చిట్‌ఫండ్ సంస్థలు డిపాజిట్లు సేకరించడాన్ని ఆర్బీఐ అనుమతించడంలేదు. డిపాజిట్ల సేకరణపై సీబీడీటీ కింద పన్నులు చెల్లించాలి. అలా చెల్లించినట్లు మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎక్కడా చెప్పడం లేదు. ఆ విషయాన్ని కప్పిపుచ్చేందుకే ఆదాయపన్ను చట్టాన్ని పాటిస్తున్నట్లు మభ్యపుచ్చుతున్నట్లు స్పష్టమవుతోంది. -
అక్రమ డిపాజిట్లను అడ్డుకోవాలి..
♦ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ♦ అక్రమ ధనార్జనా నిరోధక పోర్టల్ ఆవిష్కరణ ముంబై: అక్రమ డిపాజిట్ల పెరుగుదలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పష్టం చేశారు. ఒక వ్యక్తి కంపెనీని ప్రారంభించడం, కొన్ని తప్పుడు పథకాలతో కొన్ని నెలలు కంపెనీని నిర్వహించడం, భారీ డిపాజిట్లను సేకరించడం అటు తర్వాత కంపెనీ బోర్డు తిప్పేయడం (ఫ్లై-బై-నైట్ ఆపరేటర్స్) వంటి ఘటనలను ముందే అడ్డుకోడానికి తగిన చర్యలు అవసరమన్నారు. ఈ తరహా సంస్థలు ఏ నియంత్రణ సంస్థ పరిధిలోకీ రాకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని చెప్పారాయన. ‘‘ఈ సంస్థలు డబ్బుతో ఉడాయించడానికి ముందే. ఫైనాన్షియల్ రెగ్యులేటర్లు, న్యాయ నిర్వహణ సంస్థలు ఉమ్మడిగా వీటిపై చర్యకు ఉపక్రమించాలి. డిపాజిటర్ల రక్షణ చట్టం, రాష్ట్ర స్థాయి సహకార కమిటీల వంటివి ఈ నకిలీ సంస్థల ఆట కట్టించడానికి తగిన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ప్రజలు కూడా ఇలాంటి సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలి. రూ.50 లక్షలు ఇస్తానన్న వ్యక్తి నన్ను మొదట రూ.25,000 కట్టమని ఎందుకు అడిగాడు? ఇచ్చే డబ్బులో మినహాయించుకోవచ్చు కదా? అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి’’ అని సూచించారు. అక్రమాల గుట్టురట్టుకు పోర్టల్... అక్రమ డిపాజిట్ల సేకరణ గుట్టును రట్టు చేయడానికి ఉద్దేశించిన ఒక పోర్టల్‌ను ఈ సందర్భంగా రాజన్ ఆవిష్కరించారు. ట్చఛిజ్ఛ్టి.టఛజీ.ౌటజ.జీ పేరుతో ఏర్పాటైన ఈ సైటు ఫిర్యాదుల నమోదుకు అవకాశం కల్పిస్తుంది. ఒక సంస్థ ఏ రెగ్యులేటర్ వద్ద రిజిస్టర్ అయ్యింది? అసలు రిజిస్ట్రేషన్ అయ్యిందా... లేదా? వంటి వివరాలను ఈ వెబ్సైట్ ద్వారా తెలుసుకునే వెసులుబాటుంది. కాగా చదువుకున్న వారు సైతం మోసాలకు గురవుతున్నారని కార్యక్రమంలో పాల్గొన్న ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎస్ఎస్ ముంద్రా ఈ సందర్భంగా చెప్పారు. నకిలీ స్కీముల్లోకి నల్లధనం: రామన్ కార్యక్రమంలో పాల్గొన్న సెబీ హోల్ టైమ్ మెంబర్ ఎస్.రామన్ మాట్లాడుతూ, దేశంలో నల్లధనం పెద్ద ఎత్తున నకిలీ, మోసపూరిత పథకాల్లోకి మళ్లుతోందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన సహారా ఉదంతాన్ని పేర్కొన్నారు. ఈ కేసు విషయంలో డిపాజిటర్లకు తిరిగి చెల్లించడానికి తగిన మొత్తం సెబీ వద్ద ఉన్నా... తీసుకోడానికి తగిన సంఖ్యలో ఎవ్వరూ ముందుకురావడం లేదని చెప్పారాయన. ‘‘ఆర్థిక మంత్రిత్వ శాఖ డెరైక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ భాగస్వామ్యంతో నకిలీ స్కీముల్లోకి వచ్చిన నల్లడబ్బు వివరాలను రాబట్టే ప్రయత్నం చేస్తోంది. సహారా విషయంలో భారీ ఎత్తున డాక్యుమెంట్ల పరిశీలన ద్వారా ప్రపంచంలో ఏ రెగ్యులేటర్ చేయనంత పని సెబీ చేసింది. సెబీ లక్ష్యం ఒక్కటే. డిపాజిటర్ల డబ్బు ఎవరిదివారికి చెల్లించటమే’’ అని ఆయన వివరించారు. పెరల్ గ్రూప్ విషయంలోనూ ఇన్వెస్టర్లకు డబ్బు చెల్లించడానికి సెబీ అన్ని చర్యలూ తీసుకుంటోందని అన్నారు.


