breaking news
half crore
-
గ్రేటర్లో అర కోటి ఓట్లు గల్లంతు!
సాక్షి, హైదరాబాద్ : అక్షరాల అర కోటి ఓట్లు చెత్త బుట్టలోకి చేరనున్నాయి. ‘సర్’ ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణకు చివరి రోజైన సోమవారం కూడా గ్రేటర్ పరిధిలోని మూడు జిల్లాల్లో ఎలాంటి స్పందన కనిపించలేదు. సాయంత్రం వరకు హైదరాబాద్ జిల్లాలో 58.89 శాతం, రంగారెడ్డి జిల్లాలో 65.16 శాతం, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో 63.97 శాతం ఫారాలు మాత్రమే అధికారులకు అందాయి. చివరి రోజు అదనంగా కనీసం ఒక్క శాతం ఫారాలు కూడా అందలేదు. దీన్నిబట్టి దాదాపు 43 లక్షల ఓట్లు తగ్గే అవకాశం ఉంది. ఫారాలు అందజేసిన వారిలో తిరస్కరణకు గురయ్యేవి ఎక్కువగా ఉంటే, మరిన్ని ఓట్లు గల్లంతవనున్నాయి. దీంతో దాదాపు అరకోటికి చేరినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని పరిశీలకులు చెబుతున్నారు. ముసాయిదా లో పేర్లు కనిపించని వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. జూబ్లీహిల్స్‌లో ఎక్కువ.. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 19.47 లక్షల ఫారాలు అందే అవకాశం లేని ఎన్నికల అధికారులు గుర్తించారు. వీరిలో ఆచూకీ లేని, చిరునామా మారిన, మరణించిన(ఏఎస్డీ) ఓటర్లున్నారు. జూబ్లీహిల్స్‌లో అత్యధికంగా 1,80,219, అత్యల్పంగా చార్మినార్‌లో 95,472 మంది ఉన్నారు. బహదూర్‌పురాలో 1,20,013, అంబర్‌పేటలో 1,19,628, మలక్‌పేటలో 1,47,433, ఖైరతాబాద్‌లో 1,24,135, కంటోన్మెంట్లో 1,05,356, ముషీరాబాద్‌లో 1,40,814, నాంపల్లిలో 1,37,757, సనత్‌నగర్‌లో 1,15,416, కార్వాన్లో 1,42,263, గోషామహల్లో 1,10,771, చాంద్రాయణగుట్టలో 1,49,749, సికింద్రాబాద్‌లో 1,03,594 మంది ఉన్నారు. -
చంద్రబాబు అద్దె ఇంటికి అరకోటి
-
చంద్రబాబు ఇంటి మరమ్మతులకు అరకోటి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం నివాసముంటున్న జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు 24లోని అద్దె ఇంటికి రూ.అరకోటికి పైగా కేటాయిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యుదీకరణ పనుల కోసం రూ.35 లక్షలు, అద్దె ఇంటిలో ఉన్న క్యాంపు కార్యాలయంలో పనుల కోసం రూ.20.85 లక్షలు కేటాయించారు. జూబ్లీహిల్స్ అద్దె ఇంటికి మొత్తం రూ.55.85 లక్షలు కేటాయిస్తూ ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంబాబ్ ఆదేశాలిచ్చారు. ఇంతకు ముందే ఈ అద్దె ఇంటికి రూ.81.10 లక్షలు ఖర్చు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ఏప్రిల్‌లో జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు 24లో అద్దె ఇంటికి ఏప్రిల్‌లో మారారు. ఈ ఏడాది ఫిబ్రవరి 9న అద్దె ఇంటికి సీసీటీవీల ఏర్పాటు, సోలార్ పవర్ ఫెన్సింగ్ కోసం రూ.67.50 లక్షలు, కొన్ని విద్యుత్తు పనుల కోసం రూ.6 లక్షలు కలిపి మొత్తం 73.50 లక్షలు అప్పట్లో ఖర్చు చేశారు. ఆ తర్వాత జూబ్లీహిల్స్లోనే ప్రెస్ షెడ్ల నిర్మాణానికి రూ.7.60 లక్షలు ఖర్చు చేసి నిర్మించారు. ఇప్పటికే రూ.81.10 లక్షలు, ప్రస్తుతం కేటాయించిన రూ.55.85 లక్షలు కలిపి మొత్తం అద్దె ఇంటికి రూ.1.36 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారన్న మాట.


